breaking news
-
ఎంగేజ్మెంట్ తర్వాత సిద్దార్థ్ ఫస్ట్ బర్త్‌డే.. ప్రియురాలి విషెస్ (ఫోటోలు)
-
తన లవర్‌బోయ్‌కి అదితి లవ్లీ విషెస్
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ పుట్టిన రోజు ఈ రోజు (ఏప్రిల్17) . ఈ సందర్భంగా సిద్ధార్థ్ ప్రేయసి, అందాల తార అదితి రావు హైదరీ స్పెషల్ విషెస్ తెలిపింది. ఈ సందర్బంగా తన కాబోయే భర్తతో లవ్లీ ఫోటోలను షేర్ చేసింది. "హ్యాపీయెస్ట్ బర్త్‌డే నా మేనికార్న్’’ కాబోయే భర్త కోసం పుట్టినరోజుకి విషెస అందించింది. ఎంగేజ్మెంట్ తరువాత ఇది ఫస్ట్ బర్త్‌డే కావడంతో అదితి ఆనందంలో మునిగితేలుతోంది. మురిపెంగా ప్రియుడిని లాటర్, చీర్ లీడర్ అంటూ పొగిడేసింది. కాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం హీరోయిన్ అదితితో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. 2021లో 'మహా సముద్రం' తర్వాత నుంచి వీరిద్దరూ డేటింగ్ ప్రారంభించారు.అయితే తెలంగాణలోని వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.అయితే పెళ్లి వార్తలను ఖండించిన సిద్ధార్థ్ తాము రహస్యంగా పెళ్లి చేసుకోలేదనీ, కుటుంబంతో ప్రైవేట్‌గా నిర్వహించిన ఒక పార్టీలో ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) -
ఎంగేజ్మెంట్ సీక్రెట్‌గా జరగలేదు, మా పెళ్లెప్పుడంటే?
బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్. ఒకప్పుడు సూపర్ హిట్లతో అలరించిన ఇతడికి ఈ మధ్య తెలుగులో విజయాలే కరువయ్యాయి. సినిమాల సంగతి ఎలా ఉన్నా తెలుగు హీరోయిన్ అదితిరావు హైదరితో డేటింగ్ చేస్తూ, షికార్లకు వెళ్తూ అందరి కంట్లో పడ్డాడు. కానీ తన ప్రేమ విషయాన్ని అందరితో పంచుకోవడానికి ఇష్టపడలేదు. పెళ్లి కాస్తా ఎంగేజ్మెంట్ అయింది! ఈ క్రమంలో మార్చి 17న సడన్‌గా వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురంలో ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నాడు. తమిళనాడు నుంచి పురోహితులను తీసుకొచ్చి మరీ ఎంగేజ్మెంట్ కానిచ్చేశారు. కానీ ఆలయ అధికారులకు, పండితులకు అది సినిమా షూటింగ్ అని చెప్పి బురిడీ కొట్టించారు. తర్వాత ఆ డెకరేషన్, సెలబ్రేషన్స్ చూస్తే అది పెళ్లని అందరూ పొరబడ్డారు. దీంతో సిద్దార్థ్ సోషల్ మీడియా వేదికగా తానింకా పెళ్లి చేసుకోలేదని, జరిగింది ఎంగేజ్మెంట్ మాత్రమేనని వెల్లడించాడు. సీక్రెట్ కాదు.. తాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లిన అతడికి ఎందుకు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు? పెళ్లి ముహూర్తాలు పెట్టించారా? అని వరుస ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి సిద్దార్థ్ స్పందిస్తూ.. చాలామంది మేమేదో సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నామంటున్నారు. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు చాలా వ్యత్యాసం ఉంది. మేము మా కుటుంబసభ్యులతో కలిసి ప్రైవేట్ ఫంక్షన్ చేసుకున్నాం. ఏ ఒక్కరినీ పిలవకుండా, చెప్పాపెట్టకుండా చేసుకుంటే అది సీక్రెట్ అంటారు. మరి మా వాళ్లందరి సమక్షంలో జరిగిన నిశ్చితార్థం సీక్రెట్ ఎలా అవుతుంది? పెళ్లి వారి చేతుల్లోనే.. ఇకపోతే అదితికి ప్రపోజ్ చేసినప్పుడు ఏం సమాధానం వస్తుందా? అని ఎదురుచూశాను. నా టెన్షన్ పోగొడుతూ తను నాతో జీవితాన్ని పంచుకోవడం సమ్మతమే అని అంగీకరించడంతో సంతోషపడిపోయాను. పెళ్లి విషయానికి వస్తే అది మా పెద్దలు నిర్ణయిస్తారు. నేను డిసైడ్ చేయడానికి ఇదేమీ షూటింగ్ డేట్ కాదు కదా.. పెద్దవాళ్లే ముహూర్తాలు చూసి ఓ మంచిరోజు డిసైడ్ చేస్తారు. అప్పుడే పెళ్లి జరుగుతుంది అని చెప్పాడు. చదవండి: అతడిని ఎంతో ప్రేమించా.. పెళ్లి దగ్గర్లో ఉందనగా నేనంటే ఇష్టం లేదన్నాడు! -
పెళ్లిపై స్పందించిన సిద్దార్థ్.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హీరో!
