breaking news
-
‘సూర్య తిలక్’ వేడుక.. ట్యాబ్‌లో వీక్షించిన ప్రధాని
గువహతి:అయోధ్య బాలరాముని నుదుట సూర్యుడు తిలకం దిద్దిన ‘సూర్య తిలక్’ వేడుకను ప్రధాని నరేంద్రమోదీ అస్సాంలో తిలకించారు. బుధవారం నల్బరీ జిల్లాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని సభలోని వారందరినీ సెల్‌ఫోన్ టార్చ్‌లైట్ ఆన్ చేసి కాసేపట్లో జరిగే సూర్యతిలక్ ఉత్సవానికి సంఘీభావం తెలపాలని కోరారు. సెల్‌ఫోన్‌లైట్ కిరణాలు కూడా పంపాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ‘దేశ వాసుల 500 ఏళ్ల కల ఇన్నాళ్లకు నెరవేరింది. అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇది తొలి రామ్ నవమి. కాసేపట్లో సూర్యతిలక్ వేడుక జరగనుంది. మీరందరూ మీ సెల్‌ఫోన్ లైట్లను వెలిగించండి.. జై శ్రీరామ్, జై శ్రీరామ్ నినాదాలివ్వండి’అని ప్రధాని కోరారు. ర్యాలీ తర్వాత ప్రధాని తన వద్ద ఉన్న ట్యాబ్‌లో సూర్యతిలక్ వేడకను వీక్షించారు. ఈ దృశ్యాలను ఆయన తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్టు చేశారు. #WATCH | PM Narendra Modi watched the Surya Tilak on Ram Lalla after his rally in Nalbari, Assam "Like crores of Indians, this is a very emotional moment for me. The grand Ram Navami in Ayodhya is historic. May this Surya Tilak bring energy to our lives and may it inspire our… pic.twitter.com/hA0aO2QbxF — ANI (@ANI) April 17, 2024 ఇదీ చదవండి..బాలరాముడికి సూర్య తిలకం -
ఏపీకి ప్రైమ్ మినిస్టర్ ఎక్స్‌లెన్స్ అవార్డు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తున్న విద్యా బోదనకు గాను ‘ప్రైమ్ మినిస్టర్ ఎక్స్‌లెన్స్’ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ ఎంపికైంది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక విద్యకు శ్రీకారం చుడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన విద్యా విప్లవానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. బ్లాక్ బోర్డు స్థానంలో తెచ్చిన ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్‌పీ), బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల ద్వారా ఆధునిక బోధనకు గాను రాష్ట్రాన్ని ఈ అవార్డు వరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో అమర్చిన ఐఎఫ్‌పీలు, 8, 9వ తరగతుల విద్యార్థుల చేతుల్లో ఉన్న ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన, సందేహాల నివృత్తికి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులను పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’ కార్యక్రమం బెస్ట్ ఇన్నోవేషన్ కేటగిరీలో అవార్డు ఎంపికలో కీలకపాత్ర వహించింది. దేశంలోనే అత్యుత్తమ విద్యాబోధన చేస్తున్న రాష్ట్రంగా అత్యున్నత అవార్డుకు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఇద్దరు అధికారులను రాష్ట్రానికి పంపింది. కేంద్ర డిప్యూటీ కార్యదర్శులు ఆశిష్ సక్సేనా, హరీష్ రాయ్‌తో కూడిన బృందం గురువారం గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం వెనిగండ్ల జెడ్పీ హైసూ్కల్, గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, పట్టాభిపురంలోని నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలను సందర్శించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వీరికి పాఠశాలల్లో అమలు చేస్తున్న సాంకేతిక విద్యా బోధన గురించి వివరించారు. ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’పై ప్రశంసలు కార్పొరేట్‌ను తలదన్నేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధునిక బోధన పద్ధతులు, వసతులను తిలకించిన అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐఎఫ్‌పీలు, ట్యాబ్‌ల ద్వారా విద్యాబోధన అందించడంతో పాటు దేశంలోనే తొలిసారిగా ఇంజినీరింగ్ విద్యార్థులను పాఠశాలలకు అనుసంధానం చేస్తూ ప్రవేశపెట్టిన ‘ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్’ కార్యక్రమంపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆశిష్ సక్సేనా, హరీష్ రాయ్‌లు.. వారిలోని అద్భుతమైన మేధస్సు, సబ్జెక్టుల వారీగా పట్టు, ఇంగ్లిష్ భాష పరిజ్ఞానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ట్యాబ్‌ల ద్వారా ఇన్నోవేటివ్ ట్రెండ్స్, స్విఫ్ట్‌చాట్ యాప్, బైజూస్ కంటెంట్‌ను ఇంజినీరింగ్ విద్యార్థులు బోధిస్తున్న తీరును, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్ తదితర సాంకేతిక నైపుణ్యాలపై పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పింస్తున్న తీరును పరిశీలించారు. ఐఎఫ్‌పీల ద్వారా ఉపాధ్యాయుల బోధనను ప్రత్యక్షంగా తిలకించారు. ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్పర్ట్స్ కార్యక్రమం ద్వారా ఏ ఏ అంశాలను నేర్చుకుంటున్నదీ విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. తరగతులను బోధిస్తున్న బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులతోనూ మాట్లాడారు. మూడు పాఠశాలల సందర్శన ముగించుకున్న అధికారుల బృందం.. సంబంధిత విద్యార్థులు చదువుతున్న కళ్లం హరనాథరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లి యాజమాన్యంతో చర్చించారు. సమగ్రశిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి, ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి, డీఈవో పి.శైలజ, సీఎస్ఈ ఐటీ సెల్ ప్రతినిధి రమేష్, హెచ్ఎంలు ఉన్నారు. -
మారుతున్న కాలానుగుణంగా.. ఈ కొత్త టెక్నాలజీ మీకోసం..
'అతి వేగంగా పరుగెడుతున్న ఈ కాలాన్ని ఆపడం ఎవరి వలన కాదు. ఈ కాలంతోపాటుగా కొత్త టెక్నాలజీ కూడా అంతే వేగంగా పరుగెడుతుంది. దానిని మనం గుప్పిట్లో దాచి, సరైన క్రమంలో.. టెక్నాలజీని ఉపయోగించుటకై సరికొత్త పరికరాలు మీ ముందుకు వస్తున్నాయి. మరి వాటిని గురించి పూర్తిగా తెలుసుకందామా..!' మిల్క్ వే ట్యాబ్.. మన దేశ విద్యారంగంలోని కీలకమైన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ టెక్ సంస్థల సహాకారంతో ‘ఎపిక్’ ఫౌండేషన్ రూపొందించిన ట్యాబ్ మిల్క్ వే. కొన్ని వివరాలు: సైజ్: 8 అంగుళాలు రిజల్యూషన్: 1,280“800 పిక్సెల్స్ మీడియా టెక్ 8766 ఏప్రాసెసర్ 4జీబి ర్యామ్/64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 5,100 ఎంఏహెచ్ హానర్ మ్యాజిక్ బుక్ 16ప్రో.. సైజ్: 16.00 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 165 హెచ్జడ్ రిజల్యూషన్: 