breaking news
-
సంచలన నిర్ణయం.. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ వెనక్కు
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం రొమరియో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించాడు. స్థానిక టోర్నీలో ఉనికి కోల్పోయిన తన క్లబ్‌కు (అమెరికా ఆఫ్ రియో డి జనైరో) ఊపు తెప్పించేందుకు తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఇదే క్లబ్‌కు రొమారియో కుమారుడు రొమారిన్హో (30) కూడా ప్రాతినిథ్యం వహిస్తుండటం ఆసక్తికరం. బ్రెజిల్ బేస్డ్ ఫుట్‌బాల్ క్లబ్ అయిన అమెరికా ఆఫ్ రియో డి జనైరోకు రొమారియో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. 80, 90 దశకాల్లో స్టార్ స్ట్రయికర్‌గా పేరొందిన రొమారియో 15 ఏళ్ల కిందట (2008) ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆతర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సెనేటర్‌గా పలు మార్లు ఎన్నికయ్యాడు. రొమారియో 1994 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులో (బ్రెజిల్) కీలక సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుతం రొమారియో సెనేటర్‌గా ఉంటూనే తన క్లబ్‌ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్న విషయాన్ని రొమారియో ఇన్‌స్టా ద్వారా వెల్లడించాడు. అమెరికా ఆఫ్ రియో డి జనైరో తరఫున ఆటగాడిగా బరిలోకి దిగేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రకటించాడు. అయితే తాను ఎన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానన్న విషయాన్ని మాత్రం రొమారియో పేర్కొనలేదు. కాగా, బ్రెజిల్లో ప్రస్తుతం జరుగుతున్న రియో స్టేట్ ఛాంపియన్షిప్ పోటీల్లో అమెరికా ఆఫ్ రియో డి జనైరో క్లబ్ తడబతుంది. గతమెంతో ఘనంగా ఉన్న ఈ క్లబ్ ప్రస్తుతం పేలవ ప్రదర్శనలకు పరిమితమై ఉనికి కోల్పోయింది. రియో క్లబ్లో ఉత్సాహం నింపి పూర్వవైభవం తెచ్చేందుకే రొమారియో తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. -
Singapore PM: మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్
సింగపూర్: సింగపూర్ ప్రధానిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన లీ సీయన్ లూంగ్(72) రిటైర్మెంట్ ప్రకటించారు. మే 15వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు లూంగ్ సోమవారం తెలిపారు. అదే రోజూన ఉప ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్(51) ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు. సింగపూర్ మూడో ప్రధానిగా 2004లో లూంగ్ బాధ్యతలు చేపట్టారు. ఏ దేశానికైనా నాయకత్వ మార్పిడి ఎంతో ముఖ్యమైన విషయమని ఆయన ఫేస్బుక్లో పేర్కొన్నారు. సింగపూర్‌కు మరింత ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు వాంగ్ ప్రభుత్వానికి సహకారం అందించాల్సిందిగా ప్రజలను ఆయన కోరారు. -
దిగిపోనున్న బోయింగ్ సీఈవోకి రూ.366 కోట్లు!
బోయింగ్ సీఈవో డేవిడ్ కాల్హౌన్ భారీ మొత్తంలో రిటైర్మెంట్ చెల్లింపులు పొందనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి పదవి నుంచి వైదొలగనున్న ఆయన రిటైర్మెంట్ చెల్లింపుల కింద 44 మిలియన్ డాలర్లు (సుమారు రూ.366 కోట్లు) అందుకునే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదించింది. డేవిడ్ కాల్హౌన్ 2023 సంవత్సరానికి 33 మిలియన్ డాలర్ల (సుమారు రూ.274 కోట్లు) వేతన పరిహారాన్ని అందుకున్నారు. దాదాపుగా అదంతా స్టాక్ అవార్డ్స్‌లో ఉంది. అయితే జనవరిలో గాల్లో ఉన్న బోయింగ్ విమానం డోర్ ప్యానెల్ ఊడిపడిన ఘటన తర్వాత బోయింగ్ షేర్ ధర తగ్గిపోయింది. దీంతో ఈ సంవత్సరం ఆయన స్టాక్ చెల్లింపు దాదాపు నాలుగింట ఒక వంతు తగ్గుతుంది. ఈ ఘటన తర్వాత 2023 సంవత్సరానికి సీఈవో డేవిడ్ కాల్హౌన్ బోనస్‌ను (దాదాపు రూ.24 కోట్లు) తిరస్కరించినట్లు కంపెనీ తెలిపింది. ఘటనకు సంబంధించి బోయింగ్ దాని తయారీ నాణ్యత, భద్రతపై పలు విచారణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ సంవత్సరం చివరిలో తాను పదవి నుంచి వైదొలుగుతానని కాల్హౌన్ ఈ నెలలో ప్రకటించారు. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కాల్హౌన్ గత సంవత్సరం 1.4 మిలియన్ డాలర్ల జీతం, 30.2 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ అవార్డులను పొందినట్లు పేర్కొంది. ఇతర చెల్లింపులతో సహా కాల్హౌన్ 2023 పరిహారం మొత్తం 32.8 మిలియన్ డాలర్లు. కాగా 2022లో ఆయన 22.6 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. -
ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనం ఏమైంది?
