breaking news
-
సేనానీ.. నీ ప్రాణాలకు ఉంది హాని ..
అయిపోయాయి.. అన్ని రకాల భూతవైద్యాలు.. చేతబడులు.. బాణామతి.. ఎత్తులు.. జిత్తులు ముగిశాయి. కూటమి విజయానికి చేయాల్సిన కుట్రలన్నీ చేసేశారు. ఎన్ని సపర్యలు చేసినా పక్షవాతం రోగికి చెయ్యి కాలు నోరు రానట్లే కూటమి కూడా నిస్తేజంగా మంచానపడిన రోగిమాదిరి చూస్తుందే తప్ప ప్రయోజనం లేదు. ఈ గుడ్డిగుర్రాన్ని పంచకల్యాణి మాదిరిగా మార్చి యుద్ధానికి బయల్దేరుదాం అనుకున్న చంద్రబాబుకు నిరాశే మిగులుతోంది. పవన్ కల్యాణ్‌కు చేర్చుకోవడం ద్వారా కాపుల ఓట్లు గంప గుత్తగా కొట్టేద్దాం. దాదాపు యాభై నియోజకవర్గాల్లో కాపులకు ప్రాబల్యం ఉంది కాబట్టి అవనీ హోల్‌సేల్ లాక్కోవచ్చని భావించి 21 సీట్లు ఇచ్చినా అదీ పెద్ద వర్కవుట్ కావడం లేదు.పవన్ ప్రభావం భారీగా ఉంటుందని ఆశించిన తూర్పు గోదావరి జిల్లాలోనే దాని ఫలితం అంతంతమాత్రం అని తెలుస్తోంది. గోదావరికి వరదలు తెచ్చే స్థాయిలో ఓట్లు తెస్తాడు అనుకున్న పవన్ సైతం పిఠాపురంలో గెలుపు కష్టమే అని ఎదురీదుతున్న తరుణంలో ఇక బాబులో అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఏమి చేస్తే ఈ బతుకు బాగవుతుంది దేవుడా అనుకుంటున్నా తరుణంలో అయన ఇంకో కుట్రకు కూడా పాల్పడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కు హాని తలపెట్టి ఆ అఘాయిత్యాన్ని ప్రభుత్వం మీదకు నెట్టేసేందుకు సైతం కుట్ర పన్నుతున్నట్లు జనసైనికులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగానే తమకు అనుకూలమైన పత్రికల్లో వార్తలు, కథనాలు రాయించి ఎన్నికల ముందు పవన్ మీద దాడి చేయించి దాన్ని ప్రభుత్వం వైఫల్యం అని బుకాయించి ఆ గాయాల నుంచి లభ్ది పొందాలని టీడీపీ, చంద్రబాబు కుట్ర పన్నుతున్నట్లు సందేహాలున్నాయి. ఈమేరకు ఇప్పటికే చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు ఒక అవగాహనా కుదిరిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ విషయం మీద ఇప్పటికే పవన్ కూడా పలు సార్లు కామెంట్లు చేశారు. తనమీద దాడులు చేసేందుకు రౌడీలు సిద్ధంగా ఉన్నారని, బ్లేడ్లు పట్టుకుని తమవాళ్లను కోస్తున్నారని కూడా అన్నారు. అంతే కాకుండా తానూ ఎలాంటి దాడులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ రెచ్చగొడుతున్నారు. చూస్తుంది బయటివాళ్ల సంగతి ఏమోకానీ చంద్రబాబు పురమాయించినవాళ్ళే పవన్ మీద దాడి చేసి, అయ్యో..మన బిడ్డకు ఘోరం జరిగిందని కొందరు అద్దె మనుషుల ద్వారా డ్రామా నడిపించి కాపుల ఓట్లు దండుకునేందుకు కుట్రలకు తెగబడవచ్చని జనసైనికులు, ఇంకా చంద్రబాబు నైజం తెలిసినవాళ్ళు అంటున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడంలో చంద్రబాబును మించినవాళ్లు లేరని, రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఎంతటికైనా దిగజారుతారని తెలిసినవాళ్ళు గుర్తు చేస్తున్నారు. అందుకే పవన్... నువ్వు జరంత పైలం బిడ్డా అని జాగ్రత్తలు చెబుతున్నారు.- సిమ్మాదిరప్పన్న -
కూటమికి వెంటిలేటర్ తీసేసినట్లేనా?
