breaking news
-
‘తృణమూల్’ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే..
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల కోసం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో టీఎంసీ పశ్చిమబెంగాల్ ప్రజలకు 10 హామీలిచ్చింది. బీజేపీ ప్రధాన హామీలైన సీఏఏ, యూనిఫామ్ సివిల్ కోడ్లతో పాటు ఎన్ఆర్సీలను బెంగాల్లో అమలు చేయబోమని మేనిఫెస్టోలో తెలిపింది. పేద కుటుంబాలకు ఉచితంగా ఏడాదికి 10 వంట గ్యాస్ సిలిండర్లు, పేద కుటుంబాలకు ఉచిత ఇల్లు, రేషన్‌కార్డుదారులకు ఇంటి వద్దే రేషన్, పెట్రోలియం ఉత్పత్తుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక ఫండ్ ఏర్పాటు లాంటి హామీలు టీఎంసీ మేనిఫెస్టోలో ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సమయంలో టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అస్సాంలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్ఆర్సీలను రద్దు చేస్తాం. మళ్లీ నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే దేశంలో ప్రజాస్వామ్యం, ఎన్నికలు ఉండవు. ఇంత ప్రమాదకర ఎన్నికలను నేనుఎప్పుడూ చూడలేదు. బీజేపీ దేశం మొత్తాన్ని డిటెన్షన్ క్యాంపుగా మార్చేసింది’అన్నారు. కాగా, బెంగాల్లో ఏప్రిల్ 19న తొలి దశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి.. బీజేపీ 150 సీట్లకే పరిమితం.. రాహుల్ -
Lok sabha elections 2024: బెంగోల్ కొట్టేదెవరో?
ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కొన్నేళ్లుగా సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బెంగాల్ బెబ్బులి మమత దెబ్బకు రాష్ట్రంలో 34 ఏళ్ల సుదీర్ఘ కమ్యూనిస్టు పాలనకు తెరపడటమే గాక కాంగ్రెస్ ప్రాభవమూ కొడిగట్టింది. ఈ రాజకీయ శూన్యాన్ని భర్తీ చేస్తూ బీజేపీ క్రమంగా బెంగాల్లో పాగా వేస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 18 సీట్లను కొల్లగొట్టి మమతకు పక్కలో బల్లెంలా మారింది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లోనూ 77 సీట్లతో సత్తా చాటింది. కొంతకాలంగా రాష్ట్రం తృణమూల్, బీజేపీ ముఖాముఖి పోరుకు వేదికగా మారిపోయింది. బెంగాల్లో ఈ లోక్‌సభ ఎన్నికలు ప్రధాని మోదీ వర్సెస్ తృణమూల్ అధినేత్రి మమత అన్నట్టుగా సాగుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి... స్టేట్‌స్కాన్ 42 స్థానాలతో లోక్‌సభ సీట్లపరంగా దేశంలో మూడో అతిపెద్ద రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఇది జాతీయ పారీ్టలను ఊరించే విషయం. జ్యోతిబసు, బుద్దదేవ్ భట్టాచార్య, సోమ్‌నాథ్ చటర్జీ వంటి ఉద్ధండులను అందించిన కమ్యూనిస్టులకు ప్రస్తుతం లోక్‌సభలోనూ, బెంగాల్ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది! గత ఎన్నికల్లో బీజేపీ పుంజుకున్న తీరుతో పరిశీలకులే నోరెళ్లబెట్టారు. రాష్ట్రంలో ఎన్నడూ రెండు స్థానాలు దాటని కమలనాథులు. మొత్తం స్థానాల్లోనూ పోటీ చేసి ఏకంగా 18 సీట్లలో కాషాయ జెండాను రెపరెపలాడించారు. దాంతో తృణమూల్ 34 నుంచి 22 సీట్లకు పడిపోయింది. ఈ ట్విస్టులకు తోడు సంక్లిష్ట రాజకీయాలకు, ఎన్నికల హింసకు పెట్టింది పేరైన బెంగాల్లో ఈసారి కూడా పొలిటికల్ హీట్ పీక్స్‌కు చేరింది. తృణమూల్‌కు సవాల్... అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధిస్తున్న తృణమూల్ కాంగ్రెస్‌కు గత లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ నువ్వానేనా అనేంతగా సవాల్ విసింది. 