breaking news
-
భారీ ఆర్డర్లకు కొత్త విద్యుత్తు వాహనాలు
స్నేహితులు, కుటుంబ సభ్యులతో జరుపుకుంటున్న చిన్నపాటి వేడుకలకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టేలా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 50 మందికి ఆహారం అందించేలా కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాహనాలు అన్నీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ అని సంస్థ సీఈఓ దీపిందర్ గోయల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలిపారు. పెద్ద ఆర్డర్లకు సంబంధించి ఈ తరహా వాహనాలను ఉపయోగిస్తుండటం దేశంలో ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. ఇంతకుముందు పెద్ద ఆర్డర్లు తీసుకున్నా, సంప్రదాయ డెలివరీ భాగస్వాములే అందించేవాళ్లు అని తెలిపారు. దీని వల్ల వినియోగదారులు ఆశించిన స్థాయిలో సంతృప్తి చెందేవారు కాదని చెప్పారు. కొత్తగా తీసుకొచ్చిన ఈ వాహనాలతో భారీ ఆర్డర్లు పెడుతున్న కస్టమర్ల అవసరాలను తీరుతాయని పేర్కొన్నారు. ఇదీ చదవండి: పెరుగుతున్న దిగుమతులు.. ధరలకు రెక్కలు! ఆ వాహనాల్లో కూలింగ్ కంపార్ట్మెంట్లు, హాట్ బాక్స్‌ల వంటివి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దాంతో వినియోగదారులు కోరుకున్న రీతిలో ఆహార పదార్థాలను డెలివరీ చేసే వీలుందన్నారు. ఇటీవల ‘ప్యూర్‌వెజ్’ పేరుతో తమ వాహానాల కొన్నింటికి రంగు మార్చి విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. దాంతో ఆ నిర్ణయం ప్రకటించిన కొద్ది గంటల్లోనే దాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్‌కాల్
శాకాహారుల కోసం జొమాటో ప్రత్యేకంగా ప్రారంభించిన ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ ఇటీవల వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కొత్త సేవలు ప్రారంభమైన కొద్దిసేపటికే అందులో మార్పులు చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. డెలివరీ బాయ్స్ కోసం ప్రత్యేకంగా గ్రీన్ యూనిఫాం కాకుండా ఎర్ర రంగు దుస్తులు మాత్రమే ఉంటాయని ప్రకటించి వివాదానికి ముగింపు పలికింది. అయితే, శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించడం వెనుక కారణం.. వివాదాస్పదమైన తర్వాత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విషయాలను కంపెనీ సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల ఓ వార్తాసంస్థకు తెలిపారు. జొమాటో వినియోగదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ప్యూర్ వెజ్ ఫ్లీట్ ప్రారంభించామని దీపిందర్ చెప్పారు. తర్వాత ఓ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ‘మీరు మరిన్ని ఆర్డర్లు చేయాలంటే జొమాటో నుంచి ఏం ఆశిస్తున్నారు?’ అని వినియోగదారులను అడిగినట్లు చెప్పారు. దీంట్లో చాలా మంది శాకాహారుల కోసం మరేదైనా ప్రత్యేక సేవలు అందించాలని సూచించినట్లు తెలిపారు. దీనిపై సుదీర్ఘ చర్చల తర్వాత ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలను ప్రారంభించామన్నారు. అయితే, ఆ పదాల్లో ఉన్న నిగూఢార్థం తమకు తెలియదని.. ఇంతటి వివాదానికి కారణమవుతుందని ఊహించలేదన్నారు. సోషల్ మీడియాలో వివాదం తలెత్తిన తర్వాతే అసలు విషయం అర్థమైందన్నారు. ఇదీ చదవండి..డెబిట్ కార్డు యూజర్లపై భారంమోపిన ప్రముఖ బ్యాంక్ సామాజిక మాధ్యమాల్లో వివాదానికి తెరలేపే వార్తలు వైరల్‌గా మారిన నేపథ్యంలో వెంటనే దాదాపు 20 గంటల పాటు జొమాటోలోని ఉన్నతోద్యోగులందరూ జూమ్ కాల్లో చర్చించామని చెప్పారు. సమస్యను ఎలా పరిష్కరించాలో మంతనాలు జరిపినట్లు తెలిపారు. చివరకు గ్రీన్ యూనిఫామ్ తొలగించాలనే నిర్ణయానికి వచ్చామన్నారు. కొత్త సేవల వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. -
రెండోపెళ్లి చేసుకున్న జొమాటో సీఈవో.. అమ్మాయి ఎవరంటే!
