breaking news
-
కోతి... కొబ్బరి కాయ!
కోతి చేష్టలన్న మాట మీరెప్పుడైనా విన్నారా? అర్థం పర్థం లేని పనులు చేస్తూంటే వాడతారిలా! కానీ మీరోసారి థాయ్‌లాండ్, మరీ ముఖ్యంగా... దేశం దక్షిణం వైపున ఉన్న కొబ్బరి తోటలకు వెళ్లి చూడండి... మీ అభిప్రాయం తప్పకుండా మార్చుకుంటారు. ఏముంది అక్కడ అని ఆలోచిస్తూంటే కథనాన్ని పూర్తిగా చదివేయండి!! విషయం ఏమిటంటే... థాయ్‌ల్యాండ్‌లో కోతులు కొబ్బరికాయలు కోసే పని చేస్తున్నాయట కొబ్బరికాయలు తెంపడం అంత సులువైన పనేమీ కాదండోయ్. నిట్ట నిలువుగా 30-40 అడుగులున్న కొబ్బరి చెట్లు ఎక్కడం ఒక సవాలైతే.. బ్యాలెన్స్ చేసుకుంటూ కాయలు తెంపడమూ ఓ కళ... నైపుణ్యమే. అయితే ఈ నైపుణ్యం ఉన్న వారు రాను రాను తగ్గిపోతున్నారని కొబ్బరి తోటల పెంపకం దారులు తరచూ వాపోతూంటారు. కూలీలు దొరక్క ఇబ్బందులు పడటమూ మనం చూస్తూంటాం. థాయ్‌ల్యాండ్ రైతులు పరిష్కారం కనుక్కున్నట్టు కనిపిస్తోంది. ఇక్కడ కోతులకు కొబ్బరి కాయలు తెంపడంలో శిక్షణ ఇచ్చి వాటి సేవలను వాడుకుంటున్నారు మరి! కానీ విశేషం ఏమిటంటే... కోతులు ఆ పనులు చాలా చక్కగా పద్ధతిగా చేస్తూండటం. ఎంత పద్ధతిగా చేస్తున్నాయంటే.. మగ కోతులు చెట్లు ఎక్కి కాయలు తెంపుతూంటే... ఆడ కోతులు కిందపడ్డ వాటిని రైతుల వాహనాల్లోకి చేర్చడం వంటివి చేస్తున్నాయి. నాణేనికి మరోవైపు... కొబ్బరి కాయలు తెంపేందుకు కోతుల వాడకం బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. నాణేనికి ఇంకో పార్శ్వమూ ఉన్నట్లు దీనిపై కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, కథనాలను బట్టి చూస్తే థాయ్‌లాండ్ రైతులు ఈ కోతులను కూలీలుగా వాడుకుంటున్నా.. అందుకు తగ్గ ప్రతిఫలమూ వాటికి అందిస్తున్నారు. వాటి ఆకలిదప్పులు తీర్చడం మాత్రమే కాకుండా.. ఇంటి మనిషిగానూ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కోతుల పట్ల కొంతమంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, పనులు చేయనప్పుడు చైన్లతో కట్టిపడేస్తున్నారన్నది జంతు ప్రేమికుల ఆరోపణ. పైగా కాయలు తెంపే కోతులను అడవిలోంచి వేటాడి పట్టుకొస్తున్నారని, చిన్న వయసులోనే అక్రమంగా పట్టుకొచ్చి శిక్షణ ఇచ్చి పని చేయించుకుంటున్నారని పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అనిమల్స్) వంటి సంస్థలు విమర్శిస్తున్నాయి. శిక్షణ సందర్భంగానూ కోతులపట్ల సరిగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు. దాడులు చేసినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు కోతుల పళ్లు తీసేస్తున్నారని తెలుస్తోంది. ఎగుమతులకు పెట్టింది పేరు... థాయ్‌లాండ్ కొబ్బరి ఎగుమతులకు పెట్టింది పేరు. స్థానికంగానూ కొబ్బరి పాలకు డిమాండ్ ఎక్కువ. పశువుల నుంచి సేకరించే పాలకు బదులుగా ఇక్కడ పచ్చి కొబ్బరి పాలను ఉపయోగిస్తూంటారు. అయితే ఇటీవలి కాలంలో కోతులతో కాయలు తెంపిస్తున్నారన్న వార్తలు ప్రబలడంతో నైతికాంశాల రీత్యా కొంతమంది కొబ్బరి పాల వాడకాన్ని తగ్గించినట్లు తెలుస్తోంది. కొన్ని బహుళజాతి కంపెనీలు కూడా కోతులను కూలీలుగా వాడుతున్న వారి ఉత్పత్తులను కొనరాదని తీర్మానించాయి. ఇదీ థాయ్‌లాండ్ కోతుల చేష్టలు! మీరేమంటారు? కోతులను మనం కూలీలుగా వాడుకోవచ్చా? లేక వాటి మానాన వాటిని వదిలేయాలా? -
థాయిలాండ్‌లో ఉన్న మరో "అయోధ్య" గురించి తెలుసా..!
