breaking news
-
నయన్‌కు మరో క్రేజీ ఆఫర్.. స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్!
దక్షిణాదిలో లేడీ సూపర్‌స్టార్ నయనతార మరో బాలీవుడ్ చిత్రానికి రెడీ అవుతున్నారా? అన్న ప్రశ్నలకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఒక పక్క పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో ఎంజాయ్ చేస్తునే మరో పక్క నటిగా బిజీగా ఉన్న ఏకై క నటి నయన్. దక్షిణాదిలో సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార చాలా కాలంగా తరువాత ఇటీవలే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమె నటించిన తొలి చిత్రం జవాన్ సూపర్‌హిట్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్‌ను పూర్తి చేశారు. అందులో ఒకటి మన్నాంగట్టి సిన్స్ 1960. దర్శకుడు డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటుడు యోగిబాబు, దేవదర్శిని, గౌరి కిషన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యాన్ లోల్డన్ సంగీతం, ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది ప్రారంభమైంది. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందుతోంది. కాగా ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే నయనతార తన పోర్షన్‌ను పూర్తి చేశారట. అలాగే ఈమె నటిస్తున్న మరో చిత్రం టెస్ట్. నటుడు మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ క్రీడ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా జవాన్ చిత్రంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సక్సెస్‌ను అందుకున్న నయనతారకు అక్కడ మరో సూపర్ అవకాశం వరించినట్లు తాజా సమాచారం. సూపర్ హిట్స్ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఈమె నాయకిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్. -
Manisha Koirala: జీవితం అనే గురువు పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది
సంజయ్‌లీలా భన్సాలి ‘హీరామండి– ది డైమండ్ బజార్’ వచ్చే నెల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ‘హీరామండి’లో మనిషా కోయిరాల నటించింది. ‘హీరామండి’ విడుదలకు ముందు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన జీవితంలోని ప్రధాన సంఘటనల గురించి సుదీర్ఘమైన నోట్ రాసింది మనిషా. క్యాన్సర్‌తో తాను పోరాడిన రోజులను గుర్తు తెచ్చుకుంది. ‘ఎన్నో మంచి పాత్రలలో నటించాను. ఎంతో మంది ఉత్తమ దర్శకులతో కలిసి పని చేశాను. ఎంతోమంది స్నేహాన్ని పొందాను. దేవుడి దయతో క్యాన్సర్‌తో పోరాడి గెలిచాను. జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నా జీవితంలో ఎన్నో లోతులను చూశాను. జీవితాన్ని మించిన గురువు లేదు. ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది. కాలం విలువను తెలుసుకున్నాను’ అంటూ రాసింది. మనిషా కోయిరాల రాసిన ఈ నోట్ నెట్‌జనులను బాగా కదిలించింది. -
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
సినిమానే అనుకుంటే.. అంతకుమించి.. ఆ వెబ్ సిరీస్ రికార్డ్!
