breaking news
-
ఫ్లిప్‌కార్ట్ గుడ్‌న్యూస్.. ఇక హైదరాబాద్‌లోనూ కొత్త ఆఫర్!
హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలలో ప్రారంభించిన వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను ఇప్పుడు హైదరాబాద్‌కు విస్తరించింది. ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు ఉచిత డెలివరీ, తగ్గింపు వంటి ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ (Flipkart VIP) సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను కొత్తగా హైదరాబాద్‌తోపాటు అహ్మదాబాద్, భువనేశ్వర్, కోయంబత్తూర్, గౌహతి, పాట్నా, పూణే, రాంచీలలో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు సంవత్సరానికి రూ. 499 చెల్లించి ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ప్రయోజనాలు ఈ సబ్స్క్రిప్షన్ ప్రోగ్రామ్ లక్షలాది ఉత్పత్తులపై 48-గంటల ఉచిత డెలివరీ, అన్ని ఉత్పత్తులపైనా చెల్లింపుల కోసం సూపర్ కాయిన్స్‌ను ఉపయోగించి 5 శాతం అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. క్లియర్‌ట్రిప్‌లో ఒక్క రూపాయికే ఫ్లైట్ క్యాన్సిల్ లేదా రీషెడ్యూల్ చేసుకోవచ్చు. క్లియర్‌ట్రిప్ హోటల్ బుకింగ్‌లపై అదనపు ఆఫర్లు, 48 గంటలలోపు రిటన్ పికప్. షాపింగ్ ఫెస్టివల్స్‌కు ముందస్తు యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇలా ఎలా నమోదు చేసుకోండి.. ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ లేదా యాప్‌ని సందర్శించండి మీ వివరాలతో లాగిన్ చేయండి. ఒకవేళ మీరు ప్లాట్‌ఫామ్‌కు కొత్త అయితే, మీ వివరాలను అందించి అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. వీఐపీ ల్యాండింగ్ పేజీకి స్క్రోల్ చేసి, 'గెట్ వీఐపీ బెనిఫిట్స్' బటన్‌పై నొక్కండి చెల్లింపు, తుది ప్రక్రియ కోసం 'కంనిన్వ్యూ' క్లిక్ చేయండి మీకు అనువైన మోడ్ ద్వారా చెల్లింపు వివరాలను నమోదు చేసి ఆర్డర్‌ను కన్ఫర్మ్ చేఏయండి విజయవంతంగా నమోదు చేసుకున్న తర్వాత, వెబ్సైట్ లేదా యాప్‌లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. -
యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న డ్రైవర్: ఆనంద్ మహీంద్ర ఫిదా!
ప్రస్తుతకాలంలో ఏ వృత్తిలో ఉన్నా, ఆధునిక టెక్నాలజీని, ట్రెండ్‌ని పట్టుకోవడంలోనే ఉంది సక్సెస్. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, యూ ట్యూబ్ ప్రపంచానికి తన టాలెంట్ ఏంటో చూపించి సత్తా చాటుకున్నారు చాలామంది. ఇంటి వంట,ఇంటి పంట, గాత్రం,వ్యవసాయ క్షేత్రం ఇలా ఏదైనా చివరికి తమ రోజువారీ జీవితాల్లోని మామూలు అంశాలతో వైరల్ అయి పోతున్నారు. మట్టిలో మాణిక్యాల్లా యూట్యూబ్‌లో సంచలనం క్రియేట్ చేస్తున్నారు అలాంటి వారిలో ఒక ట్రక్ డ్రైవర్ విశేషంగా నిలుస్తున్నాడు. 1.47 మిలియన్ల యూట్యూబ్ సబ్స్క్రైబర్లతో నెటిజన్లుల చేత 'మాస్టర్‌చెఫ్' గా ప్రశంసలు పొందుతున్న కార్గో ట్రక్ డ్రైవర్ రాజేష్ రావాని గురించి తెలుసు కుందాం రండి. రాజేష్ రావాని ఒక ట్రక్ డ్రైవర్. వృత్తిపరంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ట్రక్ డ్రైవర్ నా జీవితంలో ఏముంది స్పెషల్ అనుకోలేదు. తన జీవితం నుంచే ఏదో సాధించాలనుకున్నాడు. ఇదే అతని జీవితాన్ని మార్చింది. సాధారణంగా సుదూర ప్రాంతాలకు వస్తువులను రవాణా చేసే వెళ్లే లారీ, ట్రక్ డ్రైవర్లు రోజుల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే వారుమధ్యలో ఎక్కడో ఒక చోట ఆగి వండుకొని