breaking news
-
స్మోకింగ్ బ్యాన్..! రిషి సునాక్‌పై వ్యతిరేకత
లండన్: బ్రిటన్‌లో స్మోకింగ్ బ్యాన్ చట్టంపై ప్రధాని రిషి సునాక్ వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2009 తర్వాత పుట్టిన వారికి అంటే.. 15, 15 ఏళ్లలోపు వయసు ఉన్న వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మడాన్ని నిషేధించే చట్టాన్ని సునాక్ గతేడాదే ప్రతిపాదించారు. మంగళవారం (ఏప్రిల్16) ఈ చట్టాన్ని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రవేశపెట్టారు. సునాక్ సొంత పార్టీ కన్జర్వేటివ్స్ ఎంపీల్లో కొందరు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు. మాజీ ప్రధానులు లిజ్ ట్రుస్, బొరిస్ జాన్సన్‌లు కూడా ఈ చట్టంపై వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చట్టం అమలు చేయడమంటే ప్రజల ఇష్టాఇష్టాలను నియంత్రించడమేననేది వారి వాదన. వేల కొద్ది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఒక జనరేషన్‌ను స్మోకింగ్ నుంచి దూరంగా ఉంచేందుకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని యూకే హెల్త్ సెక్రటరీ విక్టోరియా అట్కిన్స్ తెలిపారు. ఈ చట్టం దేశంలో ప్రొడక్టివిటీని పెంచడమే కాకుండా నేషనల్ హెల్త్ సర్వీస్‌పై భారాన్ని తగ్గిస్తుందన్నారు. ఇదీ చదవండి.. మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్ -
మాష్టారు..పొగమానేయండి! లేదంటే మీరు డైమండ్ డక్కే!
ధూమపానం అనేది శతాబ్దాలుగా సమాజాన్ని పీడిస్తున్న పెద్ద దురలవాటు. పొగరాయుళ్లు పొగ తాగవద్దని ఎంత చెప్పినా వినరు. ఆ అలవాటు, ఒక ఎడిక్షన్‌లా మారిపోయి, ప్రాణం మీదికి వచ్చేదాకా తెచ్చుకుంటారు. గుండెజబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, వంధ్యత్వం ఆఖరికి కేన్సర్ లాంటి ప్రాణాంతక జబ్బులొస్తాయని తెలిసి కూడా ఈ దురలవాటును మానుకునేందుకు చాలామంది ఇష్టపడరు. పరిస్థితి చేయి దాటిన తరువాత ఏం చేసినా ఫలితం ఉండదనే సత్యాన్ని గమనించరు. అంతేకాదు ధూమపానం చేయకపోయినా పాగతాగేవారి ద్వారా ఆ పొగను పీల్చడం వల్ల సన్నిహిత కుటుంబ సభ్యులు, చుట్టూ ఉన్నవారు కూడా అనారోగ్యం బారిన పడతారు. వీరినే ప్యాసివ్ స్మోకర్లు అంటారు. ఈ సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ కారణంగా ఉబ్బసం, బ్రోన్కైటిస్ , న్యుమోనియా వంటి శ్వాసకోశ వ్యాధుల బారిన పడతారు. లైంగిక సామర్థ్యంపై దెబ్బ ధూమపానం కారణంగా పురుషుల పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యం దెబ్బతింటుంది. శుక్రకణాల సంఖ్య, వాటి చురుకుదనం తగ్గి పోతుంది. చివరికి వంధ్యత్వానికి దారితీస్తుంది. ధూమపానం పురుషాంగానికి రక్త ప్రవాహం నిలిచిపోతుంది. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. స్త్రీలలో అయితే సంతానోత్పత్తి తగ్గిపోవడం, గర్భస్రావం, నెలలు నిండకుండానే ప్రసవం ,శిశువుల్లో తక్కువ బరువు పుట్టడం లాంటి ప్రమాదాలుంటాయి. అంతేకాకుండా, గర్భధారణ సమయంలో ధూమపానం పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు , అభివృద్ధి లోపాల ప్రమాదాన్ని పెంచుతుంది. తాజాగా డా. శ్రీకాంత్ మిరియాల ఇదే విషయాన్ని తనదైన స్టయిల్లో పొగబాబులకు అర్థమయ్యేలా ట్విటర్లో షేర్ చేశారు. ఆ వివరాలు... డాక్టర్ గారూ కష్టంగా ఉందండి. ఎంత కష్టం? చాలా? ఏం చేసినా? లేదు సార్, అస్సలు నిలబడట్లేదా? కొంచెమే, కానీ అది సరిపోవట్లేదు. అయ్యో? మీరే ఏదో ఒకటి చెయ్యాలి, నా కాపురం నిలబెట్టాలి. సరే, డాప్లర్ పరీక్ష అని ఉంటది, అది చేసుకుని రా! ఇదిగో సార్ రిపోర్టు. అక్కడికి రక్తం… pic.twitter.com/Sfgd2ss0Ba — Srikanth Miryala (@miryalasrikanth) March 4, 2024 (క్రికెట్లో డైమండ్ డక్ అంటే ఒక ఆటగాడు ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండా, ఒక్కపరుగూ చేయకుండా, ఔట్ కావడం) -
ఇవి మార్చితే.. చావును ఏమార్చినట్టే!
