breaking news
-
Samyuktha : సంయుక్తకు బాలీవుడ్ ఆఫర్
-
దుబాయ్‌లో మరో అమ్మాయితో భర్త ఎఫైర్.. మోసం చేశాడన్న నటి
ప్రేమ, పెళ్లి అనేది నమ్మకం అనే పునాదులపైనే నిలబడుతుంది. కానీ తన భర్త తానే సర్వస్వం అని నటిస్తూనే మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నాడని వాపోయింది నటి సంయుక్త. ఈ బ్యూటీ తమిళ బిగ్‌బాస్ 4వ సీజన్లో పాల్గొంది. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్‌తో వారసుడు, తుగ్లక్, దర్బార్ వంటి పలు చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. ప్రేమ పెళ్లి.. దుబాయ్‌లో మరో అమ్మాయితో 'నా భర్త దుబాయ్‌లో వ్యాపారం చేస్తుంటాడు. కరోనా సమయంలో అతడి గురించి నాకు భయంకరమైన నిజం తెలిసింది. నాలుగేళ్లుగా అతడు మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్న విషయం తెలిసింది. అప్పుడు నా మనసు ముక్కలైంది. అసలేం చేయాలో కూడా తోచలేదు. లాక్డౌన్ వల్ల ఎక్కడికీ వెళ్లలేకపోయాను. అప్పుడే నాకు యాంకర్ భావన పరిచయమైంది. నేను ఉంటున్న అపార్ట్మెంట్లోనే తను కూడా ఉంటుంది. కలిసినప్పుడల్లా హాయ్, బై.. ఇంతే మాట్లాడుకునేవాళ్లం. తర్వాత కలిసి వాకింగ్‌కు వెళ్లడం మొదలుపెట్టాం. ఒకరోజు తను నా భర్త, కుటుంబం గురించి అడిగింది. అప్పుడే నా గుండెల్లో ఉన్న బాధనంతా ఒక్కసారిగా కన్నీటిరూపంలో తన్నుకుంటూ వచ్చింది. బిగ్‌బాస్‌కు ట్రై చేయొచ్చుగా అని సలహా నా మనసులో ఉన్న బాధనంతా తనతో చెప్పుకున్నాను. అప్పటికి తనింకా నాకంత క్లోజ్ ఏమీ అవలేదు. అయినా నా తరపున నిలబడింది. నన్ను ఓదార్చింది. లాక్డౌన్ కావడంతో ఇంటిదగ్గరే కలిసి వర్కవుట్ చేసేవాళ్లం. అలా చాలా క్లోజ్ అయిపోయాం. మేలో నా 8వ వివాహ వార్షికోత్సవం వచ్చింది. నా బతుకు ఇలా అయిపోయిందేంటని ఒక్కదాన్ని ఎంతలా ఏడ్చానో! నాకు ఓ కొడుకు ఉన్నాడు. ఇల్లు గడవాలంటే సంపాదన అవసరం. అందుకే నాకేదైనా పని దొరుకుతుందేమో చూడమని భావనకు చెప్పాను. తను నీకేది నచ్చితే అదే చేయాలంది. బిగ్‌బాస్ షోకి ట్రై చేయవచ్చు కదా అని సలహా ఇచ్చింది. అంతేకాదు, బిగ్‌బాస్ షోకి నన్ను రిఫర్ చేసింది కూడా! విడాకులిస్తానంటే రావట్లేదు సంయుక్త ఎవరనేది ఈ ప్రపంచానికి తెలిసిందంటే అది భావన వల్లే! తన వల్లే నేను ఇక్కడిదాకా వచ్చాను. ఇప్పటికీ నా కొడుకు నాన్న ఎక్కడ? అని అడుగుతుంటాడు. తను బయట దేశంలో పని చేస్తున్నాడు, ఇండియాకు రాలేడు అని సర్ది చెప్తూ వస్తున్నాను. ఆయన మాకు ఎందుకింత అన్యాయం చేశాడో తెలియడం లేదు. తనకు విడాకులిచ్చేందుకు ఎప్పుడో సిద్ధమయ్యాను. కానీ తను ఇండియాకు రావడానికి కూడా ఇష్టపడటం లేదు. అందుకే ఇంకా విడాకుల ప్రక్రియ పూర్తి కాలేదు' అని చెప్తూ ఎమోషనలైంది. కాగా సంయుక్త ఎంటర్ప్రెన్యూర్ కార్తీక్ శంకర్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఒక బాబు రేయాన్ ఉన్నాడు. బిగ్‌బాస్ తర్వాత తను మోడల్, నటిగా కెరీర్లో దూసుకుపోతోంది. View this post on Instagram A post shared by Samyuktha Shan (@samyuktha_shan) చదవండి: కట్టప్పనే మించిపోయావ్, నీకన్నా పాము నయం.. గడగడలాడించిన గీతూ.. షాకైన రతిక -
