breaking news
-
సైలెంట్‌గా ఓటీటీకి యాక్షన్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ యంగ్ హీరో అర్జున్ దాస్ నటించిన చిత్రం పోర్. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తమిళంతో పాటు హిందీలో ఏకకాలంలో నిర్మించారు. తమిళంలో అర్జున్ దాస్, కాళిదాస్ జయరామ్ కీలక పాత్రలు పోషించారు. హిందీ వర్షన్లో హర్షవర్ధన్ రాణే, ఎహాన్ భట్ హీరోలుగా నటించారు. మార్చి 1న థియేటర్లలో పోర్ మూవీ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. హిందీలో డంగే పేరుతో రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నెల రోజులు కూడా కాకముందే ఓటీటీకి వచ్చేసింది. అయితే కేవలం తమిళం, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని భాషల్లో తీసుకొచ్చే అవకాశముంది. కాలేజీ స్టూడెంట్స్ లవ్ స్టోరీస్, గొడవలు, సరదాల కాన్సెప్ట్‌తో దర్శకుడు బిజోయ్ నంబియార్ ఈ మూవీని తెరకెక్కించారు. కాగా.. గతంలో అర్జున్ దాస్ లోకేష్ కనకరాజ్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నారు.. ఖైదీలో విలన్ గ్యాంగ్‌లో పనిచేసే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించారు. ఆ తర్వాత విజయ్ మాస్టర్‌తో పాటు కమల్‌హాసన్ విక్రమ్‌లోనూ అర్జున్ దాస్ కనిపించారు. -
ద్వి భాషా చిత్రంగా వస్తోన్న పోర్.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్స్ అర్జున్‌దాస్, కాళిదాస్ జయరామ్ నటించిన తాజా చిత్రం పోర్. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో డీజే భాను, సంజనా నటరాజన్, మెర్విన్ రోజారియో ప్రధాన పాత్రలు పోషించారు. టీ సిరీస్, రూక్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో సైతాన్, డేవిడ్, వాజీర్ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పోర్ మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్జున్‌దాస్ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథను దర్శకుడు తనకు ఒక హోటల్లో చెప్పారన్నారు. అంతకుముందే కాళిదాస్ జయరామ్ ఎంపికయ్యారని చెప్పారు. ఇది కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో కొంచెం స్నేహం సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. ఈ చిత్రంలో నటించిన దర్శకుడు తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. సాధారణంగా రెండు భాషల్లో రూపొందించే చిత్రాల షూటింగ్లో ఒక భాషలో నటించే నటులకు మరో భాషా సన్నివేశాలను చూపించరన్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు హిందీ వెర్షన్ సన్నివేశాలను చూసే అవకాశం కల్పించడంతో తాను మరింత పర్ఫెక్ట్గా నటించినట్లు చెప్పారు. కాళిదాస్ జయరామ్‌తో మళ్లీ కలిసి నటిస్తానా అనేది సందేహామే అన్నారు. ఆయన కెమెరా ముందుకు వచ్చేవరకు అందరితోనూ ఎంతో సరదాగా ఉంటారని అంత జోవియల్ వ్యక్తి అని చెప్పారు. మంచి స్నేహశీలి అని కూడా అర్జున్ దాస్ పేర్కొన్నారు. -
Sanchana Natarajan: చురకత్తిలాంటి చూపులతో గుండెను గుల్ల చేస్తున్న హీరోయిన్ (ఫోటోలు)
-
సత్తా చాటుతున్న సంచనా నటరాజన్
తమిళసినిమా: పాన్ ఇండియా నటిగా పేరు తెచ్చుకుంటున్న నటి సంచనా నటరాజన్. అందం అంతకుమించిన అభినయం, చక్కని తమిళ వాచకం వంటి అర్హతలు కలిగిన ఈ చెన్నై వాసి నటిగా 2014లో రంగ ప్రవేశం చేశారు. అలా గత తొమ్మిదేళ్లుగా తమిళం, తెలుగు, మలయాళం, ఆంగ్లం భాషల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. అందమైన ముఖం, ఆకాశమయమైన పరువం కలిగినా కథానాయకిగా మాత్రమే నటిస్తానని భీష్మించుకుని కూర్చోకుండా నటనకు అవకాశం ఉంటే ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమనే ఈమె బావనే మంచి నటిగా నిలబెట్టిందని చెప్పవచ్చు. ఇక ప్రతి పని గుర్తించడంలో ముందుండే దర్శకుడు పా రంజిత్ తాను దర్శకత్వం వహించిన సార్పట్ట పరంపరై చిత్రం ద్వారా సంచనా నటరాజన్‌ను కోలీవుడ్ కు పరిచయం చేశారు. అందులో నటుడు కలైయరసన్ కు జంటగా నటించి పలువురి ప్రశంసలను అందుకున్న సంచనా నటరాజన్ తమిళ చిత్త పరిశ్రమ దృష్టిని తనవైపుకు తిప్పుకున్నారు. ప్రస్తుతం ఈమె బాటిల్ రాధ, పోర్ అనే తమిళ చిత్రాలతో పాటు టికీ టక అనే మలయాళ చిత్రంలోని నటిస్తున్నారు. కాగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, ఎస్జే. సూర్య కథానాయకులుగా నటించిన జిగర్తండ డబుల్ ఎక్స్ చిత్రంలో నటి సంచనా నటరాజన్ కీలకపాత్రను పోషించారు. ఇందులో ఈమె నటుడు భార్యగా నటించడం విశేషం. శుక్రవారం తెర పైకి వచ్చిన ఈ చిత్రం సక్సెస్ ఫుల్‌గా ప్రదర్శింపబడుతోంది. ఇందులో ఒక పాత్రగా జీవించిన నటి సంచనా నటరాజన్ కు పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. మరిన్ని వైవిధ్య భరితమైన కథా పాత్రలో నటించి పేరు తెచ్చుకుంటానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019