3072“1920 పిక్సెల్స్ ఆపరేషన్ సిస్టమ్: విండోస్ 11 స్టోరేజ్: 16జీబి ప్లస్ 512జీబి సపోర్ట్: ఫింగర్‌ప్రింట్ సెన్సర్ బరువు: 1.75 కేజీ కలర్స్: వైట్ పర్పుల్ ఫ్రెండ్ మ్యాప్ ఫీచర్.. ‘ఫ్రెండ్ మ్యాప్’ అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది ఇన్స్టాగ్రామ్. ప్లాట్‌ఫామ్‌లోని యూజర్లకు తమ స్నేహితుల లోకేషన్‌ను చెక్ చేయడానికి ఈ ఫీచర్ ఉపకరిస్తుంది. స్నాప్‌చాట్‌లోని ‘స్నాప్ మ్యాప్’ను పోలిన ఫీచర్ ఇది. తమ లొకేషన్‌ను ఎవరు చూడాలో ఎంపిక చేసుకోవడానికి అనుమతిస్తుంది. ‘ఫ్రెండ్ మ్యాప్’లో యూజర్ తన చివరి యాక్టివ్ లొకేషన్‌ను దాచే ‘ఘోస్ట్ మోడ్’ కూడా ఉంటుంది. స్టిక్కీ నోట్స్.. మైక్రోసాఫ్ట్ వారి ‘స్టిక్కీ నోట్స్’ యాప్ కొత్త హంగులతో ముందుకు వచ్చింది. పాత ‘స్టిక్కీ నోట్స్’ను రీవ్యాంప్ చేసి ఎన్నో కొత్త ఫీచర్లు తీసుకువచ్చారు. నోట్స్ క్రియేట్ చేయడానికి, స్క్రీన్ షాట్లను తీసుకోవడానికి, ఆడియోను రికార్డ్ చేయడానికి ఇది యూజర్లను అనుమతిస్తుంది. ఇవి చదవండి: అసలు వీటి గురించి మీకు తెలుసా..! -
స్మార్ట్ ఫోన్లా ట్యాబ్‌లను వాడలేరు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు టెక్నాలజీ విద్యను చేరువ చేస్తూ ఉచితంగా అందించిన బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ ఐటీ సెల్ డిజిటల్ ఇనీషియేటివ్స్ రాష్ట్ర నోడల్ అధికారి సీహెచ్‌వీఎస్ రమేష్‌కుమార్ చెప్పారు. గురువారం గుంటూరులో ట్యాబ్‌ల యాక్టివేషన్‌పై ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రమేష్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లను స్మార్ట్‌ఫోన్‌లా ఉపయోగించేందుకు ఆస్కారం లేదని, ప్రీ లోడెడ్ యాప్స్‌ను గూగుల్ సంస్థ ద్వారా బ్లాక్ చేయించినట్లు తెలిపారు. బైజూస్ కంటెంట్‌తో కూడిన యాప్‌తో పాటు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన స్విఫ్ట్‌చాట్, ఈ–పాఠశాల, డ్యూలింగో, డిక్షనరీ యాప్‌లు మినహా మరే ఇతర యాప్‌లు ట్యాబ్‌లు ఉండవని స్పష్టం చేశారు. ఇంటర్నెట్తో పనిలేకుండా బైజూస్ కంటెంట్‌ను విద్యార్థులు చూడవచ్చని.. మిగిలిన 4 యాప్స్‌ను చూడాలంటే పాఠశాలల్లోని వైఫై ద్వారా కనెక్ట్ కావాలని చెప్పారు. సిమ్‌కార్డ్ స్లాట్‌ను బ్లాక్ చేశామని, 256 జీవీ సామర్ధ్యం కలిగిన ఎస్డీ కార్డు ద్వారా 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్‌లో అన్ని పాఠ్యాంశాలను లోడ్ చేశామని తెలిపారు. డ్యూలింగో యాప్ ద్వారా విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకోవచ్చన్నారు. స్విఫ్ట్ చాట్ యాప్ ద్వారా విద్యార్థి ఏ సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాన్నైనా తెలుసుకోవచ్చని.. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. ట్యాంపరింగ్ చేస్తే కఠిన చర్యలు.. ట్యాబ్‌లలో ఇన్‌బిల్ట్‌గా ఉన్న మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా విద్యార్థుల ట్యాబ్‌లను ఐటీ సెల్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రమేష్‌కుమార్ చెప్పారు. ట్యాబ్‌లలో ఆధునిక భద్రతా వ్యవస్థ ఇమిడి ఉందన్నారు. ఈ ట్యాబ్‌లను విద్యార్థులు, ఉపాధ్యాయులు మినహా ఇతరులెవ్వరూ వినియోగించేందుకు అవకాశం లేదన్నారు. బ్లాక్ చేసిన యాప్‌లను