breaking news
-
Kitchen Tips: ఈ చిన్న చిన్న పదార్థాలతో ఇబ్బందా? అయితే ఇలా చేయండి!
కిచెన్‌లో.. వంటచేసేటప్పుడు చిన్న చిన్న వస్తువులతో విసిగిపొతూంటాం. కొన్నిరకాల తిను బండారాలను కాపాడలేక, మరికొన్ని వస్తువులను ఎక్కువకాలం నిల్వచేయలేక ఇబ్బంది పడుతూంటాం. అలాగే కొన్ని పదార్థాలనుంచి వెలువడే చెడు వాసనతో కూడా తలనొప్పిగా భావస్తాం. మరి వీటినుంచి బయటపడాలంటే ఈ కిచెన్టిప్స్ ఓసారి ట్రై చేయండి.. కుల్చానుకాల్చేటప్పుడు.. పాన్ మీద కుల్చాను వేసి చుట్టుపక్కల కొద్దిగా నీళ్లు చల్లి మూతపెట్టాలి. ఒక వైపు కాలాక మరో వైపు తిప్పి చుట్టుపక్కల కొద్దిగా నీళ్లు చల్లి మూతపెడితే కుల్చా చక్కగా కాలుతుంది. చివరగా నూనె లేదా నెయ్యి చల్లుకుని సర్వ్ చేసుకుంటే కుల్చా చక్కగా కాలి రుచిగా వస్తుంది. ఉల్లిపాయ తరిగాక.. ఉల్లిపాయను ముక్కలుగా తరిగాక చేతులు ఉల్లివాసన వస్తుంటాయి. ఇలాంటప్పుడు బంగాళ దుంప ముక్కతో చేతులను ఐదు నిమిషాలు రుద్ది, తరువాత నీటితో కడిగితే ఉల్లివాసన వదులుతుంది. ఇవి చదవండి: సమ్మర్ సీజన్ కదా అని.. తొందరపడి పచ్చళ్లు పెట్టేస్తున్నారా! -
ఉల్లితో కలిగే ప్రయోజనాలు..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చిన్నప్పటి నుంచి విన్నదే. అయితే, దానివల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే మాత్రం మనమే మరొకరికి చెబుతాం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని... ఇంతకీ ఉల్లి ఏం మేలు చేస్తుందో, ఎలా చేస్తుందో తెలుసుకుందాం. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచిచేసే ఎన్నో పోషకాలనిస్తుందని పరిశోధనలలో వెల్లడైంది. పచ్చిఉల్లిని ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ అదుపులో ఉంటుందని పరిశోధనల్లో తెలిసింది. అంతేకాదు, ఉల్లిని తినడం వల్ల ఎలాంటి దుష్పలితాలూ ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గి, హార్ట్స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి. ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. ఉల్లిపాయను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌తో కలిపి తింటూ ఉంటే జీర్ణసంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను రోజూ ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే రుతుక్రమ సమస్య తగ్గిపోతుంది. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బీపీ, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు. రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తింటే, వేసవిలో వడదెబ్బ ముప్పు తప్పుతుంది. దీనితోపాటు, పచ్చి ఉల్లిపాయలో వేసవి వేడి నుండి రక్షించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. నిద్రకు ముందు పచ్చి ఉల్లిపాయ తినడం నిద్రలేమిని దూరం చేస్తుంది. జలుబు, కఫంలో ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది. ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి. ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సీ, కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉల్లి అనేకరకాల క్యాన్సర్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితోపాటు, ఉల్లిపాయ తినడం వల్ల కడుపు, పెద్దప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తులు ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి తగ్గుతాయి. ఉల్లి కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి కాపాడే ఆహారంలో ఉల్లిదే అగ్రస్థానం.. ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. పచ్చిఉల్లిపాయను రోజు తింటే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధ సమస్యల్ని దూరం చేస్తాయి. ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల జుట్టు రాలడంతోపాటు చుండ్రు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. జుట్టు పెరుగుతుంది. మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడేవారికి ఉల్లి మంచి ఔషదం. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజూ ఉదయం తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. తేనెటీగలు లేదా తేలు కుట్టినప్పుడు ఉల్లి రసాన్ని రాస్తే సత్వర ఉపశమనం ఉంటుంది. ఇవి చదవండి: శ్రామికలోక శక్తిమంతులు. -