ప్రేమ పెళ్లి, కొన్ని వారాలకే విడాకులు.. కొత్త కారు కొన్న నటి
పెళ్లికి ముందు ఉన్న ప్రేమ.. ఆ తర్వాత ఉండదని చాలామంది అంటుంటారు. ఏళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగి మనసారా ప్రేమించుకున్న జంటపక్షులు పెళ్లి తర్వాత మాత్రం సడన్‌గా మారిపోతారు. అప్పటిదాకా ఒకరిపై మరొకరు కురిపించుకున్న ప్రేమ.. మెడలో మూడు ముళ్లు పడ్డ తర్వాత మాత్రం హారతి కర్పూరంలా కరిగిపోతుంది. ప్రేమ స్థానంలో గొడవలు, విభేదాలు మొదలవుతాయి. అది చిలికి చిలికి గాలివానలా మారి విడాకుల వరకూ వెళ్తాయి. ఇప్పుడు చెప్పుకునే బుల్లితెర జంట కూడా అదే జాబితాలోకి వస్తుంది. సీరియల్‌తో మొదలైన ప్రేమకథ సంయుక్త.. తర్వాతి కాలంలో తన పేరును సంయుతగా మార్చుకుంది. సంయుత-విష్ణుకాంత్ సిప్పినీల్ ముత్తు సీరియల్లో కలిసి నటించారు. అప్పుడే వీరి చూపులు, మనసులు కలిశాయి. కొంతకాలం పాటు ప్రేమ జర్నీని ఎంజాయ్ చేసిన వీరు పెద్దలను ఒప్పించి ఈ ఏడాది మార్చి 3న పెళ్లి చేసుకున్నారు. అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ అప్పుడు మొదలైంది అసలు సమస్య. ఒకరి ప్రవర్తన మరొకరికి నచ్చలేదు. నెల రోజులకే విభేదాలు మొదలయ్యాయి. సర్దుకుపోదామనుకున్నారు, కుదర్లేదు.. మరో నెలరోజులకు విడిపోతున్నట్లు ప్రకటించారు. తన భార్య.. మాజీ ప్రియుడు విజయ్‌తో ఇంకా టచ్‌లో ఉందని ఆడియోక్లిప్ వదిలాడు విష్ణుకాంత్. నటికి పట్టపగలే చుక్కలు చూపించిన భర్త! తానే తప్పూ చేయలేదని, విష్ణుకాంతే తనను శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది సంయుత. వీరి విడాకుల వ్యవహారం అప్పట్లో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా సంయుత కొత్త కారు కొనుగోలు చేసింది. 'స్వతంత్రంగా కష్టపడి జీవించగలిగే మహిళకు ఏదైనా సాధ్యమే.. మంచి మనసుతో, సద్భావాలతో ఈ సమాజంలో నెట్టుకురావడం ఒక అమ్మాయికి చాలా కష్టం. మనమేం చేసినా సరే కొందరు అదేపనిగా తిడుతూ ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోకపోవడమే మేలు. మనమేంటనేది ఎవరికీ నిరూపించుకోవాల్సిన పని లేదు. కుక్కలను మొరగనివ్వండి.. కుక్కలను అలాగే మొరగనివ్వండి. వాళ్ల మనసులు కుళ్లుకుతంత్రాలతో ఎంత మురికిగా మారిందో వాళ్లకే తెలుసు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీ ఆశయాలపై ఫోకస్ చేయండి. స్వతంత్రంగా జీవించండి. పురుషాహంకారంతో విర్రవీగే వాళ్లముందు బాస్ లేడీగా ధైర్యంగా నిలబడండి. మీరు అందుకునే విజయాలతో వాళ్ల ఆలోచన తప్పని వారికే అర్థమయ్యేలా చేయండి. ఒంటరిగా తనకాళ్లపై తను నిలబడి బతుకుతున్న ప్రతి మహిళకు ఈ పాజిటివ్ వైబ్స్ అందిస్తున్నాను' అని రాసుకొచ్చింది. దీనికి తన కొత్త కారు వీడియోను జత చేసింది. మూడేళ్ల కష్టార్జితం ఇది చూసిన కొందరు.. భర్తను వదిలేసి జల్సా చేస్తున్నావా? నువ్వేదో రోల్స్ రాయిస్ కారు కొన్నట్లు బిల్డప్ ఇస్తున్నావే అని కామెంట్లు చేశారు. దీనికి సంయుత స్పందిస్తూ.. 