breaking news
-
పందికొక్కులు మీరు, మీ బాబే
సాక్షి, అమరావతి: పెరిగిన కార్డులను ఒప్పుకోరు. అత్యంత నాణ్యతతో ఇస్తున్న సరుకులను చూడరు. దాదాపుగా రెట్టింపైన సబ్సిడీ గానీ... ఇంటి ముంగిటకే వస్తున్న రేషన్ డెలివరీ గానీ... ఇవేవీ ‘నంగనాచి రామోజీ’కి పట్టవు! ఐదేళ్ల జగన్ ప్రభుత్వం 162.15 లక్షల టన్నుల బియ్యం, 3.28 లక్షల టన్నుల చక్కెర, 3.28 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.28,491 కోట్లు ఖర్చు చేసినా సరే...రామోజీకి మాత్రం రేషన్ వ్యవస్థ గాడితప్పినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు హ యాంలో కేవలం 117.45 లక్షల టన్నుల బియ్యం, 3.15 లక్షల టన్నుల చక్కెర, 0.93 లక్షల టన్నుల కందిపప్పు పంపిణీకి రూ.15,356 కోట్లు ఖర్చు చేస్తే అదేదో ఘనకార్యంగా ఈనాడు కీర్తిస్తోంది. భాషా విచక్షణ కోల్పోయిన రామోజీ పరమ నీచపు రాతలు రాస్తున్నారు. ‘గాదె కింద పందికొక్కు.. కోతవేసే పప్పూ..ఉప్పు!’ అంటూ మంగళవారం ఈనాడులో రేషన్ పంపిణీపై దగాకోరుభాషను వాడారు. అప్పట్లో.. రేషన్ కోసం ఫీట్లు..అగచాట్లు... చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి 1.39 కోట్ల కార్డులు మిగిలాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా నిర్దేశించి, పార్టీల కతీతంగా కార్డులు ఇవ్వడంతో రాష్ట్రంలో 1.49 కోట్లకు కార్డుల సంఖ్య పెరిగింది. చంద్రబాబు హయాంలో ముక్కిపోయిన, పురుగుల పట్టిన, రాళ్లు, నూకలు ఎక్కువగా ఉన్న బియ్యాన్ని ఇస్తే తినలేక జనం బియ్యం జోలికే పోయేవారు కాదు. జగన్ ప్రభుత్వంలో ఇప్పుడిస్తున్నది నాణ్యమైన సార్టెక్స్ బియ్యం. అప్పట్లో నాసిరకం బియ్యాన్నే లబ్ధిదారుల నుంచి బాబు బినామీలు తమ దళారులతో పదీ పరక్కు కొనుగోలు చేసి అక్రమ రవాణా ద్వారా రూ.కోట్ల ప్రజాధనాన్ని మింగేసేవారు. వాస్తవానికి జాతీయ ఆహార భద్రత చట్టం కింద 2.68 కోట్ల మందికి 1.54 లక్షల టన్నులు మాత్రమే కేంద్రం బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే.. మిగిలిన 1.68 కోట్ల మంది లబి్ధదారులకు సీఎం జగన్ ప్రభుత్వం సొంత ఖర్చుతో 0.81 లక్షల టన్నుల బియ్యాన్ని అందిస్తోంది. హెరిటేజ్ కోసమే పండగ కానుకలు.. చంద్రబాబు ప్రభుత్వం పండగల పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను హెరిటేజ్‌కు దోచిపెట్టడానికి.. తమ అనుయాయులు స్వాహా చేయడానికే ఉపయోగించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా.. టెండర్లు లేకుండా ఇష్టమొచ్చిన ధరలకు అప్పటి ప్రభుత్వానికి సరుకులు సరఫరా చేసిన బాబు అనుయాయులు ప్రజాధనాన్ని మింగేశారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. 2013లో అప్పటి ప్రభుత్వం తెల్ల కార్డుదారులకు ఇచ్చే 9 రకాల నిత్యావసరాల్లో పామాయిల్ ఉండేది. బాబు ప్రభుత్వం దీన్ని తొలగించింది. కందిపప్పు పంపిణీ నాడు ఎన్నికల డ్రామా వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం జూన్ 2014 సెపె్టంబర్ నుంచి 2015 జూలై వరకు అసలు కందిపప్పు గురించి పట్టించుకోలేదు. నవంబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2018 వరకు గిరిజన ప్రాంతాల్లో మాత్రమే కిలో రూ.40 చొప్పున పంపిణీ చేసింది. 