గజ్వేల్/పాపన్నపేట: వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్, పాపన్నపేట, చిన్నశంకరంపేట మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలకు మోసం జరిగిందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయు లకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు వేస్తామని చెప్పిన ప్రభుత్వం.. మాట నిలుపుకోవడంలో విఫలమైందని ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ రాకముందే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కావాల్సినంత సమయమున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. మార్చి 31న పదవీ విరమణ పొందనున్న ఉద్యోగులకు అందాల్సిన డబ్బులను బాండ్ల రూపంలో ఇస్తారని లీకులు వస్తున్నాయని చెప్పారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ ఉనికే లేదని.. కేవలం రాముడిని చూపుతూ ఆ పార్టీ ఓట్లు పొందాలని ప్రయత్నిస్తోందని అన్నారు. వీడియోలతో విమర్శనాస్త్రాలు బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం వినూత్నంగా సాగు తోంది. శుక్రవారం పాపన్నపేట మండలం కొత్తపల్లి లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో వీడి యో క్లిప్పింగ్‌లు ప్రదర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగ్‌లను చూపుతూ.. ఇవి అమలు అయ్యాయా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. ఇకపై
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మాథ్యూ వేడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు ఫార్మాట్ నుంచి తాను వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. అయితే, పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం కొనసాగుతానని వేడ్ స్పష్టం చేశాడు. ‘‘సంప్రదాయ ఫార్మాట్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడాన్ని ఎంతగానో ఆస్వాదించాను. వైట్‌బాల్ క్రికెట్లో కొనసాగినా.. బ్యాగీ గ్రీన్‌తో దేశం తరఫున బరిలోకి దిగడమే నా కెరీర్లో ఎప్పటికైనా హైలైట్‌గా నిలుస్తుంది’’ అని మాథ్యూ వేడ్ ఉద్వేగపూరిత ప్రకటన చేశాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టులు ఆడటం అంతర్జాతీయ కెరీర్లో తనకు అత్యంత ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. ది షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో టాస్మానియా- వెస్టర్న్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 21న మొదలుకానున్న ఫైనల్ మ్యాచ్ తన రెడ్ బాల్ క్రికెట్లో ఆఖరిదని వేడ్ వెల్లడించాడు. కాగా 2012లో ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అడుగుపెట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్.. 2021లో తన చివరి మ్యాచ్ ఆడాడు. అలెక్స్ క్యారీ రాకతో అతడికి అవకాశాలు సన్నగిల్లాయి. ఈ క్రమంలో టీమిండియాతో గాబా మైదానంలో ఆఖరిగా టెస్టు మ్యాచ్ బరిలో దిగాడు. ఇక కెరీర్లో మొత్తంగా 36 టెస్టులు ఆడిన మాథ్యూ వేడ్.. 1613 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికొస్తే.. టీ20 ఫార్మాట్లో ఫినిషర్‌గా వేడ్ గుర్తింపు పొందాడు. టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆస్ట్రేలియా టైటిల్ గెలవడంలో అతడిదే కీలక పాత్ర. పాకిస్తాన్‌తో సెమీ ఫైనల్లో కేవలం 17 బంతుల్లోనే 41 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ అది! ఇదిలా ఉంటే.. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు మాథ్యూ వేడ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, తాజా ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లకు మాత్రం అతడు దూరం కానున్నాడు. ఇక టీ20 వరల్డ్‌కప్-2024లో సత్తా చాటడమే లక్ష్యంగా పెట్టుకున్న మాథ్యూ వేడ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. చదవండి: హార్దిక్ రిటైర్ అవ్వటమే బెటర్: భారత మాజీ పేసర్ షాకింగ్ కామెంట్స్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019