breaking news
Ad - Sakshi_Home_Sticky
-
బాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన 'పుష్ప'
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప : ది రూల్’ బాలీవుడ్లో ప్రారంభమైంది. సినిమా విడుదలకు ముందే అక్కడ రికార్డ్ బద్దల కొడుతుంది. ఇండియన్ సినిమా మార్కెట్‌ను షేక్ చేస్తూ ఈ సినిమా రైట్స్ రికార్డు ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. పార్ట్-1 సూపర్ హిట్ కావడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పుష్పగాడి టార్గెట్ గ్లోబల్ మార్కెట్‌పై కూడా పడింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప : ది రూల్’ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.200 కోట్ల రూపాయలకు ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానీ కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇది బాలీవుడ్లో ఆల్ టైమ్ రికార్డ్ డీల్ అని చెప్పవచ్చు. నాన్ హిందీ సినిమాను బాలీవుడ్లో అంత భారీ దక్కించుకోడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. పుష్ప సినిమా కోసం ఓటీటీలో కూడా గట్టిపోటీ ఉంది. ఎలాగైనా ఈ సినిమాను దక్కించుకోవాలని నెట్‌ఫ్లిక్స్ రూ.250 కోట్ల వరకు కోట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే డిజిటల్ హక్కుల్లో కూడా పుష్పనే టాప్ అవుతుంది. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ రైట్స్ కోసం రూ. 170 కోట్లు పెట్టారు. దేశవ్యాప్తంగా పుష్ప చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో మార్కెట్ స్థాయి కూడా అదే రేంజ్లో పెరిగిందని చెప్పవచ్చు. సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. -
ఐపీఎల్లో సన్‌రైజర్స్ రికార్డులు.. పుష్ప టీమ్ స్పెషల్ ట్వీట్!
అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2021లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఎర్రచందనం సిండికేట్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన పుష్ప కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా మెప్పించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 రూపొందిస్తున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా పుష్ప టీమ్ చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను పుష్ప సినిమాతో పోలుస్తూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ టీమ్ తన రికార్డ్‌ను తానే అధిగమించింది. ముంబయిపై 277 పరుగుల అత్యధిక స్కోరు చేసిన ఎస్ఆర్హెచ్.. మరోసారి బెంగళూరుపై 287 రన్స్ చేసి తన రికార్డ్‌ను తానే బద్దలు కొట్టింది. దీంతో మొదటి మ్యాచ్‌ను పుష్ప పార్ట్-1గా.. రెండో మ్యాచ్‌ను పుష్ప-2గా పోలుస్తూ పోస్ట్ చేసింది. రెండుసార్లు అత్యధిక స్కోరు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు అభినందనలు తెలిపింది. దీంతో బన్నీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది చూసిన కొందరు అభిమానులు పుష్ప డైలాగ్స్ పోస్ట్ చేస్తున్నారు. ప్రపంచలో ఎక్కడా లేని సరకు మన దగ్గరే ఉండాది అనే డైలాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఏ టీమ్ సాధించని రికార్డ్‌ను రెండుసార్లు సన్‌రైజర్స్ అధిగమించడం ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోనుంది. HUPPPP!!! 💥💥 277/3 - SRH: The Rise 😎 287/3 - SRH: The Rule 🤙 Congratulations on scoring the Highest-ever IPL team totals twice in this season! 🔥 @SunRisers https://t.co/kcfJBj5E0Z pic.twitter.com/co0o1zIw7T — Pushpa (@PushpaMovie) April 16, 2024 -
జిమ్‌లో పుష్ప డైరెక్టర్ భార్య.. పెద్ద సాహసమే!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా ఆడియన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు 138 గంటల పాటు యూట్యూబ్‌లో నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అయింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. అయితే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత గురించి చాలామందికి తెలియదు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమాలతో పాటు ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ తబిత కనిపించారు. ఆమె వర్కవుట్స్ సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) -
తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్.. మరో క్రేజీ రికార్డ్ సొంతం!
ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవల్లిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం దక్కించుకున్న రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. పుష్ప-2 టీజర్‌ను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 8న విడుదలైన పుష్ప-2 యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. అతి తక్కువ టైమ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించిన టీజర్.. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగిన టీజర్‌గా నిలిచింది. ఇప్పటివరకు పుష్ప-2 టీజర్‌కు 110 మిలియన్లకు పైగా వ్యూస్, 1.55 మిలియన్ల లైక్స్‌తో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని పుష్ప టీం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. #Pushpa2TheRuleTeaser becomes the first teaser to be 𝗧𝗥𝗘𝗡𝗗𝗜𝗡𝗚 #𝟭 on YouTube for a record 138 HOURS ❤🔥 Takes over the nation with 𝟏𝟏𝟎𝐌+ 𝐕𝐈𝐄𝐖𝐒 & 𝟏.𝟓𝟓𝐌+ 𝐋𝐈𝐊𝐄𝐒 🔥🔥 ▶️ https://t.co/5Mvmxzyfrp Grand release worldwide on 15th AUG 2024 💥💥… pic.twitter.com/LderAMGCRg — Pushpa (@PushpaMovie) April 14, 2024 -
నా కంటే అందమైన వాళ్లున్నారు.. కానీ: రష్మిక ఆసక్తికర కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది యానిమల్ మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతే కాదు భారతీయ సినిమాలోనే అత్యధికంగా అభిమానులను అలరించిన నటిగానూ మొదటి స్థానంలో ఉన్నారు. రష్మిక పలు భాషలు, పలు చిత్రాల్లో నటించినా తెలుగు చిత్రం పుష్ప ఈమె కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ చిత్రం తరువాతనే బాలీవుడ్ ఎంట్రీ యానియల్ సినిమాతో హిట్ కొట్టింది. కాగా ఇటీవల రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకంటే అందం, ప్రతిభ కలిగిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారన్నది తనకు తెలుసన్నారు. అయితే తనకు మంచి అవకాశాలు రావడంతో ఆ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. ఇందుకు తాను నిజంగా కృతజ్ఞతురాలినై ఉంటానన్నారు. జీవితంలో సంతోషాన్ని, మీరు పొందిన విజయాన్ని సాధారణంగా భావించరాదన్నారు. గత కొద్ది కాలంగా తాను నేర్చుకున్నది ఇదేనని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ పుష్ప -2: ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత చావ అనే ఒక హిందీ చిత్రం, రెయిన్బో అనే ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు), ది గర్ల్ ఫ్రెండ్ అనే తెలుగు చిత్రం రష్మిక చేతిలో ఉన్నాయి.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019