breaking news
-
ఈ షాకింగ్ నిజాల గురించి మీకు తెలుసా?
ప్రతీరోజు ఎన్నో విషయాల గురించి తెలుసుకుంటున్నాం. వింత ప్రదేశాలు, వింత చేష్టలు, ఆశ్యర్యపరిచే నిజాలు, అద్భుతాలు.. ఇలా ఎన్నోవాటి గురించి ఎంతోకొంత అవగాహనకు వస్తూనే ఉన్నాయి. మరి ఈ కొత్త పదాలు, వింత వింతల గురించి ఎప్పుడైనా విన్నారా! లేదా? మరేంటో తెలుసుకుందామా..!! అవే ఇవి.. పే త్రూ ది నోస్.. సాధారణంగా చెల్లించేదాని కంటే ఎక్కువగా చెల్లించే సమయంలో వాడే మాట...పే త్రూ ది నోస్. ఉదా: వీ హ్యాడ్ టూ పే త్రూ ది నోస్ ఫర్ అవర్ రూమ్ బికాజ్ ఇట్ వాజ్ ఏ లాంగ్ వీకెండ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ వర్ బుక్డ్. గోయింగ్ గ్రేట్ గన్స్.. ఒక రంగంలో, పనిలో విజయ వంతంగా దూసుకువెళ్లే సందర్భంలో వాడే మాట... గోయింగ్ గ్రేట్ గన్స్. ఉదా: ది ఫర్మ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈజ్ గోయింగ్ గ్రేట్ గన్స్ విత్ హిజ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్. అవును.. ఇది నిజమే! ఆడ నెమలిని పీహెన్ అని పిలుస్తారు. అగ్గిపుల్లల కంటే ముందుగానే లైటర్‌ను తయారుచేశారు. కరెంట్ మూడ్ ఆధారంగా పాటలను ప్లే చేసే హెడ్ఫోన్లను న్యూరబుల్ కంపెనీ తయారు చేసింది. ఇవి చదవండి: అతిపెద్ద పాము ఉనికి వెలుగులోకి..అది సాక్షాత్తు పరమేశ్వరుడి..! -
ఈ భయం.. ఒక ఫోబియా అని మీకు తెలుసా!
నిత్యం కాలం పరుగెడుతున్నట్లూ.. ఈ లోకం పరుగెత్తక తప్పదు. అందులో ఎన్ని చిక్కులున్నా, ఎన్ని అడ్డంకులున్నాగానీ వాటిని అధికమిస్తూ సాగక తప్పదు. ఇలాంటి తరుణంలో మనుషుల విషయానికొస్తే.., వారిలో ఒక్కొక్కరి తీరు ఒక్కోలాగా ఉంటుంది. కొందరు ఎంతో ధైర్యవంతులుగానూ, మరికొందరు పిరికితనంగానూ కనిపిస్తుంటారు. ఇది సహజమే. ఇలాంటి ధైర్యాలకూ, భయాలకు రకరకాల ఫోబియాల పేర్లతో పిలుస్తుంటాం. అలాగే నిద్దుర విషయానికొస్తే.., ప్రతిరోజూ ఆహారం ఎంత అవసరమో, నిద్ర కూడా అవసరమే! అయితే, కొందరు నిద్దుర అంటేనే చికాకు పడుతూ, అసలు నిద్దురే రావటంలేదంటారు. ఏదో ఒక పనిలో నిమగ్నమౌతుంటారు. నిద్రపోవాలంటేనే కొందరు విపరీతంగా భయపడతారు. ఇలాంటి ఈ భయాన్నే ‘సోమ్నిఫోబియా /హిప్నోఫోబియా’ అంటారు. ఇవి చదవండి: ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వల్ల ఆ సమస్యలు ! పరిశోధనలో షాకింగ్ విషయాలు -
‘ఫోస్ డీయోన్’.. ఈ బావిలోకి దిగితే తిరిగి రావడం కష్టమే..!
