breaking news
-
మన డార్లింగ్ కోసం అంటూ.. 'ప్రభాస్'కు గిఫ్ట్ పంపిన వేణుస్వామి సతీమణి
వీణ శ్రీవాణి.. ఈ పేరు సోషల్ మీడియాలో సెన్సేషన్.. వీణపై స్వరాలు పలికిస్తూ ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె టాలెంట్‌కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినిమా పాటలతో పాటు భక్తి గీతాలను తన వీణతో వాయించటం శ్రీవాణి ప్రత్యేకత. ఎప్పుడూ వీణతో పాటు కనిపించే ఆమె అసలు పేరు సత్యవాణి. పెళ్లయ్యాక శ్రీవాణిగా మారింది. అభిమానులు మాత్రం వీణ శ్రీవాణిగా మార్చేశారు. తాజాగా ప్రభాస్ కోసం శ్రీవాణి ఒక కానుక పంపి డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. తాజాగా వీణ శ్రీవాణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో వారు పండించిన సీతాఫలాలు చూపిస్తూ.. అవన్నీ మన డార్లింగ్ ప్రభాస్‌కు పంపుతున్నట్లు చెప్పారు. తాము పండించే సీతాఫలాలు ప్రతి సంవత్సరం కోంతమందికి పంపుతామని చెప్పుకొచ్చిన ఆమె ఈ క్రమంలో ఓ స్పెషల్ వ్యక్తికి ఆ ఫలాలను పంపిస్తే ఆయన దగ్గర నుంచి ప్రభాస్ వద్దకు చేరాయని ఇలా చెప్పుకొచ్చారు. 'ప్రభాస్ గారికి నేను పంపిన సీతాఫలాలు బాగా నచ్చడంతో ఇంకొన్ని సీతాఫలాలు కావాలని కోరారు. పాన్ ఇండియా రేంజ్ స్టార్ అయిన ప్రభాస్ అడిగితే పంపించకుండా ఎవరైనా ఉండగలరా..? అందుకే ఈ బాస్కెట్లో ఉన్న సీతాఫలాలన్నీ ప్రభాస్ గారి కోసం పంపిస్తున్నా. ఈ ఫలాలతో పాటు నా గుర్తుగా ఆయన కోసం హ్యాండ్ మేడ్ బ్యాగ్‌ను కూడా పంపిస్తున్నాను. ఈ ఏడాదికి ఇదే చివరి పంట. మళ్లీ వచ్చే సీజన్లో ప్రభాస్ కోసం మరోసారి సీతాఫలాలు పంపుతాను.' అని తెలిపారు. వీణ శ్రీవాణిగా ఆమె ఎంత పాపులరో తన భర్త ప్రముఖ జ్యోతిష్యులు అయిన వేణుస్వామి కూడా అంతే పాపులర్. వాస్తవంగా వేణుస్వామి కంటే ముందే వీణ శ్రీవాణికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. టాలీవుడ్ హీరోల పాటలను తన వీణతో ప్రత్యేకంగా హమ్ చేస్తూ వినిపించేది. అలా అందరి హీరోల అభిమానులు ఆమెను అభినందిస్తారు. పలువురి సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెబుతూ వేణుస్వామి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో చాలామంది ప్రముఖలకు సంబంధించిన జ్యోతిష్య వివరాలను సోషల్ మీడియా వేదికగా ఆయన చెప్పారు. వాటిలో ఎక్కువ శాతం ఆయన చెప్పిన విధంగానే జరగడంతో వేణుస్వామిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ఒక్కోసారి భారీగా ట్రోల్స్ కూడా ఎదురు కావడం జరిగింది. అయినా వాటిని ఆయన ఏ మాత్రం లెక్కచేయరు. ఈ క్రమంలోనే ఒకసారి ప్రభాస్ గురించి మాట్లాడుతూ డార్లింగ్ సినిమాలకు కొంత కాలం పాటు పెద్దగా కలెక్షన్స్ రావని చెప్పడంతో.. వేణుస్వామిపై ప్రభాస్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఆయన సతీమణి డార్లింగ్ ప్రభాస్ కోసం సీతాఫలాలు పంపడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
రీల్స్‌తో వేణు, శ్రీవాణి ‘మ్యూజిక్’ మామూలుగా లేదుగా!
