breaking news
-
వైఎస్ వివేకా కేసులో సంచలన వీడియో
-
జిమ్‌లో పుష్ప డైరెక్టర్ భార్య.. పెద్ద సాహసమే!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా ఆడియన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు 138 గంటల పాటు యూట్యూబ్‌లో నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అయింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. అయితే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత గురించి చాలామందికి తెలియదు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమాలతో పాటు ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ తబిత కనిపించారు. ఆమె వర్కవుట్స్ సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) -
రీల్స్‌తో వేణు, శ్రీవాణి ‘మ్యూజిక్’ మామూలుగా లేదుగా!
ఆమె పేరుకు తగ్గట్టుగానే సంగీత సరస్వతి. అతను ఆమెకు దొరికిన తిరపతి లడ్డు. ఇపుడు వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్‌గా సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ వారెవ్వరో ఇప్పటికే అర్థమైపోయిందికదా. అవును వారే. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే వేణుస్వామి, యాంకర్‌గా మొదలై వీణా నైపుణ్యంతో పాపులరైన ‘వీణా శ్రీవాణి’. సోషల్ మీడియాలో ఎప్పటికపుడు అనేక పోస్ట్‌లు పెడుతూ లక్షలాది ఫాలోయర్లను సొంతం చేసుకుంది శ్రీవాణి. అనేక రకాల పాటలకు ఆమె వాయించే వీణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఇంట్రస్టింగ్ పోస్ట్‌లు, తన కచేరీలు, వీణ వీడియోలతో అభిమానులతో ఎపుడూ టచ్‌లో ఉంటుంది. తాజాగా వీరిద్దరు కశ్మీర్‌కు సమ్మర్ వెకేషన్‌కు చెక్కేశారు. దీనికి సంబంధించి రీల్స్‌ను కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘కింగ్ కాంగ్’ సినిమాలోఒక సీన్‌ను రీల్ చేశారు. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు మంచులో చిల్ అవుతూ కనిపించారు. అలాగే భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ శ్రీనగర్‌లో పెహల్గాం వద్ద అందమైన లోయ సమీపంలో రోజా సినిమాలోని పాటకు వరుసగా ఇద్దరూ రీల్ చేసిన వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేనా ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలోని ‘ఎలాంటి అమ్మాయి కావాలేంటి’ అనే డైలాగులతో భర్త వేణుస్వామితో రీల్ చేయడం ఇంట్రస్టింగ్‌గా మారింది. ఆ తరువాత టాలీవుడ్ ‘మన్మధుడు’ నాగార్జున సినిమాలోని నాగ్, బ్రహ్మీ ఫన్నీ సీన్ ను రీ క్రీయేట్ చేయడం విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే జపాన్‌లో సందడి చేసి తిరిగొచ్చారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి తనలోని మరో టాలెంట్‌ను బయటకు తీస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికెళ్లినా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇటీవలే ఓ పెళ్లిలో సతీమణి రమతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన రిహార్సల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'అందమైన ప్రేమరాణి చేయి తలిగితే' అనే పాటకు అంటూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు దర్శకధీరుడు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. SS Rajamouli Dance 👌 pic.twitter.com/hkdfxPWq1Q — Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2024 -
Chittoor: రికార్డింగ్ డాన్స్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
చిత్తూరు అర్బన్: చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభాసుపాలవుతున్నారు. ఇటీవల ఓ బైకు నడిపిన ఆయన రెండు చేతులు వదిలేస్తూ.. జాతీయ రహదారిపై చేసిన స్టంట్లు, దాన్ని వీడియోలు తీయించి వైరల్ చేసిన తీరు చూసి జనం నవ్వుకున్నారు. దీనిపై యువత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, కనీసం రోడ్డుపై స్టంట్లు చేసేప్పుడు పోలీసుల అనుమతి తీసుకోవాలనే అవగాహనలేకపోవడం ఏంటని విద్యావంతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదం నుంచి బయటపడకముందే తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో జగన్మోహన్ నాయుడు రికార్డింగ్ డ్యాన్సు చూస్తూ కనిపించారు. ఇద్దరు యువతులతో కలిసి ఆయన వేసిన కుప్పి గంతులు చూపరులకు వెగటుపుట్టస్తున్నాయి. బెంగళూరులో డిస్కోలు, పబ్బులు, మద్యం బార్లలో పిచ్చి గంతులు వేసే వ్యక్తి, బాధ్యతారహితంగా వ్యవహరించే మనిషి నాయకుడైతే ఎలా ఉంటుందో తెలుసుకోండి..! అంటూ పలువురు ఈ వీడియోలను ట్రోల్ చేశారు. సైకిల్ పోవాలి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ వీడియో వైరల్ కావడంతో టీడీపీ కార్యకర్తలు అంతర్మథనంలో పడ్డారు. తమ అభ్యర్థి నిర్వాకాలతో పార్టీ పరువు బజారున పడిందని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. భవిష్యత్‌లో సదరు అభ్యర్థి ఇంకేం వీడియోలతో నవ్వులపాలు చేస్తాడో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019