తినేలా ఏర్పాటు చేసుకుంటారు. కానీ రాజేష్ రావాని ఇంకొంచెం స్పెషల్. తనకొక స్పెషల్ కిచెన్ క్రియేట్ చేసుకుని నచ్చిన వంటల్ని, రుచికరంగా వండుకుని ఆస్వాదిస్తూ ఉంటాడు. దీన్నే స్మార్ట్‌ఫోన్ ద్వారా వీడియో తీసి పోస్ట్ చేయడం షురూ చేశాడు. దీనికి కొడుకుల సాయం తీసుకున్నాడు. రాజేష్‌కు ఇద్దరు కుమారులు సాగర్, శుభం. వీరే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి ప్రోత్సహించారని ఒకసారి నెటిజన్లుతో పంచుకున్నాడు. ముఖ్యంగా సాగర్ వీలైనప్పుడు ట్రక్కుపై అతనితో పాటు వీడియోలు చిత్రీకరిస్తూ, ఎడిట్ చేస్తూ ఉంటాడని చెప్పాడు. "యూట్యూబ్ అంటే ఏమిటో కూడా తెలియదు, అబ్బాయిలే ఛానెల్‌ని ప్రారంభించారని వెల్లడించాడు. వివిధ రాష్ట్రాలకు చెందిన పదార్థాలతో ప్రయోగాలు చేస్తూండటంతో స్పందన బాగా వచ్చింది. 2021 ఏప్రిల్‌లో తన సొంత YouTube ఛానెల్, Instagram పేజీని ప్రారంభించాడు. ఇక అక్కడినుంచి వెనుదిరిగి చూడలేదు. తన వెళ్లే ప్రదేశాలు, వండుకునే సూపర్ వంటకాలు, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, మఠర్ పనీర్ ఫ్రైడ్ రైస్ ఇలా ఒకటీ రెండూకాదు రోడ్డు పక్కన జరిగిన సంఘటనలు,ఎన్నోఅద్భుతాలు వీడియోల ద్వారా నెటిజనులకు పరిచయం చేశాడు. ప్రతీ వీడియోకు లక్షలకు పైగా వ్యూస్. సబ్స్క్రైబర్లు కూడా క్రమంగా పెరుగుతూ వచ్చారు. 786 వీడియోలు చేశాడు. 50, 60 లక్షల వ్యూస్ వచ్చిన వీడియోలున్నాయటే రాజేష వీడియోల క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by R_ Rajesh (@r_rajesh_07) ఆర్ రాజేష్ వ్లాగ్స్ ఛానెల్‌తో సెలబ్రిటీగా మారిపోయాడు. అంతేకాదు ఆయన భాష కూడా నిజంగా సూపర్ చెఫ్లాగా ఉండటంతో ఫాలోయింగ్ బాగా పెరిగింది. దీంతో "మాస్టర్‌చెఫ్" , బెస్ట్ ఫుడ్ వ్లాగర్" గా పాపులర్ అయ్యాడు. అంతేకాదు నెటిజన్లు అతని ట్రక్కును "ఫైవ్ స్టార్ రెస్టారెంట్" లేదా "చల్తా ఫిర్తా దాభా" అని పిలవడం విశేషం. ఇంకో విశేషం ఏమిటంటే డ్రైవర్లు నిర్జన ప్రదేశంలో ట్రక్ చెడిపోయినప్పుడు, చెత్త రోడ్లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా సమస్య వస్తే మరమ్మత్తు ఎలా చేసుకోవాలి లాంటివాటితో పాటు తన ట్రక్కు నుండి డ్రోన్ షాట్‌ను పోస్ట్ చేశాడు. హైదరాబాద్ నుండి పాట్నాకు వెళ్లే మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్‌ను చూపించింది. ఈ క్లిప్‌కి ఐదు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.ఇన్‌స్టాగ్రామ్‌లో అతని వంటకాలు, వీడియోలు బాగా ఆకట్టుకుంటాయి. ఎనిమిది లక్షలకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లున్నారు. దీంతో సంపాదన కూడా బాగానే ఉంది. రాజేష్ కుమారుడు కూడా తోడయ్యాడు. ఈ క్రమంలోనే ఇపుడొక కొత్త ఇంటిని కొనుగోలు చేశారు ఇద్దరూ. కొత్త ఇంటిపార్టీ వీడియోను కూడా అప్లోడ్ చేశాడు. రాజేష్ సక్సెస్ జర్నీని పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్రను బాగా ఆకట్టుకుంది. మండే మోటివేషన్ను అంటూ రాజేష్ స్టోరీని ట్విటర్లో షేర్ చేశారు. 25 సంవత్సరాలకు పైగా ట్రక్ డ్రైవర్‌గా ఉన్న రాజేష్ రావాని, తన వృత్తికి ఫుడ్ & ట్రావెల్ వ్లాగింగ్ యాడ్ చేసి ఇపుడొక ఇంటి వాడయ్యాడు అంటూ ట్వీట్ చేశారు. -
మోదీ యూట్యూబ్ సబ్స్రైబర్లు 2 కోట్లు
