breaking news
-
T20: రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా సంజూ శాంసన్!
‘రోహిత్ శర్మ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యానే.. అంతెందుకు టీ20 వరల్డ్‌కప్-2024లోనూ జట్టును అతడే ముందుకు నడిపిస్తాడు’’.. చాన్నాళ్లుగా విశ్లేషకుల మాట. అయితే, వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత సీన్ కాస్తా మారింది. గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమైన ఈ పేస్ ఆల్‌రౌండర్.. ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు వచ్చి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేస్తూ ముంబై పగ్గాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో.. బీసీసీఐ మాత్రం ఈసారి పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్ శర్మనే టీమిండియాకు సారథ్యం వహిస్తాడని ప్రకటించింది. ఇక ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలైన తర్వాత సీన్ పూర్తిగా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వైఫల్యాల కారణంగా ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదింట కేవలం మూడు మాత్రమే గెలిచింది. రాజస్తాన్ రాయల్స్ చేతిలో సోమవారం నాటి మ్యాచ్‌తో ఐదో పరాజయం నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం తన జట్టును విజయపథంలో ముందుకు నడిపిస్తున్నాడు. సంజూ శాంసన్ (PC: IPL) ఇప్పటి దాకా రాయల్స్ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఏడు విజయాలతో ప్రస్తుతం పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు.. వికెట్ కీపర్ బ్యాటర్‌గానూ సంజూ అదరగొడుతున్నాడు. ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి అతడు 314 పరుగులు సాధించాడు. ముంబైతో మ్యాచ్‌లో సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్(60 బంతుల్లో 104)తో కలిసి సంజూ(28 బంతుల్లో 38) ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఫామ్ తాత్కాలికం.. క్లాష్ శాశ్వతం అని యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ మరోసారి నిరూపించింది. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ గురించి ప్రత్యేకంగా చర్చ అవసరం లేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత జట్టులో నేరుగా అడుగుపెట్టే అర్హత అతడికి ఉంది. అంతేకాదు రోహిత్ శర్మ తర్వాత టీమిండియా తదుపరి కెప్టెన్‌గా సంజూ శాంసన్ ఎదుగుతాడనడంలో మీకేమైనా అనుమానాలున్నాయా?’’ అంటూ కేరళ బ్యాటర్ సంజూ శాంసన్ పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్ కావాలని ఆకాంక్షించాడు. అసలు జట్టులో చోటు దక్కుతుంతా అన్న సందేహాల నడుమ ఊహించని విధంగా కెప్టెన్ కావాంటూ అంటూ కామెంట్ చేశడు. కాగా వరల్డ్‌కప్-2024 నేపథ్యంలో రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ మధ్య పోటీ నెలకొన్న తరుణంలో భజ్జీ ఇలా సంజూకు ఓటు వేశాడు. మరి మీ ఓటు ఎవరికి?! Yashasvi Jaiswal’s knock is a proof of class is permanent . Form is temporary @ybj_19 and there shouldn’t be any debate about Keepar batsman . @IamSanjuSamson should walks in to the Indian team for T20 worldcup and also groomed as a next T20 captain for india after rohit . koi… — Harbhajan Turbanator (@harbhajan_singh) April 22, 2024 THAT 💯 moment! ☺️ Jaipur is treated with a Jaiswal special! 💗 Scorecard ▶️ https://t.co/Mb1gd0UfgA#TATAIPL | #RRvMI | @ybj_19 pic.twitter.com/i0OvhZKtGI — IndianPremierLeague (@IPL) April 22, 2024 -
T20 WC: సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్‌కే చోటివ్వాలి!
