breaking news
-
నెస్లే సెరెలాక్ మంచిదేనా..? పరిశోధనలో షాకింగ్ విషయాలు!
ఇటీవలకాలంలో కొన్ని ప్రముఖ ఫుడ్ బ్రాండ్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో క్యాడ్బరీ చాక్లెట్లు, బోర్నావిటా వంటి ప్రొడక్ట్స్‌పై ఆరోపణలు వచ్చాయి. వాటిల్లో అధిక చక్కెర ఉందని ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు తెలిపారు. అవి మరువక మునుపై తాజాగా ప్రముఖ బేబి బ్రాండ్ నెస్లేపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రొడక్ట్స్‌పై జరిపిన అధ్యయనంలో చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏం జరిగిందంటే..నెస్లే బ్రాండ్‌కి సబంధించిన శిశువుల ప్రొడక్ట్స్ సెరెలాక్‌లో అధిక చక్కెర కలుపుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఒక్కో స్పూన్లో దాదాపు మూడు గ్రాములు చక్కెర ఉన్నట్లు పరిధనలో గుర్తించారు. ఇది అంతర్జాతీయ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు పబ్లిక్ ఐ, అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్స్ అనే పరిశోధన సంస్థలు పేర్కొన్నాయి. దీని కారణంగా ఊబకాయం, దీర్థకాలిక వ్యాధులు తలెత్తుతాయిని తెలిపింది. ఈ ఉల్లంఘనలు కేవలం ఆసియా, ఆఫ్రికన్ మరియు లాటిన్ అమెరికన్ దేశాలలో మాత్రమే జరుగుతున్నట్లు గుర్తించింది. నెస్లే ద్వారా అమ్ముడవుతున్న రెండు రకాల బేబీ ఫుడ్ బ్రాండ్స్‌లలో అధిక స్థాయిలో చక్కెర ఉన్నట్లు పబ్లిక్ ఐ వెల్లడించింది. అయితే యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెస్లే ఉత్పత్తుల్లో చక్కెర రహితం ఉన్నాయని పబ్లిక్ ఐ తెలిపింది. భారత్‌లో ఇదే బ్రాండ్ మొత్తం 15 సెరెలాక్ బేబీ ప్రొడక్ట్స్‌లో ఒక్కో సర్వింగ్‌లో సగటున దాదాపు మూడ గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే ఇథియోపియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో ఇదే బ్రాండ్ ప్రొడక్ట్స్‌లో ఏకంగా ఆరు గ్రాములు చక్కెర ఉన్నట్లు అధ్యయనం వెల్లడించింది. మరీ జర్మనీ, యూకేలో మాత్రం చక్కెర జోడించకుండా విక్రయించడ గమనార్హం. నిజానికి ఈ నెస్లే ప్యాకేజింగ్‌పై షోషకాహార సమాచారంలో ఈ జోడించిన చక్కెర గురించి సమాచరం లేనట్లు నివేదిక పేర్కొంది. ఇది కేవలం తన ఉత్పత్తులపై విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాల గురించి ప్రముఖంగా హైలైట్ చేస్తుందని, పారదర్శకంగా లేదని నివేదిక వెల్లడించింది. నిపుణలు ఏం మంటున్నారంటే.. శిశువుల ఉత్పత్తుల్లో అధిక చక్కెర ప్రమాదకరమైనదని నిపుణలు చెబుతున్నారు. శివువులు, చిన్న పిల్లలకు అందించే ఆహారంలో చక్కెర ఎక్కువగా జోడించకూడదు. వాళ్లు ఈ రుచికి అలవాటు పడి చక్కెరకు సంబంధించిన ఆహారాలను తినేందుకు ఇష్టపడటం జరుగుతుంది. దీంతో క్రమంగా పోషకాహార రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. ఫలితంగా కౌమర దశకు చేరుకోక మునుపే ఊబకాయం, మధుమేహం లేదా రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారని నిపుణులు వెల్లడించారు. అయితే పరిశోధన సంస్థపబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్‌లు నెస్లే కంపెనీ దృష్టికి తీసుకువెళ్లగా..గత ఐదేళ్లలో, నెస్లే ఇండియా ప్రపంచవ్యాప్తంగా శిశు తృణధాన్యాల పోర్ట్‌ఫోలియోలో (పాలు తృణధాన్యాల ఆధారిత కాంప్లిమెంటరీ ఫుడ్) వేరియంట్‌ను బట్టి 30% వరకు చక్కెరలను జోడించడం తగ్గించింది అని చెబుతుండటం విశేషం. (చదవండి: ఎవరీ ప్రియంవదా నటరాజన్? ఏకంగా టైమ్ మ్యాగజైన్లో..!) -
ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వల్ల ఆ సమస్యలు ! పరిశోధనలో షాకింగ్ విషయాలు
ఇటీవల కాలంలో ఎన్నో రకాల ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. అందుకు తగ్గట్టు ఉండే అడ్వర్టైస్మెంట్లు మహిళలను అట్రెక్ట్ చేసి మరీ కొనేలా చేస్తాయి ఈ ఫెయిర్‌నెస్ ప్రొడక్ట్‌లు. అయితే తాజా అధ్యయనంలో ఈ ఫెయిర్‌నెస్ వాడకం వల్ల ఆ సమస్యలు వస్తున్నాయంటూ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ప్రజల ఆరోగ్యానికి హానికరమైన వాటితో ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు తయారు చేస్తారా? అని తయారీదారులపై ఫైర్ అవుతున్నారు. చర్మ సంరక్షణ ఎలా ఉన్నా.. ఆరోగ్యమే చెడి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు ఆరోగ్యానికి నిజంగానే హానికరమా? ఎందుకని? సవివరంగా తెలుసుకుందామా..! ఫెయిర్‌నెస్ క్రీమ్‌లంటే మహిళలకు, ముఖ్యంగా యువతకు ఎంత మక్కువ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్లో ఈ బ్యూటీ ప్రొడక్ట్స్‌కి ఉన్నంత డిమాండ్ మరే వ్యాపారానికి ఉండదంటే అతిశయోక్తి కాదేమో..!. అలాంటి ఈ ఫెయిర్‌నెస్ క్రీముల్లో మెర్క్యురీ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. దీని వల్ల మూత్రపిండాలకు సంబంధించిన మెంబ్రానస్ నెఫ్రోపతీ (ఎంఎన్) కేసులు భారత్‌లో ఎక్కువగా పెరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. అందుకు సంబంధించిన విషయం కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యింది. ఈ పరిస్థితి కారణంగా మూత్రపిండాల్లో ఫిల్టరింగ్ వ్యవస్థ దెబ్బతిని ప్రోటీన్ లీకేజ్ కారణమవుతుందని చెబుతున్నారు. మూత్ర పిండాల వ్యాధి అనేది ముఖ్యంగా శరీరంలోని అంతర్గత రక్షణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడి మూత్రపిండాల రుగ్మతకు కారణమవుతుంది. దీని కారణంగా మూత్రంలో పోటీన్లు వెళ్లిపోవడం జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే.. మనం ముఖానికి రాసుకునే ఫెయిర్‌నెస్ క్రీమ్ మూత్ర పిండాలపై ఎలా ఎఫెక్ట్ చూపుతుందంటే..?. ఆ ఫెయిర్‌నెస్ క్రీమ్‌లో వాడే పాదరసం చర్మం ద్వారా లోపలికి వెళ్తుంది. అది నేరుగా మూత్రపిండాల ఫిల్టర్ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసులు పెరుగుదలకు దారితీస్తుందని పరిశోధకులు డాక్టర్ సజీష్ శివదాస్ అన్నారు. అందులోనూ మార్కెట్లో వచ్చే ప్రతి ఫెయిర్‌నెస్ క్రీమ్ తక్షణమై ముఖం ఫెయిర్‌గా ఉండేలా చేసే ఫలితాల కారణంగానే ఈ పరిస్థితి ఎదురయ్యిందని అన్నారు. అంతేగాదు జులై 2021 నుంచి 2023 మధ్య కాలంలో ఇలాంటి మూత్ర పిండాల రుగ్మతకు సంబంధించిన 22 కేసులపై అధ్యయనం నిర్వహించారు. ఆయా వ్యక్తులు తేలికపాటి ఎడెమా(వాపు), నురుగతో కూడిన మూత్రం తదితర లక్షణాలు కనిపించాయని అన్నారు. అంతేగాదు వారిలో చాలామందికి మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు పెరిగాయన్నారు. అలాగే ఒక రోగి మాత్ర మెదడులో రక్తం గడ్డకట్టే సెరిబ్రల్ వెయిన్ థ్రాంబోసిస్ కూడా వచ్చినట్లు తెలిపారు. అలాగే వైద్యపరీక్షల్లో 22 కేసుల్లో 68% మంది అంటే 15 మందికి న్యూరల్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ 1 ప్రోటీన్(NELL-1) పాజిటివ్‌గా తేలింది. అంటే వారంతా మాత్రపిండాలకు సంబంధించిన ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నారని పరిశోధనలో తేలిందన్నారు. అంతేగాదు ఆ 15 మందిలో దాదాపు 13 మంది ఈ లక్షణాలు కనిపించక మునుపే తాము ఫెయిర్‌నెస్ క్రీమ్‌లు వాడినట్లు అంగీకరించారు. మిగతా ఇద్దిరిలో ఒకరు సాంప్రదాయ స్వదేశీ క్రీములను వాడినట్లు తెలిపారు. మరోకరికి ఆ చరిత్ర కూడా లేదు. అయితే ఆయా రోగులు ఈ ఫెయిర్నస్ క్రీమ్‌లు వాడటం మానేసిన తర్వాత మూత్రిపిండాల వ్యాధి అదుపులో ఉన్నట్లు తేలింది. అంతేగాదు ఆయా ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల ఉత్పత్తులు ప్రజారోగ్యాన్ని ఎలా ప్రమాదంలో పడేస్తున్నాయి అనేందుకు ఈ తాజా పరిశోధనే ఉదహరణ అని తెలిపారు. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు ఈ ఉత్పత్తులను సమర్థించడం, పైగా ఇది బహుళ బిలియన్ డాలర్ల పరిశ్రమ కావడం వల్ల అధికారులెవరూ ఈ ఉత్పత్తులకు అడ్డకట్టవేసే సాహసం చేయడం లేదని ఆరోపించారు. ఇక్కడ కేవలం చర్మ సంరక్షణ, మూత్ర పిండాల సమస్య కాదు. ఇందులో ఉపయోగించే పాదరసం ప్రజల ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమైనదనేది గుర్తించడం తోపాటు ఈ హానికరమైన ఉత్పత్తులకు అడ్డుకట్టవేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: సెలబ్రిటీ శారీ డ్రేపర్: ఎంత చార్జ్ చేస్తుందో తెలుసా..!) -
ఐస్ క్రీమ్ తినడం ఆరోగ్యానికి మంచిదా? పరిశోధన ఏం చెబుతోందంటే.!.
హిమ క్రీములు..అదేనండి చలచల్లని ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరికీ ఇష్టమైనది ఈ ఐస్‌క్రీమ్. అయితే ఇది తింటే కొలస్ట్రాల్ వస్తుందన్న భయంతో తినడానికి భయపడుతుంటారు చాలామంది. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు వాటి జోలికి వెళ్లను కూడా వెళ్లరు. ఇందులో చక్కెర కంటెంట్ ఎక్కు ఉంటుందని, అది కాస్త చెడు కొలస్ట్రాల్‌గా మారుతుందని రకరకాల భయాలు ఉన్నాయి. కానీ అదేమీ నిజం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పైగా తాజా అధ్యయనంలో ఐస్‌క్రీమ్ ఏమీ ఆరోగ్యానికి అంత భయానక నష్టం చేయదని తేలింది కూడా. నిజంగానే ఆరోగ్యానికి ఐస్‌క్రీమ్ మంచిదా? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి తదితరాలు గురించి సవివరంగా తెలుసుకుందాం. ఐస్‌క్రీమ్ తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి మూడు విధాలుగా అధ్యయనం చేశారు హార్వర్డ్ డాక్టరల్ విద్యార్థులు. ఆ పరిశోధనలో ఐస్‌క్రీం ఆరోగ్యానికి హానికరం కాదని, మంచి ప్రయోజనాల ఉన్నాయని తెలింది. చెప్పాలంటే ఈ పరిశోధన ఫలితాలు ఐస్‌క్రీంలా చల్లటి తియ్యని వార్తని అందించింది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారు ఐస్‌క్రీం తోపాటు ఇంకా ఏమీ తీసుకుంటున్నారో గమనించి మరీ విశ్లేషించింది. పాల కొవ్వులు డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయా అనే దిశగా కూడా పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనంలో డైరీ కొవ్వుల కంటే మాంసం, శుద్ధి చేసిన పిండి పదార్ధాలతో కార్డియోవాస్కులర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అంతేగాదు దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వెల్లడించింది. అవేంటంటే.. మెదడు అభివృద్ధికి రోజూ ఓ స్కూప్ ఐస్‌క్రీమ్ తీసుకోవడం వ్లల ప్రతికూల ప్రభావం ఉండదని పేర్కొంది. అంతేకాకుండా దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఈ పరిశోధన తేల్చింది. ఐస్‌క్రీమ్ కాల్షియం, మెగ్నీషియం, బి12 విటమిన్లు, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసే ప్రోటీన్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. పాలు, క్రీమ్ అనేవి ఐస్‌క్రీమ్‌లో ప్రధానంగా వినియోగిస్తారు. విటమిన్ ఎ, కోలిన్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంతో పాటు.. రోగనిరోధక శక్తి, మెదడు అభివృద్ధికి తోడ్పడుతున్నాయి వెల్లడించింది. ఒత్తిడి తగ్గించి మానసిక స్థితిని మెరుగుస్తుంది ఐస్‌క్రీమ్‌లు న్యూట్రీషియన్ రిచ్ ఫుడ్‌గా చెప్తున్నారు. దీనిలో న్యూట్రిషియన్లు, కాల్షియం, ప్రోటీన్, విటమిన్స్ ఉంటాయని ఇవి పూర్తి ఆరోగ్యానికి మంచివని చెప్తున్నారు. మానసికంగా దీనివల్ల ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. ఇది ఒత్తిడిని తగ్గించి మూడ్‌ని లిఫ్ట్ చేస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. సమ్మర్లో ఇవి శరీరానికి హైడ్రేషన్‌ని అందిస్తాయట. దీనివల్ల బరువు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. బోన్స్‌ను హెల్తీగా మార్చడంలోనూ, స్కిన్ హైడ్రేషన్‌కి, జీర్ణక్రియలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం.. తాజా పరిశోధనలో పాలు డెయిరీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచవని తేలింది. అయినప్పటికీ.. పాలు, చీజ్, పెరుగు, ఐస్‌క్రీమ్ వంటి ఆరోగ్యకరమన ఎంపికల మధ్య తేడాను గుర్తించాలని చెప్తున్నారు. అయితే ఈ ఉత్పత్తుల్లో చక్కెర ఎక్కువగా ఉంటుందని తెలిపారు. పెద్ద మొత్తంలో చక్కెర, ఫ్యాట్, కృత్రిమ స్వీటెనర్లు, గట్టిపడే పదార్థాలు వాటిలో వినియోగిస్తారని తెలిపారు. అందువల్ల స్వీట్ తక్కువగా ఉన్న బ్రాండెడ్ ఐస్‌క్రీంలు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మితంగా తింటే సమస్యల నిల్.. ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివే అయినా.. వాటిని కంట్రోల్‌గా తీసుకోవడం మంచిది అంటున్నారు. డైటీషియన్లు రోజుకు గరిష్ఠంగా అరకప్పు తీసుకోవచ్చని చెప్తున్నారు. ఐస్ క్రీమ్‌ను మితంగా తీసుకుంటే.. ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. ఏదీఏమైన దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మాత్రం తీసుకునే క్వాంటింటీపై కచ్చితంగా శ్రద్ధ చూపించాలని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేగాదు ఈ పరిశోధన కేవలం ఐస్‌క్రీం ఆరోగ్యానికి హానికరం కాదని లేదా లాభలు ఉన్నాయని చెప్పడానికే చేసిందే తప్ప ఐస్‌క్రీం తినమని చెప్పేందుకు కాదు. అలాగే పరిశోధనలో ఎక్కువగా ఐసీక్రీం తింటే మధుమేహం, ప్రీడయాబెటిస్ మరియు PCOS తో ఉన్నవారికి సమస్యలను కలిగిస్తుందని, కేన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని చెప్పారు నిపుణులు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. డైట్లో చేర్చుకునే ముందు మీ వ్యక్తిగత వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించి ఫాలో అవ్వడం ఉత్తమం. (చదవండి: అత్యంత ఖరీదైన టీకప్పు..ధర వింటే షాకవ్వుతారు!) -
మహిళల్లో వృద్ధాప్యం త్వరగా రావడానికి కారణం ఇదే!
