breaking news
-
Priyanka Arul Mohan Photos: ఈ గ్లామర్ సరిపోదా అంటూ ఊపేస్తున్న హీరోయిన్ (ఫోటోలు)
-
గ్లామర్ పాత్రలకు ఓకే.. ఫోటో షూట్ తో గ్రీన్ సిగ్నల్ (ఫొటోలు)
-
గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన హోమ్లీ హీరోయిన్
గ్లామర్ లేనిదే సినిమా లేదు అని చెప్పవచ్చు. ఇక చాలా మంది ఈతరం హీరోయిన్లు గ్లామర్‌ను నమ్ముకునే గడిపేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నటనకు అవకాశం ఉన్న పాత్రలకే తమ ప్రాధాన్యం అంటుంటారు. అయితే నటించేది మాత్రం గ్లామరస్ పాత్రల్లోనే. తాజాగా నటి ప్రియాంక మోహన్ కూడా ఇదే బాట పట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కన్నడ భామ మాతృభాషలో ఒకటి రెండు చిత్రాలు చేసిన తరువాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నాని సరసన నానీస్ గ్యాంగ్ లీడర్ చిత్రంలో నటించింది. అందులోనూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సంపాదించుకుంది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో ఈ అమ్మడిని అక్కడ పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక్కడ శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్ చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతోపాటు ప్రియాంక మోహన్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం హిట్‌తో శివకార్తికేయన్‌తో మరోసారి డాన్ చిత్రంలో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. ఈ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. అలా పాపులరైన ప్రియాంక మోహన్‌కు స్టార్ నటుడు సూర్యతో జతకట్టే అవకాశం వచ్చింది. ఆయనతో ఎదర్కుమ్ తుణిందవన్ (తెలుగులో ET) చిత్రంలో నటించింది. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. విశేషం ఏమిటంటే ఈ చిత్రాలన్నింటిలోనూ ఈ అమ్మడు హోమ్లీ పాత్రల్లోనే కనిపించింది. దీంతో అలాంటి ఇమేజ్‌కు పరిమితమైంది. అలాంటిది ఇటీవల ధనుష్ సరసన నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రంలో ఒక సామాజిక బాధ్యత కలిగిన పాత్రలో నటించి పేరు తెచ్చుకుంది. తాజాగా రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు చిత్రం ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి జయం రవికి జంటగా నటిస్తున్న బ్రదర్ చిత్రం. మరొకటి డాన్స్ మాస్టర్ నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తోంది. ఇకపోతే చాలా గ్యాప్ తరువాత తెలుగులో పవన్‌కల్యాణ్‌తో జత కట్టే అవకాశాన్ని పొందినట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా ప్రియాంక మోహన్ గ్లామర్ గోదాలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రత్యేకంగా ఫొటో షూట్ చేసుకుని దిగిన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తోంది. అలా తాజాగా బెడ్ రూమ్‌లో ఫొటో షూట్ చేసుకున్న గ్లామరస్ చిత్రాలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇవి గ్లామర్ పాత్రలకు గ్నీన్ సిగ్నలా అంటూ నెటిజన్లు ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్లు తమ ఇన్‌స్ట్రాగామ్‌లో ఫాలోవర్లను పెంచుకోవడానికి ఇలాంటి గ్లామరస్ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. వీటి వల్ల కూడా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. నటి ప్రియాంక మోహన్ గ్లామరస్ ఫొటోలకు ఇది కూడా ఒక కారణం అయ్యింటుందనేది ట్రోల్ అవుతోంది. View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) -
తన ప్రత్యేకత సిల్వర్ స్క్రీనే కాదు.. ఇన్‌స్టా ప్యాషన్ కూడా..
