breaking news
-
టాప్ ఈవీ తయారీ సంస్థ క్యూ1 ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
అమెరికాలోని టాప్ ఈవీ తయారీ కంపెనీగా పేరున్న టెస్లా ఇటీవల విడుదల చేసిన మొదటి త్రైమాసిక ఫలితాల్లో ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు 3,87,000 యూనిట్లను డెలివరీ చేసినట్లు కంపెనీ తెలిపింది. అయితే క్యూ1 ఫలితాల్లో టెస్లా అమ్మకాలు అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే 8.5 శాతం తగ్గాయి. దాంతో కంపెనీ రెవెన్యూ భారీగా తగ్గిపోయింది. ఏడేళ్లలో కంపెనీ ఇంతలా నష్టపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రెవెన్యూ తగ్గడంతో ఇటీవల కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10శాతం మందిని కొలువుల నుంచి తొలగించినట్లు టెస్లా ప్రకటించింది. అంటే సుమారు 14వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. చైనా ఈవీ తయారీ సంస్థల నుంచి టెస్లాకు భారీ పోటీ నెలకొన్నట్లు తెలిసింది. చైనాతోపాటు అంతర్జాతీయంగా దిగ్గజ సంస్థలు ఈవీలను తయారుచేస్తున్నాయి. టెస్లాలో వాడుతున్న ఫీచర్లతోపాటు అదనంగా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాయి. దాంతో వినియోగదారులు ఇతర కంపెనీ ఉత్పత్తులు కొనేందుకు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యటన వాయిదా.. టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్నారనే వార్తలు ఇటీవల వైరల్‌గా మారాయి. ఈమేరకు వీటిని ధ్రువీకరిస్తూ మస్క్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. అయితే ఆ పర్యటనను వాయిదావేశారు. ఏప్రిల్ 23న అమెరికాలో టెస్లా ఇన్వెస్టర్ల సమావేశం ఉండడంతో ఈ పర్యటన వాయిదా పడిందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. మస్క్ భారత్‌లో రూ.16 వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. టెస్లా కంపెనీను భారత్‌లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. విదేశీ కంపెనీలు భారత్‌లో ప్రవేశించేందుకు లైన్‌క్లియర్ చేస్తూ కేంద్రం కొత్త ఈవీపాలసీను రూపొందించింది. ఈ మేరకు కేంద్రం ఇటీవల ఆటోమొబైల్ తయారీ కంపెనీల అభిప్రాయాలను సైతం తీసుకున్నట్లు ప్రకటించింది. -
ఈవీ పాలసీపై చర్చకు హాజరైన ప్రముఖ కంపెనీ ప్రతినిధులు
దేశంలో అమల్లోకి తీసుకురాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ) పాలసీకి సంబంధించి మార్గదర్శకాల కోసం ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయాలను సేకరిస్తోంది. ఈ క్రమంలో ఆయా ఈవీల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతుండగా టెస్లా సలహాదారు కూడా ఇందులో పాల్గొన్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ సమావేశంలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా, మహీంద్రా, కియా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా, రెనాల్ట్ వంటి ప్రధాన తయారీదారుల ప్రతినిధులు ఉన్నారు. వీరితోపాటు మెర్సిడెస్ జెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి లగ్జరీ కార్ల తయారీ కంపెనీలకు చెందిన ప్రతినిధుల నుంచి ప్రభుత్వ వర్గాలు అభిప్రాయాలను సేకరించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీలోని అంశాలను ఆయా కంపెనీలకు వివరించింది. ఇదీ చదవండి: యువ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్.. భారీ రాయితీ ప్రకటించిన సంస్థ ఏప్రిల్ 22 నుంచి ఎలొన్‌మస్క్ భారత పర్యటన ప్రారంభంకానుంది. మస్క్ తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని భావిస్తున్నారు. మస్క్‌ను కలిసేందుకు భారత్‌లోని కొన్ని అంతరిక్ష రంగ స్టార్టప్ కంపెనీలను ప్రభుత్వం ఆహ్వానించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. అందులో స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, ధృవ స్పేస్ వంటి కంపెనీలున్నట్లు తెలిసింది. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. వేలాది ఉద్యోగులు ఇంటికి!
