breaking news
-
స్టార్ హీరో ఇంటికెళ్లిన సీఎం.. !
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కలిశారు. కాల్పుల ఘటనపై ఆయనను కలిసి ఆరా తీశారు. సల్మాన్ ఖాన్ ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి భద్రతా గురించి అడిగి తెలుసుకున్నారు. ఫైరింగ్ ఘటనపై పోలీసుల తీసుకున్న చర్యలపై సల్మాన్‌తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈనెల 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కాల్పుల ఘటనలో విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా గుర్తించిన ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు జరిపింది తామేనని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. #WATCH | Mumbai: Maharashtra CM Eknath Shinde arrived at the residence of actor Salman Khan. pic.twitter.com/ncJUz4n6C9 — ANI (@ANI) April 16, 2024 #WATCH | Mumbai | Maharashtra CM Eknath Shinde met actor Salman Khan at his residence. Inside visuals from the residence. (Source: Eknath Shinde office) pic.twitter.com/lbMmfCOBNm — ANI (@ANI) April 16, 2024 -
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. ఇద్దరు అరెస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఏప్రిల్ 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్వాప్తులో వేగం పెంచారు. సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరగడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ కాల్పుల ఘటనలో విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా గుర్తించిన ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు తాజాగా వెళ్లడించారు. షూటర్లు ఇద్దరూ బీహార్‌లోని పశ్చిమ చంపారన్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. గతంలో వారిద్దరిపై చాలా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. నార్త్ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో దొంగతనాలు కూడా చేసినట్లు ఆధారాలు లభ్యమైనట్లు తెలిపారు. దొంగతనాలు చేస్తున్న క్రమంలో హత్యలు కూడా చేసి ఉండవచ్చు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఏప్రిల్ 14న కాల్పులు జరిగిన తర్వాత సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ గార్డు వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పదికి పైగా టీమ్‌లుగా విడిపోయి కేసును ఛేదించారు. వారిద్దరిని విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెళ్లడిస్తామని వారు తెలిపారు. -
కాల్పులు జరిపింది మేమే అంటూ సల్మాన్ ఖాన్‌కు వార్నింగ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఆదివారం (ఏప్రిల్ 14) ఉదయం కాల్పులు జరిగాయి. ముంబయిలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయారు. కాల్పులు జరిగిన ఘటనలో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆదివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారికి సమాచారం అందినట్లు వెళ్లడించారు. సీసీటీవీ పుటేజీ ద్వారా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంతలోపు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడు జరిగింది ట్రైలర్ మాత్రమేనని అందులో ఉంది. 'ఈ కాల్పులతో మా బలం ఏంటో నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇది నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాం. ఈసారి మాత్రం తుపాకీ పేలుడు ఇంటి బయటే ఆగిపోదని గుర్తుపెట్టుకో. తప్పకుండా మా టార్గెట్ రీచ్ అవుతాం.' అని అందులో రాసి ఉంది. దీనికి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సల్మాన్ ఖాన్ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న ఒక బైక్‌ను పోలీసులు తాజాగా స్వాధీనం చేసుకున్నారు. దీనిని కాల్పులు జరిపిన దుండగులు వాడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సల్మాన్ ఖాన్‌కు ఇలాంటి బెదిరింపులు ఇప్పటికే పలుమార్లు వచ్చాయి. గతంలో ఈమెయిల్స్ ద్వారా ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో గొడవేంటి..? ఈ గ్యాంగ్స్టర్స్ నుంచి సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు రావడం ఇది తొలిసారేం కాదు. ఇప్పటికే చాలాసార్లు వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌పై విచారణ జరుగుతున్న సమయంలో వారి నుంచి ఎక్కువగానే వార్నింగ్‌లు వచ్చాయి. ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ఖాన్ దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ వారు మాత్రం ఆయనపై రివేంజ్ తీర్చుకోవాలని ఉన్నారు. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన బిష్ణోయ్ ఢిల్లీ జైలులో ఉన్నాడు. दाउद इब्राहीम और छोटा शकील के नाम के हमने दो कुत्ते पाल रखे हैं - अनमोल विश्नोई (लॉरेंस के भाई का पोस्ट)#LawrenceBishnoi #DawoodIbrahim #SalmanKhan #AnmolBishnoi #ChotaShakeel #BJPManifesto pic.twitter.com/oj2sTHRlK8 — Nisha A (Modi's family) (@matribhumi1st) April 14, 2024 -
ఇండస్ట్రీలో కలకలం.. సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిముందు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు బాంద్రాలోని సల్మాన్ ఇంటివద్ద కొందరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. ద్విచక్రవాహనపై వచ్చిన అగంతకులు రెండు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ముంబై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. గతంలో గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. తాజాగా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటివద్ద మరింత భద్రతను పెంచారు. కాగా.. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టాప్ టెన్ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నారని గతేడాది ఎన్ఐఏ హెచ్చరించిన సంగతి తెలిసిందే. #WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan's residence in Bandra where two unidentified men opened fire this morning. Police and forensic team present on the spot. pic.twitter.com/fVXgHzEW0J — ANI (@ANI) April 14, 2024 -
పైసా సంపాదన లేదు.. అయినా సల్మాన్ చెల్లితో పెళ్లి చేశారు!