2017–18లో ఎక్కడా పంపిణీ చేయలేదు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మార్చి 2018 నుంచి రెండు కిలోల కందిపప్పు పేరిట పంచి మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓపెన్ మార్కెట్లో హెచ్చురేటు ఎంత ఉన్నా, సబ్సిడీ భారాన్ని భరిస్తూ రూ.67కే అందిస్తోంది. ఇదీ.. బాబు చిరుధాన్యాల గుట్టు టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయంలో రాగులు, జొన్నలు, గోధుమ పిండి, ఉప్పు పంపిణీ ప్రారంభించింది. 1.39 కోట్ల కార్డుల్లో కేవలం 1 శాతానికే వీటినిచి్చనా... అబ్బో అంటున్నారు రామోజీ. ఎన్నికల భయంతో ప్రజలను మభ్యపెట్టేందుకు చివరి సంవత్సరంలో టీడీపీ పంపిణీ చేసిందీ చిరు ధాన్యాల్ని. జగన్ ప్రభుత్వం కరోనా తర్వాత వినియోగదారులకు పౌష్టికాహారం పంపిణీలో భాగంగా ఉత్తరాంధ్రలో రాగులు, రాయలసీమలో రాగులు, జొన్నల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రేషన్‌లో కిలో బియ్యం బదులు కిలో రాగులు, జొన్నలు ఉచితంగా అందిస్తోంది. -
రేషన్ బియ్యం రీసైక్లింగ్ ఆగేనా?
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న తీరుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన వెంటనే పౌరసరఫరాల సంస్థ తీరు పై సమీక్షించిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... పీడీ ఎస్ బియ్యం సరఫరా తీరుతెన్నుల గురించి ప్రత్యేకంగా వా కబు చేశారు. అయితే ప్రతి నెలా పేదలకు పంపిణీ అవుతు న్న 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో ఏకంగా 70 శా తం వరకు బియ్యం పక్కదారి పడుతోందని అధికారులు మంత్రికి వివరించినట్లు తెలిసింది. పీడీఎస్ బియ్యంలో నాణ్యత లోపించడం వల్లే ఇలా జరుగుతోందని తేల్చిన మంత్రి దీనికి ప్రధాన కారణం మిల్లర్లేనని సమావేశంలోనే చెప్పారు. హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొందరు మిల్లర్ల చేతివాటం గురించి పూర్తి అవగాహన ఉండటంతో ఆయన ఈ అంశాన్ని తొలి ప్రాధాన్యతగా తీసుకున్న ట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోమవారం హుజూర్‌నగర్‌లోని చౌకధరల దుకాణాన్ని తనిఖీ చేసిన ఆయన... రేషన్ బియ్యం దురి్వనియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన పీడీఎస్ రైస్ సరఫరా చేయడంతోపాటు బియ్యం పక్కదారి పట్టడాన్ని నిలువరించడంపై దృష్టి పెట్టారు. మిల్లర్ల కొనుగోళ్ల చక్రం! రాష్ట్రంలోని 90.14 లక్షల ఆహార భద్రతా కార్డులకుగాను 2.83 కోట్ల మంది లబ్ధిదారులున్నారు. వారికి ప్రతినెలా 6 కిలోల చొప్పున 1.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 3,580 కోట్లు రాయితీ కింద వెచ్చిస్తోంది. అంటే నెలకు రూ. 298 కోట్లు. మొత్తంగా కిలో బియ్యానికి సగటున రూ. 39 వెచ్చిస్తూ సరఫరా చేస్తున్న ఈ బియ్యాన్ని కార్డుదారులకు ఒక్కో యూనిట్ (ఒక్కొక్కరికి)కి నెలకు 6 కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. అయితే ఈ బియ్యాన్ని కార్డుదారుల్లో కొందరు తిరిగి రేషన్ దుకాణాల్లోనే విక్రయించే విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. కార్డుదారుల నుంచి కిలోకు రూ. 