breaking news
-
రాబిన్‌హుడ్ డేట్ ఫిక్స్
నితిన్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ విడుదల తేదీ ఖరారు అయింది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు ΄ోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘అన్ని వాణిజ్య అంశాలతో పాటు వినోదంతో రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తారు. తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు పూర్తిగా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు వెంకీ కుడుముల. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు మా సినిమాకి కలిసి రానున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: సాయి శ్రీరామ్. -
సేనాపతి రాక అప్పుడే...!
జూన్‌లో థియేటర్స్‌కు రానున్నాడు భారతీయుడు. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో రూపొందిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’). ఈ సినిమాలో సేనాపతి పాత్రలో కనిపిస్తారు కమల్‌హాసన్. 1996లో విడుదలైన ఈ సినిమాకు పాతికేళ్ల తర్వాత ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ సీక్వెల్స్‌ను రూపొందించారు హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్. ఈ రెండు చిత్రాల చిత్రీకరణ పూర్తయింది. ‘ఇండియన్ 2’ సినిమాను జూన్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘సేనాపతి మళ్లీ వస్తున్నాడు. జూన్‌లో ‘ఇండియన్ 2’ సినిమా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది’’ అని ‘ఎక్స్’లో ఈ సినిమా కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు కమల్‌హాసన్. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా, సిద్ధార్థ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సుభాస్కరన్, ఉధయనిధి స్టాలిన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 14న విడుదలయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. -
మార్చి 2న 'వ్యూహం'...RGV ఇంట్రెస్టింగ్ ప్రకటన
-
మార్చి 2న 'వ్యూహం' రిలీజ్.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్
స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' విడుదలకు సిద్ధమైంది. మార్చి 2న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తొలుత ఫిబ్రవరి 25న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ సాంకేతిక సమస్యల కారణంగా మార్చి 1వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు ఓ రోజు ఆలస్యంగా అంటే మార్చి 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోను.. హీరోయిన్ ఆండ్రియా షాకింగ్ కామెంట్స్) తాజాగా 'వ్యూహం' సినిమా విడుదలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 'పట్టు వదలని విక్రమార్కుడిని' అని క్యాప్షన్‌తో పాటు సెన్సార్ సర్టిఫికెట్‌ని చేతిలో పట్టుకున్న ఫొటోని పోస్ట్ చేశారు. వాస్తవానికి రెండు నెలల క్రితమే 'వ్యూహం' రిలీజైపోవాలి. కానీ విడుదల నిలిపేయాని నారా లోకేష్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు అడ్డంకులన్నీ క్లియర్ అయిపోవడంతో 'వ్యూహం' సినిమా థియేటర్లలోకి రానుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు. దీనికి 'శపథం' అని సీక్వెల్ కూడా త్వరలో రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) పట్టు వదలని విక్రమార్కున్ని .. VYOOHAM in theatres MARCH 2nd 💪 pic.twitter.com/DoGK95a4PB — Ram Gopal Varma (@RGVzoomin) February 28, 2024 -
ప్రభాస్ 'కల్కి' వాయిదా? ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసిన నిర్మాణ సంస్థ
ప్రభాస్ 'కల్కి' సినిమా వాయిదా.. గత కొన్నిరోజుల నుంచి అభిమానులు, సినీ ప్రేమికుల మధ్య ఇదే డిస్కషన్. చెప్పిన తేదీకి వచ్చే సమస్య లేదని కొందరు... కచ్చితంగా వస్తుందని మరికొందరు చెప్పుకొచ్చారు. దీంతో సగటు ప్రేక్షకుడు పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. సరిగ్గా ఇలాంటి టైంలో విడుదల తేదీ పుకార్లపై నిర్మాణ సంస్థ స్పందించింది. ఎట్టకేలకు ఓ క్లారిటీ ఇచ్చేసింది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అలా చాలా ఏళ్ల క్రితమే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ మూవీ కమిట్ అయ్యాడు. కాకపోతే మిగతా చిత్రాల వల్ల ఇది లేట్ అవుతూ వచ్చింది. ఏడాదిన్నర క్రితం నుంచి మాత్రం గ్యాప్ ఇస్తూనే షూటింగ్ చేస్తూ వచ్చారు. కొన్నాళ్ల క్రితం టీజర్ లాంటి వీడియో ఒకటి రిలీజ్ చేసి హైప్ పెంచారు. (ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?) ఈ మధ్య కాలంలో అయితే 'కల్కి' చిత్రంలో నాని, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ.. ఇలా చాలామంది స్టార్ హీరోలు నటిస్తున్నారని, ఏకంగా 9 భాగాల ఫ్రాంచైజీగా దీన్ని తీయబోతున్నారని ఇలా ఇలా అంచనాలు పెంచే మాటలు చాలా వినిపించాయి. అదే టైంలో చాలారోజుల క్రితమే ప్రకటించినట్లు మే 9న ఈ సినిమా థియేటర్లలోకి రాకపోవచ్చనే టాక్ వినిపించింది. అయితే ఇదంతా చూస్తూ వచ్చిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చేసింది. విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చెబుతూ.. ప్రభాస్ కాలు చూపిస్తున్న ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో రూమర్స్‌కి చెక్ పడినట్లయింది. ఈ వేసవిలో వస్తున్న ఏకైక స్టార్ హీరో సినిమా ప్రభాస్ 'కల్కి'నే కావడం విశేషం. (ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019