breaking news
-
వివాదాస్పద నటుడు మన్సూర్ అలీఖాన్ సంచలన ఆరోపణలు....!
కోలీవుడ్ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్‌పై విష ప్రయో గం జగిందనే వార్త లు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. తమిళనాడులో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు జరగనుండడంతో రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారాయి. బుధవారం వరకు అన్ని రాజకీయపార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచా రం సాగించారు. కాగా నటుడు మన్సూర్ అలీఖాన్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈయన బుధవారం వేలూ రు పరిసర ప్రాంతాల్లో ప్రచారం చేస్తుండగా కొందరు బలవంతంగా పండ్ల జ్యూస్‌ను తాగించారు. ఆ తరువాత మజ్జిగను కూ డా తాగించడంతో కడుపునొప్పికి గురైన నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ వెంటనే కిందకు పడిపోయాడు. కార్యకర్తలు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన తరువాత మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆయన అత్యవసర వార్డులో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను మన్సూర్ అలీఖాన్ సన్నిహితులు మీడియాకు విడుదల చేశారు. అందులో నటుడు మన్సూర్‌అలీఖాన్ పేర్కొంటూ తాను ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉండగా కొందరు తనతో బలవంతంగా పండ్ల రసాన్ని తాగించారని.. ఆ వెంటనే మజ్జిగను కూడా ఇచ్చారని, అది తాగిన తాను తీవ్ర కడుపు నొప్పితో కిందికి పడిపోయానని పేర్కొన్నారు. తన వెంట ఉన్న కార్యకర్తలు వెంటనే ఆస్పతికి తీసుకెళ్లారని.. పరీక్షించిన వైద్యులు విష ప్రయోగం జరిగిందని చెప్పారన్నారు. ప్రస్తుతం తాను ఐసీయూలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాననే నమ్మకముందని మన్సూర్ అలీఖాన్ వ్యక్తం చేశారు. -
విషాదం: ప్రాణం తీసిన బర్త్ డే కేక్?
ఛండీఘర్: పుట్టినరోజు నాడు కేక్ తినడం వల్ల ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె పుట్టినరోజే చిన్నారికి చివరి రోజు కావడంతో పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాదకర ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. మార్చి 24న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన 10 ఏళ్ల చిన్నారి మాన్వికి ఈ నెల 24న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఓ బ్యాకరీ నుంచి ఆన్లైన్లో కేక్ ఆర్డర్ చేశారు. సాయంత్రం ఏడు గంటలకు కేక్ కట్ చేసి.. కుటుంబ సభ్యులంతా తిన్నారు. రాత్రి 10 గంటలకల్లా అందరూ అస్వస్థతకు గురయ్యారు. ఇక, గొంతు తడారిపోతోందంటూ మాన్వి మంచినీళ్లు తాగి నిద్రలోకి జారుకుంది. ఉదయానికి కల్లా ఆమె ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వైద్యులు ఎంత ప్రయత్నించినా చిన్నారి ప్రాణాలు కాపాడలేకపోయారు. కేకు విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో, సదరు బేకరీపై చిన్నారి పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. అనంతరం.. దర్యాప్తులో భాగంగా మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపిన పోలీసులు, కేక్ నమూనాలను కూడా సేకరించి పరీక్షల కోసం పంపారు. నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక, పుట్టినరోజే తన బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
Mukhtar Ansari: అన్సారీపై విష ప్రయోగం?
