breaking news
-
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ–2 చదువుతున్న బుచ్చుక అరవింద్ హాస్టల్ గదిలో మంగళవా రం ఉరివేసుకున్నాడు. సిద్ది పేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి గ్రామానికి చెందిన అరవింద్ ఇటీవలే ఇంటికి వెళ్లి ఈ నెల 12న క్యాంపస్‌కు తిరిగివచ్చాడు. హాజరుశాతం తక్కువగా ఉందని అరవింద్‌ను అధికారులు పరీక్షకు అనుమతించలేదని సమాచారం. దీంతో మన స్తాపం చెందిన అరవింద్..తోటి విద్యార్థులు పరీక్షకు వెళ్లిన కొద్దిసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. మృతికి కళాశాల యాజమాన్యమే కారణం తొగుట(దుబ్బాక): తమ కుమారుడు ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యమే కారణమని అరవింద్ తల్లిదండ్రులు ఆరోపించారు. అరవింద్‌కు నాలుగు నెలల క్రితం డెంగీ సోకిందని, చికిత్స చేయించుకొని తిరిగి కళాశాలకు వెళ్లాడని వారు చెప్పారు. అయితే హాజరుశాతం తక్కువగా ఉందని, పరీక్షలకు అనుమతించమని చెప్పారని, దీంతో ఫీజు కట్టడానికి తాను డబ్బులు పంపామన్నారు. అయినా తమ కుమారుడిని పరీక్షలకు అనుమతించకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఐదు నెలల్లో ముగ్గురు ♦ బాసర ఆర్జీయూకేటీలో గడిచిన ఐదునెలల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ♦ 2023, నవంబర్ 25న నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ∙2024, ఫిబ్రవరి 22న రంగారెడ్డి జిల్లాకు చెందిన టి.శిరీష ఆత్మహత్య చేసుకుంది. ♦ తాజాగా అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ♦ 2023–24 విద్యాసంవత్సరంలో ఆర్జీయూకేటీలో మొత్తం ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాసరలోనే ఎక్కువ మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. క్యాంపస్‌లో ఉండే అధికారులు విద్యార్థుల మానసిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నారు. 9 వేల మంది విద్యార్థులు చదివే క్యాంపస్‌లో విద్యార్థుల భవిష్యత్‌పై దృష్టి సారించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. -
భీఫార్మసీ విద్యార్థిని శివానీ ఆత్మహత్య
సదాశివపేట(సంగారెడ్డి): ఉరివేసుకొని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన మన్నే అశోక్ సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. అశోక్ పెద్ద కుమార్తె శివానీ(17) హైదరాబాద్‌లో భీఫార్మసీ చదువుతుంది. రెండు నెలల కిందట సదాశివపేటలోని ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి మనస్తాపంతో ఉంటున్న శివానీ సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు యువతి రాసిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘‘ నాకు ఇతరులకు సహాయపడటం చాలా ఇష్టం.. నా తల్లిదండ్రుల అనుమతితో నా అవయవాలను దానం చేయాలని కోరుతున్నా.. నేను లేకున్నా నా అవయవాల వల్ల మరో ఇద్దరు జీవిస్తారమోనని నా ఆశ.. నా చావుకు నేనే కారణం.. దయచేసి ఎలాంటి విచారణ చేయొద్దని లేఖలో పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలు పనికిరావని వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహేశ్ గౌడ్ తెలిపారు. -
బెజవాడ సెంట్రల్లో కాల్కేయుడు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడలో బొండా ఉమామహేశ్వరరావు ఆయన అనుచరుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. భూకబ్జాలు, దౌర్జన్యాలు, కాల్‌మనీ, సెక్స్ రాకెట్.. ఆయన చేయని దందా లేదు. ఫలితంగా 2019 ఎన్నికల్లో ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఓటర్లను మభ్యపెట్టి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అరాచకాలను సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ► 2014–19 మధ్య బెజవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమా ఏకంగా ఓ అవినీతి సామ్రాజ్యాన్నే నిర్మించారు. నియోజకవర్గం మొత్తాన్ని కనుసైగతో శాసించారు. భూకబ్జాలు, దందాలు, దౌర్జన్యాలతో పేట్రేగిపోయారు. అధికార యంత్రాంగం కూడా ఆయన అవినీతి దందాకు వంతపాడింది. