breaking news
-
మరో 'గంగుభాయి కతియావాడి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న హిస్టారికల్ వెబ్ సిరీస్ హీరామండి: ది డైమండ్ బజార్. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బ్రిటీష్రాజ్కు వ్యతిరేకంగా భారత స్వాతంత్య్ర ఉద్యమం సమయంలో లాహోర్‌లోని హీరా మండిలోని రెడ్-లైట్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే స్వాతంత్ర్యానికి ముందు పాకిస్తాన్లో లాహోర్‌లోని వేశ్య గృహాల ఆధారంగా ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ హయాంలో వేశ్యల జీవితాలు ఎలా ఉంటుందో ట్రైలర్లో పరిచయం చేశారు. గతంలో సంజయ్ లీలా భన్సాలీ ఆలియా భట్‌తో ఇదే కాన్సెప్ట్‌తో గంగుభాయి కతియావాడి తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అదే తరహాలో హీరామండితో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సిరీస్ మే 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
డ్రోన్ షో ద్వారా ‘హీరమండి: ది డైమండ్ బజార్’ ప్రత్యేక విడుదల తేదీ (ఫొటోలు)
-
నటుడితో ప్రేమ పెళ్లి.. తల్లి కాబోతున్న హీరోయిన్!
బాలీవుడ్ భామ రిచా చద్దా బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది ఫర్కీ-3 సినిమాతో అభిమానులను అలరించింది. పంజాబ్‌కు చెందిన ముద్దుగుమ్మ ఓయ్ లక్కీ.. లక్కీ ఓయ్ అనే మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ హీరామండిలో కీలక పాత్రలో కనిపించనుంది. త్వరలోనే ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఫర్కీ నటుడు అలీ ఫైజల్‌తో ప్రేమాయణం కొనసాగించిన రిచా చద్దా(37) 2022లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా.. 2013లో ఫర్కీ సినిమా సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్న వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత పంజాబీ, లక్నో సంప్రదాయంలో ప్రీ-వెడ్డింగ్ వేడుకలను నిర్వహించారు. పెళ్లి తర్వాత సినీ ప్రముఖుల కోసం ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ తారలంతా హాజరయ్యారు. ఇక సినిమాల విషయాకొనిస్తే.. నెట్‌ఫ్లిక్స్ ఇండియా తెరకెక్కించిన ఒరిజినల్ షో కాల్ మై ఏజెంట్లో నటించారు. అంతే కాకుండా గర్ల్స్ విల్ బి గర్ల్స్ చిత్రంతో నిర్మాతలుగా మారారు. ఈ సినిమా సన్డాన్స్లో రెండు అవార్డులను గెలుచుకుంది. View this post on Instagram A post shared by ali fazal (@alifazal9) -
ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్‌బర్డ్స్
బాలీవుడ్ స్టార్ జంట రిచా చద్దా, అలీ ఫజల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సందర్బంగా ఒక ఇంట్రస్టింగ్ ఫోటోను షేర్ చేసింది రిచా. "1 + 1= 3" అంటూ శుక్రవారం ఇన్‌స్టాలో వెల్లడించింది. View this post on Instagram A post shared by ali fazal (@alifazal9) రిచా పోస్ట్‌కు భర్త అలీ ఫజల్ స్పందిస్తూ ‘ఆ చిన్న గుండె సడి తమకు ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప సవ్వడి’ అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో సన్నిహితులు, అభిమానులు ఈ జంటకు విషెస్ అందిస్తున్నారు. కాగా 2012లో ఫక్రే సెట్స్‌లో వీరిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసింది. ఏడేళ్ల డేటింగ్ తర్వాత అలీ 2019లో రిచా చద్దాకు ప్రపోజ్ చేశాడు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా 2020లో తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. రెండేళ్ల తరువాత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో 2022 అక్టోబర్ 6 న ప్రీ వెడ్డింగ్ వేడుకలతోపాటు ఘనంగా పెళ్లి చేసుకున్నారు. దాదాపు రెండేళ్ల తరువాత ఈ జంట తమ తొలిబిడ్డకు జన్మనివ్వబోతోంది. -
మీకంటే ఆమెనే ఎక్కువ.. అక్షయ్ కుమార్‌పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
బాలీవుడ్ నటి రిచా చద్దా ట్వీట్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ విమర్శలు, ప్రతి విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మంచు విష్ణు, నిఖిల్ సిద్ధార్థ, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆమె ట్వీట్‌ను తప్పబట్టారు. ఓ నెటిజన్ ట్వీట్‌కు ఇండియన్ ఆర్మీని ఉద్దేశిస్తూ ఆమె రిప్లై ఇవ్వడమే వివాదానికి ప్రధాన కారణం. 2020లో గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో మన సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. (చదవంండి: బాలీవుడ్ నటిపై హీరో నిఖిల్ ఆగ్రహం.. ఎందుకంటే?) అయితే తాజాగా సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ ఆమెకు మద్దతుగా నిలిచాడు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆమెను తప్పుపట్టడాన్ని ప్రకాశ్ రాజ్ ఖండించారు. ట్వీట్లో ఆయన రాస్తూ.. 'మీ నుంచి ఇలాంటి స్పందన ఊహించలేదు. మీకంటే ఎక్కువగా ఆమెనే మా దేశానికి సంబంధించినది. ఊరికేనే అడుగుతున్నా' అంటూ ట్వీట్ చేశారు. Didn’t expect this from you @akshaykumar ..having said that @RichaChadha is more relevant to our country than you sir. #justasking https://t.co/jAo5Sg6rQF — Prakash Raj (@prakashraaj) November 25, 2022
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019