breaking news
Ad - Sakshi_Home_Sticky
-
టీ20 వరల్డ్‌కప్‌లో ఓపెనర్లగా కోహ్లి, రోహిత్.. జైశ్వాల్‌కు నో ఛాన్స్?
టీ20 వరల్డ్‌కప్-2024కు మరో 54 రోజుల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్నాయి. జూన్ 2న డల్లాస్ వేదికగా యూనైటడ్ స్టేట్స్, కెనడా మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ పొట్టి ప్రపంచకప్ షురూ కానుంది. అయితే ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను మే1 లోపు ప్రకటించాలని ఐసీసీ ఆయా జట్లకు ఇప్పటికే డెడ్‌లైన్ విధించింది. దీంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డుల తమ జట్లను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కూడా ఈ మెగా ఈవెంట్‌కు పంపే తమ జట్టును సిద్దం చేసే పనిలో పడింది. అయితే తొలుత 20 మంది సభ్యులతో కూడిన ప్రిలిమనరీ జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో నుంచి మే 25లోపు 15 మంది సభ్యుల పేర్లను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ షార్ట్ లిస్ట్ చేయనున్నట్లు సమాచారం. రియాన్ పరాగ్‌కు ఛాన్స్.. అయితే ఐపీఎల్-2024లో దుమ్ములేపుతున్న రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు రియాన్ పరాగ్‌కు టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. మిడిలార్డర్లో అద్బుతంగా రాణిస్తుండడంతో పరాగ్ పేరును సెలక్టర్లు పరిశీలిస్తున్నట్లు వినికిడి. పరాగ్ ప్రస్తుతం తన కెరీర్లోనే అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రాజస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన పరాగ్.. 63.60 సగటుతో 318 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 వరల్డ్‌కప్‌లో భారత ఇన్నింగ్స్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ప్రారంభించనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో శుబ్‌మన్ గిల్‌ను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేసి.. మరో యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్‌ను రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో ఉంచాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కాగా ఐపీఎల్-2024లో జైశ్వాల్ దారుణ ప్రదర్శన కనబరిస్తున్నాడు. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన జైశ్వాల్17.29 సగటుతో 121 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలోనే అతడిపై వేటు వేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ క్యాష్ రిచ్‌లీగ్‌లో అదరగొడుతున్న సీఎస్కే ఆల్‌రౌండర్ శివమ్ దూబేకు సైతం వరల్డ్‌కప్‌లో చోటు దక్కే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మెగా ఈవెంట్‌కు భారత జట్టను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఏప్రిల్ 30న ప్రకటించే అవకాశముంది. -
T20 WC: దుమ్ములేపుతున్నాడు.. సెలక్టర్లు అతడిని గుర్తుంచుకోవాలి!
ఐపీఎల్-2024 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లు పూర్తి కాగా.. రాజస్తాన్ రాయల్స్ ఐదింట నాలుగు విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ పాత కథనే పునరావృతం చేస్తూ ఐదింటి నాలుగు పరాజయాలతో ప్రస్తుతం అట్టడుగున పదో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. క్యాష్ రిచ్ లీగ్ తాజా ఎడిషన్ పూర్తైన దాదాపు ఐదు రోజుల వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్-2024 ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ పదిహేడో సీజన్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా ఎంపిక జరుగనుందన్న నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాటల్లో వరుస హాఫ్ సెంచరీలు బాదుతున్న యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్‌ను గుర్తుపెట్టుకోవాలని సెలక్టర్లకు సూచించాడు. కాగా అసోం ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో గత 15 ఇన్నింగ్స్‌లో పరాగ్ ఏకంగా 170.7 స్ట్రైక్‌రేటుతో 771 పరుగులు సాధించాడు. 