breaking news
-
‘కపటనీతికి మారుపేరు కాంగ్రెస్!’.. కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కపటనీతికి మారుపేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించిందని మండిపడ్డారు. ‘ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు రూ. 4,000 నిరుద్యోగ భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక.. అసలు అటువంటి హామీ ఏమివ్వలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట మార్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వార్తాపత్రికల మొదటి పేజీలో తమ జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటనలు ఇచ్చింది. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన 30 వేల ఉద్యోగాలకు కేవలం నియామక పత్రాలను ఇచ్చి ఆ ఉద్యోగాలను నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కాంగ్రెస్. అన్ని పోటీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ తాము ఇచ్చిన హామీపై నిస్సిగ్గుగా యూ టర్న్ తీసుకుంటూ.. కాంగ్రెస్ ప్రభుత్వం టెట్ పరీక్ష ఫీజును రూ. 400 నుండి రూ. 2000లకు (2 పేపర్లకు) పెంచింది. బల్మూరి వెంకట్ వంటి కాంగ్రెస్ నాయకులను ఎన్నో కోర్టు కేసులు వేసి.. అనేక పోటీ పరీక్షలు రద్దవ్వడానికి కారణమయ్యారు. నిరుద్యోగుల ఉసురు పోసుకుని, ప్రతిఫలంగా వెంకట్ ఎమ్మెల్సీ పదవిని అందుకున్నాడు. కానీ.. ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులను మాత్రం దిక్కుతోచని స్థితిలో వదిలేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. తమని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగ యువత గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చింది’ అని ‘ఎక్స్’వేదికగా మండిపడ్డారు. కపటనీతికి మారుపేరు కాంగ్రెస్! అన్ని వర్గాల ప్రజలకు.. ముఖ్యంగా యువతకు అరచేతిలో వైకుంఠం చూపించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ తమ 120 రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులతో సహా అందరికీ ద్రోహం చేయడం ప్రారంభించింది. 👉 ప్రియాంక గాంధీ వంటి కాంగ్రెస్… — KTR (@KTRBRS) April 19, 2024 -
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్రలు.. ప్రియాంక ఆరోపణలు
దిస్పూర్ : అధికార బీజేపీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అధికార బీజేపీ దేశంలో రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటుంది. అలా జరిగితే దేశంలోని సామాన్య ప్రజలు ఎక్కువగా నష్టపోతారని అన్నారు. అసోంలోని జోర్హాట్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థి గౌరవ్ గొగోయ్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే తేయాకు తోటల కార్మికుల రోజువారీ వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ‘ 2-3 ఏళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేను అస్సాంకు వచ్చి తేయాకు తోటలను సందర్శించినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చాను. కానీ మీరు బీజేపీని ఎన్నుకున్నారు. వేతనాలు దాదాపు రూ. 250 నుండి పెంచలేదని’ తెలిపారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తేయాకు తోటల కార్మికులకు వేతనాలు పెంచుతామని మా మేనిఫెస్టో హామీ ఇచ్చిందని మరోసారి చెబుతున్నా’ అని ప్రియాంక గాంధీ సూచించారు. -
స్మృతి ఇరానీ Vs ప్రియాంక.. యూపీలో ఆసక్తికర సమరం!
