breaking news
-
Padma Awards 2024: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
సింగర్ ఉషా తొలి జీతం ఎంతో తెలుసా? వావ్ అనిపించే చీరల కలెక్షన్
Legend Usha Uthup: ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. కేవలం తన గొంతులో మాత్రమే ప్రత్యేకతను నింపుకోలేదు..ఆమె ఆహార్యం కట్టూ, బొట్టూ అన్నీ స్పెషలే. ది క్వీన్ ఆఫ్ ఇండియన్ పాప్ ఉష ఒక నటి, సామాజిక కార్యకర్త కూడా. ప్రత్యేకమైన శైలి, వాయిస్‌తో సంగీత ప్రియులను మెస్మరైజ్ చేసిన లెజెండరీ సింగర్. అయితే, ఉషా ఉతుప్ కట్టుకునే చీరలు చూస్తే ఆమెకు సారీస్ మీద పెద్ద మోజు ఇట్టే అర్థమైపోతోంది. దేశంలో అన్ని రంగాల చీరల కలెక్షన్ ఆమె వద్ద ఉంది. ఈ లిస్ట్ దాదాపు 600కు పై మాటే. ఉషా ఉతుప్ సారీస్ అండ్ సాంగ్స్ లతాజీ ,ఆశా జీ (లతా మంగేష్కర్ , ఆశా బోన్స్లే)తో సహా ప్రఖ్యాత గాయకులకు బాలీవుడ్ హీరోయిన్ల పాటలు పాడుతుంటే, వాంప్‌ల కోసం పాడమని నన్ను అడిగేవారు. కానీ దాన్ని కూడా నేను బ్రేక్ చేశాను. రేఖ, శ్రీదేవి లాంటి చాలామంది బాలీవుడ్ హీరోయిన్లకు పాటలు పాడాను అంటారు ఉషా. పంజాబీ, బెంగాలీ, మరాఠీ , హిందీ, తెలుగు భాషల్లో అనేక పాటలకు తన గాత్రాన్ని అందించిన ఘనత ఆమె సొంతం. ‘‘నాకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్ ఉన్నందుకు గర్వపడుతున్నా..నేను ఎవరిలాగానో పాడలేను..నాలాగా మాత్రమే పాడతాను. అందరికీ భిన్నంగా స్టేజ్ మీద ఎలా అలరించాలో అలాగా చేస్తాను.’’ ఇదీ ఉషా స్టయిల్. (22 ఏళ్లకే కంపెనీ పగ్గాలు, వేల కోట్ల సామ్రాజ్యం, 30వేల మందికి ఉపాధి) ప్రతీ భారతీయ అమ్మాయికి చీర ఒక అబ్సెషన్. చిన్నతనంలోనే అమ్మ చీరను చుట్టకుని మురిసిపోయేంత ప్రేమ. ఈ నేపథ్యంలో ఖరీదైన వందల చీరలు ఉషా వార్డ్‌రోబ్‌లోకి కొలువు దీరాయి. అలాగే తన తల్లి అనుభవాలను కూడా ఆమె మీడియాతో పంచకున్నారు. మధ్యతరగతి మహిళ తన తల్లికి ఎక్కువ చీరలు కొనే స్థోమత లేకపోయిందని ఉషా ఉతుప్ గుర్తు చేసుకున్నారు. అలాగే తన తల్లి గడి, చుక్కలు, చారలు అంటే చాలా ఇష్టపడేవారి చెప్పారు. ముఖ్యంగా తన చీరల్లో పూజ బోర్డర్, బంగారు హంసలున్న మావ్-హూడ్ కాంజీవరం చీర చాలా ఖరీదైందని చెప్పారు. అంతేకాదు చాలా పాతదే అయినా ఈ ట్రెడిషనల్ చీరంటే తన కుమార్తెకు కూడా చాలా ఇష్టమనట. ఈ సందర్బంగా మరో విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. (నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు) బ్లాక్ సారీ అంటే.. నలుపు రంగు చీర కట్టుకున్నప్పుడల్లా తన అత్తగారికి చాలా కోపం వచ్చేదని చెప్పారు. తమిళ అయ్యర్ కుటుంబం నుండి వచ్చిన తనకు బ్లాక్ సారీస్ అంటే చాలా ఇష్టంమని, సాధారణంగా ఇక్కడి మహిళలు నలుపు రంగును మహిళలందరూ ఇష్టపడతానన్నారు. అయితే కేరళకు చెందిన కుటుంబాన్ని వివాహం చేసుకున్నా.. అందుకే నల్ల చీర కట్టుకున్నప్పుడల్లా అత్తగారికి కోపం వచ్చేది అంటూ తన కెంతో ఇష్టమైన నల్లటి చీరను కూడా చూపించారు. ఉషా ఉతుప్ తొలి సంపాదన ఉషా ఉతుప్ తొలి సంపాదన నెలకు రూ. 750. తాను యాదృచ్ఛికంగా తన ఆంటీ సహాయంతో సింగింగ్‌లో వచ్చానన్నారు. అప్పుడపుడూ కొన్ని గిగ్‌లు పొందడానికి సహాయం చేసింది. అలా సింగింగ్ మీద ఆసక్తి పెరిగింది. ఒక హోటల్‌తో నైట్‌క్లబ్ గాయనిగా చేరారు. అక్కడ నెలకు రూ. 750 వచ్చేది అని చెప్పారు. నిజంగా ఆ సమయంలో డబ్బు సంపాదించడంలో థ్రిల్ వేరే అంటారు ఉష. -
'నాటునాటు' పాటకు ఈ వెర్షన్ చూశారా.. చూడండి అదిరిపోద్ది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- జూ. ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన RRR నుంచి ‘ఆస్కార్ అవార్డ్ సాధించిన ‘నాటునాటు’ పాట ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లోనూ అంతే సూపర్ హిట్ అయింది. ఈ పాటకు ఆస్కార్‌తో పాటు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకుంది. ఈ అవార్డును కైవసం చేసుకున్న తొలి ఆసియా పాటగా నాటు నాటు నిలిచింది. ఎంఎం కీరవాణి స్వరపరచిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. కానీ తాజాగా తన విభిన్నమైన స్వరంతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించే ప్రముఖ గాయని ఉషా ఉతుప్ నాటునాటు పాటను ఆలపించారు. ఉషా ఉతుప్ వెర్షన్లో వచ్చిన ఈ పాటను మీరూ కూడా వినేయండి. (ఇదీ చదవండి:ఆమెతో సుధీర్ పెళ్లి ఫిక్స్.. గతంలో రష్మి చేసిన కామెంట్స్ వైరల్?) -
విశాఖ : సుశీల, ఉషా ఉతుప్‌లకు మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమన్ అవార్డు (ఫొటోలు)
-
‘ఒక అబ్బాయికి పాడిన ఏకైక గాయనిని నేనే’
పాప్ సింగర్‌గా.. విలక్షణ పాటలకు కేరాఫ్‌గా.. ఒక హీరోకి పాడిన ఏకైక గాయనిగా... నైట్క్లబ్సింగర్గా.. దమ్మారో దమ్ పాటతో నేపథ్య గాయనిగా... 51 సంవత్సరాలుగా పాటల ప్రపంచానికి సుపరిచితులు ఉషా ఉతుప్. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె తన గురించి చెప్పుకొచ్చారు.. ఉషా ఉతుప్.. ఈ పేరు వినగానే పెద్ద బొట్టు, పట్టు చీర, భారీ నగలు.. ఎప్పటినుంచి ఈ వేషధారణ ప్రారంభమైంది అని నన్ను అడుగుతారు. 1969లో ప్రారంభించాను. అప్పట్లో మంచి కంచి పట్టు చీరలు దొరికేవి కాదు. చాంద్ పొట్ట్ అని తమిళంలో అంటారు. అదే తిలకం సీసా. ఆ సీసాలో ఉండే చిన్న పుల్లలాంటి దానితో బొట్టు పెట్టుకునేదాన్ని. నేను పాటలు పాడటం మొదలుపెట్టే సమయానికి రంగుల రంగులలో సింగార్ కుంకుమ్ రావటం మొదలైంది. ఆ కుంకాన్ని చేతితో ముఖం మీద గుండ్రంగా పెట్టుకునేవారు. నేను కూడా అలా మొదలుపెట్టాను. అలా అలా రానురాను పరిమాణం పెరుగుతూ వచ్చింది. బొట్టుతోపాటు నేను కూడా పెద్దదాన్ని అవుతున్నాను. నేను ఎయిర్‌పోర్టుకి వెళ్లినప్పుడు, ఎప్పుడైనా ఉదయాన్నే ముఖాన బొట్టు కనిపించకపోతే, అక్కడి వారు ‘అమ్మా, బొట్టు ఏది, పెట్టుకోలేదేంటి’ అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నిస్తున్నారు. అందరికీ నా బొట్టు అంత అలవాటయిపోయింది. బొట్టు నా జీవితంలో భాగం అయిపోయింది. ఈ వేషధారణ నాకు నేనుగా రూపొందించుకున్నాను. నైట్ క్లబ్లో పాడుతోంది నేను నైట్ క్లబ్సింగర్గా నా కెరీర్ ప్రారంభించాను. ఆ తరవాత సినీపరిశ్రమలో నేపథ్య గాయనిగా మారాను. నైట్‌క్లబ్‌లో నా పాట విన్న లక్ష్మీకాంత్ ప్యారేలాల్, ఆర్డి బర్మన్, శంకర్ జైకిషన్... ఇంకా చాలామంది... మద్రాసీ అమ్మాయి నైట్ క్లబ్లో పాడుతోంది అంటూ వినటానికి ఆసక్తి చూపేవారు. ఆ తరవాత వాళ్ల సినిమాలలో పాడటానికి అవకాశం ఇచ్చారు. నేను ఓబెరాయ్ హోటల్లో పాడినప్పుడు, బాలీవుడ్ నటుడు దేవానంద్ అక్కడ ఉన్నారు. పాట పూర్తికాగానే నన్ను పిలిపించి, ‘హరేరామ హరే కృష్ణ చిత్రంలో పాడతావా’ అని అడిగారు. అది 1969. షాన్ సినిమాకి పాడాను నేను ప్లేబాక్ సింగర్‌గా దమ్మారో దమ్ పాటతో కెరీర్ ప్రారంభమయ్యింది. దేవుళ్ల పేర్లు నన్ను చుట్టుముట్టేశాయి. హరి ఓం హరి, హరేరామ్ హరేకృష్ణ, రాధేశ్యామ్ రాధేశ్యామ్ పాటలు పాడాను. అందరూ నా పాట విని, కోమల గళంతో, చాలా బాగా పాడానని నన్ను ప్రశంసించారు. నా గొంతులాంటి గొంతు మాత్రం కాదు వారిది. నా కెరీర్ ప్రారంభమయ్యాక, ఎవరైనా హీరోయిన్లకు నా గొంతు సరిపోదనుకుంటే, టైటిల్స్ పడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ లో పాడించేవారు. అలా షాన్ సినిమాకి పాడాను. ఒకసారి మిథున్చక్రవర్తికి పాడాను. ఒక అబ్బాయికి పాడిన ఏకైక గాయనిని నేనే. అంటూ చెప్పుకొచ్చారు. ఉషా ఉతుప్.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019