15 ఇన్నింగ్స్‌లో పది హాఫ్ సెంచరీలు వరుసగా 45 (19), 61(34), 76*(37), 53*(29), 77(39), 72(36), 57*(33), 50*(31), 12(10), 8(10), 43(29), 84*(45), 54*(39), 4(4), 76(48) పరుగులు స్కోరు చేశాడు. ఇందులో ఏకంగా పది హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘అతడిపై సెలక్షన్ కమిటీ ఓ కన్నేసి ఉంచాలి. ఇక అతడేమో తన పనిని ఇలాగే చేసుకుపోతూ ఉంటే మంచిది’’ అని రియాన్ పరాగ్ మున్ముందు కూడా ఇలాగే దూసుకుపోవాలని ఆకాంక్షించాడు. అసోం తరఫున దేశవాళీ క్రికెట్లో కాగా అసోంలోని గువాహటిలో 2001లో జన్మించిన రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ హిట్టింగ్‌లో దిట్ట. అలాగే రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ కూడా! ఇక దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో రాణిస్తున్న రియాన్ పరాగ్ ఇంత వరకు టీమిండియాకు సెలక్ట్ కాలేదు. రాజస్తాన్ తరఫున దుమ్ములేపుతూ అయితే, ఐపీఎల్-2024లో మాత్రం అతడి ప్రదర్శన సెలక్టర్లను ఆకర్షించేలా ఉంది. రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 261 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం రియాన్ పరాగ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లోనూ పరాగ్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌ల సాయంతో 76 పరుగులు సాధించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ గుజరాత్ చేతిలో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. Caution ⚠ It's Riyan Parag demolition on display 🔥💥#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/dzKuPfTS0Q — JioCinema (@JioCinema) April 10, 2024 చదవండి: సంజూ శాంసన్‌కు భారీ జరిమానా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రాయల్స్‌కు టైటాన్స్ షాక్
197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ తడబడుతూనే సాగింది... చివర్లో 4 ఓవర్లలో 59 పరుగులు చేయాల్సిన దశలో గెలుపు అసాధ్యంగా అనిపించింది. కానీ తర్వాతి నాలుగు ఓవర్లలో వరుసగా 17, 7, 20, 17 పరుగులు సాధించిన టైటాన్స్ అనూహ్య విజయాన్ని అందుకుంది. అప్పటి వరకు నియంత్రణతో బౌలింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ పేలవ బౌలింగ్, వ్యూహ వైఫల్యంతో చేజేతులా మ్యాచ్‌ను కోల్పోయి ఈ సీజన్లో తొలి ఓటమిని ఎదుర్కొంది. జైపూర్: వరుస విజయాలతో అజేయంగా దూసుకుపోతున్న రాజస్తాన్ రాయల్స్‌కు బ్రేక్ పడింది. బుధవారం జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో రాయల్స్‌పై గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), సామ్సన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (44 బంతుల్లో 72; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, సాయి సుదర్శన్ (29 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టైటాన్స్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. శతక భాగస్వామ్యం... గత మూడు మ్యాచ్‌లలో వైఫల్యాల తర్వాత ఈసారి యశస్వి (19 బంతుల్లో 24; 5 ఫోర్లు) కాస్త మెరుగైన ప్రదర్శన కనబర్చగా, గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన బట్లర్ (8) విఫలమయ్యాడు. పవర్‌ప్లేలో రాజస్తాన్ 43 పరుగులే చేయగా... ఈ దశ నుంచి సామ్సన్, పరాగ్ భారీ భాగస్వామ్యం రాయల్స్‌ను పటిష్ట స్థితికి చేర్చింది. ఇద్దరూ వేగంగా పరుగులు సాధించారు. పరాగ్ 34 బంతుల్లో, సామ్సన్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నారు. ఎట్టకేలకు 19వ ఓవర్లో పరాగ్‌ను అవుట్ చేసి మోహిత్ ఈ జోడీని విడదీశాడు. అయితే ఉమేశ్ వేసిన చివరి ఓవర్లో సామ్సన్, హెట్‌మైర్ (13 నాటౌట్) చెరో సిక్స్ బాదడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. గిల్ కెప్టెన్ఇన్నింగ్స్... భారీ ఛేదనలో టైటాన్స్‌కు సుదర్శన్, శుబ్‌మన్ గిల్ దూకుడైన ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించినా... అందుకు 50 బంతులు తీసుకున్నారు. రాయల్స్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో వీరి పరుగుల వేగాన్ని నిరోధించింది. బౌల్ట్ తొలి 2 ఓవర్లలో 8 పరుగులే ఇవ్వగా... అవేశ్ బౌలింగ్‌లో 14 పరుగులు రాబట్టడంతో టైటాన్స్ స్కోరు పవర్‌ప్లే ముగిసే సరికి 44 పరుగులకు చేరింది. అయితే కుల్దీప్ సేన్ ఒక్కసారిగా గుజరాత్‌ను దెబ్బ తీశాడు. తన బౌలింగ్‌లో 6 పరుగుల వ్యవధిలో అతను సుదర్శన్, వేడ్ (4), మనోహర్ (1)లను వెనక్కి పంపించాడు. ఈ దశలో కెపె్టన్ గిల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 35 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయ్ శంకర్ (16) ప్రభావం చూపలేకపోగా... 