6–9 వరకు చెల్లించి కొందరు రేషన్ దుకాణదారులు కొంటుండగా వారి నుంచి కిలోకు రూ. 10–13 చెల్లించి దళారులు కొనుగోలు చేసి రైస్‌మిల్లులకు పంపుతున్నట్లు తెలుస్తోంది. పక్క రాష్ట్రాలకు సరిహద్దులుగా ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ వంటి జిల్లాల్లో రేషన్ డీలర్లు బియ్యాన్ని దళారుల ద్వారా ఆయా రాష్ట్రాల్లో కిలో రూ. 20 చొప్పున అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఈ తతంతంలో కొందరు అవినీతి అధికారుల పాత్ర కూడా ఉందని.. డీలర్లు, దళారుల నుంచి మామూళ్లు తీసుకొని బియ్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎస్ అధికారి నియామకంతో... ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి డీఎస్ చౌహాన్‌ను ప్రభుత్వం నియమించడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్‌తోపాటు మంత్రి ఉత్తమ్ కూడా కమిషనర్‌కు ఈ మేరకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన చౌహాన్‌కు గతంలో ఎఫ్‌సీఐలో పనిచేసిన అనుభవం ఉంది. రీసైక్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు మంత్రి ఉత్తమ్ హెచ్చరిక హుజూర్‌నగర్‌లోని ఓ రేషన్ దుకాణం తనిఖీ హుజూర్నగర్: రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం కిలో బియ్యానికి రూ. 39 ఖర్చుపెట్టి కొనుగోలు చేసి పేదలకు ఉచితంగా ఇస్తోందని, ఆ బియ్యాన్ని మిల్లర్లుగానీ, ఇతరులెవరైనా రీసైక్లింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని 33వ నంబరు రేషన్ షాపును తనిఖీ చేశారు. రేషన్ బియ్యం నాణ్యతను పరిశీలించి డీలర్ల కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. కొందరు రేషన్ బియ్యాన్ని కోళ్ల దాణాకు, బీర్ల తయారీకి అమ్ముతున్నారని చెప్పారు. కొన్ని జిల్లాల్లో కొందరు రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని పాలిష్ చేయించి తిరిగి వాటినే ప్రభుత్వ (ప్రొక్యూర్మెంట్) సేకరణకు ఇస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందని, మాఫియాలా కొనసాగుతోందని మండిపడ్డారు. ఇక నుంచి రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే నష్టాలు... గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాకం వల్లే పౌరసరఫరాల సంస్థ రూ. 56 వేల కోట్ల అప్పుల్లో, రూ. 11 వేల కోట్ల నష్టాల్లో ఉందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. అప్పులపై ఏటా రూ. 3 వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం రైస్ మిల్లర్ల దగ్గర రూ. 22 వేల కోట్ల విలువైన ధాన్యం నిల్వలు పెట్టడంపై సమీక్షిస్తున్నామని... మిల్లర్ల దగ్గర ఉన్న ధాన్యం రికవరీకి తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని ఉత్తమ్ తెలిపారు. ధాన్యం సేకరణ పద్ధతులను, రేషన్ వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. మంత్రి వెంట ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న తదితరులు ఉన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. రేషన్ కార్డుదారులకు శుభవార్త!
