breaking news
-
Padma Awards 2024: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
రాష్ట్రపతి భవన్ లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం
-
అడ్వాణీకి భారతరత్న
న్యూఢిల్లీ: రాజకీయ కురు వృద్ధుడు, బీజేపీ అగ్ర నేత లాల్‌కృష్ణ అడ్వాణీ (96)కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి భవన్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం 1990లో దేశవ్యాప్త రథయాత్రతో బీజేపీకి ఊపు తెచ్చి అధికార సాధనకు బాటలు పరిచిన అడ్వాణీని, రామాలయ ప్రారం¿ోత్సవం జరిగిన కొద్ది రోజులకే భారతరత్న వరించడం విశేషం. అడ్వాణీకి ఈ సందర్భంగా మోదీ అభినందనలు తెలిపారు. ‘‘సమకాలీన రాజకీయవేత్తల్లో అత్యంత గౌరవనీయుడు అడ్వాణీ. దేశాభివృద్ధిలో ఆయనది అత్యంత కీలక పాత్ర. అచంచలమైన చిత్తశుద్ధి, అంకితభావంతో దేశానికి దశాబ్దాల పాటు సేవ చేశారు. ప్రజాస్వామ్యానికి జాతీయవాద విలువలను కూర్చిన గొప్ప నాయకుడు. అత్యంత కింది స్థాయి నుంచి మొదలై ఉప ప్రధానిగా ఎదిగారు. రాజకీయాల్లో నైతిక విలువలకు నూతన ప్రమాణాలు నెలకొల్పారు’’ అంటూ ప్రశంసించారు. ‘‘ఇది నాకెంతో భావోద్వేగపూరిత క్షణం. అడ్వాణీతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఎంతగానో నేర్చుకునే అవకాశం నాకు దక్కింది’’ అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రకటన అనంతరం అడ్వాణీకి మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తనకు అత్యున్నత పౌర పురస్కారం లభించడం పట్ల అడ్వాణీ హర్షం వెలిబుచ్చారు. ‘‘దేశం కోసమే నా జీవితమంతా ధారపోశా. నా ఆశయాలకు సిద్ధాంతాలకు దక్కిన గౌరవమిది. నాకెంతో ఆనందంగా ఉంది’’ అన్నారు. ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. అద్వానీతో కలిపి ఇప్పటిదాకా 50 మందికి ఈ పురస్కారం దక్కింది. పది రోజుల క్రితమే బిహార్ దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సామాజికవేత్త కర్పూరి ఠాకూర్‌కు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించడం తెలిసిందే. ఒక ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి ఈ పురస్కారం ఇవ్వవచ్చు. కానీ 1999లో మాత్రం నలుగురికి భారతరత్న ప్రకటించారు. కుటుంబ రాజకీయాలను సవాలు చేసిన అడ్వాణీ: మోదీ సంభాల్పూర్ (ఒడిశా): అడ్వాణీ ఆజన్మాంతం కుటుంబ రాజకీయాలను సవాలు చేశారని, దేశ ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణ కోసం పోరాడారని మోదీ అన్నారు. బీజేపీపై అంటరాని పార్టీ ముద్రను పోగొట్టి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రాజకీయ వేదికగా తీర్చిదిద్దారని కొనియాడారు. ‘‘దివంగత ప్రధాని వాజ్పేయితోకలిసి భారత ప్రజాస్వామ్యానికి అడ్వాణీ జాతీయ విలువలద్దారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక కుటుంబ గుత్తాధిపత్యం నుంచి విముక్తం చేసేందుకు నిరంతరం పోరాడారు. ఆయనకు భారతరత్న లభించడం బీజేపీకి, దాని అసంఖ్యా కార్యకర్తలకు కూడా గొప్ప గౌరవం’’ అని ఒడిశాలోని సంభాల్పూర్ ర్యాలీలో మోదీ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, అనురాగ్ ఠాకూర్ తదితరులతో పాటు పలు పారీ్టల నాయకులు కూడా అడ్వాణీకి అభినందనలు తెలిపారు. దేశానికి, బీజేపీకి, పార్టీ సిద్ధాంతానికి ఆయన చేసిన నిస్వార్థ సేవలను వరి్ణంచేందుకు మాటలు చాలవని షా అన్నారు. తన గురువైన అద్వానీకి ఇంతటి గౌరవం దక్కడం ఆనందంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆయనకు ఫోన్లో శుభాకాంక్షలు తెలిపానన్నారు. జేడీ(ఎస్) నేత కుమారస్వామి, ఎల్జేపీ (రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు అడ్వాణీకి అభినందనలు తెలిపారు. నేడు అయోధ్యలో రామాలయం కొలువుదీరిందంటే అందుకు అడ్వాణీయే కారణమని బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప అన్నారు. త్వరలో దిగిపోనున్న మోదీ సర్కారు బీజేపీ ఓటుబ్యాంకును కాపాడుకునేందుకే అడ్వానీకి భారతరత్న ప్రకటించిందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. నేను ఆచరించిన విలువలకు, నా సేవలకు గుర్తింపు ‘‘భారతరత్న పురస్కారం నాకు అత్యున్నత గౌరవం మాత్రమే కాదు. నేను జీవితాంతం ఆచరించిన విలువలకు, శక్తివంచన లేకుండా అందించిన సేవలకు గుర్తింపు కూడా. దీన్ని అత్యంత వినమ్రతతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నా. 