ఆమె పేరుకు తగ్గట్టుగానే సంగీత సరస్వతి. అతను ఆమెకు దొరికిన తిరపతి లడ్డు. ఇపుడు వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్‌గా సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇంతకీ వారెవ్వరో ఇప్పటికే అర్థమైపోయిందికదా. అవును వారే. సినీ, రాజకీయ రంగ ప్రముఖులకు జ్యోతిష్యంలో సలహాలు, సూచనలు ఇచ్చే వేణుస్వామి, యాంకర్‌గా మొదలై వీణా నైపుణ్యంతో పాపులరైన ‘వీణా శ్రీవాణి’. సోషల్ మీడియాలో ఎప్పటికపుడు అనేక పోస్ట్‌లు పెడుతూ లక్షలాది ఫాలోయర్లను సొంతం చేసుకుంది శ్రీవాణి. అనేక రకాల పాటలకు ఆమె వాయించే వీణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలా ఇంట్రస్టింగ్ పోస్ట్‌లు, తన కచేరీలు, వీణ వీడియోలతో అభిమానులతో ఎపుడూ టచ్‌లో ఉంటుంది. తాజాగా వీరిద్దరు కశ్మీర్‌కు సమ్మర్ వెకేషన్‌కు చెక్కేశారు. దీనికి సంబంధించి రీల్స్‌ను కూడా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘కింగ్ కాంగ్’ సినిమాలోఒక సీన్‌ను రీల్ చేశారు. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. అంతేకాదు మంచులో చిల్ అవుతూ కనిపించారు. అలాగే భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ శ్రీనగర్‌లో పెహల్గాం వద్ద అందమైన లోయ సమీపంలో రోజా సినిమాలోని పాటకు వరుసగా ఇద్దరూ రీల్ చేసిన వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అంతేనా ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘మిర్చి’ సినిమాలోని ‘ఎలాంటి అమ్మాయి కావాలేంటి’ అనే డైలాగులతో భర్త వేణుస్వామితో రీల్ చేయడం ఇంట్రస్టింగ్‌గా మారింది. ఆ తరువాత టాలీవుడ్ ‘మన్మధుడు’ నాగార్జున సినిమాలోని నాగ్, బ్రహ్మీ ఫన్నీ సీన్ ను రీ క్రీయేట్ చేయడం విశేషంగా నిలిచిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Veena Srivani (satyavani Parankusham ) (@veenasrivani_official) -
వేణుస్వామిని కలిసిన అనన్య నాగళ్ల.. కారణం ఇదేనా?
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ప్రముఖ జ్యోతిష్కుడిగా వేణుస్వామికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయ, సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయన చెప్పిన వాటిలో ఎక్కువ శాతం జరుగుతాయని కొందరు అభిప్రాయం. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా వేణుస్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. వకీల్ సాబ్ చిత్రం ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘తంత్ర' అనే హారర్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించాయి. మార్చి 15న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో అనన్య కూడా వేణుస్వామిని కలవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఆయనతో పాటుగా దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. గత కొన్నేళ్లుగా వేణు స్వామి ద్వారా పూజలు చేపించుకున్న హీరోయిన్ల లిస్ట్ చాలా ఎక్కువగానే ఉంది. రష్మిక మందన్న, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి, అషురెడ్డి వంటి వారు వేణు స్వామితో పూజలు చేపించారు. ప్రస్తుతం అనన్య నాగళ్ల కూడా ఆయన్ను కలవడంతో ఆమె కూడా ఏమైనా పూజలు చేపించారా అని పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ త్వరలో తను నటించిన తంత్ర సినిమా విజయవంతం కావాలని ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు ఏమైనా వెళ్లారా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. రీసెంట్గా హీరోయిన్ డింపుల్ హయాతితో మరోసారి వేణు స్వామి పూజలు జరిపించారు. మద్యం సీసాలు ఉంచి పూజలో పాల్గొన్నారు. ఆ ఫోటోలు కూడా భారీగా నెట్టింట వైరల్ అయ్యాయి. తాను చేసే వామచార పూజలు, బాగాలమ్మకు,రాజ శ్యామల, తార, చిన్నమస్త.. ఇలా ప్రతి పూజకు లిక్కరే వాడతానని బహిరంగంగా చెప్పినట్లు బయట కథనాలు ఉన్నాయి. View this post on Instagram A post shared by TantraTheMovie (@tantrathemovie) -
ఇనయ కోసం వేణుస్వామి ప్రత్యేక పూజలు.. ఇదెప్పటినుంచో?