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.వందల కోట్లు విలువైన భూమిని బొండా కబ్జా చేశారు. సెటిల్మెంట్లతోపాటు ప్రభుత్వంలో జరగాల్సిన పనులకు కూడా కప్పం వసూలు చేశారు. ప్రజల నుంచి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. ► కాల్‌మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో బొండాపై అనేక ఆరోపణలు వచ్చాయి. కాల్‌మనీ కింగ్‌గా ఉమా పేరొందారు. ఎందరో బాధితులు బొండా కబంధ హస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడారు. ► సత్యనారాయణపురంలోని భువనేశ్వరి పీఠానికి చెందిన సీతారామ కల్యాణ మండప కబ్జాకు బొండా వర్గీయులు యతి్నంచారు. ► న్యూ రాజరాజేశ్వరిపేటలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు ఎదురుగా ఉన్న స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించి బొండా భంగపడ్డారు. ► రామకృష్ణాపురం బుడమేరులో బొండా ఉమా అనుచరులు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కలిసి వెంచర్ వేసి విక్రయించారు. స్థానిక టీడీపీ నేతలు కూడా బుడమేరు లోపలకు ఇళ్లు నిర్మించి విక్రయించారు. ► ముత్యాలంపాడులో ఇరిగేషన్ స్థలాన్ని టీడీపీ నేత కుమారుడి వ్యాయామశాలకు ధారాదత్తం చేశారు. ► అప్పటి 44వ డివిజన్ కార్పొరేటర్ రైల్వే, ప్రభుత్వ స్థలాలనూ విక్రయించారు. ► విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన రూ.30 కోట్లు భూదందాలో కూడా మాగంటి బాబు కీలక పాత్రధారి. ఈ వ్యవహారాన్ని అక్కడి ప్రజలు ఇప్పటికీ మరచిపోలేదు. ► కండ్రిక కాలనీలో జర్నలిస్టుల ఇళ్ల పేరిట ఎమ్మెల్యే అతని అనుచరులు కార్పొరేషన్‌కు చెందిన 1,720 గజాల స్థలాన్ని ఆక్రమించి, నిర్మాణాలు చేసేందుకు ప్రయతి్నంచారు. స్థానికుల ఆందోళనతో వెనక్కి తగ్గారు. ► పాయకాపురం బర్మాకాలనీ ప్రాంతంలో మూడు ఎకరాల వరకూ ఉన్న కాలనీ కామన్ సైట్‌ను తన అనుచరులతో ఆక్రమించి, వాటి కి ఇంటి పట్టాలను సృష్టించేందుకు తెగబడ్డారు. స్థానికులు అడ్డం తిరగడంతో తోకముడిచారు. గీతాంజలి కేసులో బొండా అనుచరుడి అరెస్ట్ ఇటీవల తెనాలికి చెందిన వివాహిత గీతాంజలి ఆత్మహత్య కేసులో బొండా అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్టయ్యాడు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను ప్రశంసించిన గీతాంజలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాంబాబు ఆమెను అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్లు పెట్టాడు. అతడితో పాటు టీడీపీ కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలకు మనస్తాపానికి గురైన గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుకులదీ అదే తీరు బొండా కుమారులు ఇద్దరూ దౌర్జన్యాలు చేయడంలో ఘనులే. బొండా కుమారుడు నిర్వహించిన కారు రేస్‌లో మనోరమ హోటల్లో పనిచేసే మేనేజర్ కుమారుడు మరణించాడు. అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుక్క అడ్డురావడంతో కారు ప్రమాదం జరిగిందని కేసును తప్పుదారి పట్టించారు. తెనాలికి చెందిన రౌడీషిటర్ సుబ్బుతో బొండాకు సత్సంబంధాలున్నాయి. సుబ్బు హైదరాబాద్‌లో తుపాకీ కొనుగోలు చేస్తూ పట్టుబడి బొండా, మరికొందరి టీడీపీ నేతల పేర్లు బయటపెట్టాడు. ఆ తర్వాత విజయవాడలోని మాచవరంలో పట్టపగలే సుబ్బు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో అధికార పార్టీ నేతల పేర్లు బయటకు రాకుండా పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగినట్లు కేసును తారుమారు చేశారు. దుర్గాపురంలోని ఓ అపార్ట్మెంటులో క్యాన్సర్ బాధితురాలు మాదంశెట్టి సాయిశ్రీకి చెందిన ఫ్లాట్‌ను బొండా అనుచరులు కబ్జాకు యత్నించారు. ఆమె తన వైద్యం కోసం ఆ ఫ్లాట్ విక్రయానికి యత్నించగా జాలి లేకుండా బొండా అడ్డుకున్నారు. చివరకు వైద్యం అందక సాయిశ్రీ మరణించారు. బొండా ఉమాకు మాగంటి బాబు అత్యంత సన్నిహితుడు. అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధుడి భూమిని తప్పుడు పత్రాలతో రిజి ్రస్టేషన్ చేసుకున్న వారిలో బొండా ఉమా భార్య సుజాతతోపాటు మాగంటి బాబు కూడా ఉన్నారు. బొండా ఉమా అక్రమ దందాలన్నింటిలో మాగంటి బాబు కీలకంగా వ్యవహరించారనేది బహిరంగ రహస్యం. అకృత్యాలెన్నున్నా కేసులు మూడే.. బొండా ఉమా మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 2011 మార్చి1న సెక్షన్ 9, 9ఏఏ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం బొండాపై కేసు నమోదైంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నంబర్ 462/2006పై సెక్షన్ 143 కేసు ఉంది. విజయవాడ 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో సెక్షన్ 143 కింద కేసు ఉన్నట్టు బొండా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
షూట్ విషయంలో గొడవ.. బిల్డింగ్‌పై నుంచి దూకిన యూట్యూబ్ జంట
క్షణికావేశంలో తీసుకునే కఠిన నిర్ణయాలకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చిన్న చిన్న సంఘటనలు చిలికి చిలికి గాలి వానలా మారడంతో నిండు జీవితాలు బలైపోవడమే కాకుండా.. కుటుంబీకుల్లోనూ కొండంత విషాదాన్ని మిగిల్చుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానాలోని బహదూర్‌ఘర్‌లో వెలుగుచూసింది. ఓ విషయంలో గొడవపడిన జంట.. తొందరపాటు నిర్ణయంతో బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను డెహ్రడూన్‌కు చెందిన గర్విత్ 25, నందిని 22గా గుర్తించారు. గర్విత్, నందిని ఇద్దరూ కంటెంట్ క్రియేటర్స్, సొంతంగా ఛానల్ పెట్టి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్,ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రీల్స్, షార్ట్ వీడియోలు చేస్తూ ఉంటారు. కొన్ని రోజుల కిత్రమే ఈ జంట తమ టీమ్‌తో కలిసి డెహ్రడూన్ నుంచి బహదూర్‌ఘర్‌కు మారారు. రుహీలా రెసిడెన్సీలోని ఏడవ అంతస్తులో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని ఉంటున్నారు. టీమ్‌లోని మరో అయిదుగురు రూమ్మేట్స్తో జీవిస్తున్నారు. ఈ క్రమంలో బయట షూటింగ్ పూర్తి చేసుకొని శనివారం తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. అయితే ఇద్దరి మధ్య షూట్ విషయంలో వాగ్వాదం ఏర్పడింది. ఇది కాస్తా పెరిగి పెద్దది అవ్వడంతో క్షణికావేశంలో జంట బిల్డింగ్ ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చివరగా.. ఏ సమస్యకైనా ఆలోచిస్తే తప్పక పరిష్కారం ఉంటుంది.. ప్రాణానికి మించింది ఏదీ లేదు.. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని జీవితాలను బలితీసుకోవద్ద -
‘డెత్’లైన్ గేమ్స్!
సాక్షి, సిటీబ్యూరో: బండ్లగూడ జాగీర్ సన్‌సిటీలో నివసించే భార్యభర్తలు ఇందిర, ఆనంద్ తమ కుమారుడు విక్కీని చంపి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణానికి కారణం ఆనంద్ ఆన్లైన్ గేమ్స్‌కు బానిసగా మారి అప్పుల పాలు కావడం. పంచాయితీ రాజ్ శాఖలో మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కీసర విభాగంలో ఏఈగా పని చేస్తున్న గడ్డం రాహుల్ బాబు ఆన్లైన్ గేమ్స్‌కు బానిసై ఆ నష్టాలు పూడ్చుకోవడానికి మోసగాడిగా మారి జైలుకెళ్లాడు. దుండిగల్‌లోని ఏరోనాటికల్ కాలేజీలో బీటెక్ చదువుతున్న గుడిమల్కాపూర్‌కు చెందిన శీలం మనోజ్ ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటుపడి, ఆరి్థకంగా తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త జానారెడ్డి ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటుపడి డబ్బు పోగొట్టుకోవడంతో ఆరి్థక సమస్యలు చుట్టుముట్టి మన్సూరాబాద్ భవానీనగర్‌కు చెందిన వివాహిత శిరీష ఆత్మహత్య చేసుకుంది. ....