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో రిషభ్ పంత్‌కు చోటు ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ అన్నాడు. మెగా టోర్నీ ఆడే అర్హత పంత్‌కు ఉందని.. తన దృష్టిలో అతడే టీమిండియాకు మొదటి వికెట్ కీపర్ ఆప్షన్ అని పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో సత్తా చాటి కచ్చితంగా వరల్డ్‌కప్ ఆడే జట్టులో పంత్ చోటు దక్కించుకుంటాడని రిక్కీ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా 2022, డిసెంబరులో కారు ప్రమాదానికి గురై.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ పంత్ కోలుకోవడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సుదీర్ఘకాలం పాటు పునరావాసం పొందిన పంత్.. క్రమక్రమంగా కోలుకుని మ్యాచ్ ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా తిరిగి పగ్గాలు చేపట్టిన పంత్.. వికెట్ కీపర్ బ్యాటర్‌గానూ సేవలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్ ఆడి 194 పరుగులు చేసిన పంత్ ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే.. కెప్టెన్‌గా మాత్రం పంత్ విఫలమవుతూనే ఉన్నాడు. అతడి సారథ్యంలో ఢిల్లీ ఇప్పటిదాకా ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే గెలిచింది. ఇదిలా ఉంటే.. మే 27న ఐపీఎల్-2024 ముగియనుండగా.. జూన్ 1 నుంచి వెస్టిండీస్- అమెరికా వేదికగా పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు వికెట్ కీపర్ ఎంపిక గురించి రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సంజూ బాగా ఆడుతున్నాడు.. అయినా పంత్‌కే చోటివ్వాలి! ‘‘వరల్డ్‌కప్ జట్టులో రిషభ్ పంత్‌కు చోటు ఇవ్వాలా? అంటే కచ్చితంగా ఇవ్వాలనే చెబుతా. ఐపీఎల్ ముగిసేలోపు అతడు అందుకు అర్హత సాధిస్తాడు. గత ఆరు సీజన్లలో పంత్ మెరుగ్గా ఆడాడు. టీమిండియా తరఫున కూడా మంచి ప్రదర్శన ఇచ్చాడు. భారత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదని తెలుసు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ బాగా ఆడుతున్నారు. చాలా ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అయితే.. నేను గనుక జట్టును ఎంపిక చేయాల్సి వస్తే రిషభ్ పంత్‌కే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. నన్నెపుడు ఈ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం ఇస్తాను’’ అని రిక్కీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాగా వరల్డ్‌కప్-2024 టీమిండియా వికెట్ కీపర్ల రేసులో ప్రస్తుతం సంజూ శాంసన్ ముందుకు దూసుకుపోతున్నాడు. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 264 పరుగులు సాధించాడు. చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
T20 WC: ఓపెనర్‌గా అతడు.. రింకూ, సంజూకు నో ఛాన్స్!
ఐపీఎల్-2024 తర్వాత పొట్టి ప్రపంచకప్ సమరం మొదలుకానుంది. మే 26 ఫైనల్‌తో క్యాష్ రిచ్ లీగ్ పదిహేడో ఎడిషన్‌కు తెరపడనుండగా.. జూన్ 1న టీ20 వరల్డ్‌కప్-2024కు తెరలేవనుంది. ఇక ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఈ ఐసీసీ టోర్నీలో భారత తుదిజట్టు కూర్పుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రోహిత్‌తో పాటు ఓపెనర్ అతడే ‘‘రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. విరాట్ కోహ్లి నంబర్ 3, సూర్యకుమార్ యాదవ నంబర్ 4, హార్దిక్ పాండ్యా ఐదో నంబర్లో.. రిషబ్ పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ డెప్త్ దృష్ట్యా నా జట్టులో ఆల్రౌండర్లకు కూడా అధిక ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి అక్షర్ పటేల్ ఏడు, రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో ఆడాలనుకుంటున్నా. ఆ తర్వాతి స్థానంలో నైపుణ్యాలున్న బౌలర్ కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగాలి. పేసర్ల కోటాలో ఆ ఇద్దరు తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లు రావాల్సి ఉంటుంది. ఇలా అయితే తుదిజట్టు కూర్పు సరిగ్గా ఉంటుందని భావిస్తున్నా’’ అని మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. అయితే, అనూహ్యంగా తన ప్లేయింగ్ ఎలెవన్‌లో నయా ఫినిషర్ రింకూ సింగ్, ఐపీఎల్-2024లో సత్తా చాటుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు కైఫ్ చోటివ్వకపోవడం గమనార్హం. బ్యాట్ ఝులిపించలేకపోతున్న జైస్వాల్ మహ్మద్ కైఫ్ ఎంచుకున్న తుదిజట్టులోని ఆటగాళ్లలో ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు కోహ్లి 319 