మహిళలకు మాతృత్వం అపురూపమైనది. చాలామంది అమ్మ నవ్వడం ఓ వరంలా భావిస్తారు. పిల్లలను కనడమే ఆడజన్మకు సార్థకత అని భావించేవాళ్లు ఉన్నారు. కానీ అమ్మగా ఓ స్త్రీ ఎప్పుడైతే మారుతుందో.. ఇక ప్రతి నిమిషం పిల్లల కోసమే వెచ్చిస్తుంది. తన గురించి ఆలోచించడమే మానేస్తుంది. అంతటి త్యాగమూర్తి స్త్రీ. అలాంటి మహిళలు మగవారికంటే తొందరగా వృద్ధాప్య ఛాయలు వచ్చి ముసిలి వాళ్లు అయిపోతుండటం జరుగుతుంది. అందుకు కారణం ఏంటో తాజా అధ్యాయనంలో వెల్లడించారు శాస్త్రవేత్తలు. దీనికి అదే కారణమంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మెయిల్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు మహిళల్లో వృద్ధాప్య ప్రక్రియ వేగవంతమవ్వడానికి గల కారణాలపై అధ్యయనం చేశారు. అందుకోసం సుమారు వెయ్యిమందికి పైగా మహిళలపై పరిశోధన చేశారు. వాళ్లలో పునరుత్పత్తి తర్వాత వస్తున్న డీఎన్ఏ మార్పులపై క్షణ్ణంగా అధ్య యనం నిర్వహించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకోసం శాస్త్రవేత్తలు ఆరు విభిన్నమైన "ఎపిజెనెటిక్ క్లాక్‌లు" లేదా డీఎన్ఏ మిథైలేషన్ నమునా ప్రక్రియలతో మహిళల జీవసంబంధమైన వయసును లెక్కించారు. ఆరేళ్ల సుదీర్ఘ పరిశోధనల్లో.. ఇలా అధ్యయనంలో పాల్గొన్న 825 మంది ఫలితాలు ప్రకారం..ప్రతి గర్భం స్త్రీకి రెండు నుంచి మూడు నెలలు బయోలాజికల్ వృద్ధాప్యంతో ముడి ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆరేళ్లుగా మహిళల్లో వస్తున్న మార్పులను అధ్యయనం చేయగా..గర్భవతుల జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదలను గుర్తించారు. ఈ అంశంపై కొలంబియా ఏజింగ్ సెంటర్లో అసోసియేట్ రీసెర్చ్ సైంటిస్ట్‌లు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. గర్భధారణ జీవసంబంధమైన వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందని.. ఈ ప్రభావాలు అధిక సంతానోత్పత్తి కలిగిన యువ స్త్రీలలో స్పష్టంగా కనిపిస్తాయని వెల్లడించారు. అంతేగాదు ఎక్కువ గర్భాలు లేదా పిల్లలను కన్న మహిళల్లో జీవసంబంధమైన వృద్ధాప్యంలో ఎక్కువ పెరుగుదల కనిపించిదని అన్నారు. అందువల్లే గతంలో గర్భవతిగా ఉన్న స్త్రీలు బిడ్డను మోయని వారికంటే పెద్దవారిగా కనిపిస్తారని చెప్పారు. కొందరికి ధూమపానం అలవాట్లు, ఆర్థిక పరిస్థితి కారణంగా సరైన పోషాకాలతో కూడిన ఆహారం తీసుకోలేని మహిళలపై పరిశోధనలు చేయగా వారిలో జీవసంబంధమైన వృద్ధాప్యం మరింత వేగవంతంగా ఉందన్నారు. ముఖ్యంగా తండ్రులుగా ఉన్న పురుషుల్లో ఈ ప్రభావ లేదని అన్నారు. దీని ప్రభావం కేవలం గర్భం లేదా పాలిచ్చే తల్లుల్లో కనిపిస్తుందని అన్నారు. ఇక్కడ ప్రతి స్త్రీ గర్భం సంఖ్య కూడా వారిలో