గడచిన నెలన్నర రోజుల కాలంలో వెలుగులోకి వచి్చన ఈ నాలుగు ఉదంతాలు ప్రస్తుతం సమాజంపై ఆన్లైన్ గేమింగ్స్ ప్రభావాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ గేమ్స్‌కు అలవాటుపడుతున్న వాళ్లు గెలవడానికి బానిసలుగా మారిపోతున్నారు. దీనికోసం ఆయా కంపెనీల ట్రాప్‌లో పడి వివిధ రకాలైన పాయింట్లు కొంటున్నారు. వాటిని ఖరీదు చేయడానికి, పందెం కాయడానికి అవసరమైన డబ్బు కోసం అప్పులు చేస్తున్నారు. చివరకు ఆ ఉచ్చులో పడి మోసాలు, ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. పథకం ప్రకారం విస్తరించిన గేమ్స్... కోవిడ్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఆన్లైన్ క్లాసులే నడిచాయి. దీంతో దాదాపు ప్రతి విద్యార్థి చేతికి ఫోన్, ట్యాబ్‌లు వచ్చి చేరాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరించాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్‌ను ప్రమోట్ చేశాయి. వీటికి ఆకర్షితులైన విద్యార్థులు, ఉద్యోగులు, యువత వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెట్టారు. ఆ తర్వాతి రోజుల్లో ఇవి ఆడటం అనేది ఓ వ్యసనంగా మారిపోయింది. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దీని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి తమ ముగ్గులోకి దింపుతారు. వీళ్లకి గెలుపు అనేది ఓ కిక్‌గా మారుస్తారు. పాయింట్లు, పందేల పేరుతో.. ఇలా తమ గేమ్‌కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్‌లో ఓడిపోయేలా చేస్తారు. ఆపై గేమ్‌లో నువ్వు వీక్ అయిపోయావంటూ సందేశాలు పంపి రెచ్చగొడతారు. ఇలా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన ఆడేవారిలో కలిగిస్తారు. దీనికోసం టిప్స్ ఇస్తున్నామంటూ కొన్ని యూసీ పాయింట్లను ఉచితంగా ఇస్తారు. వీటిని వినియోగిస్తే గేమ్‌లో మీ తరఫున ఆడే క్రీడాకారులు బలంగా మారి, గెలుస్తావంటూ చెబుతారు. తొలుత ఈ పాయింట్లు ఉచితమే అంటూ వాటికీ బానిసలుగా మారేలా చేస్తారు. ఆపై ఈ పాయింట్లు రావాలంటే తమకు కొంత మొత్తం చెల్లించాలంటూ వసూలు చేయడం మొదలెడతారు. అందినకాడికి దండుకుంటారు... కొన్ని రోజుల తర్వాత ఆ యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ మెలికపెడతారు. అవి కావాలంటే తమ వద్ద రిజిస్టర్ చేసుకుని, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయాలని షరతు విధిస్తారు. అప్పటికే ఈ గేమ్స్‌కు బానిసలుగా మారిన వాళ్లు తేలిగ్గా వాటి నిర్వాహకుల ట్రాప్‌లో పడిపోతున్నారు. తమవి లేదా తల్లిదండ్రుల కార్డులు తీసుకుని పేమెంట్లు చేస్తున్నారు. వీటి వివరాలను ఒకసారి నమోదు చేసి, ఆ సందర్భంలో కార్డు యజమానికి వచ్చే ఓటీపీ పొందుపరిచి, ఆటో రీచార్జ్ ఎంపిక చేసుకుంటే పదేపదే కార్డుతో అవసరం ఉండదు. దీంతో అదును చూసుకుని ఈ పని చేస్తున్న యువత అనునిత్యం భారీ మొత్తం ఖర్చు చేసేస్తోంది. ఇలా మళ్లీ గెలుపు అలవాటు చేసిన తర్వాత తమ వద్ద నిరీ్ణత మొత్తం పందెం కాసి గేమ్ ఆడితే... భారీ లాభాలు ఉంటాయని చెప్పే కంపెనీలు డబ్బు దండుకుంటున్నాయి. ఇలాంటి గేమ్స్‌లో తొలినాళ్లల్లో తక్కువ మొత్తం పెట్టినప్పుడు లా«భం వచి్చనా...పెట్టుబడి పెరిగే కొద్దీ నష్టాలే వస్తుంటాయి. వాటిలో ప్రోగ్రామింగ్ అలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఆన్లైన్ గేమింగ్స్ కోసం యాప్స్‌లో అప్పులు తీసుకుని, ఆ భారం పెరిగిపోయి, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. పురుషులే ఎక్కువ.. ఇటీవల కాలంలో ఇలాంటి ‘గేమింగ్ ఉదంతాలు’ ఎక్కువగా జరుగుతున్నాయి. పురుషులతో పాటు మహిళలూ ఇలాంటి గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. అయితే తల్లిదండ్రుల, కుటుంబీకుల కార్డ్స్ వినియోగించి యూసీ పాయింట్లు ఖరీదు చేయడం, పందేలు కావడం వంటివి మాత్రం కేవలం పురుషులే చేస్తున్నారు. ఇప్పటి వరకు మా దృష్టికి వచి్చన ఉదంతాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. యువతులు, మహిళలు గేమ్స్ ఆడుతున్నా..డబ్బు చెల్లించాల్సి వస్తే వాటికి దూరంగా ఉంటున్నారు. – జి.రాజేంద్రన్, సైబర్ నిపుణుడు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
సుస్మితా సేన్ అందానికి దక్కిన కిరీటానికి 30 ఏళ్లు పూర్తి
Multiple cat checj
Check international block
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019