breaking news
-
వారం ఆలస్యంగా...
సుందర్ .సి కీలక పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘అరణ్మనై 4’. ఇందులో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీని ‘బాక్’ పేరుతో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన విడుదలను వాయిదా వేశామని మేకర్స్ ప్రకటించారు. వారం ఆలస్యంగా మే 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘వెన్నెల’ కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, ఢిల్లీ గణేశ్, కోవై సరళ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హిప్హాప్ తమిళ, కెమెరా: కృష్ణమూర్తి. -
తమన్నా, రాశీ ఖన్నా గ్లామర్ బ్లాస్ట్.. పాటలో డోస్ పెంచిన బ్యూటీస్
దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పాటను విడుదల చేశారు మేకర్స్..అందులో తమన్నా, రాశీఖన్నా అందాల ప్రదర్శనతో పోటీ పడ్డారు అని చెప్పవచ్చు. హిప్ హాప్ ఆది అందించిన మ్యూజిక్కు వారిద్దరూ గ్లామర్‌తో మ్యాజిక్ చేశారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన మూడు సీక్వెల్స్ భారీ హిట్‌ను అందుకున్నాయి. ఇప్పుడు నాలుగో పార్ట్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో తమన్నా, రాశీఖన్నాలే హైలైట్. అందాలు ఆరబోయడంలో ఒకరితో ఒకరు పోటీపడినట్లు కనిపిస్తోంది. తెలుగులో 'బాక్' అనే పేరుతో ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అరణ్మణై 4 నిజానికి ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సింది. పలు కారణాల రీత్యా వాయిదా పడింది. ఫైనల్‌గా ఏప్రిల్ 26న ఈ చిత్రం కోలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదల కానుంది. -
సూపర్ హిట్ మూవీ.. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్
హీరో కార్తీ సూపర్ హిట్ చిత్రాల్లో పైయ్యా ఒకటి. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహించారు. తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుభాష్‌చంద్రబోస్ నిర్మించారు. మది ఛాయాగ్రహణం, యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. రోడ్ ట్రావెల్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇందులోని పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఇది తెలుగులో ఆవారాగా రిలీజై ఇక్కడ కూడా హిట్ అందుకుంది. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్ తాజాగా పైయ్యా చిత్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయడానికి తిరుపతి బ్రదర్స్ సంస్థ అధినేత సుభాష్ చంద్రబోస్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ చేయనున్నట్లు దర్శకుడు లింగుసామి ఇంతకు ముందే చెప్పారన్నది గమనార్హం. తాజాగా పైయ్యా చిత్రం రీ రిలీజ్ గురించి ఆయన మాట్లాడుతూ.. కార్తీకి ఒక హోటల్లో కథ చెప్పడం మొదలు పెట్టిన కొద్ది సేపటికే చాలా బాగుంది.. మనం చిత్రం చేస్తున్నాం అని చెప్పారన్నారు. ఆయనకు కథలపై చాలా నాలెడ్జ్ ఉందన్నారు. కెమిస్ట్రీ వర్కౌట్ అయింది సినిమాలో లవ్, యాక్షన్, చేజింగ్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు బాగా కుదిరాయన్నారు. కార్తీ, తమన్నాల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందన్నారు. ఇకపోతే పైయ్యా చిత్రానికి సీక్వెల్ చేస్తానని, కథ కూడా సిద్ధం చేశానన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే దీనికంటే ముందు ఒక పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నట్లు చెప్పారు. ఇది మహాభారతంలోని శ్రీకృష్ణుడు, అర్జునుడు పాత్రల నేపథ్యంలో ఉంటుందని చెప్పారు. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని లింగుసామి పేర్కొన్నారు. చదవండి: హీరోయిన్ అరుంధతి ప్రస్తుతం ఎలా ఉందో చెప్పిన సోదరి -
గ్లామర్‌కే ఓటేస్తున్న తమన్నా.. కారణం ఇదేనట!