థాయిలాండ్‌లో ఒక రామరాజ్యం ఉంది అనేది మనలో చాలామందికి తెలియదు. మన దేశంలో ఉన్నట్లే అక్కడ ఒక అయోధ్య ఉంది. అక్కడ అడుగడుగున రామరాజ్యమే కనిపిస్తుంది. వారి జాతీయగ్రంథం కూడా రామాయణమే. ఇవన్నీ వింటుంటే అది థాయిలాండ్ దేశమేనా..? అని ఆశ్యర్యంగా ఉంటుంది. అస్సలు మన రాముడితో వారికి సంబంధం ఎలా ఏర్పడింది?. మన రాముడి గొప్పతనం అక్కడ వరకు ఎలా వెళ్లింది..? వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం!. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్" అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు. వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండలోని 70, 71 & 73 సర్గలలో రాముని వివాహాన్ని, తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే. మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీ నది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ, మాండవి, శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా సీతారాములకు లవ కుశులు, ఊర్మిళా లక్ష్మణులకు అంగద చంద్రకేతులు, మాండవీభరతులకు పుష్కరుడు, తక్షుడనే వాళ్ళు, శృతకీర్తి శతృఘ్నులకు సుబాహువు, శతృఘాతకుడనే వాళ్ళు జన్మించారు. శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది.. పశ్చిమంలో లవునకు లవపురం (లాహోర్), తూర్పున కుశునకు కుశావతి, తక్షునకు తక్షశిల, అంగదునకు అంగదనగరం, చంద్రకేతునకు చంద్రావతిలను ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పు దిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగ వంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్‌లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణు భగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా! అందువలన వీళ్ళు తమ పేర్లచివర రామ్ అన్న పేరు తగిలించుకుని, వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే భూమిబల్అతుల్యతేజ్. థాయిలాండ్‌లోని మరో అయోధ్య.. థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో బ్యాంకాక్ అని అంటున్నాము కదా! అయితే ప్రభుత్వ రికార్డులలో అధికారిక రాజధాని పేరు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధానులలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్, ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి. "క్రుంగదేవ మహానగర అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి" థాయి భాషలో పై పేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకో విశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు, పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. అంటే అర్థం..ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోధ్యలోనే నివసిస్తారు. థాయిలాండ్‌లో నేటికి రామరాజ్యం .. థాయిలాండ్‌లో 192 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా, రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వాళ్లనెవరినీ విమర్శించడం గానీ, వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులుగా భవించి గౌరవప్రదంగా చూస్తారు . రాజవంశం వారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూ ధర్మశాస్త్ర పరిజ్ఞానముంది. థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా, వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకి రామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణ శక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మన దేశంలో లాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం. అంతేగదు రామాయణంలోని సన్నివేశాలతో నాటకాలు, తోలుబొమ్మలాటలు ఉన్నాయి. ఇక ఇక్కడ బౌద్ధులు అధిక సంఖ్యాకులు, హిందువులు అల్పసంఖ్యల్లో ఉన్నారు. అయితే బౌద్ధులు హిందూ దేవీ దేవితలను ఆరాధించటం విశేషం. థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈ జాతి లుప్తమై పోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి ( The Brahmany Kite ) అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షి శాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణు భగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక, ఆ రాముడు విష్ణువు అవతారమనీ, ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతే కాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు. థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి.. మన దౌర్భాగ్యం స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ, హిందూసంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ, థాయిలాండ్ రారాజధానిలోని ఎయిర్ పోర్ట్‌కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణ భూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 5,63,000 స్క్వేర్ మీటర్. ఎయిర్ పోర్టు ముందు "సముద్ర మథనం" ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు, రాక్షసులు చేసే క్షీరసాగర మథనాన్ని చూపిస్తుంది. మన పిల్లలకు, రాబోయేతరాలకు మనసంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి. (చదవండి: రామయ్యకు నైవేద్యంగా వడపప్పు, పానకమే ఎందుకు?) -
బ్యూటీ క్వీన్‌గా కిరీటాన్ని గెలుచుకుంది..కానీ అంతలోనే..
ఒక్కోసారి ఆకాశాన్ని అందుకునే గొప్ప విజయాన్ని అందుకుంటాం. అందరిచేతే ఆహా ఓహో అనిపించుకుంటాం. ఇక్కడ గెలిస్తే సరిపోదు..ఆ విజయాన్ని నిలబెట్టుకునేలా మనం బిహేవ్ చేయాల్సి కూడా ఉంటుంది. లేదంటే ఈ బ్యూటీ క్వీన్‌లా అందరిముందే అబాసుపాలయ్యే గెలుపు కూడా నీరుగారిపోతుంది. అసలేం జరిగిందంటే..మలేషియాకు చెందిన అందాల భామ వీరూ నికా టెరిన్సిప్ 2023లో ఉండక్ న్గడౌ జోహోర్ టైటిల్‌ని గెలుచుకుంది. అయితే ఆమె ఇటీవల సెలవులకు ధాయ్‌లాండ్‌లో గడపడానికి వెళ్లింది. అక్కడకు వెళ్లడమే శాపమై టైటిల్‌ని కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే..అక్కడ ఆమె కొంతమంది మగవాళ్లతో కలిసి కురచ దుస్తులు ధరించి డ్యాన్సులు చేసింది. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో వివాదాస్పదంగా మారి సదరు బ్యూటీ క్వీన్ విమర్శలపాలయ్యింది. ఈ వార్త కాస్త కడజాండుసున్ కల్చరల్ అసోసియేషన్‌కి చేరండంతో.. ఈ వీడియోపై సీరియస్ అవ్వుతూ ఆమె ఆ టైటిల్‌ను అందుకునే అర్హత లేదని స్పష్టం చేసింది. వెంటనే కిరీటాన్ని వెనక్కి ఇచ్చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు సదరు కడజాండుసున్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోసెఫ్ పైరిన్ కిటింగన్ మాట్లాడుతూ..