breaking news
Ad - Sakshi_Home_Sticky
-
లైవ్ షాకింగ్ విజువల్స్.. !
-
ఏడాదిలో కురవాల్సిన వాన ఒక్కసారిగా కురిస్తే ఇలా ఉంటుందా..!
వర్షం అనేది మనకు సీజన్ల బట్టే వస్తోంది ఒక్కోసారి సమ్మర్లో కూడా వచ్చిన అదికూడా ఓ మోస్తారుగా వస్తుంది. వర్షాకాలంలోనే మనకు అత్యధికంగా వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఎడారి దేశమైన దుబాయ్ లాంటి దేశాల్లో వర్షం అనేది చాలా తక్కువ. ఏడాదికి చాలా తక్కువ వర్షపాతమే నమోదవ్వుతుంది. అలాంటిది ఇటీవల దుబాయ్‌ని వణికించేలా వర్షాలు పడ్డాయి. ఒక్కసారిగా దుబాయ్‌లోని కార్లు, బహుళ అంతస్థులు నీట మునిగాయి. అంతేగాదు కనివిని ఎరుగని రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. చెప్పాలంటే ఒక్క ఏడాదిలో కురవాల్సిన వానంతా ఒక్కరోజే పడితే ఎలా ఉంటుందో అలా కుండపోతగా కురిసేసింది. అంతేగాదు అక్కడ అధికారులు కూడా ఇలాంటి వానను ఎన్నడు చూడలేదని ఇది "చారిత్రక వాతావరణ సంఘటన" అని చెబుతున్నారు. దుబాయ్ 75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వర్షాన్ని చూడలేదని తెలిపారు. ఈ భారీ వర్షాలకు ఎడారి దేశమైన దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ చిగురుటాకులా వణికిపోయింది. ఈ భారీ వర్షాలు యూఏఈనే కాకుండా ఒమన్‌ని కూడా తాకింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన చాలామంది నెటిజన్లు ముంబైలో ఉండగా కూడా తాము ఇలాంటి వర్షాన్ని చూడలేదంటున్నారు. ఎడారిలాంటి దుబాయ్ అంతటా కాలువలు పారుతున్నాయంటూ పోస్టులు పెట్టారు. Dubai: Timelapse of the massive storm that caused a historic flood. pic.twitter.com/tackWMYJzO — Pagan 🚩 (@paganhindu) April 17, 2024 (చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!) -
ఎంతటి ఫిట్నెస్ కింగ్‌లైనా..ఆ మెట్లు ఎక్కితే కాళ్లు వణికిపోవాల్సిందే!
ఎన్నో విచిత్రమైన ప్రదేశాలు గురించి విన్నాం.ఎంతో ఎత్తులో ఉండే హోటల్స్ దేవాలయాలు గురించి విన్నాం. కానీ వాటిని ఎక్కడం కష్టమేమి కాదు. కేవలం అంత ఎత్తులో ఉన్నాయన్న భయమేతప్పతే ఇంకేమీ ఉండదు. ఎంచక్కా మెట్ల మార్గం లేదా రోప్‌వే సాయంతో వెళ్లిపోయేవారు. కానీ చైనాలో ఈ ప్రసిద్ధ పర్వతం ఎక్కితే ఎంతటి వారికైన కాళ్లు వణికిపోతాయి. చేతిలో కర్ర లేనిది నడవలేరు ఎందుకంటే.. చైనాలో ప్రసిద్ధ తాయ్ పర్వతం చారిత్రక సాంస్కృతికి ప్రాముఖ్యత కలిగిన పర్వతం. