breaking news
-
Dipa Khosla: ఇన్ఫ్లూయెన్సర్తో మొదలై.. మల్టీపుల్ బ్రాండ్ డీల్స్ స్థాయికి
గ్లోబల్ ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తోంది దీప ఖోస్లా. వక్తగా ప్రసిద్ధ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ముచ్చటగా మూడోసారి ఆహ్వానం అందుకొని చరిత్ర సృష్టించింది. ఇన్ఫ్లుయెన్సర్, ఎంటర్ప్రెన్యూర్, ఫిలాంత్రపిస్ట్‌గా గుర్తింపు పొందిన దీప ఖోస్లా గెలుపు మంత్రం... ఆత్మవిశ్వాసం. లా స్టూడెంట్ నుంచి కంటెంట్ క్రియేటర్‌గా, ఆ తరువాత ఎంటర్ ప్రెన్యూర్‌గా ప్రయాణం ప్రారంభించింది దీప ఖోస్లా. ఇన్స్టాగ్రామ్ కొత్తగా పరిచయం అవుతున్న కాలం అది. ‘ఇన్ఫ్లూయెన్సర్ అంటే?’ అని ప్రశ్న దగ్గరి నుంచి మొదలైన ఆమె ప్రయాణం మల్టీపుల్ బ్రాండ్ డీల్స్‌తో సక్సెస్ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ స్థాయికి చేరింది. ఆమ్స్టర్ డామ్‌లోని సోషల్ మీడియా ఏజెన్సీలో ఇంటర్న్‌షిప్ చేసిన ఫన్ట్ ఇండియన్ డిజిటల్ క్రియేటర్‌గా ప్రత్యేకత సాధించింది. ఆ తరువాత ‘ఇండి వైల్డ్’ (స్కిన్ కేర్ అండ్ బ్యూటీ బ్రాండ్) రూపంలో ఎంటర్ప్రెన్యూర్ గా కూడా అద్భుత విజయం సాధించింది. ఆమె ప్రతి విజయంలో తల్లి సంగీత ఖోస్లా ప్రోత్సాహం ఉంది. ఆమె ఇచ్చిన అపారమైన ధైర్యం ఉంది. ‘ఇండి వైల్డ్’ హెయిర్ ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. బెస్ట్‌సెల్లర్‌గా నిలిచింది. తన తల్లి ఫార్ములా ఆధారంగానే ఈ హెయిర్ ఆయిల్‌ను తయారు చేశారు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించడానికి కావాల్సింది? ఆత్మవిశ్వాసం. మరి ఆ ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? అనే ప్రశ్నకు దీప చెప్పే జవాబు ఇది.. ‘ధైర్యంగా ప్రశ్నలు అడగడం నుంచే ఆత్మవిశ్వాసం వస్తుంది. వ్యాపారరంగంలోకి అడుగు పెట్టినప్పుడు నాకు పెద్దగా ఏమీ తెలియదు. అయితే ‘ఓటమి’ అనే భయం నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగేలా, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునేలా చేసింది’ భర్తతో కలిసి ‘పోస్ట్ ఫర్ చేంజ్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది దీప. ‘దిల్లీలో పుట్టి పెరిగాను. ఊటీ స్కూల్, యూరప్ యూనివర్శిటీలలో చదువుకున్నాను. ప్రతిష్ఠాత్మకమైన హార్వర్డ్ యూనివర్శిటీ సమావేశంలో ప్రసంగించడం నా అదృష్టంగా భావిస్తాను. నేను సాధించిన విజయాలే నన్ను అక్కడివరకు తీసుకువెళ్లాయి. విజయం అంటే కొందరికే పరిమితమైనది కాదు. నాలాగే ఎవరైనా విజయం సాధించవచ్చు’ అంటుంది దీప ఖోస్లా. దీప నిరంతరం స్మరించే మంత్రం... ఆత్మవిశ్వాసం మొటిమలతో ఇబ్బంది పడుతూ నలుగురి లో కలవడానికి ఇష్టపడని స్థితి నుంచి బయటకు తీసుకువచ్చి‘స్టార్ ఇన్ఫ్లుయెన్సర్’ను చేసింది ఆ ఆత్మవిశ్వాసమే. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో వాక్ చేసిన తొలి ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు తెచ్చింది, నలుగురిలో మాట్లాడడానికి భయపడే స్థితి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘బ్రిటిష్ హౌజ్ ఆఫ్ కామన్’లో ప్రసంగించే స్థాయికి తీసుకువెళ్లింది ఆ ఆత్మవిశ్వాసమే. తాజాగా... హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సమావేశంలో దీప ఖోస్లాపై రూపొందించిన స్ఫూర్తిదాయకమైన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. 2022లో ‘డైవర్శిటీ ఇన్ ది బ్యూటీ ఇండస్ట్రీ’ అంశంపై మాట్లాడడానికి హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి దీపకు ఆహ్వానం అందించింది. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సమావేశంలో ప్రసంగించిన ఫస్ట్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్గా చరిత్ర సృష్టించింది దీప ఖోస్లా. పర్సనల్ ఐకాన్.. దీప ఖోస్లాకు తల్లి సంగీత ఖోస్లా పర్సనల్ ఐకాన్. కొండంత అండ. ‘నా వెనుక మా అమ్మ ఉంది’ అనే ధైర్యం దీపను ముందుకు నడిపించింది. తల్లి సంగీత ఖోస్లా ఫార్ములా ఆధారంగానే తమ బ్యూటీ బ్రాండ్‌కు సంబంధించిన ‘హెయిర్ ఆయిల్’ను తయారు చేశారు. సహజ పద్ధతుల్లో ఆరోగ్యంగా ఉండడం, అందంగా కనిపించడం అనేది సంగీత ఖోస్లా ఫిలాససీ. అమ్మ బ్యూటీ ఫిలాసఫీని అనుసరిస్తూ సహజమైన పద్ధతులలో అందంగా కనిపించే టెక్నిక్స్‌ను ఫాలో అవుతుంటుంది దీప ఖోస్లా. ఇవి చదవండి: Payal Dhare: నంబర్ 1 మహిళా గేమర్ -
Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను'
ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి. ఇప్పుడు జమ్ము–కశ్మీర్లో కేవలం బాలికల కోసం ఫుట్‌బాల్ అకాడెమీ నడుపుతున్న ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు. యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్ ఆషిక్ ఒక ఉదాహరణ. కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిక్. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్‌బాల్ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది. ‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమి ప్రొఫెషనల్ స్టోన్ పెల్టర్‌ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్‌బాల్ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్ ఆషిక్. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె. ముంబై వెళ్లి.. కశ్మీర్ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్ను తగిన ప్రోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి తొలిప్రొఫెషనల్ ఫిమేల్ ఫుట్‌బాల్ ప్లేయర్ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్‌బాల్ నేర్చుకుని ఏం చేస్తావ్ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మా ప్రాంతం నుంచి ఫుట్‌బాల్‌లోకి రాలేదు. కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్ విమెన్స్ లీగ్‌లో ఆడాను. గోల్ కీపర్‌గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మా ్రపాంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్ బాలికల కోసం యునీక్ ఫుట్‌బాల్ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్. మరింత గుర్తింపు.. నేడు జమ్ము కశ్మీర్లో మహిళా ఫుట్‌బాల్ పేరు చెప్తే అఫ్షాన్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్ పెల్టర్ని కాను. గోల్ కీపర్‌ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె. ఇవి చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి! -
రూ.8300 కోట్ల సామ్రాజ్యంగా మారిన ఒక్క ఆలోచన..