బాలీవుడ్‌లోని బడా కోటీశ్వరుల్లో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. ఎప్పుడూ సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడే ఇతడికి వేలకోట్ల ఆస్తులున్నాయి. కానీ అతడి చెల్లి అర్పితఖాన్కు పెళ్లి చేసేటప్పుడు మాత్రం బావ సంపాదిస్తున్నాడా? లేదా? అని కూడా చూసుకోలేదు. చెల్లిని గుండెలో పెట్టి చూసుకుంటే చాలనుకున్నాడు. అలా లవ్ బర్డ్స్ అర్పిత ఖాన్, ఆయుశ్ శర్మ పెద్దలను ఒప్పించి 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు. అమ్మాయిని ఎలా పోషిస్తావు? అయితే అర్పితను పెళ్లాడే సమయానికి ఆయుశ్ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'నేను అర్పితను ప్రేమిస్తున్నానని చెప్పగానే అమ్మానాన్న షాకయ్యారు. నువ్వు ఏ పనీ చేయడం లేదు.. పైసా సంపాదించట్లేదు.. పెళ్లికి మాత్రం సిద్ధమయ్యావు. పైగా ఆమె ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. మరి పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావు? అని అడిగారు. నేనేం పోషించను.. అంతా మీరే చూసుకోవాలని చెప్పాను. అమ్మ తెగ కంగారు ప్రేమలో పడింది నువ్వు, పెళ్లి చేసుకునేది నువ్వు.. కానీ మీ బిల్లులు మాత్రం నేను కట్టాలా? అని నాన్న చిన్నగా కోప్పడ్డాడు. తర్వాత ఆయన రిలాక్స్ అయ్యాడు కానీ అమ్మ మాత్రం తెగ కంగారుపడిపోయింది. ఎందుకంటే నాదేమో పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ (కాంగ్రెస్ కీలక నేత పండిత్ సుఖ్ రామ్ మనవడే ఆయుశ్).. తనదేమో సినిమా బ్యాక్‌గ్రౌండ్. ఎలాగోలా వారిని ఒప్పించి సల్మాన్ ఖాన్ ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేశాను. కంగారు పడొద్దని సల్మాన్ భరోసా అప్పుడు నాన్న.. 'మేమంతా హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో నివసిస్తాం.. ఒకవేళ తప్పని పరిస్థితులు ఎదురైతే నువ్వు అక్కడికి రాగలవా?' అని అర్పితను అడిగాడు.. అందుకు సల్మాన్.. ఆయుశ్ ఎక్కడంటే అర్పిత అక్కడే ఉంటుంది. ఈ విషయంలో మీరేం కంగారుపడకండి అని భరోసా ఇచ్చాడు' అని తెలిపాడు. ఆయుశ్-అర్పిత జంటకు అయత్ అనే కూతురు, అఖిల్ శర్మ అనే కుమారుడు సంతానం. చదవండి: ఎంతగానో ప్రేమిస్తే.. నన్ను మోసం చేశాడు.. ప్రతిరోజూ ఏడుపే!
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019