breaking news
-
తెలంగాణ:నేడు, రేపు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాపం నుంచి కాస్త చల్లబడ్డ రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మధ్య మహారాష్ట్ర, ఉత్తర లోతట్టు కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటకకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. సోమవారం నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుందని వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం, కొన్నిప్రాంతాల్లో అంతకంటే తక్కువగా నమోదవుతున్నాయి. కాగా, సోమవారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. నల్లగొండలో గరిష్ట ఉష్ణోగ్రత 40.0 డిగ్రీల సెల్సియస్, అలాగే ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 21.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల మేర తక్కువగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
Manali Hidimba Temple Photos: మంచు ముద్దగా.. హిడింబ దేవాలయం అద్భుతమైన దృశ్యలు (ఫోటోలు)
-
కిడ్స్ తో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత (ఫొటోలు)
-
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు.. 39 మంది మృతి!
ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలతో పాటు హిమపాతం కారణంగా 39 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా జనం గాయపడ్డారు. ఈ వివరాలను ఖామా ప్రెస్ వెల్లడించింది. విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జనన్ సయెక్ మాట్లాడుతూ హిమపాతం కారణంగా వేలాది పశువులు కూడా మృతి చెందాయన్నారు. హిమపాతం, వర్షం కారణంగా 637 నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. 14 వేల పశువులు చనిపోయాయని తెలిపారు. కాగా నాలుగు రోజులుగా కురుస్తున్న హిమపాతం, మంచు తుఫాను తర్వాత సోమవారం సలాంగ్ హైవేను తెరిచారు. సార్ ఎ పుల్ నివాసి అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ భారీవర్షాలు, కురుస్తున్న హిమపాతం తమను ఆందోళనకు గురిచేస్తున్నదని అన్నారు. మంచు కారణంగా భారీ సంఖ్యలో పశువులు మృతి చెందుతున్నాయన్నారు. పలు రోడ్లు బ్లాక్ అయ్యాయని, ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. కాగా పశువుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. బాల్ఖ్, జాజ్జాన్, బద్గీస్, ఫర్యాబ్,హెరాత్ ప్రావిన్సులలో పశువుల యజమానులకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. -
మంచులో చిక్కుకున్న పర్యాటకులను కాపాడిన ఆర్మీ సిబ్బంది
తూర్పు సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ సైనికులు మంచులో చిక్కుకున్న పర్యాటకుల ప్రాణాలను కాపాడారు. బుధవారం అకస్మాత్తుగా భారీ హిమపాతం కురియడంతో తూర్పు సిక్కింలోని నటులాలో 500 మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు. వీరిని గమనించిన ఆర్మీ సైనికులు వెంటనే అప్రమత్తమై పర్యాటకులను రక్షించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అకస్మాత్తుగా కురిసిన భారీ మంచు కారణంగా 500 మంది పర్యాటకులతో పాటు దాదాపు 175 వాహనాలు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయాయి. వారిని ఆర్మీ బృందం కాపాడింది. భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్ పర్యాటకులను కాపాడేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆర్మీ తెలిపింది. దీనికిముందు ఫిబ్రవరి 20న జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భారీ హిమపాతం కారణంగా చిక్కుకుపోయిన వాహనాలను తరలించడంలో సీఆర్పీఎఫ్ సైనికులు సహాయం అందించారు. భారీ వర్షం, హిమపాతం కారణంగా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. 𝐒𝐮𝐝𝐝𝐞𝐧 𝐒𝐧𝐨𝐰𝐟𝐚𝐥𝐥 𝐢𝐧 𝐄𝐚𝐬𝐭 𝐒𝐢𝐤𝐤𝐢𝐦, 𝟓𝟎𝟎 𝐒𝐭𝐫𝐚𝐧𝐝𝐞𝐝 𝐓𝐨𝐮𝐫𝐢𝐬𝐭𝐬 𝐑𝐞𝐬𝐜𝐮𝐞𝐝 𝐛𝐲 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐓𝐫𝐢𝐬𝐡𝐚𝐤𝐭𝐢 𝐂𝐨𝐫𝐩𝐬 𝐈𝐧𝐝𝐢𝐚𝐧 𝐀𝐫𝐦𝐲 Due to sudden heavy snowfall, approximate 175 vehicles with more than 500 tourists got… pic.twitter.com/vdQTbdQ6jJ — Trishakticorps_IA (@trishakticorps) February 21, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019