breaking news
-
ముంబై విజయంలో అదే హైలైట్.. సచిన్ ట్వీట్ వైరల్
ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ పరాజయాల అనంతరం ముంబై ఇండియన్స్ కోలుకున్న తీరుపై ఆ జట్టు మెంటార్ సచిన్ టెండుల్కర్ హర్షం వ్యక్తం చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్‌లో సమిష్టి రాణించి గెలుపొందిన తీరు అమోఘమని కొనియాడాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా సంచలన ప్రదర్శన కనబరిచాడన్న సచిన్.. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడైన షాట్లతో విరుచుకుపడ్డారని ప్రశంసించాడు. ఇక గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ బాల్‌ను హిట్ చేస్తున్న తీరు చూసి ముచ్చటేసిందని ఈ టీమిండియా దిగ్గజం ‘స్కై’ని ఆకాశానికెత్తాడు. 𝘼 𝙎𝙆𝙔 𝙛𝙪𝙡𝙡 𝙤𝙛 s̶t̶a̶r̶s̶ 𝙨𝙞𝙭𝙚𝙨 🤩#MIvRCB #TATAIPL #IPLonJioCinema #IPLinMarathi pic.twitter.com/WUlm5lJPzL — JioCinema (@JioCinema) April 11, 2024 అదే విధంగా ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించడం కన్నుల పండుగ చేసిందని సచిన్ టెండుల్కర్ ముంబై ఇండియన్స్ సారథిపై ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు.. ‘‘వరుస ఓటముల తర్వాత.. వరుసగా రెండు విజయాలు.. జస్ప్రీత్ బుమ్రా మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ పవర్ ప్లేలో ఏమాత్రం భయపడకుండా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి గొప్ప ఆరంభం అందించారు. ఇక సూర్యకుమార్ యాదవ్ గాయం తర్వాత తిరిగి వచ్చి ఈ విధంగా హిట్టింగ్ చేయడం సంతోషాన్నిచ్చింది. హార్దిక్ పాండ్యా మ్యాచ్‌ను ఫినిష్ చేసిన తీరు అన్నిటికంటే మరింత గొప్పగా అనిపించింది’’ అని సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేయగా సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. కాగా వాంఖడే ఆర్సీబీతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రధాన పేసర్,‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బుమ్రా(5/21) ఐదు వికెట్లతో చెలరేగగా.. గెరాల్డ్ కోయెట్జీ, ఆకాశ్ మధ్వాల్, శ్రేయస్ గోపాల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అయితే, మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించిన నేపథ్యంలో.. పరిస్థితులకు తగ్గట్లుగా ముంబై బ్యాటర్లు బ్యాట్ ఝులిపించారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 34 బంతుల్లోనే 69, రోహిత్ శర్మ 24 బంతుల్లో 38 పరుగులతో దంచికొట్టారు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్ పవరేంటో చూపించాడు. కేవలం 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులతో దుమ్ములేపాడు. ఇక హార్దిక్ పాండ్యా కేవలం ఆరు బంతుల్లోనే 21 పరుగులతో అదరగొట్టాడు. స్ట్రైక్‌రేటు 350గా నమోదు చేసిన ఈ ఆల్‌రౌండర్ సిక్స్ బాది ముంబైని విజయతీరాలకు చేర్చాడు. తిలక్ వర్మ 10 బంతుల్లో 16 రన్స్ చేసి పాండ్యాతో కలిసి ఆఖరి వరకు అజేయంగా ఉన్నాడు. A @Jaspritbumrah93 special with the ball backed 🆙 by a power packed batting performance help @mipaltan win ✌ in ✌ 💙 Scorecard ▶️ https://t.co/Xzvt86cbvi#TATAIPL | #MIvRCB pic.twitter.com/ro7TeupAQj — IndianPremierLeague (@IPL) April 11, 2024 ఫలితంగా 15.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి ముంబై లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఐపీఎల్-2024లో ముంబైకి ఇది రెండో గెలుపు. తొలి మూడు మ్యాచ్‌లలో ఓడిన పాండ్యా సేన.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో బోణీ కొట్టిన విషయం తెలిసిందే. చదవండి: Jasprit Bumrah: కెనడా క్రికెట్ జట్టులో చేరాలనుకున్న బుమ్రా.. సంచలన విషయం వెల్లడి 𝗜𝗡 comes Hardik Pandya, and 𝗢𝗨𝗧 goes the ball 💫#MIvRCB #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/ufHR4tyY2u — JioCinema (@JioCinema) April 11, 2024 Two wins on the trot now for @mipaltan after a tricky start to the tournament. @Jaspritbumrah93 was sensational, once again proving why he's the best in the business. @ImRo45 and @ishankishan51's fearless batting during the powerplay overs effectively reduced the required run… pic.twitter.com/khxtvuEVAJ — Sachin Tendulkar (@sachin_rt) April 11, 2024 -
