breaking news
-
బీజేపీకి అర్థం కావడం లేదు!.. మండిపడ్డ మాజీ ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ: మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత ఆర్థిక వ్యవస్థ 'తీవ్రమైన సంక్షోభంలో' ఉంది. బీజేపీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2023 - 24లో భారతదేశ ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా ఉందని బీజేపీ చెబుతోంది. ఇదే నిజమైతే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఎందుకు తగ్గుతున్నాయి. దీనికి తగిన వివరణ ఎవరూ ఇవ్వలేకపోతున్నారని అన్నారు. ఎఫ్‌డీఐ అనేది ఒక దేశం, ప్రభుత్వం.. దాని విధానాలపై విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని వివరించారు. విదేశీ పెట్టుబడిదారులకు 2023-24లో అలాంటి విశ్వాసం బాగా తగ్గిపోయిందని చిదంబరం అన్నారు. బీజేపీ తనకు తానుగానే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటోంది. మంచి సర్టిఫికేట్ అనేది విదేశీ & భారతీయ పెట్టుబడిదారుల నుంచి రావాలని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వంపైన పెట్టుబడిదారులు విశ్వాసం వ్యక్తం చేయలేదని ఆయన అన్నారు. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, నిజమైన వేతనాలు నిలిచిపోయాయి, నిరుద్యోగం పెరుగుతోంది.. గృహ వినియోగం తగ్గుతోంది. ఇవి తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఖచ్చితమైన సంకేతాలు. కానీ ఇవన్నీ బీజేపీకి అర్థం కావడం లేదు అని కాంగ్రెస్ నాయకుడు చిదంబరం అన్నారు. BJP claims that the Indian economy is in robust health in 2023-24, but has no explanation why net FDI inflows have dropped by 31 per cent FDI is a measure of the confidence that foreign investors have in a country, the government and its policies. Such confidence has declined… — P. Chidambaram (@PChidambaram_IN) March 28, 2024 -
దమ్ముంటే అక్కడ గెలవండి! చిదంబరానికి మంత్రి హరీష్ రావు కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణాల బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య విమర్శల వేడి రాజుకుంటోంది. ముఖ్యంగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యలపై తెలంగాణా మంత్రి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందంటూ ఎక్స్ (ట్విటర్)లో ఒక పోస్ట్ పెట్టారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందని అపుడుఅధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయారనీ,చరిత్ర తెలియనిది కేసీఆర్‌కి కాదుచిదంబరమే చరిత్ర తెలియకుండా వక్ర భాష్యాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేదనే సంగతిని మర్చి,అప్పట్లో మద్రాసు రాష్ట్రం ఉండేదని, తెలంగాణ రాష్ట్రం లేకుండే అని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయం పై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో బాగుందని గ్రహించాలన్నారు. అలాగే తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికల్ని పరిశీలిస్తే మంచిదని కూడా అన్నారు. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ కాదు పదకొండు సార్లు అవకాశమిచ్చారు. చిదంబరంకు దమ్ముంటే ఆయన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలి. తెలంగాణ సాధించింది కేసీఆర్ . సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మెడల్‌గా నిలిపింది కేసీఆర్ అంటూ ట్వీట్ చేశారు. ఎవరెన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నరు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీనే దీవించబోతున్నారు అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పు భారీగా పెరిగిందని చిదంబరం కేసీఆర్ సర్కార్‌పై ధ్వజమెత్తారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోమాట్లాడిన ఆయనతెలంగాణ అప్పు రూ.3.66లక్షల కోట్లకు చేరుకుందని, ప్రతి తెలంగాణ పౌరుడిపై సగటున రూ. లక్ష అప్పు ఉందని వ్యాఖ్యానించారు. వంట గ్యాస్ సిలిండర్ ధర ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. హైదరాబాద్‌లోనే ఎక్కువనీ, నిరుద్యోగం, అధిక ధరల్ని నియంత్రించడంలో ఇంతచేసినా ప్రభుత్వం విద్య, ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్న నిధులు అరకొరగానే ఉన్నాయని విమర్శించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉంది తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దాన్ని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం చేసింది. 👉 పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉంది. 👉పొట్టి… — Harish Rao Thanneeru (@BRSHarish) November 16, 2023 -
ప్రతిపక్ష నేత ఎంపికపై సందిగ్ధం..! నాన్చుతున్న కాంగ్రెస్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను వచ్చే నెల 7వ తేదీ నుంచి నిర్వహించేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచి్చనప్పటికీ..రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఎవరన్న దానిపై ఇంకా కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చలేదు. తదుపరి ప్రతిపక్ష నేత ఎంపికపై ఇంతవరకూ కాంగ్రెస్ ఎలాంటి చర్చలు జరుపకపోవడంతో ఉత్కంఠ మరికొద్ది రోజులు కొనసాగే అవకాశాలున్నాయి. కనీసం సమావేశాల నాటికైనా కాంగ్రెస్ నిర్ణయం చేస్తుందా? లేక ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గేనే ప్రతిపక్ష„ నేతగా కొనసాగిస్తుందా? అన్నది కొంత ఆసక్తిగా మారింది. ‘ఒక వ్యక్తికి ఒకే పదవి’అన్న కాంగ్రెస్ నిబంధన మేరకు ఏఐసీసీ అధ్యక్షుడిగా నామినేషన్ వేసిన రోజునే ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేస్తూ తన లేఖను అప్పటి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాం«దీకి పంపారు. అనంతరం కొత్త నేతను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్ హోదాలో సోనియాగాంధీ ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ అది జరుగలేదు. ప్రధానంగా పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్‌లలో ఒకరిని ప్రతిపక్ష నేతగా ఎన్నుకుంటారని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా దక్షిణాదికి చెందిన ఖర్గే ఉన్నందున ఉత్తరాదికి చెందిన దిగ్విజయ్‌కు ఎక్కువ అవకాశాలున్నాయని చర్చ జరిగింది. వీరితో పాటే సీనియర్ నేతలు పి.చిదంబరం, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీలపేర్లు చర్చల్లోకి వచ్చాయి. అయితే శీతాకాల సమావేశాల సమయంలోనూ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో జైరా, దిగి్వజయ్ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరూ సభకు హాజరయ్యే అవకాశాలు తక్కువని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఈ నేపథ్యంలో ఖర్గేను శీతాకాల సమావేశాల వరకు ప్రతిపక్ష నేతగా కొనసాగిస్తారంటున్నారు. దీనిపై ఏఐసీసీ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ ‘సమావేశాలకు కొద్ది రోజుల ముందు ప్రతిపక్ష నేత ఎంపికపై నిర్ణయం చేస్తారు’అని వ్యాఖ్యానించారు. చదవండి: ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్ -
గుజరాత్‌ను నడిపిస్తున్నది వారే.. వంతెన ప్రమాదంపై చిదంబరం ఫైర్
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్స్ రచిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ సర్కార్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక, చిదంబంరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నడపడం లేదని.. ఢిల్లీ నుంచి నడుస్తోందని విమర్శించారు. ఇటీవల గుజరాత్లో కుప్పకూలిన మోర్బీ తీగల వంతెన ఘటన దారుణమైందన్నారు. ఈ ఘటన గుజరాత్‌కే తలవంపులు తెచ్చిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ ప్రమాదంపై బీజేపీ ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు ఎవరూ క్షమాపణ చెప్పలేదన్నారు. ఈ ప్రమాద ఘటనకు ఎవరూ బాధ్యత వహించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. కేంద్ర దర్యాప్తు సంస్థలపై కూడా చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఏజెన్సీలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ).. బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాయన్నారు. కేంద్ర ఏజెన్సీల ద్వారా అరెస్టు చేయబడిన వారిలో 95 శాతం మంది ప్రతిపక్ష నాయకులేనని చిదంబరం ఆరోపించారు. ఈ సందర్భంగానే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీపై కూడా సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ముందు దేశ రాజధాని గురించి ఆలోచన చేయాలని హితవు పలికారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, గాలి నాణత్య గురించి ప్రజలు ఆలోచిస్తే.. కేజ్రీవాల్‌కు ఎవరూ ఓటు వేయరని అన్నారు. Gujarat | #MorbiBridgeCollapse has brought shame to the fair name of Gujarat... The most shocking development is that no one, on behalf of the govt, has apologized for the tragedy. No one has resigned taking responsibility: Congress MP P Chidambaram pic.twitter.com/tLs6muBk79 — ANI (@ANI) November 8, 2022 -
కాంగ్రెస్ కొత్త సారథి ఎవరైనా గాంధీల సలహాలు కచ్చితంగా తీసుకోవాలి
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు పార్టీలో గాంధీ కుటుంబం ఉనికిని ఏ మాత్రం ప్రభావితం చేయవని ఆ పార్టీ సీనియర్ నేత పి.చిందరం అభిప్రాయపడ్డారు. కొత్త సారథిగా ఎవరు బాధ్యతలు చేపట్టిన గాంధీల సలహాలు, సూచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎవరు చేపట్టినా రిమోట్ కంట్రోల్ మాత్రం గాంధీల చేతిలోనే ఉంటుందనే ఆరోపణలను చిదంబరం తోసిపుచ్చారు. జిల్లా స్థాయిలో ఓటింగ్ జరిగి అధ్యక్షుడ్ని ఎన్నుకున్న తర్వాత కూడా ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుక్రవారం ఓటింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 9 వేల మంది పార్టీ ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. ఖర్గే గాంధీల విధేయుడని, ఆయన గెలిచినా నడిపించేది గాంధీలేనని విమర్శలు వచ్చాయి. ఈనేపథ్యంలో చిదంబరం స్పందించారు. 2024 ఎన్నికల్లో విజయం కోసం పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని కోరిన నేతల్లో ఆయన కూడా ఉన్నారు. కొత్తగా పార్టీ బాధ్యతలు చేపట్టేవారు సంస్థాగత ఎన్నికలు నిర్వహించి కొత్త నాయకులను ఎన్నుకునేలా చేయాలని, పార్టీలో మార్పులు తీసుకురావాలని తాజాగా సూచించారు. మరోవైపు తాను గెలిస్తే పార్టీలో సమూల మార్పులు తీసుకొస్తానని పోటీకి ముందే శశిథరూర్. ఖర్గే కూడా పార్టీలో యువతకే ఎక్కువ అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు. గాంధీల నుంచి విలువైన సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకుంటానని స్పష్టం చేశారు. ఖర్గే, థరూర్‌లో ఎవరు గెలుస్తారో బుధవారం తెలిపోనుంది. ఆరోజే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. చదవండి: ముగిసిన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.. 96% ఓటింగ్ నమోదు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019