breaking news
-
Taapsee Pannu Sister: తాప్సీ చెల్లిని చూశారా? ట్రై చేస్తే యాక్టరయ్యేది! (ఫోటోలు)
-
ఇక వ్యక్తిగత జీవితంపై ఫోకస్
వ్యక్తిగత జీవితానికి తాను ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చుకోవాల్సిన తరుణం వచ్చిందన్నట్లుగా మాట్లాడుతున్నారు హీరోయిన్ తాప్సీ. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ వివాహం గత నెల 23న ఉదయ్‌పూర్‌లో జరిగిందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాప్సీ, మథియాస్ తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ వధూవరులుగా తాప్సీ, మథియాస్ ఉన్న వీడియోలు వైరల్ అవుతుండటంతో వీరిద్దరికీ వివాహం జరిగిందని స్పష్టమైంది. కాగా పెళ్లి తర్వాత తాప్సీ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్నేళ్లు గడిచిన తర్వాత నేను నటించిన సినిమాల జాబితాను ఓ సారి చూసుకున్నప్పుడు ఆ జాబితా నాకు సంతోషాన్నివ్వాలి. ఎందుకుంటే నా జీవితంలోని ఎక్కువ సమయాన్ని సినిమాలకే కేటాయించాను. 24 గంటల్లో నేను పన్నెండు గంటలు పని చేసిన రోజులూ ఉన్నాయి. అయితే ఇకపై నేను నా వృత్తి జీవితంపైకన్నా, వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. అందుకే ఈ సినిమా వదులుకోకూడదు అనిపించేంత మంచి స్క్రిప్ట్ అయితేనే చేయాలనుకుంటున్నాను. కెరీర్‌కి మించిన జీవితం ఒకటి ఉంటుంది. ఆ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో సమయం గడపాలనుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు తాప్సీ. -
ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. వీడియో లీక్!
ఇటీవలే హీరోయిన్ తాప్సీ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోను వివాహమాడింది. వీరిద్దరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహా వేడుకలో కేవలం ఇరుకుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. తన పెళ్లి గురించి తాప్సీ ఎక్కడే గానీ వెల్లడించలేదు. ఇటీవల తాప్సీ పెళ్లికి సంబంధించిన ఫోటోలను కనిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దానికి 'మేరే యార్‌కీ షాదీ' అన్న హ్యాష్‌ట్యాగ్ జత చేసింది. ఆ తర్వాత తాప్సీ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ఈ శారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని దిగిన ఫోటోలు షేర్ చేసింది. దీంతో తాప్సీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందని అభిమానులు విషెస్ తెలిపారు. పెళ్లి వీడియో లీక్.. తాజాగా తాప్సీ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి కూతురిలా రెడీ అయిన ముద్దుగుమ్మ డ్యాన్స్ చేస్తూ కాబోయే వరుడి వద్దకు చేరుకుంది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చాలా సింపుల్‌గా తాప్సీ పెళ్లి చేసుకుందంటూ పోస్టులు పెడుతున్నారు. తాప్సీ సీనీ కెరీర్.. తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసి క్రేజ్ దక్కించుకుంది. A Happy Bride is the prettiest of all! #TaapseePannu gets married to long time beau #MathiasBoe😍 @taapsee #BollywoodBubble pic.twitter.com/ULKZFTZp1T — Bollywood Bubble (@bollybubble) April 3, 2024 View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
పెళ్లి వార్తలు.. తాప్సీ ఫస్ట్ పోస్ట్ చూశారా?
సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. కొందరు అన్ని విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. మరికొందరు తమ పర్సనల్ విషయాలను గోప్యంగా ఉంచుకోవడానికే ఇష్టపడతారు. అలా ఈ మధ్య హీరో సిద్దార్థ్ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకోగా హీరోయిన్ తాప్సీ పన్ను అయితే ఏకంగా పెళ్లే చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను పెళ్లాడిందని బాలీవుడ్ సమాచారం. మార్చి 23న వివాహం? మార్చి 23న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వివాహ వార్తల నేపథ్యంలో తాప్సీ తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. సారీతో ఈ బంధం కలకాలం ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నానంటూ చీర కట్టుకుని దానిపై బ్లాక్ కలర్ కోట్ వేసుకుని దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు నిజంగా చీర గురించే మాట్లాడుతున్నావా? లేదా మథియస్‌తో నీ బంధం శాశ్వతంగా నిలిచిపోవాలని పరోక్షంగా చెప్తున్నావా? అని కామెంట్లు చేస్తున్నారు. కెరీర్.. తాప్సీ సినిమాల విషయానికి వస్తే.. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో పలు సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌ను వదిలేసి బాలీవుడ్‌కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోలతో నటిస్తూనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసి క్రేజ్ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) చదవండి: కియారా భర్తను రాశీ పెళ్లి చేసుకుంటే బాగుండేది.. హీరోయిన్ ఏమందంటే? -
సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారా?
హీరోయిన్ తాప్సీ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో తాప్సీ రిలేషన్ షిప్లో ఉన్నారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మథియాస్, తాప్సీ వివాహం చేసుకున్నట్లుగా గతంలో కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను తాప్సీ ఖండించారు. అయితే తాజాగా మథియాస్, తాప్సీల వివాహం తెరపైకి వచ్చింది. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో మథియాస్, తాప్సీ వివాహబంధంతో ఒక్కటయ్యారని బాలీవుడ్ సమాచారం. వీరి పెళ్లి వేడుకలు ఈ నెల 20నే మొదలయ్యాయని, 23న వివాహం జరిగిందని టాక్. తాప్సీ మెయిన్ లీడ్‌గా నటించిన సినిమాలతో అసోసియేట్ అయిన కనికా థిల్లాన్ తో పాటు కొందరు బాలీవుడ్ నటీనటులు తాము ఓ పెళ్లి వేడుకలో పాల్గొంటున్నామన్నట్లుగా సోషల్ మీడియాలో హింట్ ఇచ్చారు. దీంతో వీరు హాజరైంది తాప్సీ వివాహానికే అనే ప్రచారం జరుగుతోంది. మరి.. తాప్సీ, మథియాస్ పెళ్లి జరిగిందా అనే విషయంపై ఆ ఇద్దరే క్లారిటీ ఇవ్వాలి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019