ఉన్నత చదువులు చదువుకున్న చాలా మంది ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా.. కొత్త మార్గాలను అన్వేషిస్తూ, వ్యాపార రంగంలోకి అడుగులు వేస్తున్నారు. ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు సునీర, ఆమె సోదరుడు సాల్ రెహ్మెతుల్ల. ఇంతకీ వీరు ఎవరు, వీరు చేస్తున్న వ్యాపారం ఏంటి, సంస్థ విలువ ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ఫ్లోరిడాలో నివసిస్తున్న 'సునీర' జన్మస్థలం పాకిస్తాన్. కరాచీలో పుట్టిన ఈమె ఫ్లోరిడా యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఫస్ట్ డేటాతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించి తమ్ముడు రెహ్మెతుల్లతో కలిసి 2014లో స్టాక్స్ (Stax) ప్రారంభించింది. స్టాక్స్ అనేది ఇతర ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే విక్రయాల శాతం మాదిరిగా కాకుండా నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్రాతిపదికన చార్జెస్ వసూలు చేసే ఆల్ ఇన్ వన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్. ఈ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి కోసం ఈమె సుమారు 12 బ్యాంకులను సంప్రదించింది. అయినా ఫలితం లేకుండా పోయింది. సునీర తన ఆలోచనలను తల్లిదండ్రులతో పంచుకుంది, వారు ఆమె ఆలోచనపై పని చేయమని ప్రోత్సహించారు. నెలవారీ చందా ప్రాతిపదికన వసూలు చేసే ప్లాట్‌ఫారమ్‌లో వారు కూడా పని చేయడం ప్రారంభించారు. ఆ తరువాత ఆమె ఓర్లాండోకు వెళ్లి తన ఆలోచనను మరింత విస్తరించింది. సునీర, రెహ్మెతుల్ల చేస్తున్న ఈ తరహా బిజినెస్ అభివృద్ధి చెందుతున్న సమయంలో వారి స్టాక్‌ను కొనుగోలు చేయడానికి రూ. 145 కోట్ల డీల్ ఆఫర్ వచ్చింది. దీనిని వారు సున్నితంగా తిరస్కరించారు. ఆ తరువాత తోబుట్టువులిద్దరూ తమ ఉద్యోగాలను వదిలిపెట్టి స్టాక్‌లోనే పూర్తిగా పనిచేయడం ప్రారంభించారు. దీంతో వారికి ఆర్ధిక సమస్యలు ఎదురయ్యాయి. ఇదీ చదవండి: సమీపిస్తున్న గడువు.. ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ ఇలా అప్డేట్ చేసుకోండి ఆర్థిక సమస్యలను అధిగమించడానికి వారిరువురు.. కుటుంబం, స్నేహితుల నుంచి 50000 డాలర్లు అప్పుగా తీసుకుని, ఆ డబ్బుని కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఈ సంస్థలో ఏకంగా 300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు, కంపెనీ విలువ.. ఫోర్బ్స్ ప్రకారం రూ.8,308 కోట్లని తెలుస్తోంది. -
ఏ ప్రశ్నకైనా సమాధానం 'చాట్‌జీపీటీ' - ఇంటర్వ్యూకి ఇలా సిద్దమైపోండి!
