breaking news
-
సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ కాంతారతో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ సప్తమిగౌడ. ఈ సినిమాలో ఫారెస్ట్ కానిస్టేబుల్ పాత్రలో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు దక్కిచుకుంది. ఇటీవల శాండల్‌వుడ్‌లో యువ చిత్రంలో హీరోయిన్గా నటించింది. యువ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ద్వారా శివరాజ్‌కుమార్ అన్నయ్య కుమారుడు యువరాజ్‌కుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఈ మూవీ ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీకి వచ్చేసింది. కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం రెంటల్ విధానంలో మాత్రమే అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో ఉచితంగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. సంతోష్ ఆనంద్రామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ చిత్రంలో యువరాజ్‌కుమార్ రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించాడు. మరోవైరు ఈ ఏడాదిలోనే సప్తమి గౌడ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిస్తోన్న తమ్ముడు మూవీలో సప్తమి గౌడ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. -
గర్ల్ ఫ్రెండ్ అంటూ విష్ చేసిన కాంతార హీరో.. వీడియో వైరల్!
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా రిలీజైన కాంతారకు సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో స్థానిక భూత కోలా క్రీడ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాంతార సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'కాంతారా చాప్టర్- 1' ఫస్ట్ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా రిషబ్ తన భార్య ప్రగతి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విష్ చేశారు. తన ఫ్యామిలీతో కలిసి ఉన్న క్షణాలను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. బర్త్ డే రోజు తన భార్య ప్రగతికి గుర్తుండిపోయేలా శుభాకాంక్షలు తెలిపారు. రిషబ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా బర్త్ డే గర్ల్‌ఫ్రెండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఆనందం ఒక వరంలా ఉండనివ్వండి. ఈ బంధం చిరస్థాయిగా నిలిచిపోనివ్వండి. మీ ఆయురారోగ్యాలు, మా ఆప్యాయత ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటాయి.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. వీరిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
సలార్‌తో పోటీ పడిన సూపర్ హిట్ మూవీ.. ఓటీటీకి వచ్చేస్తోంది!
కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన చిత్రం కాటేరా. గతేడాది సలార్‌కు పోటీగా కర్ణాటకలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తరుణ్ సుధీర్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 9న నుంచే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. కన్నడలో సలార్ మూవీకి పోటీగా డిసెంబర్ 29న కాటేరా రిలీజైంది. పెద్ద సినిమాతో పోటీ కలెక్షన్స్ రాబట్టింది. ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సలార్‌ను పక్కకు నెట్టి భారీ వసూళ్లు సాధించింది. దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఫిబ్రవరి 9న ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. అయితే మొదట దర్శన్ బర్త్ డే సందర్భంగా ఈనెల 16న ఓటీటీకి తీసుకురావాలని నిర్ణయించారు. కానీ వారం రోజులు ముందుగానే స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. అయితే ఈనెల 9న కేవలం కన్నడలోనే అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం వర్షన్లు మరింత ఆలస్యంగా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా.. కాటేరా 2023లో శాండల్‌వుడ్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా నిలిచింది. కన్నడ ఇండస్ట్రీ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న సినిమాల్లో ఏడో స్థానంలో నిలిచింది.ఈ చిత్రంలో సీనియర్ కథానాయిక మాలాశ్రీ కూతురు ఆరాధన రామ్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే ఆమె కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. రాక్‌లైన్ వెంకటేష్ ఈ మూవీని నిర్మించాడు. -
అక్కడ సూపర్ హిట్.. తెలుగులో రిలీజ్ కానున్న మూవీ!