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా తమ ఉద్యోగులలో 10 శాతం కంటే ఎక్కువమందిని తొలగించడానికి సన్నద్ధమైంది. గ్లోబల్ మార్కెట్లో కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతుండటంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థగా ఎదిగిన టెస్లా కంపెనీలో 2023 డిసెంబర్ నాటికి 1,40,473 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా సంస్థ తీసుకున్న నిర్ణయం వల్ల 14000 కంటే ఎక్కువ మందిని తొలగించే అవకాశం ఉంది. టెస్లా సిబ్బందికి పంపిన ఇమెయిల్‌లో.. ఇలాన్ మస్క్ (Elon Musk) ఇలా పేర్కొన్నారు.. కంపెనీ తదుపరి వృద్ధికి సిద్దమవుతున్న తరుణంలో ఖర్చులను తగ్గించుకోవడానికి, ఉత్పాదకను పెంచుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరి మీద ద్వేషం లేదు, తప్పని పరిస్థితుల్లో చేస్తున్నామని అన్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్‌లోని కొంతమంది సిబ్బందికి ఇప్పటికే తొలగించినట్లు సమాచారం. మరోవైపు గిగాఫ్యాక్టరీ షాంఘైలో టెస్లా సైబర్ ట్రక్ ఉత్పత్తి తగ్గించడం కూడా తాజాగా ఉద్యోగుల తొలగింపుకు కారణం అయి ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. ఇదీ చదవండి: 13 ఏళ్ల అమ్మాయికి 'ఆనంద్ మహీంద్రా' జాబ్ ఆఫర్: ఎందుకో తెలిస్తే.. టెస్లా షేర్లు ఇటీవలి బాగా దెబ్బతిన్నాయి. గతంతో పోలిస్తే.. ఇది సుమారు 31 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ.. ఆ విభాగంలో ప్రత్యర్థులు ఎక్కువవుతున్నారు. ఇది టెస్లా అమ్మకాల మీద ప్రభావం చూపిస్తోందని తెలుస్తోంది. -
ప్రముఖ భారత కంపెనీతో టెస్లా ఒప్పందం
టెస్లా తన కార్యకలాపాల కోసం సెమీకండక్టర్ చిప్‌లను కొనుగోలు చేయడానికి టాటా ఎలక్ట్రానిక్స్‌తో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈమేరకు కొన్ని వార్తామీడియా సంస్థల్లో కథనాలు వెలువడ్డాయి. కొన్నినెలల కొందట టాటా గ్రూప్ సెమీ కండక్టర్ విభాగంలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా దాదాపు రూ.40వేల కోట్ల పెట్టుబడితో అస్సాంలో సెమీకండక్టర్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్ యోచిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి. సెమీకండక్టర్ తయారీ నేపథ్యంలో టాటాగ్రూప్ గ్లోబల్ క్లయింట్లను సంపాదించే పనిలో పడింది. అందులో భాగంగా టెస్లాతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇప్పటికే టెస్లా భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేసింది. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త ఈవీపాలసీ నిబంధనలతో దాదాపు ఆ సంస్థ భారత్ ప్రవేశానికి లైన్ క్లియరైంది. ఈ తరుణంలో ఇండియాలో తమ తయారీ ప్లాంట్ పెట్టేందుకు టెస్లా సిద్ధపడుతోందని తెలిసింది. ఈనెల 21న ఎలొన్‌మస్క్ ఇండియా రానున్నారు. ఈమేరకు దానిపై కీలక నిర్ణయం వెలువడనుందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదీ చదవండి: ‘తప్పు చేశాం.. మళ్లీ తప్పు చేస్తాం..’ 10వేల డాలర్లు ఆఫర్.. ఈ పరిణామాల నేపథ్యంలో టాటాగ్రూప్ టెస్లాతో సెమీకండక్టర్ల విషయంలో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇరు కంపెనీల మధ్య ఎంత విలువ చేసే డీల్ కుదిరిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. మస్క్ భారత్ పర్యటనలో భాగంగా దాదాపు 2-3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే అమెరికన్ ఈవీ దిగ్గజ సంస్థ దేశంలో తమ ఉత్పత్తుల తయారీకోసం రిలయన్స్‌తో జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని పరిశీలిస్తున్నట్లు కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. -