14 ఏళ్ల వయసులో కార్యకర్తగా ఆరెస్సెస్‌లో చేరిన రోజు నుంచి భరతమాతకు నిస్వార్థంగా సేవ చేయడమే లక్ష్యంగా బతికా. ఈ జీవితం నాది కాదు, దేశానిదేనన్న భావనే నన్ను ముందుకు నడిపింది. ఈ సందర్భంగా పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలను కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటున్నా. ఈ ఇద్దరు మహనీయులతో కలిసి పని చేసే అదృష్టం నాకు దక్కింది. సుదీర్ఘ ప్రజా జీవితంలో నాతో పాటు కలిసి పని చేసిన లక్షలాది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు తదితరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు భారతరత్న ప్రకటించినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. నాకు అడుగడుగునా అంతులేని ప్రేరణ శక్తిగా నిలిచిన నా కుటుంబీకులను, ముఖ్యంగా నన్ను వీడి వెళ్లిన నా భార్య కమలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. నా దేశం మరిన్ని ఘనతలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ – భారతరత్న ప్రకటన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో అడ్వాణీ. -
‘అర్జున’ అందుకున్న ఇషా
సాక్షి, న్యూఢిల్లీ: భారత మహిళా షూటింగ్ రైజింగ్ స్టార్, తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను బుధవారం అందుకుంది. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ అవార్డును ఇషా సింగ్‌కు బహూకరించారు. ఈనెల 9న రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. అయితే అదే సమయంలో ఇషా జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతుండటంతో ఆమె హాజరుకాలేకపోయింది. ఇషాకు ‘అర్జున’ అందించిన అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ పారిస్ ఒలింపిక్స్ నుంచి ఇషా పతకంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. -
‘అర్జున’తో అందలం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు ప్రదాన కార్యక్రమం మంగళవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. వేర్వేరు క్రీడాంశాల్లో సత్తా చాటి ఈ పురస్కారానికి ఎంపికైన భారత ఆటగాళ్లు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దీనిని సగర్వంగా అందుకున్నారు. భారత క్రికెట్ జట్టు స్టార్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీతో పాటు తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ అర్జున అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. జకార్తాలో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడుతున్న కారణంగా తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ఈ అవార్డును అందుకోలేకపోయింది. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ‘ఖేల్‌రత్న’ అవార్డుకు ఎంపికైన టాప్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. వీరిద్దరు ప్రస్తుతం కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొంటున్నారు. భారత మహిళా చెస్ గ్రాండ్‌మాస్టర్, తమిళనాడు అమ్మాయి ఆర్. వైశాలి, రెజ్లర్ అంతిమ్ పంఘాల్, అథ్లెట్ పారుల్ చౌదరి, భారత కబడ్డీ జట్టు కెపె్టన్, తెలుగు టైటాన్స్ జట్టు స్టార్ ప్లేయర్ పవన్ కుమార్ సెహ్రావత్ కూడా అర్జున పురస్కారాన్ని అందుకున్నారు. పారా ఆర్చర్ శీతల్ దేవి అవార్డు అందుకుంటున్నప్పుడు ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందించగా... వీల్‌చైర్‌లో కూర్చుకున్న పార్ కనోయిస్ట్ ప్రాచీ యాదవ్ వద్దకు వెళ్లి స్వయంగా రాష్ట్రపతి అవార్డు అందించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంధ క్రికెటర్ అజయ్ కుమార్ రెడ్డి కూడా అర్జున అవార్డును అందుకోగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన స్విమ్మర్ మోతుకూరి తులసీ చైతన్య టెన్జింగ్ నార్గే జాతీయ సాహస పురస్కారాన్ని స్వీకరించాడు. విజయవాడ సిటీ స్పెషల్ బ్రాంచ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న 34 ఏళ్ల తులసీ చైతన్య కాటలీనా చానెల్, జిబ్రాల్టర్ జలసంధి, పాక్ జలసంధి, ఇంగ్లిష్ చానెల్, నార్త్ చానెల్లను విజయవంతంగా ఈది తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. 2023 సంవత్సరానికి ఇద్దరికి ‘ఖేల్ రత్న’... 26 మందికి ‘అర్జున’... ఐదుగురికి ‘ద్రోణాచార్య’ రెగ్యులర్ అవార్డు... ముగ్గురికి ‘ద్రోణాచార్య’ లైఫ్‌టైమ్... ముగ్గురికి ‘ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్’ అవార్డులు ప్రకటించారు. ప్రతి ఏటా జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29న) ఈ అవార్డులను అందజేస్తారు. అయితే ఆ సమయంలో హాంగ్జౌ ఆసియా క్రీడలు జరుగుతుండటంతో అవార్డుల ఎంపికతోపాటు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019