breaking news
-
'ఆ ఒక్క పదం తెచ్చిన తంటా'.. వాళ్లిద్దరిపై మండిపడ్డ హీరోయిన్!
ఇటీవల డార్లింగ్ అనే పదంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, హీరోయిన్ నభా నటేశ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. పరిచయం లేని మహిళలను డార్లింగ్ అని పిలిస్తే వేధింపులకు కిందకు వస్తుందని నభా పోస్ట్ చేసింది. ప్రియదర్శి సైతం లైట్ తీస్కో డార్లింగ్ అంటూ రిప్లై కూడా ఇచ్చారు. తాజాగా వీరిద్దర మధ్య జరిగిన ఇంటరాక్షన్‌లో మరో హీరోయిన్ ఎంటరైంది. అదేంటో ఓ లుక్కేద్దాం. ప్రియదర్శి, నటి నభానటేశ్ గొడవలోకి నటి రీతూవర్మ ఎంట్రీ ఇచ్చింది. నా కామెంట్స్ సెక్షన్లో మీ పంచాయతీ ఏంటి? అని ఆమె ఇద్దరిని ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల కొద్ది రోజుల క్రితం హీరోయిన్ రీతూవర్మ ఓ ఫొటోషూట్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ పోటోలు చూసిన ప్రియదర్శి స్పందించారు. 'వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు' అని కామెంట్ చేశారు. అయితే ఇది చూసిన నభా నటేశ్ మళ్లీ స్పందించింది. ఇతను మళ్లీ మొదలుపెట్టాడు.. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్‌పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రతి ఒక్కరనీ డార్లింగ్ అని పిలవడమేంటని అసహనం వ్యక్తం చేసింది. నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకేంటని ప్రియదర్శి బదులిచ్చారు. తాజా సంభాషణపై రీతూవర్మ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. నా కామెంట్ సెక్షన్లో మీ ఇద్దరి గొడవ ఏంటని నిలదీసింది. ప్రస్తుతం వీరి గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి నెటిజన్స్‌కు ఫుల్ ఎంటర్టైనింగ్ ఉన్నప్పటికీ ఇందతా సినిమా ప్రమోషన్స్ కోసమేనని చర్చించుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) Ahaa! Do not cross the line! Chuskundham.. https://t.co/8mwOpLC0di — Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024 -
Ketika Sharma: టాలీవుడ్ హీరోయిన్ కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్.. ఫోటోలు
-
‘టెనెంట్’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
లేటు వయసులో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. కానీ ఓ ట్విస్ట్!
బాలీవుడ్ భామ, టాలీవుడ్ హీరోయిన్ ఆర్తి చాబ్రియా ఇటీవల బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుందని వార్తలొచ్చాయి. కానీ తాజాగా ఆర్తి చాబ్రియా ఫ్యాన్స్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే తాను బిడ్డకు జన్మనిచ్చి నెల రోజులు పూర్తయిందని రాసుకొచ్చింది. ఇదొక అద్భుతమై, కష్టమైన ప్రయాణమని రాసుకొచ్చింది. మార్చి 4వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించింది. తన బిడ్డకు యువన్ అని పేరు కూడా పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా..2019లో విశారద్ బీదాస్సీని పెళ్లాడింది. అయితే యువన్ పుట్టకముందే తనకు గర్భస్రావం అయిందని ఛాబ్రియా వెల్లడించింది. గతంలో తనకు గర్భస్రావం జరిగిందని.. అందుకే తన ప్రెగ్నెన్సీ గురించి ముందుగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. 41 ఏళ్ల వయసులో డెలివరీ కావడం అంటే.. 20 లేదా 30 ఏళ్లలో ఉన్నంత సులభం కాదని నటి చెప్పుకొచ్చింది. అయితే ఇది నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందని.. కానీ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరని అన్నారు. కేవలం బిడ్డను కనాలని మహిళలపై ఒత్తిడి తెస్తున్నారని ఆర్తి అన్నారు. చివరికీ నేను ఆశలు వదులుకున్న టైంలో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిందని.. దీంతో నేను, నా భర్త చాలా ఆనందంగా ఫీలయ్యామని తెలిపింది. ఆర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఈ ఫోటో మిమ్మల్ని మోసం చేయదు. ఎందుకంటే ఈ ప్రయాణం అంత సులభం కాదు. తల్లి కావాలనుకుంటున్న మహిళలకు.. ఆ కోరిక తీరనప్పుడు పడే బాధ, కష్టాలు నాకు తెలుసు. ఎందుకంటే నేను చాలా కష్టాలు పడ్డాను. నేను ఎప్పుడు నవ్వుతూ, అందంగా కనిపించగలను కాబట్టి ఇది చాలా సులభమని నేను ఎప్పుడూ అనుకోను. కానీ చివరికి ఆ దేవుడు నా పట్ల దయతో ఉన్నాడు. మన కోరుకున్న దానికోసం ఒత్తిడికి దూరంగా ఉంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనకు అంతా మంచే జరుగుతుంది.' అని రాసుకొచ్చింది. కాగా.. ఆర్తి చాబ్రియా బాలీవుడ్లో ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా, తుమ్సే అచ్చా కౌన్ హై, షాదీ నంబర్ 1 వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. చాబ్రియా చివరిసారిగా 2013లో విడుదలైన పంజాబీ చిత్రం వ్యాహ్ 70 కిమీలో కనిపించింది. అప్పటి నుంచి ఆమె పెద్దగా సినిమాల్లో నటించలేదు. టాలీవుడ్లో మధుర క్షణం, ఒకరికి ఒకరు, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి సినిమాలు చేసింది. చింతకాయల రవి మూవీలో ఐటం సాంగ్‌లో మెరిసింది. తెలుగులో చివరగా గోపి గోడ మీద పిల్లి చిత్రంలో నటించింది. View this post on Instagram A post shared by Aarti Chabria (@aartichabria) -
ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎక్కడో తెలుసా?
బహు భాషా నటిగా, హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రాశీఖన్నా. ఈ ఢిల్లీ భామ గ్లామరస్ పాత్రల్లో మెప్పించింది. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించింది. టాలీవుడ్‌తో పాటు తమిళంలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల బాలీవుడ్ యోధ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం సబర్మతి రిపోర్ట్, అరణ్మై-4 చిత్రాల్లో కనిపించనుంది. తెలుగులో చివరిసారిగా నాగ చైతన్య సరసన థ్యాంక్ యూ చిత్రంలో నటించింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్‌లో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కొత్త ఇంటిలో పూజలు నిర్వహిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే గతంలోనే హైదరాబాద్‌లో రెండు ఇళ్లు కొన్న రాశి.. ప్రస్తుతం మూడో ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రాశి ఖన్నా నూతన గృహా ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఓ నెటిజన్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వేడుకలో సన్నిహితులు, స్నేహితులను మాత్రమే పాల్గొన్నారు. కాగా.. రాశి నటించిన'యోధ' మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. Raashii Khanna has recently purchased a new house in Hyderabad 🤩 House warming #RaashiiKhanna pic.twitter.com/e5BLW8OmrP — Raashi khanna Lovers (@Raashi_lovers) April 5, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019