అందాల రాణి ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం ఏ మాత్ర సబబు కాదని అన్నారు. హుమినోడున్ రాష్ట్రానికి చెందిన అందాల రాణిగా టైటిల్ గెలుచుకుంది. అంటే.. ఆమె అపారమైన జ్ఞానానికి, సంస్కారానికి ప్రసిద్ధి అని అర్థం. పైగా పబ్లిక్ ఫిగర్. అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకునే స్థాయిలో ఉంది. అలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడూ పద్ధతిగా నడుచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఆమె సాధారణ వ్యక్తి అయితే ఇదేం అంత పెద్ద సమస్యగా ఉండేది కాదని కూడా కిటింగన్ అన్నారు. అంతేగాదు ఆమె తన కుటుంబంతో కలిసి వ్యక్తిగత విహారయాత్రకు వెళ్లిందని మాకు అర్థమయ్యింది. కానీ ఇలాంటివి సహించేవి మాత్రం కావని అన్నారు. ఆ వీడియో నెట్టింట వైరల్ కాకుండా ఉంటే ఆమెకి ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదన్నారు అయినా అందరికీ ఇదొక హెచ్చరికలా ఉంటుందన్నారు. మళ్లీ ఇలాంటి దుస్సాహసాలకు ఎవ్వరూ యత్నించరని కిటింగన్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బ్యూటీ క్వీన్.. నా స్వంత ఇష్టంతోనే ఈ ఉండుక్ న్గడౌ అందాల పోటీలకు వెళ్లాను. అయినా ఈ టైటిల్ ఏమి ఒక వ్యక్తి పరిపూర్ణ విజయాన్ని నిర్ణయిస్తుందని భావించను. అయినప్పటికీ వారి నిర్ణయాన్ని గౌరవించి వెనక్కి ఇచ్చేస్తాను ఈ టైటిల్‌ని. అలాగే ఇదంతా నా అజాగ్రత్త వల్లే జరిగిందని ఒప్పుకుంటున్నా. అందుకు నన్ను క్షమించండి. ప్రతి ఒక్కరూ ఈ సంఘటనను నుంచి చాలా నేర్చుకుంటారని ఆశిస్తున్నా. అయినా ఈ విషయాన్ని భూతద్దంలా చూడొద్దు. దయచేసి ఇతర సమస్యలపై దృష్టిసారించండి. అలాగే ఈ ఘటనకు పూర్తి బాధ్యత నాదే, దీనికి నా స్నేహితులు, తల్లిదండ్రులను బాధ్యులుగా చెయ్యొద్దు. నా వివరణను యాక్సెప్ట్ చెయ్యడం, చెయ్యకపోవడం మీ ఇష్టం. గుండెల్లోంచి వస్తున్న మాటలు ఇవి. అయినా ఇంతవరకు ఓపిగ్గా విన్నందుకు ధన్యవాదాలు. అని పోస్ట్‌లో పేర్కొంది. అందాల భామ వీరూ నికా టెరిన్సిప్. (చదవండి: రంజాన్ రోజు షీర్ కుర్మా చేయడానికి రీజన్ ఏంటో తెలుసా..!) -
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ‘థాయ్‌లాండ్’.. బీజేపీ విమర్శల దాడి
న్యూఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేస్తోంది. ఆ పార్టీ మేనిఫెస్టోలో న్యూయార్క్, థాయ్‌లాండ్‌ల ఫోటోలను ఉపయోగించారని బీజేపీ నేత సుధాన్షు త్రివేది ఆరోపించారు. 'రాహుల్ గాంధీకి ఇష్టమైన గమ్యస్థానం థాయిలాండ్' “కాంగ్రెస్ మేనిఫెస్టోలో నీటి నిర్వహణపై ఓ చిత్రం ఉంది. ఈ చిత్రం న్యూయార్క్‌లోని బఫెలో నదికి సంబంధించినది. తమ సోషల్ మీడియా ఛైర్పర్సన్ ట్విటర్ నుండి ఎవరు ట్వీట్ చేస్తున్నారో వారు ఇప్పటి వరకు దీన్ని గుర్తించలేకపోయారు. కానీ వారికి ఈ చిత్రాన్ని ఎవరు పంపారు? పర్యావరణ విభాగం కింద, రాహుల్ గాంధీకి ఇష్టమైన గమ్యస్థానమైన థాయ్‌లాండ్ నుండి ఒక చిత్రాన్ని పెట్టారు. వీటన్నింటినీ తమ మేనిఫెస్టోలో ఎవరు పెడుతున్నారు?’’ అని సుధాన్షు త్రివేది అన్నారు. 'విదేశీ ఫొటోలను అరువు తెచ్చుకుంటున్నారు' “తప్పు ఫోటోలు ఉపయోగించడం పెద్ద సమస్య కాదు. అయితే ఈ ఫోటోలు విదేశీ సంస్థలకు సంబంధించినవి. ఇప్పటి వరకు విదేశాలకు వెళ్లి భారత్, ప్రధాని నరేంద్ర మోదీ పరువు తీస్తున్నారు. కానీ ఇప్పుడు వారు తమ మేనిఫెస్టో కోసం విదేశీ ఫోటోలను అరువు తెచ్చుకుంటున్నారు" అని విమర్శించారు. Looks like the Congress forgot that it is preparing a manifesto for India and not putting together a holiday itinerary for Rahul Gandhi! What