రెండు కాళ్లూ పడిపోయి చంకల్లో కర్రలు పెట్టుకుని దేకుతూ వెళ్తున్నవాడి కర్రలు ఫాట్ మని లాగేస్తే ఏమవుతుంది? అన్ని అవయవాలూ పని చేయడం మానేస్తూ.. ఒక్కోటీ విశ్రమిస్తుంటే.. ఏదోలా ఆయువును నిలుపుతున్న వెంటిలేటర్‌ను ఆపేస్తే ఏమవుతుంది. ఏదోలా గౌరవ ప్రదమైన స్కోర్ చేస్తాడు అనుకున్న బ్యాట్స్ మ్యాన్ రెండో బంతికే అవుటైతే ఎలా ఉంటుంది.. గోల్డ్ మెడల్ తెస్తాడు అనుకున్నవాడు డోపింగ్ టెస్టులో దొరికిపోతే ఏమవుతుంది.. ఆ అందరి ఆశలూ గల్లంతవుతాయి. భవిష్యత్ అంధకారమవుతుంది.. కొన్ని జీవితాలు ముగిసిపోతాయి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామం కూడా అచ్చం అలాంటిదే. తెలుగుదేశం.. జనసేన.. బీజేపీ.. ఇంకా కాంగ్రెస్ నాయకులూ ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక్కటంటే ఒక్క కారణం, రాజకీయ ఆధారం కనిపించడం లేదు. గతంలో టీడీపీ- జనసేన-బీజేపీ కలిపినా ఉమ్మడి పాలనలో రాష్ట్రానికి ఏమి చేశారన్నది వాళ్లు ఒక్క ముక్కా చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలను మిళితం చేసి రుచి చూపించిన పాలనకు ప్రజలు ఫిదా అయ్యారు. ఈసారి కూడా జగన్ మళ్లీ గెలవాలని రైతులు.. మహిళలు.. యువత.. పేదలు... దళితులూ.. మైనారిటీ గిరిజనవర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల జాబితా సూపర్ సిక్స్ ను ప్రజలు నమ్మడం లేదు... ఎందుకంటే బాబుకున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. అందుకే సూపర్ సిక్స్ పెద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో కూటమి నాయకులూ యావత్తు.. తాము మూడుసార్లు గెలిచాక ఏమి చేసాం.. మళ్ళీ గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తాం అనేది చెప్పకుండా ఐదేళ్ల క్రితం జరిగిన వివేకానందరెడ్డి హత్యకేసును ప్రచారాంశంగా మార్చుకుని పదేపదే అదే అంశాన్ని మాట్లాడుతున్నారు. మాటిమాటికీ హూ కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు అరుస్తూ ఆ హత్యకేసును సీఎం వైయస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డికి చుట్టేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఇదే ఎజెండాను అటు వివేకా కుమార్తె సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పవన్ కళ్యాణ్, ఆఖరుకు బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్మోహన్రెడ్డిని దోషిగా మార్చేందుకు యాతన పడుతున్నారు. వాస్తవానికి ఈ కేసు ఇప్పటికే సీబీఐ విచారణలో ఉండగా ఈ కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ విచారించింది. కోర్టులో ఉన్న ఈ అంశాన్ని పదేపదే ప్రజల్లోకి తీసుకెళ్లడం అనైతికమని చంద్రబాబుకు తెలుసు కానీ అది మినహా వేరే అంశం తనకు లేకపోవడంతో ఎంతసేపూ వివేకా హత్య అంశమే ప్రచారాంశం అవుతోయింది. దీంతో ఇక ఈ హత్య కేసును ఆ అంశాన్ని ప్రచారంలో వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేత సురేష్‌బాబు కడప కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌ను బలపర్చిన న్యాయస్థానం వైఎస్ షర్మిళ, సునీత, చంద్రబాబు, పవన్, లోకేష్.. పురందేశ్వరి ఇలా ఎవరూ ఆ హత్య కేసును ప్రచారంలో ప్రస్తావించరాదని కోర్టు ఆదేశించింది. దీంతో