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా 10 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అయితే, యశస్వి జైస్వాల్ మాత్రం ఇంత వరకు ప్రభావం చూపలేదు. ఈ రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో కలిపి కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు. మరో ఓపెనింగ్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాత్రం 255 పరుగులతో దుమ్ములేపుతున్నాడు. ఇక వికెట్ కీపర్ కోటాలో సంజూ శాంసన్ 246 పరుగులతో పంత్ కంటే చాలా ముందున్నాడు. రింకూ సైతం కేకేఆర్‌పై ఫినిషర్‌గా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. కాగా ప్రపంచకప్ జట్టులో టీమిండియాను రోహిత్ శర్మనే ముందుకు నడిపిస్తాడని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చదవండి: గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్లో CSK కెప్టెన్ అతడే! -
చరిత్ర సృష్టించిన శాంసన్.. రోహిత్ శర్మ 8 ఏళ్ల రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ ఓటమి పాలైనప్పటకి.. సంజూ మాత్రం తన అద్బుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా 38 బంతులు ఎదుర్కొన్న శాంసన్ 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా ఇది సంజూకు రాజస్తాన్ కెప్టెన్‌గా 50వ ఐపీఎల్ మ్యాచ్ కావడం గమనార్హం. తద్వారా శాంసన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా 50వ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా సంజూ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2016లో అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ 48 బంతుల్లో 65 పరుగులు చేశాడు. అయితే తాజా మ్యాచ్‌తో 8 ఏళ్ల రోహిత్ రికార్డును శాంసన్ బ్రేక్ చేశాడు. శాంసన్, రోహిత్‌లతో పాటు గౌతమ్ గంభీర్ కూడా కెప్టెన్‌గా తన 50వ ఐపీఎల్ మ్యాచ్‌లో ఫిఫ్టీ సాధించాడు. అతను 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేకేఆర్ కెప్టెన్‌గా 59 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా 50వ ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్లు చేసింది వీరే.. 68* (38) - సంజు శాంసన్ (రాజస్తాన్) వర్సెస్ గుజరాత్, 2024 65 (48) - రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)వర్సెస్ ఢిల్లీ, 2016 59 (46) - గౌతమ్ గంభీర్ (కేకేఆర్) వర్సెస్ ఆర్సీబీ, 2013 45 (33) - డేవిడ్ వార్నర్ (ఎస్ఆర్హెచ్) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, 2021 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సంజూ శాంసన్‌కు భారీ షాక్
IPL 2024 GT vs RR: ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు అతడికి రూ. 12 లక్షల మేర జరిమానా విధించారు. కాగా సొంత మైదానం జైపూర్‌లో రాజస్తాన్ బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆఖరి బంతికి గుజరాత్ టైటాన్స్ స్టార్ రషీద్ ఖాన్ ఫోర్ బాది తమ జట్టును గెలిపించాడు. ఫలితంగా ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుసగా నాలుగు విజయాలు నమోదు చేసిన రాజస్తాన్ రాయల్స్ విజయపరంపరకు బ్రేక్ పడింది. అయితే, ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ చేజేతులా మ్యాచ్‌ను చేజార్చుకుంది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఓవర్ రేటు విషయంలో నిర్దిష్ట సమయానికి ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఫలితంగా స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించగలిగిన గుజరాత్ బ్యాటర్లు విజయానికి బాటలు వేసి.. పని పూర్తి చేశారు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 ఇక స్లో ఓవర్ రేటు కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు పనిష్మెంట్ ఇచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు. ‘‘ఐపీఎల్-2024లో జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు జరినామా విధిస్తున్నాం’’ అంటూ రూ. 12 లక్షలు ఫైన్ వేసింది. ఇది మొదటి తప్పిదం కావున ఈ మొత్తంతో సరిపెడుతున్నట్లు వెల్లడించింది. కాగా ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఒకసారి(రూ. 12 లక్షలు), ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రెండుసార్లు(24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్ల ఫీజులో 25 శాతం/ఆరు లక్షలు) జరిమానా బారిన పడ్డారు. చదవండి: #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019