భారత్‌లో ప్రవేశించనున్న ఎలొన్‌మస్క్ మరో కంపెనీ
ప్రపంచ ఎలక్ట్రిక్‌కార్ల దిగ్గజ సంస్థ టెస్లా చీఫ్ ఎలొన్ మస్క్ ఏప్రిల్ 21న భారత్‌కు రానున్నారు. ఈ తరుణంలో భారత్‌లో టెస్లా ప్లాంట్ తయారీకి సంబంధించిన అంశాలు చర్చించనున్నట్లు తెలిసింది. దాంతోపాటు ప్రధానితో చర్చలు జరుపనున్నట్లు సమాచారం. అయితే కేవలం టెస్లా అంశమే కాకుండా మస్క్ కీలక ప్రాజెక్ట్ అయిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించే స్టార్‌లింక్‌ను కూడా ఇండియాలో ప్రవేశపెట్టేలా అధికారులతో చర్చలు జరుపనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ యూనిట్‌కు సంబంధించి లైసెన్స్ ప్రక్రియ ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్ విభాగం(డీఓటీ) పరిశీలనలో ఉంది. ఇటీవల శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ), ట్రయల్ స్పెక్ట్రమ్‌పై పని చేసేందుకు డీఓటీ లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. స్టార్‌లింక్ లైసెన్స్ కోసం గతంలోనే ఆ సంస్థ గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ సర్వీసెస్ లైసెన్స్(జీఎంపీసీఎస్) కోసం దరఖాస్తు చేసింది. అయితే డేటా స్టోరేజీ, ట్రాన్స్ఫర్ విషయంలో సంతృప్తికర సమాధానం ఇవ్వకపోవడంతో లైసెన్స్ రద్దు అయింది. తాము అంతర్జాతీయంగా ఉన్న ప్రమాణాలనే పాటిస్తామని అప్పట్లో స్టార్ లింక్ పేర్కొంది. దాంతో ప్రభుత్వం తమ దరఖాస్తును తిరస్కరించింది. డేటా స్టోరేజీ విషయంలో భారత నియమ నిబంధనలే పాటించాలని ప్రభుత్వం స్టార్ లింక్‌కు స్పష్టం చేసింది. తర్వాత కొన్నిరోజులకు తిరిగి దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో స్టార్ లింక్ ఇచ్చిన సమాధానం పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందింది. సెక్యూరిటీ చెక్ తర్వాత శాటిలైట్ సర్వీసులకు సంబంధించిన అనుమతులు మంజూరు అవుతాయని తెలిసింది. దేశీయంగా భారతీ ఎయిర్టెల్ మద్దతున్న వన్ వెబ్, రిలయన్స్ జియో శాటిలైట్ సర్వీసులకు మాత్రమే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. స్టార్ లింక్‌కు కూడా అనుమతులు లభిస్తే మూడో సంస్థ అవుతుంది. అదే జరిగితే ఎయిర్టెల్, జియోకు ఈ విభాగంలో గట్టి పోటీ ఎదురుకానుంది. మరోవైపు ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ సైతం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఈ ప్రతిపాదనపై డాట్ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదీ చదవండి: అలర్ట్.. 48 గంటల్లో యుద్ధం.. భారత వాణిజ్యంపై ప్రభావం ఎంతంటే.. టెస్లా కంపెనీను భారత్‌లో ప్రవేశించేలా చేసేందుకు నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని మస్క్ గతంలో ప్రధానితోపాటు ఇతర కేంద్రమంత్రులు, అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇటీవల విదేశీ ఈవీ తయారీ కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలు సాగించేలా, ఇక్కడ పెట్టుబడిపెట్టేలా కేంద్రం కొత్త ఈవీ పాలసీను రూపొందించింది. ఈ పరిణామాలు చోటుచేసుకున్న కొద్ది రోజులకే ఈవీ తయారీలో టాప్‌స్థాయిలో ఉన్న టెస్లా చీఫ్ మస్క్ భారత్ పర్యటన రాబోతుండడం పరిశ్రమవర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019