రేషన్ కార్డ్ లబ్ధిదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద 81 కోట్ల మంది రేషన్ కార్డ్ దారులకు మరో ఐదేళ్లు రేషన్‌ను ఉచితంగా అందిచనుంది. ఇటీవల ఇటీవల ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనున్న పీఎంజీకేఏవై పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తామని స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలపై మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. కోవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కేంద్రం పేదలకు అండగా నిలుస్తూ పీఎంజీకేఏవై పథకాన్ని ఏప్రిల్ 2020లో ప్రారంభించింది. ఈ స్కీంలో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే ప్రజలకు ఉచిత రేషన్‌ను మూడు నెలల పాటు అందించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వచ్చింది. ఈ డిసెంబర్ 31తో ఈ పథకం వ్యవధి ముగియనుండగా.. తాజాగా దీన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆటకట్టు
సాక్షి, అమరావతి: పేదల బియ్యాన్ని బొక్కే అక్రమార్కులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. పటిష్ట చర్యలతో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే నిత్యావసరాలను దారిమళ్లించడం, దుర్వినియోగానికి పాల్పడిన వారిపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తోంది. ఇప్పుడు దీర్ఘకాలికంగా బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ, తరచూ పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్టును ప్రయోగిస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో సత్ఫలితాలు గతంలో రేషన్ బియ్యం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగేది. వందల టన్నుల బియ్యం సరిహద్దులు దాటేసేది. మరోపక్క పేదలు తినే బియ్యంపై కొందరు అసత్య ప్రచారం చేసి, వాటిని తక్కువ రేటుకు కొని, తిరిగి పాలిష్ పట్టి మార్కెట్లోకి తెచ్చి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. లారీలతో లోడ్లు తరలిపోతున్నా కేసులే నమోదయ్యేవి కావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి అక్రమార్కుల ఆట కట్టిస్తోంది. రేషన్ బియ్యం రవాణాపై నిఘాను పటిష్టం చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దులు, మండల నిల్వ పాయింట్లు, చౌక దుకాణాలు, ఎండీయూ వాహనాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిరంతర నిఘా పెట్టడంతో చాలా వరకు అక్రమ రవాణా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు 743 మందిని అరెస్టు చేసింది. నిత్యావసర వస్తువుల చట్టం – 1955 సెక్షన్ 6ఏ ప్రకారం అక్రమ రవాణాలో పట్టుబడిన సరకులు, వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేస్తోంది. ఈ కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొని, అక్రమార్కులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తోంది. పట్టుబడిన బియ్యాన్ని వెంటనే తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తెస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాల్లో బియ్యం అక్రమరవాణాలో పట్టుబడ్డ సరుకు నిల్వల విలువ రూ.50 లక్షల లోపు ఉంటే జేసీలు, అంతకు పైబడి ఉంటే కలెక్టర్లకు కేసుల పరిష్కార బాధ్యతలను అప్పగించింది. ఫలితంగా ఏళ్లు తరబడి సీజ్ చేసిన సరుకు ముక్కిపోయి, పురుగులు పట్టి పాడవకుండా బహిరంగ వేలం ద్వారా వెంటనే తిరిగి మార్కెట్లోకి తెస్తోంది. ఇలా గడిచిన నాలుగేళ్లలో 6ఏ కేసులు 8,696 నమోదు చేస్తే, వాటిల్లో 4,565 కేసులను పరిష్కరించింది. మొత్తం 4.70లక్షల క్వింటాళ్ల స్టాక్‌ను స్వాధీనం చేసుకోగా, 2.82 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్ టైం మానిటరింగ్ 6ఏ కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసింది. కేసు నమోదు చేసిన వెంటనే సీజ్ చేసిన స్టాక్ వివరాలను ఇందులో అప్లోడ్ చేస్తారు. జిల్లాలు, తేదీలు, నెలలవారీగా నమోదైన కేసులు, పరిష్కరించినవి, సీజ్ చేసిన స్టాకు, బయటకు విడుదల చేసిన స్టాక్ వివరాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించి, వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద చూపించడం, పాలిష్ పట్టి కొత్త ప్యాకింగ్‌లో మార్కెట్లో విక్రయించడాన్ని సంపూర్ణంగా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. పటిష్ట నిఘాతో అక్రమ రవాణా కట్టడి ఇప్పటి వరకు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని సీజ్ చేసి పక్కన పెట్టేవారు. వాటిని పట్టించుకోకపోవడంతో తినడానికి పనికిరాకుండా పాడయ్యేవి. ఈ క్రమంలోనే మేము 6ఏ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాం. కేసులు వేగంగా పరిష్కారమయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. దీనికి తోడు బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే వారిని పీడీ యాక్టులో పెడుతున్నాం. పటిష్ట నిఘా ఉంది కాబట్టే కేసులు నమోదవుతున్నాయి. అంతేగానీ అక్రమ రవాణా జరిగిపోతున్నట్టు కాదు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
ఈకేవైసీ తప్పనిసరి..