2014తో పోలిస్తే దీదీ ఏకంగా 12 సీట్లను కోల్పోయారు. కాషాయదళం 18 సీట్లను ఎగరేసుకుపోయింది. ఇరు పారీ్టల మధ్య ఓట్ల తేడా కేవలం 3 శాతమే! కానీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి భిన్న ఫలితాలొచ్చాయి. తృణమూల్ ఏకంగా 215 సీట్లతో క్లీన్ స్వీప్ చేసింది. కాకపోతే బీజేపీ బలం 3 అసెంబ్లీ సీట్ల నుంచి ఏకంగా 77 స్థానాలకు ఎగబాకింది. దాంతో కాంగ్రెస్, లెఫ్ట్ పారీ్టలే ప్రధానంగా నష్టపోయి పూర్తిగా సున్నా చుట్టాయి. 2016లో 44 సీట్లు సాధించిన కాంగ్రెస్, 32 సీట్లు నెగ్గిన లెఫ్ట్ పారీ్టలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది! అంతకుముందు 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలం 4 నుంచి 2 సీట్లకు పడిపోయింది. లెఫ్ట్ ఉన్న 2 సీట్లనూ కోల్పోయింది. ఇండియా కూటమిలో భాగంగా బీజేపీపై పోరాడుతున్న మమత ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం మొత్తం 42 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తుండటం విశేషం. మోదీ సర్కారు తమ పారీ్టపై, రాష్ట్రంపై కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆమె ప్రజల్లోకి వెళ్తున్నారు. తమ అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. బీజేపీ హిందుత్వ నినాదం నేపథ్యంలో ముస్లిం ఓటర్లను పూర్తిగా తమవైపు తిప్పుకునేలా ప్రయతి్నస్తున్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్పొరేట్లతో కుమ్మక్కు వంటి అ్రస్తాలను మోదీపై ఎక్కుపెడుతున్నారు. బీజేపీ పై చేయి సాధించేనా? పశ్చిమబెంగాల్లో అధికారమే లక్ష్యంగా సాగుతున్న కమలనాథుల్లో 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఫుల్ జోష్ నింపాయి. రాష్ట్రంలో 2 స్థానాలకు మించి ఎప్పుడూ గెలవని బీజేపీకి ఏకంగా 18 సీట్లు దక్కాయి. కాషాయదళం కేంద్రంలో తొలిసారి 300 సీట్ల మైలురాయిని అధిగమించడంలో ఈ స్థానాలే కీలకమయ్యాయి. అనంతరం 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తృణమూల్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచి్చంది. 77 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. ఇదే జోరుతో ఈసారి మరిన్ని లోక్‌సభ సీట్లు కొల్లగొట్టాలనేది బీజేపీ వ్యూహం. బెంగాలీ హిందూ ఓట్లపై కమలం పార్టీ ప్రధానంగా గురిపెట్టింది. అయోధ్య రామమందిర కల సాకారం, మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటోంది. మమతా ప్రభుత్వ అవినీతి, విపక్షాలపై తృణమూల్ గూండాయిజం, దాడులను కూడా లేవనెత్తుతోంది. మమత ఒంటరిగా పోటీ చేస్తుండటంతో, త్రిముఖ పోరు నెలకొంది. ఇండియా కూటమికి తృణమూల్ మొండిచెయ్యి, కాంగ్రెస్, లెఫ్ట్ నిరీ్వర్యమవడం తమకు కలిసొస్తుందనేది కమలనాథుల అంచనా. గత ఎన్నికల్లో ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో సాధించిన గణనీయ విజయాలను మిగతా చోట్లా రిపీట్ చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో ఇటీవల పలు ఇన్ఫ్రా, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ భారీగా నిధులు విదల్చడం దీనిలో భాగమే. మెజారిటీ స్థానాలతో దీదీపై పైచేయి సాధించాలని కమలనాథులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో మోదీ కూడా బెంగాల్‌పై ఫోకస్ పెంచారు. సర్వేలు ఏమంటున్నాయి... బెంగాల్లో పోటీ బీజేపీ, తృణమూల్ మధ్యేనని, ఇతర పారీ్టలది ప్రేక్షక పాత్రేనని సర్వేలు చెబుతున్నాయి. టీఎంసీ ఈసారి కూడా 21–22 సీట్లను దక్కించుకోవచ్చని పలు సర్వేలు లెక్కలేస్తున్నాయి. బీజేపీకి 19–20 స్థానాలు రావచ్చంటున్నాయి. అంటే 2019 కంటే కాస్త మెరుగుపడనుంది. కాంగ్రెస్ రెండు సీట్లలో ఒకటి కోల్పోవచ్చని అంచనా. సీఏఏ గేమ్ చేంజర్..! కేంద్రం తాజాగా అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఈ ఎన్నికల్లో బెంగాల్లో బాగా ప్రభావం చూపేలా ఉంది. బెంగాల్ విభజన తర్వాత బంగ్లాదేశ్ నుండి భారీగా వలస వచి్చన దళిత ప్రాబల్య మథువా సామాజిక వర్గం దశాబ్దాలుగా పౌరసత్వం కోరుతూనే ఉంది. సీఏఏ నేపథ్యంలో వారంతా గంపగుత్తగా బీజేపీకి జై కొట్టేలా కని్పస్తున్నారు. వీరు ఉత్తర 24 పరగణాలు, నాదియా, మాల్దాతో పాటు పలు ఉత్తర బెంగాల్ జిల్లాల్లో ఎక్కువగా స్థిరపడ్డారు. సీఏఏ నుంచి ముస్లింలను మినహాయించడం తెలిసిందే. బంగ్లా నుంచి ముస్లింల వలసలకు మమత సర్కారు గేట్లెత్తేసిందనేది బీజేపీ ప్రధాన ఆరోపణ. మరోవైపు సీఏఏను మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ ఎన్నికల లబ్ధి కోసం తెచి్చన ఈ చట్టం అమలును బెంగాల్లో అడ్డుకుని తీరతానంటున్నారు. అవినీతికి లైసెన్స్, దోపిడీకి ఫ్రీ పాస్ కావాలని తృణమూల్ సర్కారు కోరుకుంటోంది. రాష్ట్రంలో టీఎంసీ సిండికేట్ రాజ్ నడుస్తోంది. అందుకే దోపిడీలకు, అవినీతికి పాల్పడిన పార్టీ నేతలపై విచారణ కోసం వచి్చన కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపై టీఎంసీ దాడులు చేయిస్తోంది. –జల్పాయ్గురి సభలో ప్రధాని మోదీ జూన్ 4న ఎన్నికల ఫలితాలొచ్చాక విపక్ష నేతలందరినీ జైలుకు పంపుతామంటూ మోదీ బెదిరిస్తున్నారు. ఒక ప్రధాని అనాల్సిన మాటలేనా ఇవి! కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి చాలామంది నేతలను బీజేపీ ఇప్పటికే జైల్లో పెట్టింది. మొత్తం హిందుస్థాన్నే జైలుగా మార్చేసింది. సీబీఐ, ఎన్ఐఏ వంటి దర్యాప్తు సంస్థలు బీజేపీ సోదరులు. ఐటీ, ఈడీ ఆ పారీ్టకి నిధులు సమీకరించే సంస్థలు. మీకు గెలిచే సత్తా, నమ్మకముంటే మా నాయకులను అరెస్టు చేయాల్సిన అవసరమేంటి? ఈ ఎన్నికల తర్వాత కూడా బెంగాల్లో ఉండేది మా ప్రభుత్వమే. మేం తలచుకుంటే మీ నాయకులందరినీ ఊచలు లెక్కపెట్టిస్తాం. – కృష్ణనగర్ ఎన్నికల ర్యాలీలో సీఎం మమతా బెనర్జీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
తృణమూల్ కాంగ్రెస్ ఆ పార్టీకి కాపీ.. త్రిపుర సీఎం
అగర్తల: సార్వత్రిక ఎన్నికల హోరు జోరుగా సాగుతోంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం మళ్ళీ అధిక సంఖ్యలో సీట్లు గెలవడానికి ప్రయతిస్తోంది. ఈ తరుణంలో త్రిపుర ముఖ్యమంత్రి 'మాణిక్ సాహా' తృణమూల్ కాంగ్రెస్ పార్టీపైన కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ త్రిపుర జిల్లా పరిధిలోని బెలోనియాలో జరిగిన బహిరంగ సభలో సాహా మాట్లాడుతూ.. బెంగాల్‌ను వరుసగా 34 ఏళ్లు పాలించిన సీపీఐఎంకు తృణమూల్ కాంగ్రెస్ కార్బన్ కాపీ అని వ్యాఖ్యానించారు. 'కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ పాలించినా వారి అవశేషాలు దొరుకుతాయని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు తృణమూల్‌ను నమ్మి ఓట్లు వేయడం దురదృష్టమని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకుంది. ఈ సారి మరింత మెరుగైన ఫలితాలు రానున్నట్లు మాణిక్ సాహా పేర్కొన్నారు. ఇప్పటికే వామపక్షాలకు చెందిన నా మిత్రులు బీజేపీకి ఫిర్యాదు చేశారు. మా పార్టీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలను గురించి వివరిస్తూ.. అప్పట్లోనే బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందని బాక్సానగర్, ధన్పూర్ వంటి ప్రాంతాల్లో మెజారిటీ స్థాయిలో ఓట్లను నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందని అన్నారు. -
ఎలక్టోరల్ బాండ్ల కొత్త డేటా విడుదల.. ఏ పార్టీకి ఎంత?
ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్లపై కేంద్ర ఎన్నికల సంఘం రెండో జాబితాను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సమర్పించిన డేటాను మరోసారి అందుబాటులో ఉంచినట్లు ఆదివారం ఎన్నికల సంఘం వెల్లడించింది. సీల్డ్ కవరులో కోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ పార్టీ అత్యధికంగా రూ.6,986.50 కోట్ల విరాళాలను పొందినట్లు తెలిపింది. కేవలం 2019-2020 మధ్య బీజేపీకి రూ.2,555 కోట్ల బాండ్లు అందినట్లు ఈసీ విడుదల చేసిన డేటా వెల్లడిస్తోంది. ఇక.. బీజేపీ పార్టీ తర్వాత అత్యధికంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి రూ.1,397కోట్ల విలువైన బాండ్లను విరాళాలుగా పొందినట్లు తెలిపింది. ఈసీ వెల్లడించిన డేటా ప్రకారం.. ఆయా పార్టీకు వచ్చిన విరాళాలు కాంగ్రెస్ పార్టీ- రూ.1334 కోట్లు బీఆర్ఎస్- రూ. 1322 కోట్లు బిజు జనతాదళ్- రూ.944 కోట్లు డీఎంకే - రూ. 656.5 కోట్లు (ఇందులో రూ. 509 కోట్లు లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ నుంచి వచ్చాయి) వైఎస్సార్సీపీ- రూ.442.8 కోట్లు టీడీపీ- రూ.182. 35 కోట్లు సమాజ్‌వాదీ పార్టీ- రూ. 14.5 కోట్లు అకాలీదళ్- రూ.7.26 కోట్లు ఏఐఏడీఎంకే- రూ.6.05 కోట్లు నేషనల్ కాన్ఫరెన్స్- రూ. 50 లక్షలు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి మొదటి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సంఘానికి ఇచ్చిన సమాచారంలో ఎస్బీఐ పూర్తి సమాచారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు ఎందుకు లేవో చెప్పాలని మార్చి 15 నోటీసులు జారీ చేసింది. తమ ఆదేశాల ప్రకారం బాండ్ల పూర్తి వివరాలు వెల్లడించకపోవటంపై ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎస్బీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చదవండి: ఒకే డ్రెస్ ఎన్ని రోజులేసుకుంటాం.. ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు -
లోక్‌సభ ఎన్నికల బరిలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్
టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. పఠాన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నాడు. వెస్ట్ బెంగాల్‌లోని బరంపూర్ నియోజకవర్గం నుంచి యూసఫ్ పఠాన్‌ను టీఎంసీ బరిలోకి దించింది. ఇవాళ ఉదయమే తృణమూల్ తీర్దం పుచ్చుకున్న పఠాన్... పార్టీలో చేరిన గంటలోపే ఎంపీ టికెట్ దక్కించుకోవడం ఆసక్తికరం. ప్రస్తుతం బరంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ ఎంపీగా ఉన్నాడు. చౌదరీ గతంలో ఈ స్థానం నుంచి ఐదు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా బరంపూర్ స్థానాన్ని టీఎంసీ కాంగ్రెస్‌కు వదిలి పెడుతుందని అంతా అనుకున్నారు. Here's an exclusive image of Yusuf Pathan following his entry into the politics with the All India Trinamool Congress.#YusufPathan pic.twitter.com/UfnrbdvDTy— CricTracker (@Cricketracker) March 10, 2024 అయితే కాంగ్రెస్‌కు షాక్ ఇస్తూ టీఎంసీ రాష్ట్రం మొత్తంలో అభ్యర్దులను నిలబెట్టింది. ఇవాళ ఉదయం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 42 మంది అభ్యర్దుల పేర్లను ప్రకటించింది. సీట్ల సర్దుబాటులో విషయంలో కాంగ్రెస్-టీఎంసీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని గత కొద్ది రోజుల నుంచి భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తాడని సమాచారం. యువీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి బరిలో నిలుస్తాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. కాగా, భారత క్రికెటర్లు రాజకీయాల్లో రావడం కొత్తేమీ కాదు. గతంలో చాలామంది లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. కొందరు రాజ్యసభకు ఎన్నికయ్యారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గతంలో రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుతం టర్బనేటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ ఎంపీగా (ఆమ్ ఆద్మీ పార్టీ) కొనసాగుతున్నాడు. లోక్‌సభ విషయానికొస్తే.. టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇతను 2019లో బీజేపీ అభ్యర్దిగా గెలుపొందాడు. అయితే గంభీర్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవలే ప్రకటించాడు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తాడని ప్రచారం జరుగుతున్న యువరాజ్ సింగ్.. ప్రస్తుత ఎంపీలు గంభీర్, హర్బజన్ సింగ్ సమకాలీకులే కావడం విశేషం.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019