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. డేటింగ్ను ఓపెన్‌గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. తాజాగా మార్చి 27న అదితిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు. అయితే తన పెళ్లిపై హీరో సిద్ధార్థ్ తొలిసారి స్పందిచాడు. తాజాగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 'ఆమె ఓకే చెప్పింది.. అందుకే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం' అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇప్పటికే వీరిద్దరి పెళ్లి జరిగిపోయిందని ఫ్యాన్స్ భావిస్తుంటే సిద్ధార్థ్ సడన్ షాకిచ్చాడు. ఎంగేజ్మెంట్ పోస్ట్‌తో అభిమానులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చి పడేశాడు. మరి వీళ్లద్దరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే విషయంపై క్లారిటీ లేదు. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth) -
Siddharth-Aditi Rao Marriage: సిద్దార్థ్ పెళ్లిలో ట్విస్ట్.. వారికి అబద్ధం చెప్పారా?
హీరో సిద్దార్థ్- హీరోయిన్ అదితిరావు హైదరీ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. డేటింగ్ను ఓపెన్‌గా చెప్పుకోవడానికే ఇష్టపడని సిద్దార్థ్ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ తనతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేవాడు. వీళ్ల ప్రేమ విషయాన్ని ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారా? అని అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో నిన్న(మార్చి 27న) అదితిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చాడు. వనపర్తిలోని గుడిలో ఆమెతో ఏడడుగులు వేశాడు. షూటింగ్ అని చెప్పి వనపర్తే ఎందుకంటే? అదితిరావు హైదరి పూర్వీకులు వనపర్తి సంస్థానాధీశులు. అందుకనే ఆ సంస్థానానికి చెందిన ఆలయంలోనే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆలయంలో పని చేసే స్థానిక పూజారులకు సినిమా షూటింగ్ అని చెప్పి గుడిని అందంగా ముస్తాబు చేశారట! వారిని లోపలకు రానివ్వకుండా తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పెళ్లి తంతు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. పెళ్లి మండపం, గుడిని డెకరేట్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కన్ఫమ్ చేసిన హోస్ట్ అదితి రావు హైదరి హీరామండి: ద డైమండ్ బజార్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఈ సిరీస్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కార్యక్రమాన్ని ముంబైలో బుధవారం నిర్వహించారు. సిరీస్‌లో నటించిన అందరూ స్టేజీపై మెరిశారు, ఒక్క అదితి తప్ప! ఆ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సచిన్ కుంబర్ మాట్లాడుతూ.. అదితి ఇక్కడ ఎందుకు లేదో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజు ఆమె పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి అని తెలిపారు. దీంతో సిద్దార్థ్- అదితి పెళ్లి నిజమేనని అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు. చదవండి: గతంలో విడాకులకు దరఖాస్తు.. ఇప్పుడేమో ఇంకో ఆప్షన్ లేదంటూ..
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019