breaking news
Ad - Sakshi_Home_Sticky
-
Article updation and invalidation check 1
లోరెమ్ ఇప్సమ్ అనేది ప్రింటింగ్ మరియు టైప్ సెట్టింగ్ పరిశ్రమ యొక్క డమ్మీ టెక్స్ట్ మాత్రమే. 1500 ల నుండి లోరెమ్ ఇప్సమ్ పరిశ్రమ యొక్క ప్రామాణిక డమ్మీ టెక్స్ట్‌గా ఉంది, ఒక తెలియని ప్రింటర్ ఒక రకం రకాన్ని తీసుకొని ఒక రకం నమూనా పుస్తకాన్ని తయారు చేయడానికి ప్రయత్నించింది. ఇది ఐదు శతాబ్దాలు మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ టైప్ సెట్టింగ్ లోకి దూసుకెళ్లి, మౌలికంగా మారలేదు. ఇది 1960 లలో లోరెమ్ ఇప్సమ్ ప్యాసేజీలను కలిగి ఉన్న లెట్రాసెట్ షీట్ల విడుదలతో మరియు ఇటీవల డెస్క్ టాప్ పితో ప్రాచుర్యం పొందిందిలోరెమ్ ఇప్సమ్ యొక్క వెర్షన్లతో సహా ఆల్డస్ పేజ్ మేకర్ వంటి సాఫ్ట్ వేర్ ను ప్రచురిస్తుంది -
ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రారంభం
సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా మంగళవారం ఆరంభమైంది. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించనున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు విజయ్ కనకమేడల కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ సినిమాలో సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. రావు రమేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించనున్నాం. దర్శకుడిగా నక్కిన త్రినాథరావు విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు డైలాగ్ రైటర్‌గా చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
హీరోల్.. ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా
హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్ క్యారెక్టర్స్ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నేపాలీ భాషలో... తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్ హోటల్’ (1992), ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్ హీరోస్’ (1997), ‘హ్యాండ్సప్’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. చంద్ర పంత్ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆరు పదులలో ప్రేమ ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్ రానుంది. వినోదాల సుబ్రమణ్యం కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా రావు రమేశ్ ఏ రేంజ్లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మధ్యవయస్కుడి కథ తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్‌లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తండ్రి విలువ తెలిపేలా... తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది. మ్యూజిక్ షాప్‌లో... ‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్ ఘోష్. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన హీరో శివకార్తికేయన్
తమిళ ప్రముఖ హీరో శివకార్తికేయన్ రూ.50 లక్షలు విరాళం అందించారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' భవన నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నడిగర్ సంఘం నుంచి శివకార్తికేయన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖ రాశారు. నడిగర్ భవన నిర్మాణ కోసం ఇప్పటికే కోలీవుడ్ టాప్ హీరోలు తమ వంతుగా సాయం చేస్తూనే ఉన్నారు. 'సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్'కు జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న హీరో విశాల్.. భవన నిర్మాణం కోసం విరాళాలు సేకరించే పనిలో గత కొన్ని నెలలుగా ఉన్నారు. ఆయన పిలుపుతో కమల్ హాసన్,విజయ్,సూర్య,కార్తీ వంటి స్టార్ హీరోలు తమ వంతుగా సాయం అందించారు. తాజాగా శివకార్తికేయన్ కూడా రూ. 50 లక్షలు విరాళం అందించారు. ఇప్పటికే రూ.40 కోట్లతో నిర్మాణ పనులు పూర్తి కాగా, నిర్మాణ పనులకు మరో రూ.25 కోట్లు అవసరం ఏర్పడటంతో నటీనటుల సంఘం తరపున బ్యాంకు రుణం ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే రూ.12.5 కోట్లు డిపాజిట్ చేస్తే రూ.30 కోట్ల రుణం ఇచ్చేందుకు బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అందుకు సరిపడ మొత్తాన్ని ఏర్పాటు చేసే పనిలో విశాలు ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు. Actor #Sivakarthikeyan donated Rs 50Lakh from his personal fund towards the construction of New Nadigar Sangam Building. He handed the cheque to South Indian Artistes' Association President M.Nasser and Treasurer Si.Karthi.#NadigarSangam #siaa@actornasser @VishalKOfficial… pic.twitter.com/vGfoTURb0t — Ramesh Bala (@rameshlaus) April 23, 2024 -
నేను యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే కచ్చితంగా సాధించేదాన్ని: టాప్ హీరోయిన్
'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ సప్తమి గౌడ. ఈ చిత్రంలో లీల పాత్రలో అద్భుతంగా నటించిన సప్తమి గౌడకు ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ద వ్యాక్సిన్ వార్, యువ, కాళి, కాంతార ప్రీక్వెల్ తదితర చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఆమె హీరో నితిన్ సరసన 'తమ్ముడు'లో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా కోసం ఆమె గుర్రపు స్వారీ కూడ నేర్చుకుంది. తాజాగా యూపీఎస్సీ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆమె పలు ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. బెంగళూరులో సివిల్ ఇంజనీరింగ్ చదవును పూర్తి చేసిన సప్తమి గౌడకు మొదట యూపీఎస్సీ సాధించి పోలీస్ శాఖలో రాణించాలని కోరిక ఉండేదట.. దీనికి ప్రధాన కారణం తన తండ్రి కర్ణాటక పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా ఉండటమేనని ఆమె చెప్పింది. 'మా నాన్న మాదిరి పోలీస్ విభాగంలో ఉండాలని నాకు ఆశ ఉండేది. దీంతో నా చిన్నతనం నుంచే చదువులోనూ, క్రీడల్లోనూ రాణించాను. చదువులో చాలా ముందు ఉండేదాన్ని. నేను యూపీఎస్సీకి ప్రయత్నించి ఉంటే, గ్యారెంటీగా పాస్ అయ్యేదానిని.. కానీ, ఇప్పుడు అది సాధ్యం కాదు. దానికి చాలా ఫోకస్ కావాలి. అనుకోకుండా నటిని అయ్యాను.' అని ఆమె చెప్పింది. ఐదేళ్ల వయసులోనే సప్తమి గౌడ ఈత శిక్షణ పొందింది. 2006 నుంచి 2010 వరకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న సప్తమి గౌడ ఎన్నో రజత, కాంస్య, బంగారు పతకాలను కైవసం చేసుకుంది. సప్తమి గౌడ 2020లో విడుదలైన దునియా సూరి 'పాప్‌కార్న్ మంకీ టైగర్'చిత్రంతో తన నటనను ప్రారంభించింది. దీనికిగాను 2021లో ఉత్తమ తొలి నటిగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డును గెలుచుకుంది. కాంతార చిత్రం తరువాత తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఆమె సత్తా చాటుతుంది.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019