breaking news
-
Tenant Movie Review: ‘టెనెంట్' మూవీ రివ్యూ
టైటిల్: టెనెంట్ నటీనటులు: సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తదితరులు దర్శకత్వం: వై. యుగంధర్ నిర్మాత: మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాణ సంస్థ: మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ సినిమాటోగ్రఫీ: జెమిన్ జోం అయ్యనీత్ ఎడిటర్: విజయ్ ముక్తవరపు సంగీతం: సాహిత్య సాగర్ విడుదల తేదీ: 19-04-2024 అసలు కథేంటంటే.. సత్యం రాజేశ్(గౌతమ్), మేఘా చౌదరి(సంధ్య) పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తుంటారు. అన్యోన్య దాంపత్యం అంటే ఎలా ఉంటుందో వారి మధ్య ప్రేమానురాగాలు అలా ఉంటాయి. ఓ ఖరీదైన ఫ్లాట్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. త్వరలోనే అమెరికా వెళ్లాలనుకున్న ఆ దంపతుల మధ్య బంధం, ప్రేమ ఒక్కసారిగా దూరమవుతుంది. కానీ అన్నింటిని మౌనంగానే భరిస్తూ వస్తాడు గౌతమ్. సంధ్య ఎందుకిలా ప్రవర్తిస్తుందో.. ఆమె ప్రవర్తన వెనుక ఉన్న కారణాలేంటో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అంతలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఎవరూ ఊహించని విధంగా ఆమె బెడ్‌పైనే విగతజీవిలా పడి ఉంటుంది. అదే సమయంలో వారి అపార్ట్మెంట్లోనే ఓ యువకుడు పైనుంచి కిందకు దూకేస్తాడు. అసలు సంధ్యను ఎవరు చంపారు? ఆమెది హత్యా? లేక ఆత్మహత్యా?. గౌతమే ఆమెను చంపేశాడా? లేదా ఆమె మరణం వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అసలు అపార్ట్మెంట్ నుంచి కిందకు దూకిన యువకుడు ఎవరు? అసలు పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? అనే విషయాలు తెలియాలంటే టెనెంట్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ తర్వాత డైరెక్టర్ వై యుగంధర్ తెరకెక్కించిన చిత్రమిది. సమాజంలో నిజజీవితంలో సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే టెనెంట్. టెనెంట్.. ఈ టైటిల్ చూడగానే చాలామందికి గుర్తొచ్చేది అద్దెకు ఉంటున్న వాళ్లు అని. టైటిల్‌తోనే మీకు కథ ఏంటనేది ఓ ఐడియా వచ్చేస్తుంది. ఆ కాన్సెప్ట్‌తోనే ఈ సినిమాను తీశారు. క్లైమాక్స్ సీన్‌తో కథను ప్రారంభించిన యుగంధర్.. ఆ తర్వాత నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్‌లో గౌతమ్, సంధ్యకు పెళ్లి కావడం, వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో కథను నడిపించారు. వారి ఫ్లాట్ పక్కన ఉండే టెనెంట్స్తో సన్నివేశాలు కాస్తా నవ్వులు తెప్పించినా.. సీరియస్‌నెస్ ఎక్కడా మిస్సవ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఒకవైపు పోలీసుల దర్యాప్తు.. మరోవైపు భార్య, భర్తల మధ్య వచ్చే సీన్లతో మెల్లగా ఆడియన్స్‌ను కథలోకి తీసుకెళ్లాడు. కానీ పెద్దగా సస్పెన్ష్, ట్విస్టుల్లాంటి లేకపోవడంతో కథ నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఎలాంటి హడావుడి లేకుండానే ఇంటర్వెల్ బ్యాంగ్ పడిపోతుంది. సెకండాఫ్‌లో కథలో వేగం పెరుగుతుంది. పక్క ఫ్లాట్‌లో ఉండేవారితో గౌతమ్ భార్య సంధ్యకు పరిచయం కావడం, వారితో కలిసిపోవడం చకాచకా జరిగిపోతుంది. గౌతమ్, సంధ్యకు ఫ్లాట్ పక్కన ఉండే రిషి(భరత్ కాంత్) తనకు కాబోయే అమ్మాయి శ్రావణిని(చందన) పరిచయం చేస్తాడు. అక్కడి నుంచే కథ మలుపులు తిరుగుతుంది. రిషి ఫ్రెండ్స్ అతని ఫ్లాట్‌కు రావడం.. గౌతమ్‌ను రిషి సాయం కోరడం.. ఆ తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతాయి. అదే సమయంలో రిషి ఫ్రెండ్స్ చేసిన పనికి అతని జీవితం ఊహించని విధంగా మలుపు తిరుగుతుంది. అతని ఫ్రెండ్స్ చేసిన పనేంటి? చివరికీ రిషికి గౌతమ్ సాయం చేశాడా? ఆ తర్వాత రిషి, శ్రావణి ఏమయ్యారు? సంధ్య ఎలా మరణించింది? పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్ చివరికీ నిజం చెప్పాడా? అనే సస్పెన్ష్తో ఆడియన్స్‌లో ఆసక్తి పెంచేలా చేశారు. క్లైమాక్స్ సీన్ వరకు సంధ్య ఎలా చనిపోయిందన్న విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్ష్ కొనసాగించాడు డైరెక్టర్. చివర్లో వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఓవరాల్‌గా ఆడియన్స్‌కు ఓ మంచి సందేశం ఇస్తూ ముగింపు పలికాడు. ఎవరెలా చేశారంటే.. పొలిమేర-2 తర్వాత సత్యం రాజేశ్ నటించిన చిత్రం టెనెంట్. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ మూవీపై అంచనాలు కూడా పెరిగాయి. సత్యం రాజేశ్ మరోసారి తనదైన మార్క్ చూపించారు. ఇలాంటి మిస్టరీ కథల్లో హావాభావాలతో మెప్పించడంలో సత్యం రాజేశ్ ఒదిగిపోయారు. హీరోయిన్గా మేఘా చౌదరి ఫలానా అమ్మాయి.. ఫలానా అబ్బాయి మూవీ తర్వాత నటించిన చిత్రమిది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన నటనతో మెప్పించింది. ఇన్స్పెక్టర్ ఎస్తేర్ నోరోన్హా ఈ సినిమాలో హైలెట్. తన గ్లామర్‌తో పోలీస్ ఆఫీసర్‌గా తన మార్క్ చూపించింది. చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే సాహిత్య సాగర్ నేపథ్యం సంగీతం, బీజీఎం బాగుంది. జెమిన్ జోం అయ్యనీత్ సినిమాటోగ్రఫీ, విజయ్ ముక్తవరపు ఎడిటింగ్ ఫరవాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
పోటీ పడాలనే కోరిక నాకు లేదు: సత్యం రాజేశ్
‘క్షణం’ సినిమాలో నేను పోషించిన పోలీస్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత నా దగ్గరకు 50 పోలీస్ రోల్స్ వచ్చాయి. కానీ మళ్లీ అలాంటి పాత్రలే చేయడం నాకిష్టం లేదు. అందుకే రిజెక్ట్ చేశాను. కామెడీ చేసే పోలీసు పాత్రలు కాకుండా పవర్‌ఫుల్‌గా ఉండేవి వస్తే మాత్రం మళ్లీ పోలీసుగా నటిస్తాను. ప్రకాశ్ రాజ్, రఘువరన్ లాంటి వాళ్లలాగా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనేది నా కోరిక అన్నారు నటుడు ‘సత్యం’ రాజేశ్. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘టెనెంట్’.వై.యుగంధర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్ నోరోన్హా, భరత్ కాంత్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా సత్యం రాజేశ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► టెనెంట్ సినిమా అనేది ఎదురింట్లో లేదా పక్కింట్లో జరిగే కథ. భార్యభార్తల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చూపించే కథ. ఒక అపార్ట్మెంట్లో జరిగే స్టోరీ. అన్నీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్‌లాగే ఉంటాయి. డైరెక్టర్ ఏం చెప్పారో అది పర్ఫెక్ట్గా తీశారు. ప్రతి సీన్ చాలా బాగుంటుంది. సినిమా థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పేలా ఉంటుంది. ఆడియన్స్‌కు ఈ సినిమా బ్యూటిఫుల్ ఫీల్ ఇస్తుంది. ► కథ నచ్చడంతో చిన్న సినిమాగా స్టార్ట్ చేశాం. ఓటీటీ కోసమే అనుకుని చేస్తున్న క్రమంలో సినిమా అవుట్‌పుట్ చూసుకుంటే అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. అప్పుడు థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. అందుకోసం ఇంకా ఇంప్రూవ్ చేశాం. ► ఈ సినిమా కథను వర్మ శ్రీనివాస్ గారు రాశారు. ఆయన రైటింగ్ చాలా నేచురల్‌గా ఉంది. ఇందులో ఓవర్ డైలాగ్స్ ఉండవు. సినిమాలో నేను మాట్లాడేదే చాలా తక్కువ ఉంటుంది. సినిమా మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా ఉంటుంది. ► ఈ సినిమాకు సాహిత్య సాగర్ సంగీతం అందించారు. ఈ సినిమాకు మ్యూజిక్కే ప్రాణం. క్లైమాక్స్‌లో డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేనే అలా అలా పాజ్ అయ్యా. ఒక ఆడియన్‌లాగా నాకే కన్నీళ్లు వచ్చాయి. సినిమాలో మ్యూజిక్ ఫీల్ అంతగా ఉంటుంది. సాహిత్య సాగర్‌కు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. ► ఆర్టిస్ట్‌గా చేస్తూనే.. మంచి పాయింట్ ఉన్న సినిమాలు చేయాలనేది నా కోరిక. అందుకే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాక్షన్, డ్యాన్స్, రొమాన్స్, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన భారీ బడ్జెట్ సినిమాలు ఎంచుకోను. ఇప్పుడు ఎవరితోనే పోటీ పడాలనే