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్(41) రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. మెక్సికన్‌కు చెందిన మోడల్ గ్రేసియా మునోజ్‌ను దీపిందర్ పెళ్లి చేసుకున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ వివాహం జరిగి మాత్రం నెలవుతుందని సమాచారం. తాజాగా గోయల్, గ్రేసియో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో విషయం ఆరా తీశారు. దాంతో ఇద్దరికీ వివాహం జరిగినట్లు తెలిసింది. మునోజ్ ఇన్స్టాగ్రామ్ వివరాల ప్రకారం.. ఆమె మెక్సికోలో జన్మించారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. గతంలో మోడలింగ్ చేసిన ఆమె.. ఇప్పుడు సొంతంగా లగ్జరీ కన్జూమర్ప్రొడక్ట్లకు సంబంధించి ఒక స్టార్టప్ నడుపుతున్నారు. 2022 ఏడాదికిగాను మెట్రోపాలిటన్ ఫ్యాషన్‌వీక్ విజేతగా నిలిచారు. దీపిందర్‌కు ఇది రెండో పెళ్లి. ఆయన ఐఐటీ దిల్లీలో చదువుతున్నపుడు కంచన్ జోషితో పరిచయం ఏర్పడింది. దాంతో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కంచన్ దిల్లీ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. దీపిందర్.. 2008లో హరియాణాలోని గురుగ్రామ్ కేంద్రంగా జొమాటో సంస్థను స్థాపించారు. కన్సల్టింగ్ సంస్థలో ఉద్యోగాన్ని వదిలి.. ఆహార డెలివరీ యాప్ ప్రారంభించారు. దేశంలో వెయ్యికి పైగా నగరాల్లోకి దీని కార్యకలాపాలు విస్తరించాయి. సుమారు రూ.1.5లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ కలిగిన జొమాటో ఇటీవల శాకాహారుల కోసం ప్రత్యేక సేవలు ప్రారంభించి వివాదంలోకి వెళ్లింది. ఇదీ చదవండి: మొదటి విద్యుత్‌కారును ఆవిష్కరించిన ఫేమస్ కంపెనీ ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో కొత్త సేవలు మొదలుపెట్టింది. అయితే ఆ ఫ్లీట్‌లో డెలివరీ స్టాఫ్‌కు ప్రత్యేకంగా గ్రీన్‌కలర్ డ్రెస్‌కోడ్ ఉంటుందని ప్రకటించడంతో వివాదం చెలరేగింది. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. View this post on Instagram A post shared by Grecia Muñoz (@greciamunozp) -
జొమాటో యూనిఫామ్‌లో మార్పులు.. క్షణాల్లోనే నిర్ణయం వెనక్కి..
ప్రత్యేకంగా శాకాహారమే కోరుకునే వినియోగదారుల కోసం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ పేరుతో ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొత్త సేవలు ప్రారంభించింది. శాకాహారుల కోరిక మేరకే ఈ సేవలు ప్రారంభించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. అయితే ఈ ప్రకటన చేసిన సమయంలో డెలివరీ స్టాఫ్‌కు ప్రత్యేకంగా గ్రీన్‌కలర్ డ్రెస్‌కోడ్ ఉంటుందని ప్రకటించారు. అలా ప్రకటన వెలువరించిన కాసేపటికే కంపెనీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇకపై అందరూ ఎర్ర రంగు యూనిఫామ్‌ను ధరిస్తారని చెప్పింది. అయితే ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. వెజ్ ఆర్డర్లను అందించడానికి ప్రత్యేక సిబ్బంది ఉంటారని కంపెనీ వివరించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వ్యతిరేక సామాజిక పరిణామాలు ఎదురైతే మాత్రం ‘ప్యూర్ వెజ్ ఫ్లీట్’ను వెంటనే నిలిపివేస్తామని దీపిందర్ గోయల్ తెలిపారు. ఆకుపచ్చ యూనిఫామ్ ధరించడంపట్ల కొన్ని సమాజిక వర్గాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్యూర్ వెజ్ ఫ్లీట్ వెనుక ఎలాంటి రాజకీయ, మతపరమైన ఉద్దేశాలు లేవని గోయల్ స్పష్టం చేశారు. ‘చాలామంది వినియోగదారులు నిత్యం నాన్‌వెజ్ ఆర్డర్ చేస్తారు. డెలివరీ సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ డెలివరీ బాక్సుల్లో పదార్థాలు కొన్నిసార్లు ఒలికిపోయే అవకాశం ఉంటుంది. దాంతో ఆ వాసన అలాగే ఉండిపోతుంది. తదుపరి ఆర్డర్ చేసే శాకాహార వినియోగదారులకు అది ఒకింత ఇబ్బంది కలిగించే అంశం. దాంతో ఫ్లీట్‌ను విభజించాం. కొంతమంది ప్యూర్ వెజిటేరియన్ హోటళ్ల నుంచి మాత్రమే ఫుడ్ ఆర్డర్ పెడతారు. వారిని దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయం తీసుకున్నాం’ అని సీఈఓ వివరించారు. భారత్‌లోనే అత్యధిక శాతం శాకాహారులు ఉన్నారని గోయల్ తెలిపారు. ఆహారం వండే విధానం, దాన్ని నిర్వహించడంపై వారు ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉంటారని అన్నారు. కేవలం శాకాహారమే అందించే రెస్టారెంట్ల ఎంపిక, నాన్-వెజ్ ఆహారాన్ని మినహాయించడం వంటివి ఫ్యూర్ వెజ్ మోడ్‌లో ఉంటాయి. ఇదీ చదవండి: ఉద్యోగుల జీతాల పెంపునకు టీసీఎస్ ఎస్? ఫ్యూర్ వెజ్ ఫ్లీట్ ఆహారాన్ని డెలివరీ చేసేందుకు జొమాటో సాధారణంగా వినియోగించే ఎర్ర బాక్సుల స్థానంలో ఆకుపచ్చ డెలివరీ బాక్స్‌లను వినియోగించనుందని ముందుగా ప్రకటించింది. కొన్ని వర్గాల నుంచి సామాజిక మాధ్యమాల్లో విమర్శలు రావడంతో డెలివరీ బాక్స్‌లు, యూనిఫామ్ విషయంతో ప్రకటనను తిరిగి వెనక్కి తీసుకుంది. కానీ ప్యూర్ వెజ్ ఫ్లీట్ సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. Update on our pure veg fleet — While we are going to continue to have a fleet for vegetarians, we have decided to remove the on-ground segregation of this fleet on the ground using the colour green. All our riders — both our regular fleet, and our fleet for vegetarians, will… — Deepinder Goyal (@deepigoyal) March 20, 2024 -
మనుషుల్లేకుండా ఫుడ్ డెలివరీ.. వీడియో వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో రోబోల వాడకం ఎక్కువవుతోంది. మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు అవి వెళ్తున్నాయి.. చేయలేని పనులు చేస్తున్నాయి. భవిష్యత్తులో మానవులు నేరుగా చేసే పనుల స్థానాల్లో క్రమంగా రోబోల సంఖ్య పెరుగుతుంది. జపాన్ వంటి కొన్ని దేశాల్లో కార్మికుల కొరత అధికమవుతోంది. వారిస్థానాలను భర్తీ చేసేలా రోబోలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఉబర్ ఈట్స్ సంస్థ ఫుడ్ డెలివరీ చేయడానికి జపాన్‌లో రోబోలను వినియోగిస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ ఉబర్ ఈట్స్ జపాన్‌లో ఫుడ్ డెలివరీ కోసం రోబోలను రంగంలోకి దించింది. డెలివరీ బాయ్స్‌కు బదులుగా రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసే సర్వీసులను ఇటీవల ప్రారంభించింది. దేశం ఎదుర్కొంటున్న కార్మికుల కొరత సమస్యను ఇది తీరుస్తుందని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ రోబోల సేవలను టోక్యోలోని రెండు స్టోర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో వీటిని మరిన్ని స్టోర్లకు విస్తరిస్తామని చెప్పారు. కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తాయి. 27 లీటర్ల పానీయాలు, 27 కేజీల ఆహారాన్ని ఏకకాలంలో తీసుకుపోయే సామర్థ్యం వీటిటి ఉందని కంపెనీ వివరించింది. ఇదీ చదవండి: ప్రపంచం వాడుతున్న జర్మన్ ఆవిష్కరణలు ఉబర్ ఈట్స్ సంస్థ కార్ట్కెన్ అండ్ మిసుబుషి ఎలక్ట్రిక్ కంపెనీతో కలిసి టోక్యోలో ఈ రోబోలను వినియోగిస్తుంది. ఇవి ‘మోడల్ సీ’ రోబోలుగా ప్రసిద్ధి చెందాయి. స్టార్‌షిప్ టెక్నాలజీస్ అమెరికాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీలో మొదట రోబోల ద్వారా ఫుడ్ డెలివరీ చేసి రికార్డుల్లో నిలిచింది. డెలివరీ రోబోట్లను ఫుడ్ డెలివరీ, ప్యాకేజీ డెలివరీ, హాస్పిటల్ డెలివరీ, రూమ్ సర్వీస్ వంటి విభిన్న అవసరాలకు వాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 食品宅配サービスを手掛けるウーバーイーツジャパン(東京)は5日、自律走行ロボットによる配送を東京・日本橋エリアで6日に始めると発表しました。記事→https://t.co/jbVVrbcb22 #ウーバーイーツ #ロボット配送 #ubereats pic.twitter.com/oWbYjRGrn0 — 時事通信映像ニュース (@jiji_images) March 5, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019