ప్రియంకా మోహన్.. నటించబోయే నెక్స్›్ట మూవీ కోసం ఎంతమంది ఎదురుచూస్తారో.. సోషల్ మీడియాలో ఆమె నెక్స్›్ట ఫొటో కోసమూ అంతేమంది వేచి చూస్తుంటారు. దీన్నిబట్టే చెప్పొచ్చు స్టోరీస్ సెలెక్షన్లో ప్రియంకా ఎంత ప్రత్యేకంగా ఉంటుందో! సిల్వర్ స్క్రీన్ కథే కాదు.. ఇన్‌స్టాలోని ఫ్యాషన్ స్టోరీనూ! ఆ స్టోరీ టెల్లింగ్‌లో ఈ బ్రాండ్స్ కూడా పార్ట్‌నర్సే! అకోయ జ్యూలరీ.. ఇదొక ఆన్లైన్ జ్యూలరీ స్టోర్. ట్రెండ్‌కి తగ్గట్టు ఫ్యాషన్ జ్యూలరీని క్రియేట్ చేస్తూ యూత్‌లో తెగ క్రేజ్ సంపాదించుకుంటోంది. ఆ క్రేజే ఈ బ్రాండ్‌ను సెలబ్రిటీలకూ దగ్గర చేస్తోంది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఆన్లైన్ లోనే కొనుగోలు చేసే వీలుంది. దేవ్నాగరి.. అక్కాచెల్లెళ్లు కవిత, ప్రియంకా.. ఒకరు ఇంజినీర్, మరొకరు డాక్టర్ కావాలనుకున్నారు. కానీ అమ్మమ్మ స్ఫూర్తితో చివరికి వారిద్దరి కల ఒక్కటే అయింది. అదే ఫ్యాషన్ డిజైనింగ్. ఆ ఆసక్తితోనే జైపూర్‌లో లభించే సంప్రదాయ దుస్తులపై పరిశోధన చేశారు. కుటుంబ సభ్యుల సహకారంతో 2013లో సొంతంగా ‘దేవ్నాగరి’ అనే ఓ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. దేశంలోని ఏ ప్రాంతంలో జరుపుకునే పండుగకైనా వీరి వద్ద దానికి తగ్గ ప్రత్యేకమైన డిజైన్స్ లభిస్తాయి. అదే వీరి బ్రాండ్ వాల్యూ. ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. పలు ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లో ఈ డిజైన్స్ లభిస్తాయి. చీర బ్రాండ్: దేవ్నాగరి, రూ. 57,000 జ్యూలరీ బ్రాండ్: అకోయ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. ఇవి చదవండి: Alia Bhatt: తనకు 'ఆలూ' అనే ముద్దు పేరు ఎలా వచ్చిందో తెలుసా! -
ధనుష్ సినిమాలో ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్..
హీరోగా బిజీగా ఉన్న ధనుష్ దర్శకుడిగా, నిర్మాతగానూ కొనసాగుతున్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం రాయన్. ఇది ధనుష్ 50వ చిత్రం అన్నది తెలిసిందే. దుషారా విజయన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న రాయన్ మూవీ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోది. దీంతో ధనుష్ ప్రస్తుతం తన 51వ చిత్రం కుబేరపై దృష్టి పెట్టారు. కుబేర.. టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇకపోతే ధనుష్ మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆయన సోదరి కొడుకు పవిష్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. నటి అనికా సురేంద్రన్, మాథ్యూ థామస్, ప్రియ ప్రకాశ్ వారియర్, రమ్య రంగనాథన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇందులో ధనుష్ కీలక పాత్రలో మెరవనున్నారు. దీనికి జీవి ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. స్పెషల్ సాంగ్ ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై ధనుష్ పేరెంట్స్.. దర్శకుడు కస్తూరి రాజా, విజయలక్ష్మి నిర్మిస్తున్నారు. మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిలావుకు ఎన్మేల్ ఎన్నడీ కోబం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో ప్రియాంక మోహన్ నటించినట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు ధనుష్‌తో కలిసి ఈ బ్యూటీ కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన దర్శకత్వం వహిస్తున్న నిలావుకు ఎన్ మేల్ ఎన్నడీ కోబం చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ పాట చిత్రంలో చాలా కీలకమని తెలిసింది. చదవండి: మూడు నెలల తర్వాత చెప్పింది చేసిన 'బిగ్‌బాస్ 7' విన్నర్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019