28 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన స్థితిలో గిల్ వెనుదిరగడంతో టైటాన్స్ ఆశలు సన్నగిల్లాయి. అయితే కీలక సమయంలో రషీద్ ఖాన్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు), రాహుల్ తెవాటియా (11 బంతుల్లో 22; 3 ఫోర్లు) ఆట జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వేడ్ (బి) ఉమేశ్ 24; బట్లర్ (సి) తెవాటియా (బి) రషీద్ 8; సామ్సన్ (నాటౌట్) 68; పరాగ్ (సి) శంకర్ (బి) మోహిత్ 76; హెట్‌మైర్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–32, 2–42, 3–172. బౌలింగ్: ఉమేశ్ 4–0–47–1, జాన్సన్ 4–0–37–0, రషీద్ 4–0–18–1, నూర్ 4–0–43–0, మోహిత్ 4–0–51–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సుదర్శన్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 35; గిల్ (స్టంప్డ్) సామ్సన్ (బి) చహల్ 72; వేడ్ (బి) కుల్దీప్ 4; మనోహర్ (బి) కుల్దీప్ 1; విజయ్ శంకర్ (బి) చహల్ 16; తెవాటియా (రనౌట్) 22; షారుఖ్ (ఎల్బీ) (బి) అవేశ్ 14; రషీద్ ఖాన్ (నాటౌట్) 24; నూర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–64, 2–77, 3–79, 4–111, 5–133, 6–157, 7–195. బౌలింగ్: బౌల్ట్ 2–0–8–0, అవేశ్ 4–0–48–1, మహరాజ్ 2–0–16–0, అశి్వన్ 4–0–40–0, చహల్ 4–0–43–2, కుల్దీప్ సేన్ 4–0–41–3. ఐపీఎల్లో నేడు ముంబై X బెంగళూరు వేదిక: ముంబై రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2024 RR VS GT: శివాలెత్తిన సంజూ శాంసన్
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ శివాలెత్తిపోయి మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 31 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సంజూ.. ప్రస్తుత సీజన్లో మూడో అర్దశతకాన్ని నమోదు చేశాడు. తొలుత లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో అజేయమైన 82 పరుగులు చేసిన సంజూ.. ఆతర్వాత ఆర్సీబీపై 42 బంతుల్లో 69.. తాజాగా గుజరాత్‌పై 38 బంతుల్లో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్లో భీకరఫామ్‌లో ఉన్న సంజూ.. 5 మ్యాచ్‌ల్లో 157.69 స్టయిక్‌రేట్‌తో 82 సగటున 246 పరుగులు చేసి, విరాట్ (316), రియాన్‌ల (261) తర్వాత సీజన్ మూడో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో సంజూతో పాటు రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. టార్గెట్ 197.. ఆచితూచి ఆడుతున్న గుజరాత్ రాజస్థాన్ నిర్దేశించిన 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆచితూచి ఆడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 30/0గా ఉంది. సాయి సుదర్శన్ (19), శుభ్‌మన్ గిల్ (11) క్రీజ్‌లో ఉన్నారు. -
పిచ్చెక్కించిన రియాన్ పరాగ్.. మరో సుడిగాలి ఇన్నింగ్స్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రియాన్ పరాగ్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో రియాన్ మూడో హాఫ్ సెంచరీతో మెరిశాడు. గుజరాత్‌తో ఇవాళ (ఏప్రిల్ 10) జరుగుతున్న మ్యాచ్‌లో రియాన్ 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో మెరుపు అర్దశతకం బాదాడు. రియాన్ హాఫ్ సెంచరీ మార్కును సిక్సర్‌తో అందుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 48 పరుగులు ఎదుర్కొన్న రియాన్.. 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. RIYAN PARAG ON FIRE IN IPL 2024. 🤯👌 pic.twitter.com/fincAlQBPh— Johns. (@CricCrazyJohns) April 10, 2024 ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రియాన్ చేసిన స్కోర్ల వివరాలు.. 43(29) vs LSG 84*(45) vs DC 54*(39) vs MI 4 (4) vs RCB 76 (48) vs GT ఈ సీజన్లో రియాన్ 5 మ్యాచ్‌ల్లో 158.18 స్ట్రయిక్‌రేట్‌తో 87 సగటున 261 పరుగులు చేసి విరాట్ కోహ్లి (316) తర్వాత సీజన్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రియాన్, సంజూ మెరుపులు.. రాజస్థాన్ భారీ స్కోర్ మ్యాచ్ విషయానికొస్తే.. రియాన్ పరాగ్‌తో పాటు సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపులు మెరిపించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019