breaking news
-
45 డిగ్రీలు దాటేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఉదయం నుంచే మంట పుట్టిస్తున్న సూర్యుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చండ ప్రచండ వేడితో ప్రజలు తల్లడిల్లుతున్నారు. గురువారం మంచిర్యాల జిల్లా హాజిపూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అదే విధంగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో కూడా గరిష్ట ఉష్ణోగ్రత 45.2 డిగ్రీ ల సెల్సియస్, ములుగు జిల్లా మేడారంలో 45.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతా యని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావొద్దని సూచించింది. ఎండల తీవ్రతకు తోడు వడగాల్పుల ప్రభావంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఎండదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, ఏప్రిల్‌లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడంతో వచ్చే నెల మేలో పరిస్థితేంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా... రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. సగటున 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గురువారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత భద్రాచలంలో 43.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత దుండిగల్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఖమ్మంలో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5.6 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదు కాగా, భద్రాచలం, నల్లగొండలో 4 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, మెదక్, హనుమకొండ, నిజామాబాద్, రామగుండంలో 3 డిగ్రీల సెల్సియస్ మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 2 డిగ్రీల సెల్సియస్ మేర సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మన్నార్ గల్ఫ్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. శుక్రవారం ఉత్తరాది జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. -
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు (ఫొటోలు)
-
ఒకేరోజు 12 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
ఛత్తీస్‌గఢ్‌లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోయాయి. గత 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు తగ్గింది. తేమ 87 శాతానికి పెరిగింది. ఫలితంగా రాష్ట్రంలోని ఇళ్లు, కార్యాలయాల్లోని ఏసీలు, కూలర్లకు విశ్రాంతి దొరికింది. రాజధాని రాయ్‌పూర్‌లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. గడచిన 24 గంటల్లో రాయ్‌పూర్‌లో ఒక సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది, రాయ్‌పూర్‌లో 24.7, మనాలో 24, బిలాస్పూర్లో 28.4, పెండ్రారోడ్లో 29.6, అంబికాపూర్‌లో 31.5, జగదల్పూర్లో 26.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయ్‌పూర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్ తగ్గింది. -
వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డయ్యే ఈ ఉష్ణోగ్రతలు ఒకింత ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్ ఆరంభంలోనే మే నెలను తలపించే వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడచిన 132 ఏళ్లలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గణాంకాలను పరిశీలిస్తే.. మన రాష్ట్రంలో నమోదైన గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 1875లో ఐఎండీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డయిన ఉష్ణోగ్రతలను గమనిస్తే.. 2003 మే 28న రెంటచింతలలో (ప్రస్తుత పల్నాడు జిల్లా) అత్యధికంగా 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే రికార్డు. ఆ తర్వాత స్థానంలో ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నిలిచింది. అక్కడ 1962 మే 26న 48.9 డిగ్రీలు నమోదైంది. గన్నవరంలో 2002 మే 11న 48.8, నంద్యాలలో 1994 మే 11న 48.2, మచిలీపట్నంలో 1906 మే 25న 47.8, తునిలో 1998 మే 30న 47.5, విజయవాడలో 1980 మే 26న 47.5, ఒంగోలులో 2003 మే 31న 47.4, నరసారావుపేటలో 1983 మే 2,3 తేదీల్లో 47, నెల్లూరులో 1892 మే 15న, 1894 జూన్ 1న 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఇలా.. ఏప్రిల్ నెలలోనూ అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులున్నాయి. గడచిన పదేళ్లలో (ఏప్రిల్‌లో) 2016 ఏప్రిల్ 25న తిరుపతిలో నమోదైన 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం. ఈ రికార్డును ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో నమోదైన 46 డిగ్రీల ఉష్ణోగ్రత చెరిపేసింది. ఇంకా ఆదివారం నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఎల్‌నినో వంటి ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు. -
దేశరాజధాని ఢిల్లీలో పెరిగిన ఉష్ణోగ్రతలు
దేశరాజధాని ఢిల్లీలో ఉక్కపోతల కాలం మొదలయ్యింది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 33 డిగ్రీలు దాటింది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న మూడునాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో విపరీతమైన వేడి వాతావరణం ఉండనుందని, పలు రాష్ట్రాల్లో వేడిగాలులు మొదలు కానున్నాయిని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. సోమవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 33.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుత కనిష్ట ఉష్ణోగ్రత 15.8 డిగ్రీల సెల్సియస్, ఇది సీజన్ సగటు కంటే ఒక డిగ్రీ తక్కువ. తేమ శాతం 40 నుంచి 94 శాతం వరకు ఉంటున్నదని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం రాబోయే రెండుమూడు రోజుల్లో ఢిల్లీ-ఎన్సీఆర్లో ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు చేరుకోనుంది. కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)తెలిపిన వివరాల ప్రకారం మార్చి 26న ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్‌లోని ఉప-హిమాలయ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019