కోరిక నాకు లేదు. ► ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేని సినిమాలు చేయడం వల్ల ఇండస్ట్రీలో పది కాలాలపాటు చల్లగా ఉంటాం. పోటీలో దిగి ఫైట్ చేసి ఓడిపోతే ఇంటికి వెళ్లిపోవాలి. మనం కుమ్మేస్తా.. కొట్టేస్తాం అని చెప్పే అలవాటు నాకు లేదు. నా జీవితం ఏంటో అందరూ చూసేశారు కదా. నాకు నప్పే సినిమాలనే నేను చేస్తా. ► నేను ఆర్టిస్టుగా చేస్తా.. ఆల్రెడీ కొన్ని సినిమాల్లో చేస్తున్నా. మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తే.. నాకు సూట్ అవుతాయనుకుంటేనే హీరోగా చేస్తా. ► ప్రస్తుతం స్ట్రీట్ ఫైట్ అని నేను మెయిన్ లీడ్‌లో ఒక సినిమా చేస్తున్నా. మాస్ మహారాజా రవితేజ గారి మిస్టర్ బచ్చన్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నా. ఇంకా కొన్ని చర్చల దశలో ఉన్నాయి -
సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో 'టెనెంట్' ట్రైలర్
కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేశ్..ఇప్పుడు హీరోగా దూసుకెళ్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర సీక్వెల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన ‘టెనెంట్’ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్ విడుదల చేశారు. వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రవీందర్ రెడ్డి .ఎన్ సహా నిర్మాత. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తుంది. ప్రస్తుత కాలంలో మహిళలు ఎంత అప్రమంతంగా ఉండాలో తెలియజేసేలా చాలా విలువైన కంటెంట్ తో పాటు ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మేఘా చౌదరి, చందన పయావుల, భరత్ కాంత్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు. -
‘టెనెంట్’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ
టైటిల్: గీతాంజలి మళ్ళీ వచ్చింది నటీనటులు: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణ కథ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్ దర్శకత్వం: శివ తుర్లపాటి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థ ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ విడుదల తేది: ఏప్రిల్ 11, 2024 తెలుగు బ్యూటీ అంజలి కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ‘గీతాంజలి’ సినిమా ఒకటి. పదేళ్ల క్రితం వచ్చిన ఈ కామెడీ హారర్ అప్పట్లో ఘన విజయం సాధించింది. దశాబ్దం తర్వాత మళ్లీ అదే టీమ్‌తో గీతాంజలికి సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గీతాంజలి తరహాలో సీక్వెల్ కూడా హిట్ అయినట్లేనా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. దర్శకుడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో మరో అవకాశం రాదు. సినిమా చాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి స్నేహితులు ఆరుద్ర(షకలక శంకర్), ఆత్రేయ(సత్యం రాజేశ్)కలిసి హైదరాబాద్‌లో కష్టపడుతుంటాడు. మరోవైపు వైజాగ్‌లో ఫాస్ట్‌పుడ్ సెంటర్ నడుపుకునే అయాన్(సత్య) హీరో కావాలనని కలలు కంటుంటాడు. అయాన్ని హీరో చేస్తానని నమ్మించి అతని నుంచి డబ్బులు వసూలు చేస్తాడు శ్రీనివాస్. ఫ్రెండ్‌పై నమ్మకంతో హైదరాబాద్ వస్తాడు అయాన్. ఇక్కడకు వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. మోస పోయానని తెలిసినా శ్రీనివాస్ పరిస్థితి చూసి ఏమి అనలేకపోతాడు. ఇక సినిమా ఇండస్ట్రీని వదిలేసి వేరే ఏదైనా పని చేసుకుందాని శ్రీనివాస్ గ్యాంగ్‌తో పాటు అయాన్ కూడా నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఊటికి చెందిన పెద్ద వ్యాపారవేత్త విష్ణు( రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా(శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి శ్రీనివాస్‌కి ఫోన్ కాల్ వస్తుంది. అతనితో ఓ సినిమాను నిర్మిస్తానని విష్ణు చెబుతాడు. హీరోయిన్గా ఊటీలోనే కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అలాగే షూటింగ్ అంతా సంగీత్ మహాల్‌లోనే చేయాలని కండీషన్ పెడతాడు. ఆ మహాల్ చరిత్ర ఏంటి? ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలలో శ్రీను టీమ్‌కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సినిమా షూటింగ్‌ని అక్కడే చేయాలని విష్ణు ఎందుకు కండీషన్ పెట్టాడు? హ్యాట్రిప్ ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనుతో విష్ణు ఎందుకు సినిమా తీయాలనుకున్నాడు? హీరోయిన్గా అంజలినే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ కథలోకి గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ కామెడీ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. పదేళ్ల కిందట వచ్చిన గీతాంజలి ముందు కూడా ఈ జానర్లో సినిమాలు వచ్చాయి. కానీ గీతాంజలి తరహాలో అవి విజయం సాధించలేకపోయాయి. ఆ చిత్రం విజయానికి ప్రధాన కారణం కామెడీ, హారర్‌తో పాటు ఎమోషన్స్ కూడా చక్కగా కుదరడం. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో ఆ ఎమోషన్ మిస్ అయింది. కేవలం కామెడీ, హారర్ ఎలిమెంట్స్‌తో కథనాన్ని నడింపించారు దర్శకుడు. కథ- కథనంపై ఫోకస్ చేయకుండా కాన్సెప్ట్‌ని నమ్ముకొని సినిమాను తెరకెక్కించారు. వాస్తవానికి ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. దెయ్యాలతో సినిమా షూటింగ్ అనేది కొత్త పాయింటే. ఆ ఎపిసోడ్ వరకు కామెడీ బాగా వర్కౌట్ అయింది. కానీ మిగతా కథంతా అంతగా ఆకట్టుకునేలా సాగదు. ప్రేక్షకులను నవ్విస్తూనే..కొన్నిచోట్ల భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తిగా సక్సెస్ కాలేదు. కొన్ని సన్నివేశాలు అయితే మరీ రొటీన్‌గా ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాల్లో లాజిక్కులను వెతుకొద్దు. కానీ ఎమోషన్స్‌ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో చిత్రబృందం పూర్తిగా విఫలం అయింది. ఎంతసేపు నవ్వించడం మీదనే ఫోకస్ పెట్టారు. పోనీ ఆ కామెడీ అయినా కొత్తగా ఉందంటే అదీ లేదు. ఫస్టాప్‌లో వచ్చే కామెడీ సీన్స్ అయితే జబర్దస్త్ షోని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ వరకు కథంతా సోసోగానే సాగుతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది. దెయ్యాలను జూనియర్ ఆర్టిస్టులు అని శ్రీను నమ్మించడం.. ఆ తర్వాత సత్య, సునీల్ పాత్రలు ఆ దెయ్యాలతో జరిపే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ పరమ రొటీన్‌గా ఉంటుంది. ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా భయపెట్టలేదు.. కడుపుబ్బా నవ్వించనూ లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం కాస్త ఎంటర్టైన్ అవుతారు. ఎవరెలా చేశారంటే.. గీతాంజలి పాత్రలో అంజలి ఒదిగిపోయింది. అల్రేడీ చేసిన పాత్రే కాబట్టి.. ఇంకాస్త చక్కగా నటించింది. ఇందులో ఆమెకు ఓ యాక్షన్ సీన్ ఉంది. ఆ సీన్లో అదరగొట్టేసింది. ఈ సినిమాకు సత్య పోషించిన పాత్ర హైలెట్ అని చెప్పాలి. అయాన్‌గా ఆయన పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. శ్రీనివాస్‌రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్‌లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నానిగా సునీల్ పండించిన కామెడీ కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది. దెయ్యాలుగా రవిశంకర్, ప్రియ కొన్ని చోట్ల భయపెట్టారు. ఆ పాత్రలకు సరైన ముగింపు ఉండదు. రాహుల్ మహదేవ్ విలనిజం అంతగా పండలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. హారర్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. బీజీఎంతోనే భయపెట్టాలి. కానీ ప్రవీణ్ లక్కరాజు ఆ స్థాయి నేపథ్య సంగీతాన్ని అందించలేకపోయాడు. పాటలు కూడా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. గ్రాఫిక్స్ విభాగం పనితీరు వీక్‌గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంభాషణలు కొన్నిచోట్ల ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019