ఈ రోజుల్లో సినిమా తీయాలంటే మాటలు కాదు. కోట్లతో కూడుకొన్న వ్యవహారం. ప్రస్తుత రోజుల్లో పాన్ ఇండియా సినిమాలను కోట్ల రూపాయలు పెట్టి తెరకెక్కిస్తున్నారు. అలా రోజు రోజుకు సినిమా బడ్జెట్ పెరుగుతూనే వస్తోంది. ఇక ఓటీటీ యుగం రావడంతో వెబ్ సిరీస్‌లు సైతం పోటీపడుతున్నాయి. సినిమాలే ఎక్కువ బడ్జెట్ అనుకుంటే.. ఇప్పుడు వెబ్ సిరీస్‌లు సైతం ఆ జాబితాలో చేరిపోయాయి. తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలంటే మనకు గుర్తుచ్చే పేరు రాజమౌళినే. బాహుబాలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు అత్యధిక బడ్జెట్‌తో చేసిన సినిమాలే. కానీ ఇప్పుడు సినిమా బడ్జెట్‌ను మించిపోయేలా ఓవెబ్ సిరీస్ వస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు అందించారు. గతంలో అలియాభట్‌తో తీసిన గంగూభాయి కతియావాడి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన సరికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ హీరామండి వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ బడ్జెట్‌కు సంబంధించిన నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. యానిమల్, బాహుబలి, డంకీ సినిమాల బడ్జెట్‌ను మించిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్‌గా నిలవనుంది. తాజా సమాచారం ప్రకారం హీరామండి వెబ్ సిరీస్‌ను రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. రుద్రను వెనక్కి నెట్టి.. ఇప్పవరకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ నటించిన వెబ్ సిరీస్ రుద్ర:ఎడ్జ్ ఆప్ డార్క్నెస్ అత్యంత భారీ బడ్జెట్‌గా రూపొందించిన వెబ్ సిరీస్‌గా నిలిచింది. ఈ సిరీస్‌ను దాదాపు రూ.200 కోట్లతో తెరకెక్కించారు. తాజాగా హీరామండి వెబ్ సిరీస్ బడ్జెట్ మాత్రం రూ.200 కోట్లు దాటిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే బడ్జెట్లో ఎక్కువశాతం రెమ్యునరేషన్లకే వెళ్లినట్లు తెలుస్తోంది. పారితోషికం విషయాకొనిస్తే డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీయే రూ.60 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా బాలీవుడ్ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. వీరికి కూడా భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాజమౌళి బాహుబలి మూవీని రూ.180 కోట్లతో తెరకెక్కించగా.. యానిమల్ రూ.100 కోట్లు, డంకీ రూ.120 కోట్లతో తీశారు. ఆ లెక్కన ఈ సూపర్ హిట్ సినిమాల బడ్జెట్ కంటే ఎంతో ఎక్కువ ఖర్చుతో హీరామండి తీస్తున్నారు. ఇటీవలే ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పేరుతో టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఈ ఏడాదే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. దేశానికి స్వతంత్రం రాకముందు ప్రస్తుతం పాకిస్థాన్‌లోని లాహోర్‌లో వేశ్యల జీవితాలను ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. -
జాతీయ అవార్డులు అందుకున్న మూవీ.. 19 ఏళ్లకు ఓటీటీలో..
దర్శకదిగ్గజం సంజయ్‌లీలా భన్సాలీ తీసే సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఆయన సినిమాలు ఎంత రిచ్‌గా ఉంటాయో అంతే ఎమోషనల్‌గా కూడా ఉంటాయి. తను తీసే ఒక్కో సినిమా ఒక్కో కళాఖండంలా ఉంటుంది. అలా ఆయన 19 ఏళ్ల క్రితం తెరకెక్కించిన ఓ మాస్టర్ పీస్ 'బ్లాక్'. టైటిల్ చూడగానే ఓ విషయం అర్థమైపోతుంది. హీరోహీరోయిన్లలో ఒకరికి అంధత్వం ఉందని తెలిసిపోతోంది. అవును, ఇందులో హీరోయిన్గా నటించిన రాణీ ముఖర్జీకి కనబడదు, వినబడదు. అంధురాలు, అల్జీమర్ టీచర్ మధ్య లవ్.. ఆమెకు టీచర్ అమితాబ్ బచ్చన్‌తో అనుబంధం ఏర్పడుతుంది. కానీ అతడికి క్రమంగా అల్జీమర్స్(మతిమరుపు) వచ్చి ఆమెను మర్చిపోతాడు. ఆ ఇద్దరి మధ్య నడిచే డ్రామానే బ్లాక్. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఎంతోమంది మనసులను మెలిపెడుతూ కంటతడి పెట్టించేలా చేసింది. అంతేకాదు, మూడు జాతీయ అవార్డులను ఎగరేసుకుపోయింది. ఇన్నాళ్లకు ఓటీటీలో అయితే ఇప్పటివరకు ఈ సినిమా ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ ఓటీటీలోకి వస్తే బాగుండని ఎన్నిసార్లు అనుకున్నామో, ఫైనల్‌గా మా కల నెరవేరింది అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: పేరెంట్స్‌తో వెళ్లా.. నడిరోడ్డుపై అసభ్యంగా తాకుతూ, గిల్లుతూ...: హీరోయిన్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019