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఛానల్ సబ్స్రైబర్లు రెండు కోట్లు దాటారు. ప్రపంచంలో ఈ ఘనత దక్కిన నేత నరేంద్ర మోదీనే కావడం గమనార్హం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో మోదీ ఈ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు దీనిని వినియోగిస్తూనే ఉన్నారు. ఇందులో పోస్టు చేసిన వీడియోలకు 450 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఛానల్ సబ్‌స్రైబర్ల సంఖ్యలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సొనారో 64 లక్షలతో రెండో స్థానంలో ఉన్నారు. వ్యూస్ అంశంలో మోదీ తర్వాత ఉక్సెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఉన్నారు. జెలెన్ స్కీ పోస్టు చేసిన వీడియోలకు 22.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత స్థానాల్లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ 7.89 లక్షల మంది, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు 3.16 లక్షల మంది సబ్స్రైబర్లు ఉన్నారు. రాహుల్ గాంధీ ఛానల్‌కు 35 లక్షల మంది ఉన్నారు. ఇదీ చదవండి: అఫీషియల్: మణిపూర్ నుంచి ముంబై దాకా రాహుల్ గాంధీ ‘భారత్ న్యాయయాత్ర’ -
10 కోట్ల మంది 5జీ యూజర్లు..
దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచి్చన నేపథ్యంలో సుమారు 10 కోట్ల మంది సబ్‌్రస్కయిబర్స్ ఈ సరీ్వసులను వినియోగించుకుంటున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. టెలికం సంస్థలు 2022లో వేలంలో కొనుక్కున్న స్పెక్ట్రం కోసం రూ. 1.5 లక్షల కోట్లు వెచి్చంచడంతో పాటు మొత్తం మీద రూ. 2 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్‌లోనే 5జీ సేవలు విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, లిక్విడిటీని మెరుగుపర్చేందుకు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గత కొన్నాళ్లుగా చేపట్టిన సంస్కరణలు టెలికం రంగ వృద్ధికి తోడ్పడ్డాయని చౌహాన్ చెప్పారు. -
ఎన్పీఎస్ ఉపసంహరణకు ‘పెన్నీ డ్రాప్’ ధ్రువీకరణ
న్యూఢిల్లీ: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) నుంచి చందాదారులు తమ నిధులను ఉపసంహరించుకునే సమయంలో ‘పెన్నీ డ్రాప్’ ధ్రువీకరణను పింఛను నిధి అభివృద్ధి, నియంత్రణ మండలి (పీఎఫ్ఆర్డీఏ) ప్రవేశపెట్టింది. పెన్నీడ్రాప్ విధానంలో చందాదారు బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరు, ఎన్పీఎస్లోని పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్లోని పేరు ఏక రూపంలో ఉందా అన్నది సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ) తనిఖీ చేస్తుంది. ఎన్‌పీఎస్‌తోపాటు ఎన్పీఎస్ లైట్, అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)కు సంబంధించి అన్ని రకాల ఉపసంహరణలు, వైదొలగడాలు, చందాదారు బ్యాంకు ఖాతా వివరాల్లో మార్పులకు నూతన విధానం అమలు కానుంది. దీన్ని ఎలా చేస్తారంటే.. చందాదారు బ్యాంక్ ఖాతాలోకి చాలా స్వల్ప మొత్తాన్ని (రూపాయి) బదిలీ చేస్తారు. తద్వారా బ్యాంక్ ఖాతాలో ఉన్న పేరును ధ్రువీకరించుకుంటారు. నిధుల ఉపసంహరణకే కాకుండా, చందాదారులు తమ బ్యాంక్ ఖాతా వివరాల అప్డేట్కు దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారు. ఈ పెన్నీడ్రాప్ విధానంలో ధ్రువీకరణ విజయవంతం కాకపోతే, నోడల్ ఆఫీస్ సహకారాన్ని సీఆర్ఏ తీసుకుంటుంది. పెన్నీడ్రాప్ విఫలమైందని, సమీప నోడల్ ఆఫీస్ లేదా పీవోపీని సంప్రందించాలంటూ చందాదారులకు ఈ మెయిల్, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. చందాదారు నుంచి సరైన వివరాలు అందేంత వరకు నిధుల బదిలీని నిలిపివేస్తారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019