else explains using picture of Thailand under the Environment section? It shouldn’t be a surprise if Rahul Gandhi dashes off to Thailand,… pic.twitter.com/5MsNTCjFuc — Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) April 5, 2024 'రాహుల్ గాంధీ హాలిడే టూర్లా ఉంది' రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ మరో నేత అమిత్ మాల్వియా విరుచుకుపడ్డారు. "భారతదేశం కోసం మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నామని, రాహుల్ గాంధీ కోసం హాలిడే టూర్ షెడ్యూల్‌ను రూపొందించడం లేదన్న విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయినట్లు కనిపిస్తోంది" అన్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే రాహుల్ గాంధీ మరో హాలిడే ట్రిప్ కోసం థాయ్‌లాండ్‌కు వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని మాల్వియా ‘ఎక్స్’ పోస్ట్‌లో రాశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా స్పందించారు. మేనిఫెస్టోను రూపొందించడానికి విదేశీ ఏజెన్సీని నియమించారా అని ప్రశ్నించారు. -
బుద్ధుడి అవశేషాల ప్రదర్శన థాయ్‌లాండ్‌లో..
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన బుద్ధ భగవానుని పవిత్ర అస్థికలను, చితాభస్మాన్ని బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం థాయ్‌లాండ్‌లో ప్రదర్శించనున్నారు. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 18 వరకూ మధ్య థాయ్‌లాండ్‌లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరగనుంది. థాయ్‌లాండ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం బుద్ధుని అస్థికలను, చితాభస్మాన్ని థాయ్‌లాండ్‌కు పంపాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 22న కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ నేతృత్వంలో వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో పటిష్టమైన భద్రత నడుమ వీటిని పంపనున్నారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. శిష్యుల అస్థికలు కూడా.. బుద్ధ భగవానుని అస్థికలతోపాటు అతని శిష్యులైన అర్హంత్ సరిపుత్ర, అర్హంత్ మహామొగల్యన్లో అస్థికలను కూడా థాయ్‌లాండ్ పంపనున్నారు. ప్రస్తుతం ఈ మహనీయుల చితాభస్మం మధ్యప్రదేశ్‌లోని సాంచి స్థూపంలో భద్రపరిచారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో ఈ విషయమై చర్చించిన తర్వాత వీరి అస్థికలను థాయ్‌లాండ్‌కు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పంపిస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో బుద్ధ భగవానునికి సంబంధించిన 22 పవిత్ర అస్థికలు ఉన్నాయి. వీటిలో 20 అస్థికలు ప్రస్తుతం నేషనల్ మ్యూజియంలో ఉండగా, రెండు కోల్‌కతా మ్యూజియంలో ఉన్నాయి. వీటిలో నాలుగు అస్థికలను ఇప్పుడు థాయ్‌లాండ్‌కు పంపుతున్నారు. రెండోసారి థాయ్‌లాండ్‌కు.. బౌద్ధమత అనుచరులు ఈ పవిత్ర అస్థికలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. బుద్ధునికి సంబంధించిన ఈ పవిత్ర ఎముకలను ఇప్పటికే శ్రీలంక, కంబోడియా, సింగపూర్, దక్షిణ కొరియాలకు అక్కడి ప్రజల సందర్శనార్థం పంపారు. ఇప్పుడ రెండోసారి థాయ్‌లాండ్‌కు వీటిని పంపుతున్నారు. గతంలో అంటే 1995లో తొలిసారి బుద్ధుని అస్థికలను థాయ్‌లాండ్‌కు పంపారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019