సచిన్ షాట్‌ను కాపీ కొట్టిన శుబ్‌మన్ గిల్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మరోసారి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బుధవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 పరుగులు చేశాడు. అయితే గిల్ తన ఇన్నింగ్స్‌లో కొట్టిన ఓ షాట్ మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచాడు. గిల్ తన షాట్‌తో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను గుర్తు చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన అవేష్ ఖాన్ బౌలింగ్‌లో నాలుగో బంతిని శుబ్‌మన్ అద్భుతమైన ఆన్-డ్రైవ్ షాట్ ఆడి సిక్స్‌గా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్ వాట్‌ఏ షాట్ అంటూ కామెట్లు చేస్తున్నారు. కాగా 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఈ తరహా షాట్లతో అభిమానులతో అలరించాడు. అనాటి మ్యాచ్‌లో సచిన్ విధ్వంసం సృష్టించాడు. సచిన్ 131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో ఏకంగా 143 పరుగులు చేశాడు. pic.twitter.com/a5MwVJaChL — Sitaraman (@Sitaraman112971) April 10, 2024 -
'సచిన్, లారా కాదు.. నా లైఫ్‌లో నేను చూసిన బెస్ట్ ప్లేయర్ అతడే'
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లు మూడింట విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. అయితే లక్నో విజయాల వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉంది. అతడే లక్నో హెడ్ కోచ్, ఆసీస్ లెజెండరీ క్రికెటర్ జస్టిన్ లాంగర్. ఈ ఏడాది సీజన్‌తో లక్నో హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన లాంగర్ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అయితే లాంగర్ తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన లైఫ్‌లో చూసిన అద్బుతమైన క్రికెటర్లు గురించి లాంగర్ చర్చించాడు. "ఇప్పటివరకు నా జీవితంలో నేను చూసిన బెస్ట్ ఆటగాడు విరాట్ కోహ్లినే. ఈ విషయాన్ని నేను ఇప్పటికే చాలా సార్లు పబ్లిక్‌గా చెప్పాను. నాకు లెజండరీ క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, అలన్ బోర్డర్, మార్టిన్ క్రోవ్‌లు అంటే కూడా నాకు ఇష్టం. మార్టిన్ క్రోవ్‌కు ప్రత్యర్ధిగా కూడా నేను ఆడాను. అదేవిధంగా బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్ కూడా గొప్ప ఆటగాళ్లు. కానీ విరాట్ ఎనర్జీ వీరిందరి కంటే అద్భుతం. అతడు చాలా ఫిట్‌గా ఉన్నాడు. విరాట్ మైదానంలో వికెట్ల మధ్య పరిగెత్తడం, ఫీల్డింగ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. కాబట్టి అతని ఆట చూడటం నాకు చాలా ఇష్టం. మాతో మ్యాచ్‌లో కోహ్లిని తొందరగా ఔట్ చేయడం ఔట్ చేయడం చాలా సంతోషంగా అన్పించిందని" లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూలో లాంగర్ పేర్కొన్నాడు. -
బుల్లి క్రికెట్ స్టార్ సంచలనం : స్టైలిష్ బ్యాటింగ్‌తో సచిన్ ఫిదా
క్రికెట్‌పై అమ్మాయిలు చూపిస్తున్న ఆసక్తి మహిళా క్రికెట్‌పై ఆశల్ని మరింత పెంచుతోంది. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ క్రికెట్ మహిళలు స్టార్లుగా సత్తా చాటుతున్న నేపథ్యంలో తాజాగా ఒక సంచలన తార అవతరించడం విశేషంగా నిలిచింది. తొమ్మిదేళ్లకే అత్యుత్తమ ప్రతిభతో ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. దిగ్గజాలను సైతం అబ్బుర పరుస్తోంది.Always good to see young girls playing cricket. Watching videos like these brings a smile to my face. https://t.co/LaQv9ymWRx— Sachin Tendulkar (@sachin_rt) March 30, 2024 ఎడమచేతితో బ్యాటింగ్ చేస్తూ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను ఆకట్టుకునే స్టైలిష్ బ్యాట్ స్వింగ్‌తో మైదానం నలుమూలలకు బంతిని పరుగులు పెట్టించింది. గొప్ప క్రికెటర్‌గా రాణించాలని కలలు కంటోంది. కశ్మీర్‌లోని సోపోర్‌కు చెందిన తొమ్మిదేళ్ల బాలిక హర్మత్ ఇర్షాద్ భట్. సాధారణ డ్రైవర్ కుమార్తె. బుమై (జైంగీర్)లో రెండో తరగతి చదువుతోంది. ఇటీవల ప్లేగ్రౌండ్‌లో అబ్బాయిల టీంతో ఆడుతూ షాట్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ఆమె లాంటి పిల్లలు క్రికెట్‌ను ఆస్వాదించడం చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈవీడియోను రీ-ట్వీట్ చేశాడు. యువత ఆడటం క్రికెట్ ఆడటం చూడటం తనకు చాలా సంతోషానిస్తోందంటూ టూ ట్వీట్‌చేశారు. దీంతో మరింత వైరల్ అయింది. పలువురు ఆమె టాటెంట్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
నేను 22 ఏళ్లు ఎదురుచూశా.. నువ్వు ఆ మాత్రం వెయిట్ చేయలేవా?