కూటమి నాయకులకు గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. ఇన్నేళ్ల పాలనలో తాము చేసింది కానీ.. చేయబోయేది కానీ చెప్పుకునేందుకు ఒక్కటీ లేని పరిస్థితుల్లో కేవలం ఆ హత్య కేసుని పదేపదే సభల్లో ప్రస్తావించి పబ్బం గడుపుకుందాం అనుకున్న చంద్రబాబుకు ఇది షాకింగ్ వార్త.. ఇక ఈ అంశం మాట్లాడకుండా ఎన్నికల సభలు ఎలా నిర్వహిస్తారో ఆయనకు.. లోకేష్.. పవన్.. పురందేశ్వరికి తెలియాలి. ఇక చేయడానికి ఏమీ లేని తరుణంలో చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో.. ప్రజలను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.. -సిమ్మాదిరప్పన్న -
పవన్ కల్యాణ్ Vs పవన్ కల్యాణ్.. పిఠాపురంలో విచిత్ర పరిస్థితి
పనివాడు పందిరి వేస్తె పిచ్చుకలొచ్చి పడగొట్టాయి అన్నట్లుగా పవన్ కల్యాణ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ బుగ్గైపోతోంది. గతంలో జగన్‌ను సీఎం కానివ్వను.. ఇది శాసనం.. అని భారీ డైలాగులు కొట్టిన పవన్ కట్ చేస్తే గాజువాక, భీమవరం రెండుచోట్లా ఓడిపోయారు. ఇటు జగన్ రాజాలాగా సీఎంగా అసెంబ్లీకి వెళ్లారు. ఈసారి కూడా పవన్ గట్టిగానే మాట్లాడారు. హే జగన్ నిన్ను అదః పాతాళానికి తొక్కేస్తా అన్నారు... డైలాగ్ ఐతే ఎవరో రాసింది సులువుగా చెప్పేశారు కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తొక్కడం సంగతి అటుంచి ఈ భారీ డైలాగ్స్ పవన్ పాలిట సంకటంలా మారాయి. ఈసారి టార్గెట్ మిస్సవ్వకూడదని గట్టిగా డిసైడైన పవన్ భూతవైద్యులు, కోయదొరలను, ఎరుకలసాని, గవ్వలు రాళ్లతో భవిష్యత్ చెప్పేవాళ్ళు, కొండదొరలను సైతం సంప్రదించి..చంద్రబాబు సలహాతో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండేచోట పిఠాపురంలో పోటీ చేయాలనీ డిసైడయ్యారు. ఎంసెట్‌లో రెండుసార్లు మూడేసి లక్షల ర్యాంకులతో కుదేలైపోయి ఏందీ.. ఈసారీ ఎంసెట్ రాలేదా.. అదేంటి.. బాగా చదవాలమ్మా అని చుట్టాలు ఇచ్చే బోడి సలహాలతో విసిగిపోయి...సిగ్గుతో చచ్చిపోయిన పిల్లాడిమాదిరి పరువుపోగొట్టుకున్న పవన్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో అయినా ఎంసెట్ కొట్టాలన్న స్టూడెంట్ లెక్క ఈపాలి ఎలాగైనా అసెంబ్లీలో అధ్యక్షా అనాలన్న కసిమీద ఉన్నారు. అందుకే పిఠాపురంలో గెలుపుకోసం గతంలో తాను పేకాట క్లబ్బుల ఓనర్ అని విమర్శించిన వర్మ ఇంటికే వెళ్లి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సి వచ్చింది. నా గెలుపు నీ చేతిలో ఉందంటూ పవన్ మోకరిల్లారు.. సరే వర్మ పని చేస్తాడు అనుకుంటున్న తరుణంలో ఈయన పిఠాపురం వెళ్లేసరికి అక్కడ ఇంకో పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు.. ఆయనకూడా అచ్చం ఈయన మాదిరిగానే మెడ మీద చెయ్యివేసి రుద్దుకుంటూ... సరిగ్గా నిలబడకుండా ఊగిపోతూహ..హ..అంటుంటే ఎవుడ్రా నువ్వూ అంటూ కొందరు ఆయన్ను ప్రశ్నించారట.. ఏయ్ నేను పవన్ కళ్యాణ్.. ఎస్..నేనే పవన్ కళ్యాణ్ అంటున్నారాయన..