breaking news
Ad - Sakshi_Home_Sticky
-
మరో 'గంగుభాయి కతియావాడి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బ్రిటీష్రాజ్కు వ్యతిరేకంగా భారత స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో లాహోర్‌లోని హీరా మండిలోని రెడ్-లైట్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే స్వాతంత్ర్యానికి ముందు పాకిస్తాన్లో లాహోర్‌లోని వేశ్య గృహాల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ హయాంలో వేశ్యల జీవితాలు ఎలా ఉంటుందో ట్రైలర్లో పరిచయం చేశారు. గతంలో సంజయ్ లీలా భన్సాలీ ఆలియా భట్‌తో ఇదే కాన్సెప్ట్‌తో గంగుభాయి కతియావాడి తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అదే తరహాలో హీరామండితో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్ మే 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఆరుగురు హీరోయిన్లతో రియల్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న తాజా వెబ్ సిరీస్ హీరామండీ: ది డైమండ్ బజార్. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందిస్తున్నారు. హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ లాంటి అగ్రతారలు నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోన్న ఈ వెబ్ సిరీస్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వీడియో షేర్ చేస్తూ రివీల్ చేశారు. మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. కాగా.. స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి- ది డైమండ్ బజార్ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్ ద్వారా ప్రపంచానికి చూపించనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను ప్రధానాంశాలుగా సంజయ్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. త్వరలో తన కలల ప్రాజెక్టు హీరామండీ: ది డైమండ్ బజార్‌తో ఓటీటీలోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. -
ఒకే ఫ్రేంలో అందాల తారలు.. కనుల పండుగగా హీరామండి ఫస్ట్‌లుక్
బాలీవుడ్లో దిగ్గజ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. వాస్తవిక కథలను, హిస్టారికల్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్టా. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, దేవదాస్, ‘బాజీరావ్ మస్తానీ’వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను కళ్లకు కట్టినట్లుగా ప్రేక్షకులకు అందించారు. ఇక ఆయన ఓ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పలువురు అగ్ర నటిమణులతో హీరామండి అనే వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ కోసం ఆయన రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున ఈ సిరీస్ వేశ్యల కథ నేపథ్యంలో కొనసాగనున్నట్టు తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సిరీస్‌ను నుంచి అప్డేట్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. తాజాగా ఈ వెబ్ సిరీస్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ క్వీన్స్ గెటప్‌లలో రాయల్ లుక్‌లో కనిపించారు. అందమైన తారలంతా ఒకే ఫ్రేంలో రాయల్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ అంత కనుల పండుగా చేసుకుంటున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. కాగా స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను అంశాలుగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. Another time, another era, another magical world created by Sanjay Leela Bhansali that we can’t wait to be a part of. Here is a glimpse into the beautiful world of #Heeramandi 💫 Coming soon! pic.twitter.com/tv729JHXOE — Netflix India (@NetflixIndia) February 18, 2023 -
సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్‌తో చై చర్చలు.. అందుకేనా?
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీతోనే చై బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసం చై కొన్ని రోజులుగా ముంబైలోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇది చైకి ఫస్ట్ మూవీ కావడంతో లాల్ సింగ్ చద్దాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే చైకి సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ బయటకు వచ్చింది. లాల్ సింగ్ చద్దా మూవీని ప్రమోట్ చేస్తూనే మరోవైపు బాలీవుడ్ మార్కెట్‌పై చై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, నిర్మాత కరణ్ జోహార్‌ని అతడు కలిసినట్లు సమాచారం. చదవండి: ప్రస్తుత టాలీవుడ్ కష్టాలకు కారణం డైరెక్టర్ రాజమౌళినే: వర్మ చైతన్య నిన్న(బుధవారం) ముంబైలోని సంజయ్ లీలా భన్సాలీ ఆఫీసుకి వెళ్లినట్లు తెలుస్తోంది. ‘లాల్ సింగ్ చద్దా’ మూవీ ప్రమోషన్ అనంతర నేరుగా చై సంజయ్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఆయనతో సమావేశమయ్యాడట. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయా? అని అంత చర్చించుకుంటున్నారు. ఇక ఏదేమైన చైతన్య, సంజయ్ భన్సాలీని కలవడం టాలీవుడ్లో ఆసక్తిని సంతరించుకుంది. ఇది అక్కినేని ఫ్యాన్స్ చైతో దేవదాసు మూవీ చేయండి అంటూ కోరుతున్నారు. అయితే చై, సంజయ్ లీలా భన్సాలి కలవడం వెనక అసలు కారణమేంటన్నది తెలియాల్సి ఉంది. కాగా లాల్ సింగ్ చద్దాలో చై బాలరాజు అనే ఆర్మి యువకుడిగా కనిపించనున్నాడు. చదవండి: ఆ హీరోయిన్‌తో డేటింగ్ వార్తలపై నోరు విప్పిన చై -
సంజయ్ లీలా భన్సాలీని కలిసిన అల్లు అర్జున్, వీడియో వైరల్
Allu Arjun Meets Sanjay Leela Bhansali: పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గతేడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప: ది రైజ్ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో బన్నీ పుష్ప రాజ్ అనే స్మగ్లర్‌గా కనిపించాడు. ప్రస్తుతం సెకండ్ పార్ట్ పుష్ప: ది రూల్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివర్లో పుష్ప పార్ట్ 2ను రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత కూడా బన్నీ పాన్ ఇండియా చిత్రాలపైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: యాంకర్ రష్మీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు, ఆమె కాల్ రికార్డు ఇంకా ఉంది ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ కలిశాడు అల్లు అర్జున్. సోమవారం అల్లు అర్జున్ ముంబైలోని సంజయ్‌లీలా భన్సాలీని కలిశాడు. కార్యాలయానికి వెళ్లాడు. సంజయ్ లీలా భన్సాలిని కలిసేందుకు బన్నీ ఆయన కార్యాలయానికి వెళ్లి బన్నీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ మారింది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ని ఐకాన్ స్టార్ ప్రత్యేకంగా కలవడంతో ఇటూ టాలీవుడ్, అటూ బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. భవిష్యత్తులో ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడం కోసమే సమావేశమయ్యారా? లేక ఇంకేదైనా కారణాలతో కలిశారా అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. చదవండి: Radhe Shyam Director: వారిపై ‘రాధేశ్యామ్’ డైరెక్టర్ అసహనం ఈ క్రమంలో త్వరలోనే వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారా? అని చర్చించుకుంటున్నారు. ఏదేమైన బన్నీ, సంజయ్ లీలా భన్సాలీతో సినిమా తీస్తే చాలా బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. సినిమాలను తెరకెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీకి ఓ ప్రత్యేక శైలి ఉంది. అలాంటి దర్శకుడి ఐకాన్ స్టార్ మూవీ అంటే ఏ రేంజ్లో ఉంటుందోనని ఇప్పుడు ఫ్యాన్స్ ముచ్చటించుకుంటున్నారు. రీసెంట్గా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'గంగూబాయి కతియావాడి' రిలిజై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో అలియా భట్ మెయిన్ లీడ్ రోల్ చేసింది. Icon StAAr @alluarjun met with Bollywood top director #SanjayLeelaBhansali @ Mumbai today.#AlluArjun @bhansali_produc pic.twitter.com/ElELV7ddpo — VamsiShekar ON DUTY (@UrsVamsiShekar) March 14, 2022
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019