జీవసంబంధమైన మార్పులు తీసుకువస్తుందని అధ్యయనంలో తేలింది. ఇవే వృద్ధాప్యంపై ప్రభావం చూపిస్తాయని తెలిపారు. అయితే కౌమారదశలోని గర్భం దాల్చినవారిపై ఈ ప్రభావాలు మరింత ఎక్కువగా ఉంటాయన్నారు. అందుకు ఆరోగ్య సంరక్షణ, సరైన వనరులు లేకపోవడం తదితరాలు కూడా ఈ ప్రభావానికి కారణమవుతాయని అన్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇక్కడ మహిళల్లో వేగంగా వచ్చే ఈ వృద్ధాప్యం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపి మరణానికి కారణమవుతోందా? లేదా? అన్నది తెలియాల్సి ఉందన్నారు. ఇక్కడ తల్లుల సంరక్షణ అనేది ప్రధానమైనది అనేది ఈ అధ్యయనం పేర్కొంది. కొత్త తల్లులకు మంచి పోషకాలతో కూడిన ఆహారం, హెల్తీగా ఉండేలా తగిన వైద్యం ప్రాముఖ్యతలను తెలియజేస్తోంది ఈ పరిశోధన. అంతేగాఉ ముఖ్యంగా గర్భధారణ సమయంలో సరైన ఫుడ్, డైట్, మానసికంగా హెల్తీగా ఉంటే ఈ వృధ్యాప్య ఛాలయలను అధిగమించొచ్చని చెబుతున్నారు. ఈ పరిశోధన ఫలితాలు 'ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్'లో ప్రచురితమయ్యింది. (చదవండి: మగవారికి మెనోపాజ్ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!) -
చీరలతో కేన్సర్ ప్రమాదం : షాకింగ్ స్టడీ!
ప్రపంచ జనాభాను వణికిస్తున్న వ్యాధి కేన్సర్. ఇతర ప్రమాదకర కేన్సర్లతో పాటు, మహిళలు రొమ్ముకేన్సర్, సర్వైకల్ కేన్సర్ బారిన పడుతున్నారు. అయితే ఈ కేన్సర్‌కు సంబంధించి తాజాగా ఒక షాకింగ్ స్టడీ ఒకటి వెలుగులోకి వచ్చింది. భారతీయ స్త్రీలకు చీరల వల్ల కేన్సర్ వ్యాధి పొంచి ఉందిట. చీర ధరించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశంతో పాటు, అనేక ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉన్నాయని అధ్యయనంలో కనుగొన్నారు. అయితే దుస్తులు ఏవైనా పరిశుభ్రతే ఎక్కువ కారణమని వైద్యులు పేర్కొడం గమనార్హం. ముంబైలోని RN కూపర్ హాస్పిటల్ లాంటి చోట్ల పరిశోధనలు కూడా జరిగాయి. ఈ పరిశోధనలో ధోతీ కూడా ఉంది. చీర కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన అందమైన దుస్తుల్లో ఒకటి. ఐదున్నర నుండి ఆరు మీటర్ల చీరను ధరించడం ఆనవాయితీ. ఢిల్లీలోని పిఎస్ఆర్ఐ ఆసుపత్రిలో క్యాన్సర్ సర్జన్ డాక్టర్ వివేక్ గుప్తా, ఒకే వస్త్రాన్ని ఎక్కువసేపు ధరించడం వల్ల నడుము వద్ద రాపిడి ఏర్పడుతుంది. చర్మం రంగు మారుతుంది. పొట్టులాగా రావడం జరుగుతుందిట. ఆ తరువాత మానని పుండుగా మారి ఇదే కేన్సర్‌కు దారితీసే అవకాశాలున్నాయి. దీన్నే వైద్య పరిభాషలో స్క్వామస్ సెల్ కార్సినోమా (SCC), చీర క్యాన్సర్ అని పిలుస్తారని పరిశోధకులు తెలిపారు. నడుము చుట్టూ ఇరిటేషన్, పుండ్లు తాజాగా 68 ఏళ్ల మహిళ ఈ కేన్సర్ బారిన పడటంతో ఇది వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు పేర్కొన్నారు. చీర కట్టుకోవడం వలన వచ్చిన కేన్సర్ కాబట్టి, దీన్ని చీర కేన్సర్‌గా భావిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత, తేమ ఉండే జార్ఖండ్, బీహార్‌లో చీర క్యాన్సర్ కేసులు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుల సంఖ్య ఒక శాతంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. డెర్మటోసిస్ నుండి ఉత్పన్నమయ్యే ప్రాణాంతక, చాలా అరుదైన కేసుగా వైద్యులు పేర్కొంటున్నారు. భారత దేశంలోని అనేక ప్రాంతాలలో, ధనికులు, పేదలు, పట్టణ లేదా గ్రామీణ మహిళలు ఏడాది పొడవునా, వారానికి ఏడు రోజులు చీరలను ధరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నిజానికి ఏ పని చేస్తున్నా రోజంతా చీరలోనే ఉంటారు. చీర జారిపోకుండా ఉండేందుకు పెటీకోట్ను నాడాతో గట్టిగా కట్టుకుంటారు. ఇలా గట్టిగా కట్టు కోవడం వల్ల నడుము చుట్టూ చర్మం కమిలిపోవడం, దురద రావడం, క్రమంగా పుండ్లు రావడం.. ఇవన్నీ చీర కట్టుకునేవారికి అనుభవమే. అధిక ఉష్ణోగ్రతలుండే ప్రదేశాల్లో ఇది మరీ చికాకు పుట్టిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే, ఇది కేన్సర్‌గా (చాలా అరుదు)గా మారే ప్రమాదం ఉంది. అంతేకాదు జీన్స్‌తో సహా బిగుతుగా ఉండే దుస్తులు ముఖ్యంగా స్త్రీ పురుషులు ఎవరికైనా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. చాలా బిగుతుగా ఉండే దుస్తులను ఎక్కువసేపు ధరించడం వల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలుగుతుందని, మగవారిలో వ్యంధ్యత్వ సమస్యకు దారి తీస్తుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించిన సంగతి విదితమే. కాశ్మీర్లో కాంగ్రీ కేన్సర్ అదేవిధంగా, కాశ్మీర్లో కాంగ్రీ కేన్సర్ అని పిలువబడే చర్మ కేన్సర్‌కి మరో రూపం. చలికాంలో వెచ్చదనం కోసం కాంగ్రీస్ అని పిలువబడే కుంపటితో నిండిన మట్టి కుండలను వాడే విధానం వల్ల ఈకేన్సర్ వస్తుంది. ముఖ్యంగా పొత్తికడుపు , తొడ ప్రాంతాలలో కాంగ్రిస్ నుండి వేడికి ఎక్కువ కాలం ఎక్స్పోజ్ కావడం దీనికి దారి తీస్తుంది. నోట్ : చీరలు కట్టుకునేవారికి అందరికీ కేన్సర్ వస్తుందని కాదు. దుస్తులు ఏవైనా, పరిశుభ్రంగా ఉండటం, మరీ బిగుతుగా కట్టుకోకుండా ఉండటం అవసరం. అలాగే లోదుస్తుల విషయంలో, ముఖ్యంగా వేసవిలో చాలా పరిశుభ్రతను పాటించాలి. చిన్న పిల్లల విషయంలో కూడా అప్రతమత్తత అవసరం. నడుము చుట్టూ గానీ, స్థనాల వద్ద, తొడలు, జననాంగాల మధ్య ఇరిటేషన్, నల్లటి మచ్చలు మానని పుండ్లు లాంటి సమస్యలొస్తే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019