breaking news
Ad - Sakshi_Home_Sticky
-
కొత్త మార్క్‌కు బంగారం.. నిన్ననే కొన్నవారు సేఫ్!
Gold Rate today: పసిడి కొనుగోలుదారులకు ఇది చేదువార్త. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 19) మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు రెండు రోజులు బ్రేక్ ఇచ్చి ఈరోజు మళ్లీ పెరిగి కొత్త మార్క్‌ను చేరాయి. హైదరాబాద్ నగరంతోసహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 పెరిగి రూ.74,340 లకు ఎగిసింది. ఇతర నగరాల్లో బంగారం ధరలు ♦ చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.550 పెరిగి రూ.68,900 లకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.600 చొప్పున ఎగిసి రూ.75,160 లను తాకింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్దకు, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,300 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.540 పెరిగి రూ.74,490 లకు ఎగిసింది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.68,150 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.540 ఎగిసి రూ.74,340 వద్దకు చేరింది. -
హమ్మయ్య.. మళ్లీ పెరగక ముందే కొనేయండి!
Gold Rate today: పసిడి ప్రియులకు శుభవార్త ఇది. బంగారం ధరలు ఈరోజు (ఏప్రిల్ 18) తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు క్రితం రోజున పెరుగుదలకు బ్రేక్ ఇచ్చి స్థిరంగా కొనసాగగా ఈరోజు గణనీయంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున తగ్గి రూ.73,800 వద్దకు దిగొచ్చింది. ఇతర నగరాల్లో.. ♦ చెన్నైలో ఈరోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.68,350 లకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల బంగారం రూ.390 చొప్పున క్షీణించి రూ.74,560 లకు తగ్గింది. ♦ బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 తగ్గి రూ.73,800 వద్దకు చేరింది. ♦ ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,800 లకు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.330 తగ్గి రూ.73,950 వద్ద ఉంది. ♦ ముంబైలో 22 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ.67,650 వద్ద, అదే విధంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.330 ఎగిసి రూ.73,800 వద్దకు చేరింది. -
WhatsApp Chat Filters: వాట్సాప్‌లో కొత్త ఫీచర్..
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది వాట్సాప్. దీనికి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో వాట్సప్‌కి గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి. తాజాగా వాట్సాప్ నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. చాట్ ఫిల్టర్ ఫీచర్ ని వాట్సాప్ కొత్తగా లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మనకు కావాల్సిన చాట్ కోసం స్క్రోల్ చేసే అవసరం లేకుండా సర్చ్ చేసి మెసేజ్ లు చూసుకోవచ్చు. చాట్ ఫిల్టర్ ఫీచర్ 2020లో జీమెయిల్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదే ఫీచర్‌ను ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తెచ్చింది మెటా సంస్థ. మొదట ఆండ్రాయిడ్ వర్షన్ 2.22. 16.14లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్, ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా వాట్సాప్‌లో యాక్టివ్‌గా లేని యూజర్లను గుర్తించే మరో ఫీచర్ ని కూడా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. -
ఇకపై రూ.1 లక్ష విత్‌డ్రా చేసుకోవచ్చు.. పీఎఫ్‌లో కీలక మార్పు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ( EPFO ) చందాదారుల నగదు ఉపసంహరణ విషయంలో కీలక మార్పులు చేసింది. వైద్య ఖర్చుల కోసం చేసే 68జే క్లెయిమ్‌ల అర్హత పరిమితిని రూ. 50,000 నుంచి రూ.1 లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈపీఎఫ్‌వో కొత్త మార్పు ప్రకారం.. చందాదారులు తమ వ్యక్తిగత లేదా కుటుంబ సభ్యుల వైద్య చికిత్స ఖర్చుల కోసం ఇకపై రూ.1 లక్ష వరకూ ఉపసంహరించుకోవచ్చు. నెల అంతకంటే ఎక్కువ రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నా, ఆపరేషన్లు చేయించుకున్నా క్లెయిమ్ చేయొచ్చు. పక్షవాతం, టీబీ, క్షయ, క్యాన్సర్, గుండె సంబంధిత చికిత్స కోసం కూడా నగదు విత్‌డ్రాకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. లక్ష పరిమితికి లోబడి ఉద్యోగుల ఆరు నెలల బేసిక్ వేతనంతోపాటు డీఏ లేదా ఈపీఎఫ్‌లో ఉద్యోగి వాటా వడ్డీతో సహా ఏది తక్కువైతే అంత వరకూ మాత్రమే ఉపసంహరించుకోవడానికి క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. ఇందు కోసం ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు. -
రైల్వే రిజర్వేషన్లో కొత్త రూల్! ప్రాధాన్యత వారికే..
రైల్వే రిజర్వేషన్, బెర్తుల కేటాయింపులో ఇండియన్ రైల్వే కొత్త రూల్‌ను అమలు చేసింది. లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్లో వృద్ధ ప్రయాణికులకు ప్రాధాన్యతనిస్తూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రయాణంలో సీనియర్ సిటిజన్ల ఇబ్బందులను తొలగించడానికి భారతీయ రైల్వే ఈ చర్య చేపట్టింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌లను రిజర్వ్ చేసుకోవడానికి అర్హులు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రయాణికుల విభిన్న అవసరాలను తీర్చడంలో రైల్వే నిబద్ధతను ఈ నిబంధన తెలియజేస్తుంది. పైకి ఎక్కలేని వృద్ధులకు లోయర్ బెర్త్‌ను బుక్ చేసుకున్నప్పటికీ అప్పర్ బెర్త్‌ల కేటాయించడంపై సోషల్ మీడియాలో లేవనెత్తిన ప్రయాణికుల ఆందోళనకు ప్రతిస్పందనగా ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తూ సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రిజర్వేషన్లను పొందే ప్రక్రియను స్పష్టం చేసింది. ఇండియన్ రైల్వే అందించిన స్పష్టీకరణ ప్రకారం.. ప్రయాణికులు లోయర్ బెర్త్ కోసం బుకింగ్ సమయంలో తప్పనిసరిగా రిజర్వేషన్ ఛాయిస్ ఎంపికను ఎంచుకోవాలి. అయితే బెర్తుల కేటాయింపులు లభ్యతకు లోబడి ఉంటాయి. ముందుగా రిజర్వ్ చేసుకున్నవారికి ముందుగా ప్రాతిపదికన లోయర్ బెర్త్‌లు కేటాయిస్తున్నట్లు భారతీయ రైల్వే స్పష్టం చేసింది. లోయర్ అవసరమైన ప్రయాణికులు రైలు టిక్కెట్ ఎగ్జామినర్ (TTE)ను సంప్రదించవచ్చని, లోయర్ బెర్త్‌లు అందుబాటులో ఉంటే కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొంది.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019