ఒకప్పటి నుంచి మనకు ఏ ప్రశ్నకు సమాధానం కావాలన్నా.. గూగుల్ మీద ఆధారపడేవాళ్లం. అయితే ఇప్పుడు కాలం మారింది, టెక్నాలజీ పెరిగింది. ఈ సమయంలో చాలామంది ప్రతి ప్రశ్నకు 'చాట్‌జీపీటీ' ద్వారా సమాధానం తెలుసుకుంటున్నారు. ఈ కథనంలో 'చాట్‌జీపీటీ' ద్వారా ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యేవారికి చాట్‌జీపీటీ ఎలా ఉపయోగపడుతుందంటే.. ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం సిద్ధం కావడానికి చాట్‌జీపీటీ చాలా ఉపయోగపడుతుంది. సాధారణ ఇంటర్వ్యూ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం దగ్గర నుంచి మీ విశ్వాసాన్ని పెంచుకోవడం వరకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. 👉 ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యేటప్పుడు మీ బలం ఏమిటి? బలహీనత ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి చాట్‌జీపీటీ సహాయపడుతుంది. చాట్‌జీపీటీతో మీరు పరస్పరం చర్చించుకుంటూ పోతే నైపుణ్యాలను తప్పకుండా మెరుగుపరుచుకోవచ్చు. 👉 మీరు ఏ కంపెనీ ఇంటర్వ్యూ కోసం సిద్దమవుతున్నారో.. ఆ సంస్థకు సంబంధించిన చాలా విషయాలను కూడా చాట్‌జీపీటీ తెలియజేస్తుంది. కంపెనీ కల్చర్ ఏమిటి? కంపెనీ గోల్స్ గురించి కూడా వివరిస్తుంది. దీని ప్రకారం ఇంటర్వ్యూ చేసేవారి అంచనాలకు అనుగుణంగా ప్రిపేర్ అవ్వొచ్చు. 👉 ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో ఏలాంటి డ్రెస్ (వస్త్రధారణ) వేసుకోవాలనేది కూడా చాట్‌జీపీటీ చెబుతుంది. ఇంటర్వ్యూకి వెళ్లే సమయంలో డ్రెస్ కోడ్ చాలా ముఖ్యమైన అంశం. 👉 ఇంటర్వ్యూకి సిద్ధమయ్యేవారికి కావలసిన మరో ముఖ్యమైన అంశం 'బాడీ లాంగ్వేజ్'. బాడీ లాంగ్వేజ్ ఇంప్రూ చేసుకోవడంలో కూడా చాట్‌జీపీటీ ఉపయోగపడుతుంది. సరైన బాడీ లాంగ్వేజ్ మెయింటేన్ చేసేవారు ఎదుటివారికి హుందాగా కనిపిస్తారు. 👉 ఇంటర్వ్యూలో ఎప్పుడూ మీ గురించి లేదా ఉద్యోగానికి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే అడుగుతారని భావించకూడదు. ఎందుకంటే మీ ఆలోచనకు పదునుపెట్టే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాట్‌జీపీటీ సాయంతో అలాంటి ప్రశ్నలకు సిద్దమవ్వొచ్చు. 👉 ఆత్మ విశ్వాసం ఆయుధంగా మారితే.. ఏదైనా సాధించవచ్చనే ధైర్యం వస్తుంది. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి సిద్ధమయ్యే సమయంలో లేదా ఇంటర్వ్యూకు వెళ్ళేటప్పుడు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే మాత్రమే సరిపోదు. 'సెల్ఫ్ కాన్ఫిడెన్స్' (ఆత్మ విశ్వాసం) కూడా చాలా అవసరం. కేవలం ప్రశ్నలకు, బాడీ లాంగ్వేజ్ వంటి వాటికి మాత్రమే కాకుండా.. మీ మీద మీకు విశ్వాసం పెరగటానికి కూడా చాట్‌జీపీటీ ఒక ఆయుధంగా పనికొస్తుంది. మొత్తం మీద వినియోగించుకునే విధానాన్ని బట్టి చాట్‌జీపీటీ మీకు ఆత్మబంధువులా పనికొస్తుంది. ఇదీ చదవండి: భారత్ నిర్ణయంతో చైనాకు రూ.50000 కోట్లు నష్టం - ఎలా అంటే? చాట్‌జీపీటీ.. చాట్‌జీపీటీ అనేది GPT (జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్) ఆర్కిటెక్చర్ ఆధారంగా OpenAI చేత అభివృద్ధి చేసిన పెద్ద లాంగ్వేజ్ మోడల్. మనిషి భాషను అర్థం చేసుకోవడానికి అల్గారిథమ్‌లను ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ప్రశ్నలకు సమాధానమివ్వడం, టాస్క్‌లను పూర్తి చేయడం వంటి విషయాలను అవలీలగా పూర్తి చేస్తుంది. వెబ్సైట్, యాప్స్, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా వివిధ ఇంటర్‌ఫేస్‌ల ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారుడు అడిగే ప్రశ్నలకు దాని శిక్షణ, భాషపై అవగాహన ఆధారంగా రెస్పాండ్ అవుతుంది. -
రూ.5 వేలతో మొదలైన రూ.14000 కోట్ల కంపెనీ.. సామాన్యుడి సక్సెస్ స్టోరీ!