శాండల్‌వుడ్ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం సప్త సాగరదాచే ఎల్లో. కన్నడలో ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో సప్త సాగరాలు దాటి అనే పేరుతో సెప్టెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ తెలుగు వెర్షన్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేస్తోంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు మేకర్స్. (ఇది చదవండి: రతిక.. నా కొడుకుని వాడుకుంది, అమర్దీప్ అయితే..:పల్లవి ప్రశాంత్ పేరెంట్స్) కన్నడలో సెప్టెంబర్ 1న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినిమాకు మౌత్ టాక్‌తో పాటు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కొన్ని రోజుల క్రితమే ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా సప్త సాగరదాచే ఎల్లోని ఇతర భాషలలో కూడా విడుదల చేయాలని రక్షిత్ శెట్టిని అభ్యర్థించాడు. కాగా.. ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు భాగాలు తెరకెక్కించారు. రెండో భాగం అక్టోబర్ 20న విడుదల కానుంది. (ఇది చదవండి: బిగ్‌బాస్: నాకు న్యాయం కావాలి.. చంటిపిల్లాడిలా ఏడ్చేసిన ప్రిన్స్) The waves of love are coming your way on sep 2️⃣2️⃣ nd 🥰 Unlock the doors of your hearts and let it sink through 😍❤️#SapthaSagaraluDhaati 📻🐚🌊♥️#SSDFromSep22#SSESideA@Rakshitshetty @rukminitweets @hemanthrao11 @vishwaprasadtg @vivekkuchibotla @peoplemediafcy pic.twitter.com/e4T72qJm69 — People Media Factory (@peoplemediafcy) September 15, 2023 -
హీరో భార్యకు సీమంతం.. ఏకంగా సమాధి వద్దే శుభకార్యం!
శాండల్‌వుడ్ హీరో ధృవ సర్జా కన్నడనాట పరిచయం అక్కర్లేని పేరు. 2012లో విడుదలైన 'అద్దురి' అనే సినిమా ద్వారా ఎంట్రీ వచ్చారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకు మేనల్లుడైన ధృవ సర్జాకు కన్నడ చిత్ర పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్వర్గీయ చిరంజీవి సర్జాకి తమ్ముడిగా గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన పనికి సర్వత్రా చర్చ మొదలైంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ధృవ సర్జా తన భార్యకు సీమంత వేడుక నిర్వహించారు. అయితే ఈ శుభకార్యం జరిగిన విధానం కన్నడ పరిశ్రమలో కొత్త చర్చకు దారి తీసింది. (ఇది చదవండి: పాకీజాను వీడని ఆర్థిక కష్టాలు.. షాపుల వద్ద భిక్షాటన చేస్తూ!) చిరంజీవి సర్జా కోసం.. తన అన్నయ్య చిరంజీవి సర్జా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ధృవ సర్జా భార్య ప్రేరణ గర్భంతో ఉంది. ఈ శుభ సమయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సీమంతం వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకను చిరంజీవి సర్జా సమాధి ఉన్న ఫామ్ హౌస్‌లో నిర్వహించడం విశేషం. శ్రీకృష్ణ జన్మాష్టమిని చిన్నారులకు కృష్ణుడి వేషం వేసి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ధృవ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఫామ్ హౌస్ మొత్తం రకరకాల పూలతో అలంకరించి ఈ కార్యక్రమం నిర్వహించారు. ధృవ సర్జా తన సోదరుడు చిరంజీవి సర్జా మరణంతో ఆయన కుటుంబం ఇప్పటికీ బాధలో ఉంది. ధృవ సర్జా ఇంట్లో జరిగిన కార్యక్రమాల్లో చిరు జ్ఞాపకంగా ఉండేలా సీమంతం వేడుకను నిర్వహించారు. ఈ వేడుకతో చిరును ప్రత్యేకంగా అన్నపై ఉన్న ప్రేమను ధృవ సర్జా చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ధృవ సర్జా తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. (ఇది చదవండి: బుల్లితెర నటి పోస్ట్.. ఇది మీ పర్సనల్ అంటూ నెటిజన్స్ ఫైర్!) కాగా.. ధృవ సర్జా 2019లో ప్రేరణను వివాహం చేసుకున్నారు. ప్రేరణను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధృవ సర్జాకు 2022 అక్టోబర్‌లో ఆడబిడ్డకు జన్మించింది. ప్రస్తుతం ఈ జంట రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ధృవ సర్జా ఇంట్లో సంబరాలు నెలకొన్నాయి. ధృవ సర్జా ప్రస్తుతం కేడి, మార్టిన్ చిత్రాల్లో నటిస్తున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019