ఎంత కష్టపడినా కొందరికి అంత ఈజీగా విజయాలు వరించవు. కష్టానికి తోడు ఆవగింజంత అదృష్టం కూడా ఉండి తీరాలి. అది ఉన్నప్పుడే సక్సెస్ సాధ్యమవుతుంది. అయితే వచ్చిన సక్సెస్‌ను, క్రేజ్‌ను కాపాడుకోవడం కూడా ఇప్పటి పరిస్థితుల్లో చాలా కష్టంగా మారింది. కొందరు అలా మెరిసి ఇలా మాయమవుతున్నారు. బిగ్‌బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా కూడా ఇదే కోవలోకి వస్తుంది. సినిమాల మీద పిచ్చితో కన్నవారిని, ఇంటిని వదిలేసి ఫిలింనగర్‌కు పారిపోయి వచ్చేసింది. బిగ్‌బాస్ తర్వాత మారని రాత సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి వార్తల్లోకెక్కింది ఇనయ. తర్వాత బిగ్‌బాస్ షోలోనూ అడుగుపెట్టింది. తెలుగు బిగ్‌బాస్ ఆరో సీజన్లో పాల్గొని బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న ఇనయ సుల్తానా.. ఈ రియాలిటీ షో తర్వాత ఎన్నో ఆఫర్లు వస్తాయనుకుంది. అనుకున్నదొక్కటైతే అయినది మరొక్కటి.. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎలాగైతే అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిందో ఇప్పుడు కూడా అలాగే ఛాన్సులు ఇవ్వమని అడుగుతోంది. కానీ ఆమె మొర ఆలకించేవారే లేదు. ఇలాగైతే పని కాదనుకుందో ఏమో కానీ పూజారి వేణుస్వామిని కలిసి ప్రత్యేక పూజలు చేయించుకుంది. నువ్వు గుడిలో పూజలు చేస్తున్నావా? ఈ క్రమంలో మెడలో పూల మాల వేసుకుని భక్తితో మునిగిపోయిన ఆమెపై వేణుస్వామి కలశంతో నీళ్లు చల్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఇనయ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇది చూసిన జనాలు 'ఏంటి? పూజ చేయగానే ఫేమస్ అయిపోతాననుకుంటున్నావా?', 'వెంటనే హీరోయిన్గా పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇస్తారనుకుంటున్నావా?', 'ఇలాంటివన్నీ ఎలా నమ్ముతారసలు?' అని సెటైర్లు వేస్తున్నారు. ఒకరైతే 'నువ్వు ముస్లిం కదా.. పూజలు చేస్తున్నావేంటి?' అని అడగ్గా.. 'నేను భారతదేశంలో ఉన్నాను. ఇక్కడ నాకు నచ్చింది చేయగలిగే స్వేచ్ఛ ఉంది. మధ్యలో నీకేంటి సమస్య?' అని గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) -
వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?
సాధారణంగా జ్యోతిష్యులు ఫేమ్ తెచ్చుకోవడం చాలా అరుదు. కానీ గత కొన్నాళ్ల నుంచి ఓ ఆస్ట్రాలజర్ మాత్రం సినిమా హీరోహీరోయిన్ల కంటే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే వేణుస్వామి. స్టార్ హీరోల జాతకాల చెప్పడం దగ్గర నుంచి స్టార్ హీరోయిన్ల ఇంట్లో పూజల చేయడం లాంటివి ఈయన చేస్తుంటారు. ఈ మధ్య చిన్నపాటి వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. అలాంటి ఈయన తెలుగు సినిమాలోనూ యాక్ట్ చేశారా? (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) అవును మీరు సరిగానే విన్నారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి.. జగపతిబాబు హీరోగా చేసిన 'జగపతి' అనే తెలుగు సినిమాలో చిన్న పాత్రలో అలా కనిపించారు. అయితే ఇది కూడా గుడిలోని అర్చకుడు వేషం. కాకపోతే ఈ సినిమా 2005లో రావడం, అప్పుడు వేణుస్వామి ఎవరనేది పెద్దగా తెలియకపోవడం లాంటి వాటి వల్ల ప్రేక్షకులకు పెద్దగా గుర్తుంచుకోలేకపోయారు. అలానే 'అతడు' చిత్రంలో ఓ పాటలో కనిపించారు. ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా కాబట్టి వేణు స్వామి యాక్ట్ చేసిన మూవీ క్లిప్ అనేది వైరల్ అయింది. అలా ఈయన కూడా అప్పట్లో యాక్ట్ చేశారని జనాలకు తెలిసింది. ఇకపోతే ఈ మధ్యనే వేణుస్వామి మాట్లాడుతూ.. టాలీవుడ్‌కి చెందిన సూపర్‌స్టార్.. ఇండస్ట్రీని విడిచిపెట్టేస్తారని సెన్సేషనల్ కామెంట్స్ చేయడం విశేషం. (ఇదీ చదవండి: కేటుగాళ్ల దెబ్బకు లక్షలు మోసపోయిన అవార్డ్ విన్నింగ్ తెలుగు హీరోయిన్) Venu Swamy in Jagapathi Movie 😂 pic.twitter.com/gJ1s4KjQ61 — AitheyEnti (@Vyavasaayam) January 2, 2024 Ikkada kuda unnaadu chillar gaadu 😝 Baabu Cinema lo Junior artist gaadivi neekendhuku ra Prabhas Future Prediction lu... 🥱 Edhainaa pani cheskora Bewakoof 😪 pic.twitter.com/QhKBC2xEC8 — Just_JanakiRam (@Just_JanakiRam_) January 2, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019