M P Ramachandran Success Story: సక్సెస్.. ఈ పదం వినటానికి లేదా చూడటానికి చాలా చిన్నదిగానే ఉండొచ్చు. కానీ సాధించాలంటే అహర్నిశలు కష్టపడాల్సి ఉంటుంది, ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అయితే సంకల్పం ఉంటే తప్పకుండా విజయం సొంతమవుతుందని ఇప్పటికే చాలా మంది నిరూపించారు, ఈ కోవకు చెందిన వారిలో ఒకరు జ్యోతి ల్యాబ్స్ ఫౌండర్ 'మూతేడత్ పంజన్ రామచంద్రన్' (M. P. Ramachandran). ఈయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 1983లో కేరళ త్రిస్సూర్‌లో జన్మించిన రామచంద్రన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ముంబైలో అకౌంటెంట్‌గా పనిచేయడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసిన తరువాత ఆ కంపెనీ మూసివేశారు. దీంతో ఏమి చేయాలో తోచక ఇంటికి వచేసాడు. లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్నర్ ఉజాలా ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపనతో ఉండే రామచంద్రన్.. అప్పట్లో తెలుపు రంగు దుస్తులకు సరైన లిక్విడ్ అందుబాటులో ఉండేది కాదు, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒక లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్నర్ 'ఉజాలా'ను తయారు చేసాడు. రామచంద్రన్ ఈ లిక్విడ్ ఫ్యాబ్రిక్ వైట్నర్ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, సోదరుడి నుంచి రూ. 5000 తీసుకుని తమకున్న కొంత భూమిలోనే ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసాడు. దీనికి తన కూతురు జ్యోతి పేరు పెట్టాడు. ప్రారంభంలో అనుకున్న రీతిలో ఉజాలా అమ్మకాలు ముందుకు సాగలేదు, కానీ పట్టు వదలకుండా కొంతమంది సేల్స్ గర్ల్స్‌ని నియమించి ఆ ఏడాది రూ. 40000 ఆదాయం పొందాడు. ఇదీ చదవండి: బాలీవుడ్ బ్యూటీ 'కిమ్ శర్మ' కొత్త లగ్జరీ కారు.. ధర తెలిస్తే అవాక్కవుతారు! ఇతర ఉత్పత్తులు & వార్షిక ఆదాయం క్రమంగా తమ ప్రొడక్ట్ మీద నమ్మకం భారీగా పెరిగింది. దీంతో జ్యోతి లేబొరేటరీస్ మరిన్ని ఉత్పత్తులను తయారు చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఎక్సో, ప్రిల్, మిస్టర్ వైట్, మార్గో, మాక్సో వంటి అనేక ఉత్పతులు పుట్టుకొచ్చాయి. దెబ్బకు విదేశీ కంపెనీలు సైతం మూసుకోవాల్సి వచ్చింది. ప్రారంభంలో ఎన్నో ఆటంకాలు, ప్రత్యర్థులు జిత్తులను ఎదుర్కొని కంపెనీని దినదినాభివృద్ధి చెందించడంలో రామచంద్రన్ కృషి చేసాడు. కేవలం రూ. 5000తో ప్రారంభమైన జ్యోతి ల్యాబ్స్ వార్షికాదాయం నేడు ఏకంగా రూ. 14,000 కోట్లకు చేరినట్లు సమాచారం.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019