'నేను మూడేళ్లు కష్టపడి మొదటిసారి ఓ కారు కొన్నాను. ఇది మిగతావారికి గొప్ప విషయం కాదేమో కానీ నాకు మాత్రం అద్భుతమైనదే! అయినా నీ పని నువ్వు చేసుకోకుండా ఇలాంటి చెత్త కామెంట్లు పెట్టడం నీకవసరమా?' అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Samyutha (@samyutha.official) View this post on Instagram A post shared by Samyutha (@samyutha.official) చదవండి: చంద్రయాన్ విజయంపై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ హీరోయిన్ -
సంయుక్త కోసం బుట్టబొమ్మకి హ్యాండ్ ఇచ్చిన త్రివిక్రమ్ ?
-
బెడ్రూమ్లో కెమెరా.. నన్ను టార్చర్ పెట్టాడు: మాజీ భర్తపై నటి ఆరోపణలు
కోలీవుడ్ బుల్లితెర జంట సంయుక్త- విష్ణుకాంత్‌ల పెళ్లి మూన్నాళ్ల ముచ్చటే అయింది. ప్రేమించి, పెద్దలను ఒప్పించి వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు వేసిన వీరిద్దరూ రెండు నెలలకే విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. అప్పటినుంచి వీరు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. మొదట విష్ణుకాంత్.. సంయుక్త తన మాజీ ప్రియుడిని ఇంకా మర్చిపోలేదని, తనకు గతంలో ఒక లవ్ స్టోరీ ఉందన్న విషయాన్ని కూడా చెప్పలేదంటూ ఆమెకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ లీక్ చేశాడు. అది నెట్టింట వైరల్ అవడంతో పలువురూ సంయుక్తను తిట్టిపోశారు. ఈ క్రమంలో తానే తప్పూ చేయలేదని, విష్ణుకాంతే తనకు నరకం చూపించేవాడని ఆరోపించింది నటి. శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. అడల్ట్ వీడియోలు చూడమని బలవంతం చేసేవాడని, తనతో హింసాత్మకంగా ప్రవర్తించేవాడంది. బెడ్రూమ్లో కెమెరా పెట్టి అన్నింటినీ రికార్డు చేయడానికి ప్రయత్నిస్తే తాను వ్యతిరేకించానని చెప్పుకొచ్చింది. తనను భార్యగా కాకుండా వ్యభిచారిలా చూశాడని కన్నీళ్లు పెట్టుకుంది. తనకు అలర్జీ వచ్చినప్పుడు ఆస్పత్రికి వెళ్తానంటే అంగీకరించలేదని, అప్పుడు ఎంతో బాధేసిందని ఆవేదన వ్యక్తం చేసింది సంయుక్త. అయితే సంయుక్త ఆరోపణలను విష్ణుకాంత్ తిప్పికొట్టాడు. 'ఆమె ఇప్పటికీ తన తప్పు ఒప్పుకోవడం లేదు. తనను తాను రక్షించుకోవడానికి నా మీద నిందలు మోపుతోంది. తను చెప్పేది నిజమైతే అందుకు తగ్గ సాక్ష్యాలు చూపించాలిగా. నేను శారీరకంగా, లైంగికంగా టార్చర్ పెట్టానంటోంది. మరి చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తుందిగా! సంయుక్త చెపుతోందంతా అబద్ధం. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నా ప్రతిష్టను దిగజార్చేందుకే ఆమె ఇదంతా చేస్తోంది. సాక్ష్యాధారాలు లేకుండా ఆమె చెప్పే మాటలను ఎవరూ నమ్మకండి' అని కోరాడు. చదవండి: ఒక్క సినిమాతో ఫేమస్.. తల్లి కాబోతున్న నటి
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019