మన నిత్య జీవన విధానం, అలవాట్లు వంటివి మన జీవితకాలంపై ప్రభావం చూపుతాయన్నది తెలిసిందే. మరి ఏయే అలవాట్లు, పద్ధతులు మార్చుకుంటే.. 'మరణం' మనకు ఎంతెంత దూరం జరుగుతుందో తెలుసా.. దానిపై ఓ విస్తృత అధ్యయనం జరిగింది. 2011-2013 మధ్య 40 నుం 90 ఏళ్ల మధ్య వయసున్న ఏడు లక్షల మందిపై జరిపిన పరిశోధనలో ఆరు కీలక అంశాలను గుర్తించారు. వీటిని పాటించని వారితో పోలిస్తే.. పాటిందే వారిలో మరణ ప్రమాదం ఎంతవరకు తగ్గుతుందన్నది తేల్చారు. ముఖ్యంగా వ్యాయామం చేయనివారితో పోలిస్తే.. వారంలో కనీసం 150 నిమిషాల సాధారణ వ్యాయామం లేదా 75 నిమిషాల కఠిన వ్యాయామం చేసేవారు. మరణానికి దూరంగా ఉంటారని గుర్తించారు. మానసిక ఒత్తిడి, ఆందో నియంత్రించుకోగలిగితే 29 శాతం, డ్రగ్స్‌కు దూరంగా ఉంటే 380 మరణం రిస్క్ ను తప్పించుకున్నట్టేనని తేల్చారు. చదవండి: Alexi Navalni: కుటుంబ సభ్యులనూ వదలని పుతిన్ దేనిని పాటిస్తే మరణ ప్రమాదం ఎంత శాతం తగ్గుతుంది? -
హుక్కాపై నిషేధం!
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ఆరోగ్యాన్ని రక్షించే లక్ష్యంతో హుక్కా ధూమపానంపై నిషేధం విధించింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు గురువారం ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. "ప్రజా ఆరోగ్యం, యువతను రక్షించే ఉద్దేశంతో హుక్కాపై రాష్ట్రవ్యాప్త నిషేధం విధించాం. హుక్కా ధూమపానంతో తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. అందుకే సిగరెట్లు,ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA)ను సవరించాం. హుక్కా ధూమపానాన్ని నిషేధించాలని నిర్ణయించాం." అని ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. ప్రభుత్వం హుక్కా బార్లపై నిషేధాన్ని యోచిస్తోందని, పొగాకు వినియోగానికి చట్టపరమైన వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఆరోగ్య మంత్రి దినేష్ సెప్టెంబరు 2023లోనే ప్రకటించారు. హుక్కాలో ఉపయోగించే పదార్థాలు వ్యసనానికి దారితీస్తాయని అన్నారు. గతేడాది ఇదే తరహాలో హర్యానా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా సేవించడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదీ చదవండి: కాశీ, అయోధ్య.. ఇక మథుర: యోగి -
బహిరంగ ప్రదేశాల్లో దూమపానం నిషేధం : ఎస్పీ
పుట్టపర్తి టౌన్: బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ మాధవరెడ్డి హెచ్చరించారు. పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై వైద్య ఆరోగ్య శాఖ ముద్రించిన పోస్టర్లను మంగళవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో ఆయన విడుదల చేసి మాట్లాడారు. బహిరంగ ప్రదేశాలతో పాటు విద్యాసంస్థలు వద్ద ధూమపానాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. 18 సంవత్సరాలలోపు వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించడమూ చట్టరీత్యా నేరమన్నారు. జిల్లాలో పొగాకు నిషేధిత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు అడిషనల్ ఎస్పీ విష్ణు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019