నాగర్‌కర్నూల్: రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఆహార భద్రతా కార్డుల్లో అనర్హుల పేర్లను తొలగించి నిజమైన పేదలకే రేషన్ సరుకులు అందేలా కృషిచేస్తోంది. దీనికోసం ఈకేవైసీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో కార్డులో పేరు ఉన్న కుటుంబీకులంతా రేషన్ దుకాణాలకు వెళ్లి ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గత కొన్నేళ్లుగా రేషన్‌కార్డులకు సంబంధించి తనిఖీలు చేయకపోవడంతో కొన్నిచోట్ల అనర్హులకు, చనిపోయిన వారి పేరుపై కూడా రేషన్ సరుకులు అందుతున్నాయి. దీంతో రేషన్ కార్డులో ఉన్న ప్రతిఒక్కరూ ఈకేవైసీ నమోదు చేయించుకుంటే అర్హులు, చనిపోయిన వారి విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో జిల్లాలో రేషన్ డీలర్లు ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. రేషన్ డీలర్ల వద్ద ఉన్న ఈ పాస్ మిషన్ల ద్వారా డీలర్లు ఈకేవైసీ చేస్తున్నారు. ఇలా చేసుకోవాలి.. రేషన్ కార్డులో పేరున్న కుటుంబీకులంతా చౌకధర దుకాణానికి వెళ్లి ఈ–పాస్ మిషన్‌లో వేలిముద్ర వేయాలి. వేలిముద్ర వేయగానే లబ్ధిదారుడి ఆధార్ నంబర్ వస్తుంది. మిషన్‌లో గ్రీన్‌లైన్ వస్తే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయినట్లు.. రెడ్‌లైన్ వస్తే రేషన్ కార్డులో పేరున్న వ్యక్తి ఆధార్ మ్యాచ్ కాలేదని ఈకేవైసీ రిజక్ట్ అవుతుంది. అలాంటి వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగిస్తారు. ఇందుకోసం కార్డులో పేరున్న వ్యక్తులంతా రేషన్ దుకాణానికి వెళ్లి వేలి ముద్రలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు వెళ్లకున్నా వారిని రేషన్ కార్డు నుంచి తొలగిస్తారు. జిల్లా పరిధిలో ఇలా.. జిల్లాలో ప్రస్తుతం 2,38,052 రేషన్ కార్డులు ఉండగా.. ఇందులో 18,621 అంత్యోదయ కార్డులు, 40 అన్నపూర్ణ, సాధారణ రేషన్ కార్డులు 2,19,272 కార్డులు ఉన్నారు. అంత్యోదయ కార్డు ఉన్న వారికి కుటుంబానికి 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు ఉన్నవారికి 10 కిలోలు ఉచితంగా ఇస్తున్నారు. జిల్లాలో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారుల కోసం నెలకు 4,861 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాకు కేటాయిస్తున్నారు. ఇప్పటికే ఈకేవైసీ ప్రక్రియ జిల్లాలో మందకొడిగా కొనసాగుతుంది. ఈ విషయమై పెద్దగా అవగాహన లేకపోవడంతో లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దీనిపై ప్రభుత్వంతోపాటు.. అధికారులు సైతం క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అ వగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లబ్ధిదారులు 7,52,628 మొత్తం రేషన్ కార్డులు 2,38,052 ఇంకా చేయాల్సింది 6,27,089 ఈకేవైసీ పూర్తిచేసిన వారు : 1,25,539 అవగాహన కల్పిస్తాం.. కుటుంబ యజమానితోపాటు రేషన్ కార్డులో పేరున్న ప్రతిఒక్కరూ వేలిముద్రలు వేసి ఈకేవైసీ చేయించుకోవాలి. రేషన్ షాపుల్లోనే ఈ–పాస్ మిషన్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. అనర్హులను గుర్తించేందుకే ఈ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈకేవైసీ చేయించుకోకుంటే రేషన్ కార్డు నుంచి పేర్లు తొలగిస్తాం. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించేలా చూస్తాం. – స్వామికుమార్, డీఎస్ఓ
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019