సృష్టి రహస్యాల్లో.. ప్రకృతి ఒడిసిపట్టిన అందాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి సోయగానికి మానవనిర్మాణం జతకలిస్తే ఇదిగో ఇలానే.. అద్భుతం అనిపిస్తుంది. ‘ఫోస్ డీయోన్’.. ఇదో భూగర్భం జలాశయం. చూడటానికి పెద్ద బావిలా కనిపిస్తుంది. కానీ నిరంతర ఊట లాంటిది ఇది. ఫ్రాన్స్‌కు ఈశాన్యంలో ఉన్న టోనెరే నగరం నడిబొడ్డునున్న ఈ నీటి కొలను.. 18వ శతాబ్దంలో బయటపడిందట. ఆ వెంటనే ‘షెవాలీర్ డి ఇయాన్’ అనే రాయబారి దీన్ని అందమైన కట్టడంగా మార్పించాడు. గుండ్రటి పెద్ద నుయ్యి.. లోపలికి బయటికి కొన్ని మెట్లు.. అర్ధచంద్రాకారంలో ఇల్లు మాదిరి పెంకులతో చూరు కట్టించాడు. ఒకవైపు ఆ ప్రహరీకి ఆనుకుని పెద్దపెద్ద బిల్డింగ్స్ ఉంటే.. మరోవైపు ఆ జలాశయానికి తోవ ఉంటుంది. నీటిధారకు అనువుగా ఎత్తుపల్లాలతో నిర్మించిన ఈ నిర్మాణం.. స్వచ్ఛమైన నీళ్ల మధ్య ఆకుపచ్చని నాచుమొక్కలతో.. పరిసరాల ప్రతిబింబాలతో.. ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఈ పురాతనమైన నుయ్యి.. పైకి కనిపించినంత రమ్యమైనది మాత్రం కాదు. దీని లోతెంతో.. మూలమేంటో.. నేటికీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నాలలో చాలామంది ప్రాణాలనే కోల్పోయారు. ఈ బావి నుంచి ప్రతి సెకనుకు 311 లీటర్ల నీరు బయటికి వస్తుంది. అయితే కాలానికి తగ్గట్టుగా దీని వేగం.. పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. దీనిలోపల పెద్దపెద్ద గుహలు, సున్నపురాయితో ఏర్పడిన సన్నటి సందులు, మలుపులు ఉంటాయి. అయితే ఫ్రెంచ్ ఇతిహాసాలు.. ఈ జలాశయం గురించి చాలా కథలను వినిపిస్తాయి. మధ్యయుగంలో మనుషులు.. ఈ నీటిని ఉపయోగించుకునే జీవనం కొనసాగించారట. 7వ శతాబ్దంలో ఈ కొలనును కాకాట్రైస్ అనే పాములాంటి జీవి ఆక్రమించుకుని.. మనుషుల్ని దరిదాపుల్లో తిరగనిచ్చేది కాదట. ఈ జీవి డ్రాగన్స్‌లా రెండు కాళ్లతో.. సగం కోడిపుంజులా.. సగం బల్లిలా కనిపిస్తుందట. ‘సెయింట్ జీన్ డి రీమ్’ అనే సన్యాసి.. అప్పట్లో ఈ కాకాట్రైస్ను చంపి.. ఈ బావిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడట. ఈ ఫోస్ డీయోన్లో పొంగుతున్న నీరు.. ఎక్కడినుంచి వస్తుందో తేలలేదు. ఎంత ప్రత్యేక శిక్షణపొందిన డైవర్ అయినా సరే.. ఈ బావిలోకి దిగితే తిరిగి రావడం కష్టమే. మొదటిసారి 1974లో ఇద్దరు డైవర్స్.. దీని లోతును, జన్మస్థానాన్ని కనిపెట్టడానికి లోపలికి వెళ్లారు. కానీ తిరిగి రాలేదు. 1996లో మరొక డైవర్ అదే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో చాలా ఏళ్లపాటు దీనిలో ఈతకు అనుమతుల్లేకుండా పోయాయి. ఇక 2019లో డైవర్ పియరీ–ఎరిక్ డిజైనే.. దీనిలో 1,214 అడుగుల (370 మీటర్లు) మార్గాలను అన్వేషించారు. అదృష్టవశాత్తు అతను సజీవంగా తిరిగి వచ్చాడు కానీ.. దీని మూలాన్ని మాత్రం గుర్తించలేకపోయాడు. అయితే అతడికి ఆ బావిలో ఎలాంటి పాములు, చేపలు, అతీంద్రియశక్తులు కనిపించలేదట. కానీ లోపల మార్గం మాత్రం.. ఎంతటి తెలివైన వారినైనా తికమక పెట్టేలానే ఉందట. ఏది ఏమైనా ఈ జలాశయం ఎక్కడ పుట్టింది.. దీని లోతెంత? ఇందులో నిరంతరం నీరు ఎలా ఊరుతోంది? వంటి సందేహాలు తేలకపోవడంతో ఇది.. మిస్టీరియస్‌గానే మిగిలిపోయాయి. — సంహిత నిమ్మన ఇవి చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త! -
ఈ విశేషాల గురించి మీరెప్పుడైనా విన్నారా..!