ఇంతకూ ఎవరా అని చూస్తే అయన నవరంగ్ నేషనల్ పార్టీ అభ్యర్థి అని, అయన పేరుకూడా కె. పవన్ కళ్యాణ్ అని, తాను పిఠాపురంలో బకెట్ గుర్తు మీద పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి పిఠాపురంలో తానే గెలుస్తానని అయన అంటున్నారు. ఆ బకెట్ గుర్తు చూడడానికి గాజు గ్లాసు గుర్తు మాదిరిగానే ఉండడంతో నిరక్షరాస్యులు ఓటేసేటపుడు గందరగోళానికి గురై గాజు గ్లాసును బదులుగా ఈ బకెట్ గుర్తుమీద నొక్కేస్తే ఎలా అని జనసేనాని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఓ రెండు మూడు వేల ఓట్లు ఆ బకెట్ గుర్తు పాలైనా తనకు ఓటమి తప్పదని జనసేనాని టెన్షన్ పడుతున్నారు. అందుకే దరిద్రుడు రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం వదలడం లేదని పెద్దలు అంటారు. -సిమ్మాదిరప్పన్న. -
ఇది ఖచ్చితంగా క్లాస్ వార్.. పేదలపై పెత్తందారుల దాడి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాళ్ల దాడి వెనుక చాలా సామాజిక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి ఒక ఆకతాయి పని కాదని, ఒక తుంటరి కుర్రాడు చేసిన పని కాదని, ఆ ఘటన వెనుక పెద్ద పన్నాగమే ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా సీఎం జగన్ వేస్తున్న అడుగులు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పెత్తందారులకు కంటగింపుగా, కడుపు మంటగా మారాయని, ఆ క్రమంలోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి నుంచీ రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతోమంది మేధావులు, సామాజికవేత్తలను ఆలోచింపజేస్తున్నాయి. మొదటి నుంచీ తాను పేదల ప్రతినిధిని అని, పేదలు, బీసీలు ఇతర అణగారిన వర్గాలకు నాయకుడిని అని పదేపదే చెప్పడమే కాకుండా టిక్కెట్లు ఇచ్చే సమయంలో తాను తన మాటకు ఏ విధంగా కట్టుబడిందీ చేసి చూపించారు. రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు మొత్తం 200 ఉండగా అందులో వంద స్థానాలు.. అంటే యాభై శాతం సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. విశాఖ, నరసరావుపేట వంటి లోక్‌సభ స్థానాలను సైతం బీసీలకు కేటాయించారు. ఇన్నాళ్ళూ ఆర్థికంగా బలవంతులు, అగ్రవర్ణాలు, సామాజికంగా రాజకీయంగా పెత్తందారీ పాత్ర పోషించిన వర్గాలకు ఇప్పుడు సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు శరాఘాతంగా మారాయి. రూల్స్ మావి రూలింగ్ మాది.. గవర్నమెంట్ మాది.. అసలు మేమే గవర్నమెంట్ అనే పరిస్థితిని ఆయన ఏకంగా తిరగరాశారు. దానికితోడు విజయవాడ వంటి పెత్తందారీ పోకడలున్న నగరంలో సీఎం జగన్ రోడ్ షోకు వస్తున్న అసాధారణ స్పందన చూసి వారికి కడుపు రగిలిపోయింది. పేదల ప్రతినిధిగా, సామాజిక, రాజకీయ సంస్కర్తగా ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు తమను రాజకీయ సమాధి చేస్తాయన్న భయాందోళనలతోనే పెత్తందారుల చెంచాలు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌పై జరిగిన చేసిన ఈ దాడిని ఏకంగా పేదలపై జరిగిన దాడిగా చూడాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు సీఎం జగన్ చెప్పినట్లుగానే ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది క్లాస్ వార్ అని.. రానున్న ఎన్నికలు పేదలు, పెత్తందారులు మధ్య జరిగే యుద్ధానికి ప్రతీక కాబోతున్నదని ఈ దాడి స్పష్టం చేస్తోంది. -సిమ్మాదిరప్పన్న. -
సేనానిని నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో !
తమ్ముణ్ణి సినిమాకు తీసుకెళ్లావ్..నన్నుతీసుకెళ్లలేదు..వాడికి కొత్త బట్టలు కొన్నావు,సైకిల్ కొన్నావ్..నాకు కొనలేదు అని పిల్లలు అలుగుతుంటారు..అలాంటప్పుడు తల్లి, తండ్రి వాణ్ని దగ్గరకు తీసి ఒరేయ్ చిన్నోడా అది కాదురా.. వాడికి సైకిల్ కొన్నాను కదా... నీకూ కొంటాను.. నీకు ఇంకోటి కొంటాను.. వాణ్ని సినిమాకు తీసుకెళ్ళాను కదా.. నువ్వు బాధపడకు నిన్ను జాతరకు తీసుకెళ్తాను... బాధపడకు... అని ఓదార్చాలి... అదే కుటుంబం బాధ్యత. అదే విధంగా పార్టీలో ఉన్నవాళ్లందరికీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు.. అలాంటప్పుడు పిలిచి ఇదిగోవయ్యా.. నువ్వు బాగానే కష్టపడ్డావు కానీ నీకు నేను టికెట్ ఇవ్వలేకపోతున్నాను.. దానికి ఏవేవో కారణాలు ఉన్నాయ్.. కాబట్టి ఏమీ అనుకోకు.. పార్టీ కోసం పని చేయండి.. గెలిస్తే మిమ్మల్ని తప్పక గౌరవిస్తాం అని చెప్పాల్సిన బాధ్యత పార్టీ అధినేత మీద ఉంటుంది. కానీ జనసేనాని వీటన్నిటికీ అతీతంగా ఉంటారు.. టికెట్లు తనకు నచ్చినవాళ్లకు ఇచ్చుకుంటారు. తిరుపతిలో కిరణ్ రాయల్ కావచ్చు.. విజయవాడ వెస్ట్ లో పోతిన మహేష్..ఇలా ఎన్నో జిల్లాల్లో ఎంతోమంది పవన్ కోసం పదేళ్లుగా పని చేస్తూ లక్షలు, కోట్లు తగలేశారు. ఇన్నేళ్ళుగా వాళ్ళను వాడుకుని అక్కడ పార్టీ ఉనికిలోకి వచ్చాక.. ప్రజల్లో కాస్త గుర్తింపు వచ్చాక అక్కడి సీటును వేరేవాళ్లకు ఇచ్చుకోవడం, ఇదేమంటే పొత్తు ధర్మం అని, త్యాగాలకు సిద్ధం కావాలని సమర్థించుకోవడం పవన్ కు అలవాటుగా మారింది. పోతిన మహేష్ టికెట్ బీజేపీకి అంటే సుజనా చౌదరికి ఇవ్వడానికి వెనుక కోట్లు చేతులుమారాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇలా పవన్‌ను నమ్ముకుని బికారులు అయిపోయినవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలోనే ఉన్నారు అయితే ఏనాడూ.. పవన్ అలా నష్టపోయిన లేదా మోసపోయినవాళ్లను పిలిచి వాళ్ళతో మాడ్లాడడం కానీ... వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా..హామీ కానీ ఇచ్చినట్లు వినలేదు. మాకు పవన్ మద్దతుగా ఉంటామన్నారు అని ఇంతవరకూ ఏ ఒక్క నాయకుడూ చెప్పలేదు. ఆంటే ఆయనది అంతా తన ఇష్టానుసారం. తనకు నచ్చినవాళ్లకు టికెట్లు ఇచ్చుకోవడం.. ఆయన్ను నమ్ముకుని మునిగిపోయినవాళ్లు పోవడం.. అంతే తప్ప...కనీసం వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా పార్టీలో ఇంకో వ్యక్తి, ఇంకో నాయకుడు లేకపోవడం ఇక్కడ దారుణం. దీంతో బాధితుల రోదన అరణ్య రోదన అవుతోంది తప్ప వాళ్ళ గోడు వినేవాళ్ళు లేకుండాపోయారు. దీంతో ఎక్కడికక్కడ జిల్లాలు.. నియోజకవర్గాల్లో పార్టీని మోసి మోసపోయిన జనసేన నాయకులంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ తమ దారితాము చూసుకుంటున్నారు. తాను పిఠాపురంలో గెలిస్తే చాలు..పార్టీ మొత్తం ఏమైపోయినా ఫర్లేదు...అనే భావనలో పవన్ ఉండడంతో క్యాడర్ సైతం మెల్లగా సైడ్ అయిపోతున్నారు. --సిమ్మాదిరప్పన్న
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019