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్‌లో ఎత్తైన ప్రదేశం. దీన్ని చైనా వాళ్లు పవిత్ర తూర్పు పర్వతంగా పిలుస్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం రెండు ఈ పర్వతం వద్ద చూడొచ్చు. అంత విశేషం గల భారీ పర్వతం. ఈ పర్వతం ఎక్కేందుకు ఏకంగా 6600 మెట్లు ఉంటాయి. అయితే ఈ మెట్లు ఎక్కినప్పుడు కింద భాగం సమ ఉష్ణోగ్రత ఉంటుంది. పైకి వెళ్లే కొద్ది ఉష్ణోగ్రత తక్కువగా ఉండి చలిగా ఉంటుంది. అయితే ఎవ్వరైనా ఈ మెట్లు ఎక్కితే కర్ర పట్టుకోక తప్పదు. అన్ని మెట్టు ఎక్కుతుండటం వల్లనే ఏమో ఎంతటి ఫిట్నెస్ గల వాళ్లైనా వృద్ధుల వలే గజగజ కాళ్లు వణికిపోతుంటాయి. మీసాలు మెలేసిన కండల ధీరుడైన ఈ మెట్లు ఎక్కితే మాత్రం బాబోయ్ అంటూ కర్ర పట్టుకుని వణికిపోక తప్పదు. అంతలా ఉంటుంది ఆ పర్వతం వొంపు, దాని ఉష్ణోగ్రతలు కారణంగానే ఈ పరిస్థితి ఎదురయ్యింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ తెగ వైరల్ అయ్యింది. 中国の泰山。7200段の階段があり、登頂に4~6時間かかるため観光気分で訪れた人々が後悔する。 pic.twitter.com/DY7xwj18iy — ロアネア@最多情報源バズニュース (@roaneatan) April 17, 2024 (చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!) -
మంచి మనసు చాటుకున్న తిలక్ వర్మ.. వీడియో వైరల్
ముంబై ఇండియన్స్ యువ బ్యాటర్ తిలక్ వర్మ మంచి మనసు చాటుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు మద్దతుగా వచ్చిన చిన్నారులకు ఊహించని బహుమతి ఇచ్చి వారి ముఖాల్లో నవ్వులు పూయించాడు. ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై విజయంలో తిలక్ వర్మ కూడా కీలక పాత్ర పోషించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ లెఫ్టాండర్.. సూర్యకుమార్ యాదవ్(78)తో కలిసి ముంబై ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. The 𝕊𝕦𝕡𝕝𝕒 shot we've been waiting for 🤌#PBKSvMI #TATAIPL #IPLonJioCinema #IPLinBhojpuri pic.twitter.com/XyiGgWs0fN — JioCinema (@JioCinema) April 18, 2024 మొత్తంగా 18 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 34 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు తిలక్ వర్మ. అంతేకాదు.. ముంబై విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రమాదకరంగా మారిన పంజాబ్ కింగ్స్ సంచలనం శశాంక్ సింగ్(25 బంతుల్లో 41) వికెట్ పడగొట్టడంలో భాగస్వామ్యమయ్యాడు కూడా! పంజాబ్ ఇన్నింగ్స్ పదమూడో ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతిని తప్పుగా అంచనా వేసి గాల్లోకి లేపాడు. మిడ్ వికెట్ ఫీల్డ్ పొజిషన్లో ఉన్న తిలక్ వర్మ ఏమాత్రం పొరపాటు చేయకుండా వేగంగా కదిలి క్యాచ్ అందుకున్నాడు. ఇక పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి వరకు విజయం కోసం పోరాడిన ముంబై ఎట్టకేలకు తొమ్మిది పరుగుల తేడాతో గట్టెక్కిన విషయం తెలిసిందే. ఫలితంగా సొంతమైదానం ముల్లన్‌పూర్‌లో పంజాబ్ గెలుపొందితే చూడాలని ఆశపడ్డ అభిమానులకు భంగపాటే ఎదురైంది. ఈ నేపథ్యంలో విజయానంతరం డ్రెస్సింగ్‌రూంకు వెళ్తున్న తరుణంలో తిలక్ వర్మ.. టెస్టు జెర్సీలు వేసుకున్న ముగ్గురు అమ్మాయిలు ఇంకా స్టేడియంలో ఉండటాన్ని గమనించి.. తన బ్యాటింగ్ గ్లోవ్స్‌ను వారి వైపునకు విసిరాడు. ఆ ముగ్గురిలో ఇద్దరు చిన్నారులు గ్లోవ్స్‌ను క్యాచ్ పట్టి థాంక్యూ అంటూ కృతజ్ఞతలు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘18 బంతుల్లో 38 పరుగులు చేయడంతో పాటు.. ఓ కీలక క్యాచ్ అందుకున్నాడు. అలాగే ఇద్దరు వర్ధమాన క్రికెటర్లు తమ కలలను నిజం చేసుకునేందుకు ఓ కారణాన్ని కూడా చూపించాడు. తిలక్ వర్మ హ్యాట్సాఫ్’’ అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ 2022లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది టీమిండియాలోనూ అరంగేట్రం చేశాడు. ఇక ఐపీఎల్లో ఇప్పటికీ ముంబై ఫ్రాంఛైజీతో కొనసాగుతున్న ఈ తెలుగు తేజం తిలక్.. తాజా సీజన్లో ఇప్పటి వరకు ఆడిన ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 208 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. ముంబై ఈ ఎడిషన్‌లో ఏడింట మూడు విజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. చదవండి: హార్దిక్‌ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా! వైరల్ వీడియో Scored 34* (18), took an important catch and this… Gave two budding cricketers a reason to believe in their dreams. Tilak Varma, 🙏👍🥹#MumbaiMeriJaan #MumbaiIndians #PBKSvMI | @TilakV9 pic.twitter.com/nZIifQAcZh — Mumbai Indians (@mipaltan) April 19, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'యూ, యూ, యూ, లైక్ ఇట్స్'.. ఈ మాగ్నటిక్ సాంగ్‌ను విన్నారా!?
కొరియన్–పాప్ సెన్సేషన్ ‘ఇలిట్’ మ్యూజిక్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. డెబ్యూ–సింగిల్ ‘మాగ్నెటిక్’ బిల్బోర్డ్ చార్ట్ ‘హాట్ 100’లో చోటు సాధించడం ద్వారా ‘ఇలిట్’ గ్లోబల్ స్టేజీపై గ్రౌండ్ బ్రేకింగ్ విజయాన్ని సొంతం చేసుకుంది. యునహ్, మింజుచ, మోకా, వోన్హీ, ఇరోహ అనే అయిదుగురు అమ్మాయిల బృందంతో ‘ఇలిట్’ మ్యూజిక్ బ్యాండ్ గత నెల ప్రారంభమైంది. తొలి అడుగుల్లోనే స్పాటిఫై ‘డైలీ టాప్ సాంగ్ గ్లోబల్’ చార్ట్‌లో చోటు సంపాదించింది. యూకే ‘అఫిషియల్ సింగిల్స్ టాప్ 100’లో మెరిసింది. ‘మాగ్నెటిక్’ సాంగ్‌ను ‘ఇలిట్’ సభ్యుల ఇంటర్వ్యూల ఆధారంగా రూపొందించారు. ఈ గ్రూప్ డెబ్యూ ఆల్బమ్... సూపర్ రియల్ మీ. ‘మై వరల్డ్’, ‘మాగ్నటిక్’, ‘మిడ్నైట్ ఫిక్షన్’, ‘లక్కీ గర్ల్ సిండ్రోమ్’ అనే నాలుగు ట్రాక్‌లు ఈ ఆల్బమ్‌లో ఉంటాయి. తొలి వారంలోనే ‘సూపర్ రియల్ మీ’ అమ్మకాలలో రికార్డ్ సృష్టించింది. ‘యూ, యూ, యూ, లైక్ ఇట్స్ మాగ్నటిక్/ యూ, యూ, యూ, సూపర్’ అంటూ ‘మాగ్నటిక్’ను పాడాలనుకుంటే ఇప్పుడే వినండి మరి! ఇవి చదవండి: అతిపెద్ద పాము వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..!
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019