సచిన్ టెండుల్కర్.. ఇరవై నాలుగేళ్ల సుదీర్ఘ కెరీర్లో అరుదైన ఘనతలెన్నో సాధించి క్రికెట్ దేవుడిగా నేటికీ నీరాజనాలు అందుకుంటున్నాడు. నభూతో న భవిష్యతి అన్న రీతిలో అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా వంద సెంచరీలు సాధించి శిఖరాగ్రాన నిలిచాడు. అయితే, సచిన్ వ్యక్తిగతంగా లెక్కకు మిక్కిలి రికార్డులు కొల్లగొట్టినా ఒక్కటంటే ఒక్క వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడటానికి 22 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తాను భాగమైన భారత జట్టు 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంతో సచిన్ టెండుల్కర్ చిరకాల కల నెరవేరింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సచిన్ టెండుల్కర్ అప్పట్లో తనలో స్ఫూర్తిని నింపాడంటూ తాజాగా గుర్తుచేసుకున్నాడు.. నాటి అరంగేట్ర, ‘యువ’ బౌలర్. ‘‘ఆరోజు మేము వాంఖడే స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నాం. వికెట్ ఫ్లాట్‌గా ఉంది. వెస్టిండీస్ స్కోరు అప్పటి బహుశా 500/4 అనుకుంటా. నాలో.. వికెట్ తీయలేకపోతున్నాననే అసహనం పెరిగిపోతోంది. అప్పటికి నా వయసు 21 ఏళ్లు. ఇరవై ఒక్క ఓవర్ల పాటు వికెట్ తీయలేకపోవడం అదే మొదటిసారి. ఆ సమయంలో సచిన్ టెండుల్కర్ మిడాఫ్‌లో తన ఫీల్డింగ్ పొజిషన్లో నిలబడి ఉన్నాడు. నన్ను చూసి... ‘ఏమైంది అలా ఉన్నావు? ఎందుకంత నిరాశ?’ అని అడిగాడు. అందుకు బదులిస్తూ.. ‘పాజజీ.. నా బౌలింగ్‌లో ఇప్పటివరకు 21 ఓవర్లు అయినా వికెట్ తీయకపోవడం ఇదే తొలిసారి తెలుసా?.. అలాంటిది అరంగేట్రంలో ఇలా జరుగుతుందని అనుకోలేదు’ అని వాపోయాను. అప్పుడు వెంటనే.. ఓవర్ మధ్యలోనే.. నన్ను తన దగ్గరికి రమ్మని పిలిచి.. ‘నీకు తెలుసా.. నేను తొలి వరల్డ్‌కప్ అందుకోవడానికి 22 ఏళ్ల పాటు ఎదురుచూశాను. మరి నువ్వు నీ తొలి వికెట్ కోసం కనీసం 21 ఓవర్లపాటు వెయిట్ చేయలేవా? అంతగా నిరాశపడొద్దు. గతంలో ఏం జరిగిందన్నది అప్రస్తుతం. ఇప్పుడు ఏం చేయగలవో ఆలోచించు’ అన్నాడు. అవును.. కదా పాజీ చెప్పింది నిజమే కదా అనిపించింది. ఆ మరుసటి బంతికే నేను డారెన్ బ్రావో(166)ను అవుట్ చేసి తొలి వికెట్ అందుకున్నా. ఆ తర్వాత కార్ల్టన్, డారెన్ సామీ వికెట్లు తీశాను. నా అరంగేట్రం అలా ప్రత్యేకంగా మారిపోయింది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. ఈ మేరకు.. బీసీసీఐ ఇంటర్వ్యూలో తన మనసులోని భావాలు పంచుకుంటూ.. మన ఆలోచనా విధానాన్ని, అంతకు ముందున్న పరిస్థితులను మార్చడానికి ఒక్క మాట చాలని తనకు ఆరోజు తెలిసిందన్నాడు. సచిన్ టెండుల్కర్ చెప్పిన ఆ స్పూర్తిదాయక మాటలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని పేర్కొన్నాడు. ఇంతకీ ఆ బౌలర్ పేరు చెప్పలేదు కదూ! వరుణ్ ఆరోన్.. జంషెడ్‌పూర్‌కు చెందిన 34 ఏళ్ల రైటార్మ్ పేసర్. 2011లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 9 టెస్టులు, 9 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో 18, 11 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2024: అరంగేట్రంలో అదరగొట్టేందుకు!.. అందరి కళ్లు అతడిపైనే..
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019