అన్‌లాక్ చేసేందుకు సెల్‌ఫోన్ షాపులవాళ్లు, ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. దీనిపై అన్ని జిల్లాల ఎస్పీలకు ప్రభుత్వం సమాచారం చేరవేసిందని తెలిపారు. విద్యార్థులు ట్యాబ్‌లలో ఏ సబ్జెక్టు ఎంతసేపు చూశారనే సమాచారం కూడా నమోదవుతుందని వివరించారు. సర్వీస్ సెంటర్ల ద్వారా ఉచిత సేవలు ట్యాబ్‌లలో ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే.. ఆ సంస్థ సర్వీసు సెంటర్ల ద్వారా ఉచిత సేవలు పొందవచ్చని రమేష్‌కుమార్ చెప్పారు. పని చేయని ట్యాబ్‌ను సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌కు అందిస్తే, వాళ్లు ఆన్లైన్లో నమోదు చేసి టోకెన్ ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం ఆ ట్యాబ్‌ను సర్వీసు కేంద్రానికి పంపించి.. బాగు చేయించి మూడు రోజుల వ్యవధిలో తిరిగి అందజేస్తారని చెప్పారు. ట్యాబ్ కింద పడినా పాడవకుండా సురక్షితమైన కవర్ కేస్‌తో పాటు స్క్రీన్ గార్డు, చార్జర్, ఇయర్ ఫోన్ అందిస్తున్నట్లు చెప్పారు. -
విడుదలకు ముందే వన్‌ప్లస్ ట్యాబ్ ధరలు లీక్
టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో రోజు రోజుకి కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అలాంటి కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతుంటాయి. ఈ నేపథ్యంలో భాగంగానే 'వన్‌ప్లస్' (OnePlus) తన మొదటి ట్యాబ్‌ను దేశీయ విఫణిలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే ఈ కొత్త ట్యాబ్ విడుదలకు ముందే ధరల వివరాలు లీక్ అయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. భారతీయ మార్కెట్లో విడుదలకానున్న వన్‌ప్లస్ ప్యాడ్ ట్యాబ్‌ను కంపెనీ గత ఫిబ్రవరిలోనే పరిచయం చేసింది. అయితే ఆ సమయంలో కంపెనీ ఈ ప్రొడక్ట్ లాంచ్, ప్రైస్ వంటి వాటిని వెల్లడించలేదు. కంపెనీ అధికారిక ధరలను వెల్లడించకముందే ఈ ట్యాబ్ రూ. 23,099 దరిదాపుల్లో ఉంటుందని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. లీకైన ధరలను బట్టి చూస్తే ఈ ట్యాబ్ సరసమైన ధర వద్ద లభించే అవకాశం ఉంటుందని అర్థమవుతోంది. ఇది ఈ నెల చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తుంన్నారు. విడుదల సమయంలో కంపెనీ దీని ధరలను వెల్లడిస్తుంది. (ఇదీ చదవండి: ఇప్పుడు పేటీఎంలో బస్ టికెట్ కొంటే ఆఫర్లే.. ఆఫర్లు!) త్వరలో విడుదలకానున్న వన్‌ప్లస్ ప్యాడ్ 11.61 ఇంచెస్ 2.8K ఎల్సీడీ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ టాప్ వేరియంట్ 12జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ పొందుతుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ సపోర్ట్ వంటి వాటితో పాటు మీడియాటెక్ డైమన్సిటీ 9000 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే, ఈ కొత్త ట్యాబ్ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి 9,510mAh బ్యాటరీతో 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. సౌండ్ కోసం నాలుగు స్పీకర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త ట్యాబ్ కోసం ఇప్పటికే అమెరికా, యూకేలలో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. ఇండియాలో ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019