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అంశంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది తేలియాల్సి ఉంది. కాగా, ముందు నుంచి ఈ స్థానంలో రాబర్ట్ వాద్రా పోటీ ఉంటారనే వార్తలు వినిపించినప్పటికీ అది జరగపోవచ్చు అని సమాచారం. కాగా, గాంధీ కుటుంబంతో విడదీయరాని బంధం ఉన్న అమేథీ, రాయబరేలీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే అంశం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని ఈ విషయంలో ఒక హింట్ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలో ఉంటారని వెల్లడించారు. కాగా, ఆంటోని బుధవారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమేథీ, రాయబరేలీ సీట్లపై ఎలాంటి ఊహాగానాలు వద్దు. యూపీ నుంచి గాంధీ కుటుంబమే పోటీ చేస్తారు. రాబర్ట్ వాద్రా అక్కడ పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని కామెంట్స్ చేశారు. దీంతో, ప్రియాంక లేదా రాహుల్ గాంధీ యూపీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాహుల్ ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక, అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని ఢీకొట్టేందుకు ప్రియాంకు బరిలోకి దింపుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రియాంక కనుక అమేథీ నుంచి పోటీలో నిలిస్తే రాజకీయం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు.. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా అమేథీ స్థానం కాంగ్రెస్‌కు దక్కిన విషయం తెలిసిందే. -
రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ? త్వరలో అధికారిక ప్రకటన?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తర్వాత యూపీలోని రాయ్‌బరేలీ ఎవరిది? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ హైకమాండ్ త్వరలోనే జవాబు చెప్పనుంది. తాజాగా రాయ్‌బరేలీ ఎన్నికల బరిలో ప్రియాంక ప్రవేశానికి సంబంధించిన సూచనలు హై కమాండ్ నుంచి జిల్లా కార్యనిర్వాహకవర్గానికి అందిందనట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందట. ప్రియాంకా గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరేందుకు జిల్లా కమిటీ అధికారులు ఫిబ్రవరిలో ఆమెను కలుసుకున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రాయ్‌బరేలీ సీటు ఎంతో కీలకం. సమాజ్‌వాదీతో పొత్తు కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 17 సీట్లు దక్కాయి. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తే రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలకు మంచి సందేశం అందుతుందని, అది భారత కూటమికి మేలు చేస్తుందని కాంగ్రెస్ థింక్ ట్యాంక్ నమ్ముతోంది. రాయ్‌బరేలీలో ప్రియాంక గాంధీకి.. ఆమె అమ్మమ్మ ఇందిరా గాంధీ, తల్లి సోనియా గాంధీకి ఉన్నంత ఆదరణ ఉంది. ప్రియాంక తొలిసారి 1999 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాయ్‌బరేలీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి కెప్టెన్ సతీష్ శర్మ గెలుపు బాధ్యతను ప్రియాంక విజయవంతం చేశారు. రాయ్‌బరేలీ రాజకీయాలపై ప్రియాంకకు మంచి అవగాహన ఉందని విశ్లేషకులు చెబుతుంటారు. -
మేం తప్పుడు హామీలు ఇవ్వం..బీజేపీపై ఖర్గే కామెంట్స్
జైపూర్ : ప్రధాని నరేంద్ర మోదీలాగా తమ పార్టీ తప్పుడు వాగ్దానాలు ఇవ్వదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ మేనిఫెస్టో అబద్ధాల పుట్టా అంటూ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఆ వ్యాఖ్యలపై ఖర్గే పై విధంగా స్పందించారు. జైపూర్‌లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ..‘మా పార్టీ అధికారంలోకి వస్తే 25 హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం. అంతే తప్పా ప్రధాని మోదీలా అబద్ధాలు చెప్పం’ అని అన్నారు అయితే నేను మిమ్మల్ని (ప్రజల్ని ఉద్దేశిస్తూ.) ఒకేటే అడగాలనుకుంటున్నాను. బీజేపీ ఎన్నో హామీలు ఇచ్చింది. వాటిల్లో ఇప్పటి వరకు ఎన్ని హామీలను నెరవేర్చింది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందుకే గత 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చింది. మీకు 20 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా లేదా అంటూ వ్యంగంగా మాట్లాడారు. నిరుద్యోగం తగ్గేందుకు బీజేపీ ఏం చేసింది బీజేపీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటైన దేశంలోని పెద్ద పెద్ద సంస్థలు నిర్వీర్యమయ్యాయని, నేడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంపై ప్రజలకు నమ్మకం లేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. దేశంలో నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం పెరిగిపోతుందని, ఆ నిరుద్యోగాన్ని తగ్గించేందుకు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. "Unlike PM Modi, we don't tell lies...": Congress President Mallikarjun Kharge Read @ANI Story | https://t.co/GBMtRCjHMd#PMModi #MallikarjunaKharge #Congress #BJP #CongressManifesto #LokSabhaElections2024 pic.twitter.com/aYBAzBZ4qw — ANI Digital (@ani_digital) April 6, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019