ఉరుకులు పరుగులుగా సాగుతున్న ఈ జీవితంలో ఎన్నో కొత్త విషయాలు, విశేషాలు మనకు ఎదురుపడుతుంటాయి. అవి ఆశ్యర్యాలను కలిగిస్తుంటాయి. మీరెప్పుడైనా ఇలాంటి పదాలు గానీ, విషయాల గురించి గానీ విన్నారా..! మరి ఆలస్యం ఎందుకు? అవేంటో తెలుసుకుందాం. అవును..ఇది నిజమే.. పోలిస్’ ఫుల్‌ఫామ్.. పబ్లిక్ ఆఫీసర్ ఫర్ లీగల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఎమర్జెన్సీస్ కళ్లు మూసుకున్నప్పుడు మనకు కనిపించే రంగును ‘ఐగన్గ్రావ్’ అంటారు. ఇది నలుపురంగుకు భిన్నమైనది. థాయ్‌లాండ్ జాతీయ గ్రంథం రామకియన్. దీని అర్థం రామ మహిమ. ఆస్కార్ గెలుచుకున్న తొలి నాన్ హ్యూమన్ మిక్కీ మౌస్ యానిమేటెడ్ మిక్కీ మౌస్. ఏప్రిల్ 18,1930లో బీబీసి రేడియో ‘నో న్యూస్ టుడే’ అని ప్రకటించి న్యూస్‌కు బదులుగా పియానో మ్యూజిక్‌ను ప్రసారం చేసింది. ఇంగ్లీష్ ఇడియమ్స్.. మోర్ దేన్ మీట్స్ ది ఐ ‘అనుకున్నంత సులభం కాదు’ అనుకున్నప్పుడు, ఊహించిన దానికి పూర్తి భిన్నంగా ఉండడం.. మొదలైన సందర్భాలలో వాడే మాట... మోర్ దేన్ మీట్స్ ది ఐ. ఉదా: ఐ హ్యాడ్ డన్ సమ్ రిసెర్చ్. బట్ దేర్ ఈజ్ మోర్ టు ది సబ్జెక్ట్ దెన్ మీట్స్ ది ఐ టర్న్ ది క్లాక్ బ్యాక్ పూర్వస్థితికి తీసుకురావడం, గతంలోకి వెళ్లడం, వోల్డ్–ఫ్యాషన్ ఐడియాలు.. మొదలైన సందర్భాలలో వాడే మాట.. టర్న్ ది క్లాక్ బ్యాక్. ఉదా: ది కోర్ట్స్ డెసిషన్ ఇన్ దిస్ కేస్ విల్ టర్న్ ది క్లాక్ బ్యాక్ ఇవి చదవండి: Gaming: 'టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది.. -
ఈ సంగతి విన్నారా! ఒకే కాన్పులో.. 'నైన్ ఆల్ ఫైన్'..!!
సాధారణంగా మనం ఎన్నో వింటుంటాం, చూసుంటాం. వింతలైనా, విశేషాలైనా, మరేవైనా కావచ్చు. అలాగే ఇక్కడ కూడా అవాకయ్యేలాగా ఓ అద్భుతం జరిగింది. ఇంతకీ అది అద్భుతమేనా? ముమ్మాటికీ అవుననే చెప్పవచ్చు. అదే.. ఈ 'ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం' ఎప్పుడైనా చూశారా? మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో..! ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుట్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే సంతానం టోటల్ టెన్ అన్నమాట. మాలి దేశానికి చెందిన హలీమా సిస్చే, అబ్జెల్కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు. ఫ్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అరకిలో నుంచి కిలో మధ్య ఉంది. దీంతో పిల్లలు 10 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు. ఇవి చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019