breaking news
-
బ్రిల్లార్ క్లినిక్ మొదటి వార్షికోత్సవంలో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్
దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా. ముఖ్యంగా తెలుగు, తమిళ్ భాషల్లో సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. చెన్నైలో పుట్టి పెరిగిన రెజీనా.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ స్థాయికి చేరుకుంది. టాలీవుడ్లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. ఒకప్పడు స్టార్ హీరోయిన్గా వెలిగిన రెజీనా ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో వెబ్ సీరీస్‌పై దృష్టి పెట్టింది. వరుసగా వెబ్‌సీరీస్‌ల్లో నటిస్తూ బిజీగా మారింది. ఆపై చిన్ని సినిమాలను కూడా ఒప్పుకుంటుంది. అయితే ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్ హీరో సందీప్ కిషన్‌తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని సందీప్ చెప్పడంతో అది కాస్త ఆగిపోయింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజను ఏకంగా పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వచ్చాయి.. కొన్నిరోజుల తర్వాత ఓ తమిళ స్టార్ హీరోతో సీక్రెట్‌గా రొమాన్స్ చేస్తుందని కూడా టాక్ వచ్చింది. ఇవన్నీ రూమర్స్ అని తర్వాత తేలిపోయింది. కానీ ఆమె మాత్రం ఇలాంటివి ఇండస్ట్రీలో కామనే అనుకుని సమాధానం ఇవ్వకుండా తనపని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. సినిమా ఛాన్సులు తగ్గడంతో అందరి హీరోయిన్ల మాదిరే రెజీనా కూడా పెళ్లి పీటలెక్కబోతుందని కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఓ బిజినెస్‌మేన్‌ను ఆమె వివాహం చేసుకోబుతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వారి కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయని అంటున్నారు. త్వరలో ఈ శుభవార్తను రెజీనా ప్రకటించే అవకాశం ఉందని టాక్.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ రెజీనా పెళ్లి ప్రచారం మాత్రం భారీగా జరుగుతుంది. ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్‌గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్‌కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by RegenaCassandrra (@reginaacassandraa) -
Utsavam Movie: ఆకట్టుకుంటున్న ‘ఫస్ట్ కిస్’ సాంగ్
రెజీనా కసాండ్రా, దిలీప్ ప్రకాశ్ జంటగా నటించిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వంలో సురేష్ పాటిల్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ ప్రమోషన్స్‌ని ప్రారంభించారు మేకర్స్. ‘ఫస్ట్ కిస్..’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేసింది యూనిట్. చిత్ర సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా రామ్ మిరియాల పాడారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమ, వినోదం, భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఉత్సవం’ రూపొందింది. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ‘ఫస్ట్ కిస్..’ పాట యువతను ఆకట్టుకుంటుంది. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులందరూ చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. -
చివరకు అలాంటి పాత్రలు కూడా చేస్తున్న స్టార్ హీరోయిన్!
రెజీనా పేరు చెప్పగానే తెలుగు యంగ్ హీరోయిన్ గుర్తొస్తుంది. దాదాపు కెరీర్ అంతా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెబ్ సిరీసులు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన ఏ మూవీ కూడా హిట్ కావడం లేదు. దీంతో ఎలాంటి పాత్రకు అయినా సరే రెడీ అంటోంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) ప్రస్తుతం తమిళంలో అజిత్ హీరోగా 'విడమయూర్చి' సినిమా తీస్తున్నారు. ఇందులో అర్జున్ విలన్‌గా నటిస్తున్నాడు. రెజీనా.. విలన్ పాత్రధారి అర్జున్‌కి జోడీగా నటిస్తోంది. ఒకప్పుడు హీరోల సరసన నటించిన రెజీనా ఇప్పుడు విలన్ సరసన నటించే పాత్రలు చేస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అజిత్ 'విడమయూర్చి' మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని అజిత్ పుట్టినరోజు కానుకగా మే 1న ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కొత్త మూవీ చేస్తాడు. (ఇదీ చదవండి: అక్కడ 'సలార్'ని మించి కలెక్షన్స్ సాధిస్తున్న చిన్న సినిమా!) -
ఓటీటీలోకి హారర్- థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా చూసేయండి
కోలీవుడ్‌లో ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో 'కంజూరింగ్ కన్నప్పన్' సూపర్ హిట్ కొట్టింది. సెల్విన్ రాజ్ జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సతీష్, రెజీనా, నాసర్, శరణ్య ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. హారర్-థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధించింది. డిసెంబర్ 8, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయిన ఈ చిత్రం. ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా జనవరి 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. కేవలం తమిళ్లో మాత్రమే బిగ్ స్క్రీన్‌లో విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో మాత్రం తెలుగు, మలయాళం, కన్నడలో కూడా విడుదల కానుంది. కథ : గేమింగ్ ఇండస్ట్రీపై చాలా ఆసక్తి ఉన్న సతీష్ ఉద్యోగం కోసం పలు ప్రయత్నాలు చేస్తు ఉంటాడు. అతను డ్రీమ్ క్యాచర్ అని పిలువబడే మంత్రముగ్ధమైన వస్తువును తీసుకొని దాని నుంచి అద్భుతాలు క్రియేట్ చేస్తాడు. అలా సతీష్ నిద్రలోకి జారుకున్నప్పుడల్లా స్వప్న ప్రపంచంలో దెయ్యం వలలో చిక్కుకుంటాడు. చివరికి అతని కుటుంబం తనలాగే చిక్కుకుపోవడంతో ఏం జరిగిందనేది సినిమా.. కామెడీ- హారర్‌తో పాటు ఇందులో థ్రిల్లింగ్ తెప్పించే సన్నివేశాలు కూడా ఉంటాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019