గ్లామరస్‌గా నటించాలంటే నేటి కథానాయికల్లో తమన్నా తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. సుమారు 20 ఏళ్ల క్రితం చాంద్ సా రోషన్ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయం అయిన ఈ బ్యూటీ ఆ తరువాత దక్షిణాది చిత్రాలపై దృష్టి పెట్టారు. హిందీలో పెద్దగా పేరు తెచ్చుకోలేకపోయినా, తెలుగు, తమిళం భాషల్లో అగ్రనటిగా రాణిస్తున్నారు. అయితే ఆది నుంచి తమన్నా గ్లామర్‌నే నమ్ముకున్నారని చెప్పవచ్చు. నువ్వు కావాలయ్యా.. అలాగని ఈ అమ్మడిలో నటించే సత్తా లేదని చెప్పలేం. బాహుబలి వంటి చిత్రాల్లో నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. అయినా గ్లామర్ క్వీన్‌గానే ముద్ర వేసుకున్నారు. ఇటీవల జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా పాటలో తనదైన స్టైల్లో అందాలను ఆరబోసారు. ఈ పాట ఇప్పటికీ వాడవాడల్లో మారు మోగుతోందంటే అతిశయోక్తి కాదు. తమన్నా తమిళంలో నటించిన తాజా చిత్రం అరణ్మణై –4. ఇందులో అభినయం, అందాలతో ప్రేక్షకులను అలరించడానికి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైండ్‌సెట్ మారాలి ఈ సందర్బంగా ఈ చిత్రంలో ఎక్కువ గ్లామరస్‌గా నటించడానికి కారణం ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. దీనిపై మిల్కీ బ్యూటీ స్పందిస్తూ.. గ్లామర్‌ను ప్రదర్శించడం, అలాంటి పాటల్లో నటించడం అనేది ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమేనన్నారు. ఇంకా చెప్పాలంటే పాటల్లో గ్లామర్‌ను ప్రదర్శించడం తప్పేమీ కాదన్నారు. ఈ విషయంలో ప్రేక్షకుల మైండ్‌సెట్ మారాలన్నారు. జైలర్ చిత్రంలో కావాలయ్యా పాటను చూసిన కొందరు చాలా దారుణంగా కామెంట్స్ చేశారని, అది తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. చదవండి: అవార్డును వేలం వేసిన విజయ్ దేవరకొండ.. దక్కించుకున్నది ఎవరంటే? -
మళ్లీ వచ్చేస్తున్న హారర్ మూవీ.. ట్రైలర్ చూశారా?
దర్శకుడు సుందర్ సి ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం అరణ్మణై–4. ఇంతకుముందు ఈయన తెరకెక్కించిన అరణ్మణై 1, 2, 3 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో అరణ్మణై–4 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నటి కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్‌కుమార్‌కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో తమన్నా, రాశీ ఖన్నా, యోగిబాబు, కోవై సరళ, వి.టీవీ గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. అప్పట్లో ఆ ఆలోచనే లేదు హిప్ హాప్ ఆది సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఏప్రిల్ నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని నిర్వహించారు. హీరో సుందర్ సి మాట్లాడుతూ.. అరణ్మణై చిత్రం తొలిభాగం తన కెరీర్లో చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు. దానికి సీక్వెల్స్ రూపొందించాలన్న ఆలోచన తనకు అప్పట్లో లేదన్నారు. మంచి ఐడియాలు రావడం వల్లే సీక్వెల్స్ రూపొందిస్తున్నట్లు చెప్పారు. వేరే చిత్రానికి సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నప్పుడు తన కోరైటర్ ఒక విషయాన్ని చెప్పారన్నారు. రాజులే భయపడ్డారు అది కొత్తగా ఉండడంతో ఈ అరణ్మణై –4 చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమైనట్లు చెప్పారు. 'ఇండియాలోని పలు భాగాలను పాలించడానికి అప్పట్లో పలువురు రాజులు దండెత్తి వచ్చారు. అయితే వారెవరూ ఈస్ట్ భాగంలోని బ్రహ్మపుత్ర నదిని దాటి వెళ్లడానికి సాహసించలేదు. అందుకు పలు కారణాలు ఉండగా.. అందులో ఒకటి దెయ్యం! ఆ ప్రాంతంలో బాగ్ అనే మానవశక్తిని మించిన శక్తి కలిగిన దెయ్యం ఉందనేది కథలు, కథలుగా చెప్పుకునేవారు. ఆ అంశాన్ని కథగా మలుచుకుని రూపొందించిన చిత్రమే అరుణ్మణై–4' అని చెప్పారు. ఇప్పటి వరకు గ్లామర్, యాక్షన్ పాత్రల్లో చూసిన తమన్నాలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చదవండి: సాధారణ వ్యక్తి ప్రేమలో 'పూజా హెగ్డే'.. ఫోటోలు వైరల్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019