లక్నో: బాందా జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ (63) గురువారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ఆయనకు చికిత్స అందుతుండగానే.. గుండెపోటుకు గురై చనిపోయినట్లు దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం అన్సారీ మృతిపై సంచలన ఆరోపణలకు దిగారు. ముఖ్తార్ అన్సారీపై విషప్రయోగం జరిగిందని.. 2005 నుంచి బాందా జైలులో ఉన్న ఆయనపై విషప్రయోగం జరగడం ఇప్పుడు రెండోసారి ఆయన సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. ‘జైలులో అన్సారీకి ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. సుమారు 40 రోజుల పాటు ఆహారంలో విషం కలిపారు. మార్చి 19వ తేదీన ఆయన తిన్న ఆహారంలో విషం కలిసింది. అందుకే ఆయన ఆరోగ్యం ఆందోళనకంగా మారి ఆస్పత్రిలో చేరారు’ అని అఫ్జల్ అన్సారీ అంటున్నారు. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు ఉమర్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ‘ మా నాన్న(ముఖ్తార్)పై విష ప్రయోగం జరుగుతోందన్న విషయాన్ని మేము గతంలో కూడా చెప్పాం. ఇప్పుడూ కూడా అదే చెబుతున్నాం. మార్చి 19న మా నాన్న( ముఖ్తార్)కు రాత్రి భోజనంలో విషం కలిపారు. మేము ఈ విషయంలో కోర్టును సంప్రదిస్తాం. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని ఉమర్ తెలిపారు. బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం విషయమించటంతో ఆయన్ను మంగళవారం బాందాలోని దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఆయనపై విష ప్రయోగం జరిగిందా? అనేదానిపై వైద్యులు స్పందించలేదు. బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఇవాళ ముఖ్తార్ అన్సారీ మృతదేహానికి శవపరీక్ష జరగనుంది. ఆపై ఈ ఆరోపణలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ యూపీలోని మౌకు చెందిన అన్సారీపై గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 హత్య కేసులు ఉన్నాయి. 1980ల్లో గ్యాంగ్ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990ల్లో సొంతంగా గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపుర్, వారణాసి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడేది. 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్ బయటపడడంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో గతేడాది ఏప్రిల్‌లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవితఖైదు విధించింది. ఐదుసార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ రెండు సార్లు బీఎస్పీ తరఫున ఎన్నికయ్యారు. ఆయన మృతికి ఆ పార్టీ ఎక్స్(ట్విటర్)లో సంతాపం ప్రకటించింది. అన్సారీ మృతితో యూపీ మొత్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. బాందా, మౌ, ఘాజీపుర్, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, సెంట్రల్ రిజర్వ్ బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ముఖ్తార్ అన్సారీ మృతిపై దర్యాప్తు జరగాలి: మాయావతి జైలులో ముఖ్తార్ అన్సారీపై మృతిపై ఆయన కుటుంబం వ్యక్తం చేస్తున్న భయాలు, విష ప్రయోగానికి సంబంధించి ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ వేదిక స్పందించారు. ‘ ముఖ్తార్ మృతి దార్యప్తు జరగాలి. మృతికి సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. मुख़्तार अंसारी की जेल में हुई मौत को लेकर उनके परिवार द्वारा जो लगातार आशंकायें व गंभीर आरोप लगाए गए हैं उनकी उच्च-स्तरीय जाँच जरूरी, ताकि उनकी मौत के सही तथ्य सामने आ सकें। ऐसे में उनके परिवार का दुःखी होना स्वाभाविक। कुदरत उन्हें इस दुःख को सहन करने की शक्ति दे। — Mayawati (@Mayawati) March 29, 2024 -
మిస్టరీ: 'డోంట్ టచ్’ అనే హెచ్చరికతో.. 'చెచెన్, చాకా' ట్రీస్
'మధ్య అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించే ప్రతి చెచెన్ చెట్టుకు ‘డోంట్ టచ్’ అనే హెచ్చరిక బోర్డ్ మీద డేంజర్ బొమ్మ గీసి మరీ ఉంటుంది. అవును ఆ చెట్టు బెరడు తాకితే.. భయంకరమైన దద్దుర్లు వస్తాయి. తట్టుకోలేనంత దురద పుడుతుంది. భరించలేనంత మంట వస్తుంది. దాని బెరడు నుంచి నల్లటి జిగురు పొంగుతుంది. కొన్నేళ్లక్రితమే ఆ చెట్టుపై ఎన్నో ప్రయోగాలు జరిపి.. అది విషపూరితమని, పట్టుకుంటే ప్రమాదమని నిపుణులు తేల్చేశారు. అందుకే ఆ చెట్టుకు ‘బ్లాక్ పాయిజన్ వుడ్ ట్రీ’ అని పేరు పెట్టారు. కొన్నిసార్లు ఆ చెట్టు సమీపంలో తిరిగితే.. దద్దుర్లు వచ్చేవరకు తెలియదట ఆ చెట్టును మనం తాకామన్న సంగతి'. అయితే విచిత్రమేమిటంటే.. ఆ చెట్టుకు పక్కనే లేదా సమీపంలో ‘చాకా’ అనే మరో చెట్టూ కచ్చితంగా పెరుగుతుంది. చెచెన్ చేసిన గాయాలకు.. చాకా చెట్టు బెరడు విరుగుడుగా పనిచేస్తుంది. దద్దుర్లు రాగానే.. చాకా బెరడును కత్తిరించి.. దాని నుంచి వచ్చే జిగురును దద్దుర్లొచ్చిన చోట రాయాలి. బాడీ లోపలి నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే.. ఈ చాకా బెరడుతో టీ పెట్టుకుని తాగొచ్చు. చెచెన్ ట్రీ బెరడు తగిలిన వెంటనే చాకా ట్రీ బెరడును ఔషధంలా ఉపయోగించకపోతే.. వైద్యుల్ని సంప్రదించాల్సిందే. అయితే ఒక ప్రమాదం, దానికి పరిష్కారం రెండూ ఒకేచోట పుట్టిపెరగడం విశేషం. నిజానికి ఈ చెచెన్ – చాకా ట్రీస్ పుట్టుక వెనుక పెద్ద చరిత్రే ఉంది. కొన్ని వందల ఏళ్లక్రితం ఆగ్నేయ మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో ముగిసిన ఓ విషాద ప్రేమగాథే ఈ చెట్ల వెనుకున్న పురాణం. మాయన్ యోధులైన ఇద్దరు అన్నదమ్ముల కథ ఇది. టిజిక్, కినిచ్ అనే సోదరులు.. గొప్ప యుద్ధవీరులు.. ఆ రాజ్యానికి యువరాజులు కూడా. అయితే కినిచ్ దయా హృదయంతో, మంచివాడిగా ఉండేవాడు. ప్రేమతో, నిస్వార్థంగా జీవించేవాడు. అందరినీ ఆదరించేవాడు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సాయం చేసేవాడు. చెచెన్ చెట్టు, పక్కపక్కనే ఉన్న చెచెన్, చాకా చెట్లు కానీ అతని సోదరుడు టిజిక్ మాత్రం.. కోపంతో, ఆవేశంతో నిత్యం అసహనంతో జీవించేవాడు. అందరి పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాడు. అహంకారం ప్రదర్శించేవాడు. ఒకరోజు కినిచ్, టిజిక్లు రాజ్యపర్యటనలో ఉండగా.. ‘నిక్టే హా’ అనే అందమైన అమ్మాయిని చూసి మనసు పారేసుకున్నారట. ‘ఆమె నాకు సొంతమంటే నాకు సొంతం’ అని అన్నదమ్ములిద్దరూ వాదులాటకు దిగారు. అది కాస్తా గొడవకు దారితీసి.. యుద్ధానికి సిద్ధమయ్యారు. చివరికి నిక్టే కళ్లముందే.. ఇద్దరు అన్నదమ్ములు యుద్ధానికి తెగబడ్డారట. కొన్నిరోజుల పాటు జరిగిన ఆ భయంకర యుద్ధంలో.. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేసిన ఒకనాడు.. సోదరులిద్దరూ ఒకరి చేతుల్లో ఒకరు చనిపోయారు. తనను ప్రేమించిన ఇద్దరు మహాయోధులు చనిపోయారన్న బెంగతో నిక్టే కూడా మరణించింది. మరణానంతరం స్వర్గానికి వెళ్లిన ఇద్దరు సోదరులూ.. దైవాన్ని క్షమాపణ కోరి, మళ్లీ పుట్టించమని కోరుకున్నారు. అనుగ్రహించిన దేవతలు వారికి పునర్జన్మను ప్రసాదించారు. టిజిక్.. చెచెన్ చెట్టులా.. కినిచ్.. చాకా చెట్టుగా తిరిగి జన్మించారు. అప్పుడే వారికి సమీపంలోనే నిక్టేహా అందమైన తెల్లటి పువ్వులా జన్మించిందట. నిజానికి టిజిక్ వ్యక్తిత్వానికి తగ్గట్టుగా.. చెచెన్ చెట్టు విషాన్ని చిమ్మితే.. దాన్ని సరిచేసే ఔషధంలా కినిచ్.. చాకాలా ప్రేమను పంచుతున్నాడట. అందుకే ఈ పురాణగాథలో చెప్పినట్లే.. అన్నదమ్ములిద్దరూ ఆ చెట్ల రూపంలో ఎక్కడ పుట్టినా కలసే పుడతారట. వారి సమీపంలో నిక్టే కూడా అందమైన పువ్వు రూపంలో జన్మిస్తుందని నమ్ముతారు. ఏదేమైనా.. చెచెన్, చాకా చెట్ల జన్మరహస్యం నేటికీ ఓ మిస్టరీనే. ఈ సృష్టిలో అద్భుతమే. — సంహిత నిమ్మన -
పాము విషానికి విరుగుడు.. ఒంటె కన్నీరు!
ఒంటె కన్నీటిలోని రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనికివస్తాయని శాస్త్రవేత్తలు చేసిన పలు పరిశోధనల్లో వెల్లడయ్యింది. ఈ నేపధ్యంలో ఒంటె కన్నీటితో పాము విషాన్ని తొలగించగల ఔషధాన్ని తయారు చేసే ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాము కాటు కారణంగా ప్రతి సంవత్సరం సుమారు 1.25 లక్షల మంది మరణిస్తున్నారు. కొన్ని పాములు అత్యంత విషపూరితమైనవి. ఇవి కాటువేసినప్పుడు మనిషి బతికేందుకు అవకాశం ఉండదు. ఈ నేపధ్యంలో పాము విషానికి విరుగుడుగా పనికి వచ్చే ఔషధాల తయారీకి నిరంతరం పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దుబాయ్‌లోని సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ (సీవీఆర్ఎల్) ఒంటె కన్నీటిని ఉపయోగించి, పాము విషానికి విరుగుడును తయారు చేయవచ్చని వెల్లడించింది. దుబాయ్‌లోని ఈ ల్యాబ్‌లో దీనిపై చాలా ఏళ్ల క్రితం పరిశోధనలు జరిగినప్పటికీ నిధుల కొరత కారణంగా అవి ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు నిధులను సమకూర్చుకుని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళతామని సీవీఆర్ఎల్ పేర్కొంది. తాము త్వరలోనే పాము విషాన్ని అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే ఔషధాన్ని తయారు చేయనున్నామని ఈ పరిశోధనా కేంద్రం అధిపతి డాక్టర్ వార్నర్ తెలిపారు. ఒంటె కన్నీటిలో అనేక రకాల ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా కాపాడతాయి. ఒంటె కన్నీటిలోని ఔషధ లక్షణాలపై అమెరికా, ఇండియా, తదితర దేశాల్లో పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె కన్నీటిలో లైసోజైమ్‌లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, వైరస్‌లను నిరోధిస్తాయి. ఒంటె కన్నీరే కాదు మూత్రానికి కూడా ఔషదీయ గుణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019