Onion skin: ఉల్లిపాయ పొట్టుతో ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
సాధారణంగా వంటల్లో ఉల్లిపాయలను అందరమూ వాడుతుంటాం. కొంతమంది వాసన పడక, మరికొంతమంది ఉపవాసాల సమయంలోనూ ఉల్లిపాయలను పక్కనపెట్టేస్తారు. అయితే ఉల్లిపాయలు మాత్రమేకాదు ఉల్లిపాయ తొక్కలు లేదా పొట్టు వల్ల ఆశ్చర్యకరమైన ప్రయోజనాలున్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అన్నట్టు ఉల్లిపాయ తొక్కల్లో కూడా మంచి పోషకాలు ఉన్నాయి. ఉల్లిపాయల్లో యాంటీ బయోటిక్, యాంటీ సెప్టిక్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉండి వీటిని తినడం ద్వారా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనల్ని కాపాడుతాయి. వీటిలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బీ, సీ సమృద్ధిగా ఉంటాయి. అదేవిధంగా కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం చాలా తక్కువగా ఉండి మనకు ఆరోగ్యాన్నిస్తాయి. క్వెర్సెటిన్ లాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలను ఉల్లిపాయ తొక్కల్లో ఉన్నాయని అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే ఉల్లి తొక్కలతో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి చర్మం, జుట్టుకు మేలు చేకూరుస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో సాయపడతాయి. అంతేకాదు ఉల్లి పొట్టు మంచి కంపోస్ట్‌గా ఉపయోపడుతుంది. టీ, హెయిర్ డై, టోనర్‌గా, ఫ్లేవర్ ఏజెంట్‌గా, కంపోస్ట్‌గా.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో చూద్దాం. ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు టీ ఉల్లిపాయ తొక్కతో చేసిన టీ తాగడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుందట వీటిని నీటిలో 10 నుంచి 20 నిమిషాలు ఉడకబెట్టి వడపోసి తరువాత ఈ టీని తాగొచ్చు. ఊబకాయం, అధిక రక్తపోటు, ఇన్ఫెక్షన్లను నియంత్రిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మసాలా ఉల్లిపాయ తొక్కలను పారేయకుండా శుభ్రంగా కడిగి రెండు సార్లు కడగాలి. వీటిని ఎండలో ఆరబెట్టి పొడిచేయాలి. ఆరునెలలపాటు నిల్వ ఉండే ఈ పొడి మసాలాలో కలుపుకుని కూరల్లో వేసుకుంటే..కూర మంచి రుచిగా ఉంటుంది. రుచి, సువాసన స్టాక్, సూప్, గ్రేవీ మరుగుతున్న సమయంలో ఉల్లిపాయ తొక్కలను జోడించడం ద్వారా మంచి రుచితోపాటు శక్తివంతమైన రంగును అందిస్తుంది. గ్రేవీని చిక్కగా మారుస్తుంది. ఉడకబెట్టిన తర్వాత పీల్స్ తొలగించడం మర్చిపోవద్దు. చర్మం రోగాలకు ఉల్లిపాయ తొక్కలు యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉండి చర్మం, దద్దుర్లు, అథ్లెట్స్ ఫుట్‌పై దురదను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మంపై ఉల్లిపాయ తొక్క నీటిని అప్లై చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. హెయిర్ డై సల్ఫర్ పుష్కలంగా ఉండే ఉల్లిపాయ తొక్కలను ఉపయోగించి నెరిసిన జుట్టు రంగు మార్చుకోవచ్చు. ఇది హెయిర్ ఫోలికల్స్‌కు పోషణ అందించడం ద్వారా బూడిద జుట్టును బంగారు గోధుమ రంగులోకి మారుస్తుంది. అలాగే, జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయ తొక్కలు నల్లగా కాలింత వరకు మీడియం మంట మీద వేడి చేసి తొక్కలను మెత్తగా నూరాలి. దీనికి కొద్దిగా కలబంద జెల్ లేదా నూనె కలపాలి. ఇలా చేసుకున్న జెల్‌ను నేరుగా హెయిర్ డైలా అప్లై చేసి గ్రే హెయిర్‌ను కవర్ చేసుకోవచ్చు. మంచి నిద్రకు ఉల్లిపాయ తొక్కలలో ఉండే ఎల్-ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సహజమైన మత్తుమందులా పనిచేస్తుంది. ఉల్లిపాయ తొక్క టీ తాగడం వల్ల నరాలు ప్రశాంతతను పొందుతాయి. మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. హెయిర్ టోనర్ పొడి జుట్టు, నిస్తేజమైన జుట్టు కోసం ఉల్లిపాయ తొక్కలను హెయిర్ టోనర్‌గా వాడుకోవచ్చు. ఉల్లిపాయ తొక్కలను నీళ్లలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగించడం ద్వారా ఈ టోనర్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని సీసాలో నిల్వ చేసుకుని అప్పుడప్పుడు జుట్టుకు పట్టించాలి. మంచి కంపోస్ట్‌గా మిద్దె తోటల్లో, బాల్కనీ గార్డెన్ ఉల్లి తొక్కల కంపోస్ట్ బాగా ఉపయోపడుతుంది. మొక్కల పెరుగుదలను ప్రోత్సహించే అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. గులాబీ, మల్లి లాంటి ఇతర పూల మొక్కలకు ఈ కంపోస్ట్ మంచి టానిక్‌లా ఉపయోపడుతుంది. ఉల్లిపాయ తొక్కల్లో మొక్కలకు బలాన్నిచ్చే ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. సహజరంగుగా ఉల్లిపాయ తొక్కలను నీటిలో ఉడకబెట్టి ఆ రంగును సహజ రంగులుగా వాడతారు. ఉల్లి రకాన్ని బట్టి బంగారు-పసుపు , డార్క్ ఆరెంజ్ రంగు వస్తుంది. హస్తకళాకారులు, చేతివృత్తులవారు ఈ సహజ రంగును వివిధ ఫాబ్రిక్ ,పేపర్ కోసం ఉపయోగిస్తారు. జాగ్రత్త: ఉల్లిపాయ తొక్కను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇది కొంతమంది వ్యక్తులలో అలెర్జీ రావచ్చు. అలాగే కొన్ని రకాల ఉల్లిపాయలపై అప్పుడప్పుడు నల్లటి ఫంగస్ లాంటిది ఉంటుంది. సో శుభ్రమైన హెల్దీగా ఉన్నవాటిని తీసుకొని, నీటిలో బాగా కడిగి వాడుకోవడం ఉత్తమం -
అలరిస్తున్న ఉల్లి, ఇసుకల శాంతాక్లాజ్ శిల్పం!
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన శాంతా క్లాజ్‌ను రూపొందించారు. ఉల్లిపాయలు,ఇసుక సహాయంతో సుదర్శన్ పట్నాయక్ ఈ శాంతా క్లాజ్‌ని తీర్చిదిద్దారు. పట్నాయక్ తనదైన శైలిలో ప్రజలకు సందేశం ఇచ్చారు. శాంతాక్లాజ్ సైకత శిల్పం ముందు క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాయడంతోపాటు ఈ భూమిని సస్యశ్యామలం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ భారీ సైకత శిల్పం తయారీకి రెండు టన్నుల ఉల్లిని వినియోగించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపారు. ప్రతి సంవత్సరం, క్రిస్మస్ సందర్భంగా పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో విభిన్న శిల్పాలను రూపొందించడానికి ప్రయత్నిస్తుంటానని పట్నాయక్ చెప్పారు. ఈసారి ఉల్లిపాయలు, ఇసుకతో ప్రపంచంలోనే అతిపెద్ద శాంతా క్లాజ్‌ని తయారుచేశానని తెలిపారు. ఈ శాంతాక్లాజ్ సైకత శిల్పం 100 అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దారు.ఈ సైకత శిల్పం తయారు చేసేందుకు ఎనిమిది గంటల సమయం పట్టిందని పట్నాయక్ తెలిపారు. కాగా వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇండియా ఈసైకత శిల్పాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద శాంతాక్లాజ్ సైకత శిల్పంగా ప్రకటించింది. ఇది కూడా చదవండి: ‘వాజపాయి ప్రధాని కావడం తథ్యం’.. నెహ్రూ ఎందుకలా అన్నారు? Our World's biggest Onion and Sand installation of #SantaClaus. Set a New World record. The Chief Editor Sushma Narvekar and Senior Adjudicator Sanjay Narvekar of World Record Book of India declared it as a new world record and they presented me official certificate and a medal… pic.twitter.com/IzseZTpVsn — Sudarsan Pattnaik (@sudarsansand) December 25, 2023 -
ఉల్లి ఎగుమతులు నిషేధించిన భారత్.. కారణం ఇదే..
దేశీయ మార్కెట్లో ఉల్లి ధరలు మళ్ళీ కొండెక్కుతున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుదలవైపు దూసుకెళ్తున్న ఉల్లి ధరలు ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో హాఫ్ సెంచరీ (రూ. 50) దాటేశాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే సూచనలున్నట్లు భావిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరల పెరుగుదలను నియంత్రణలో ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం 2024 మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులను నిషేదించింది. దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్లను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) వెల్లడించింది. ప్రజలకు తక్కువ ధరలోనే ఉల్లి అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు నుంచి (డిసెంబర్ 8) నిషేధం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎగుమతికి సిద్దమైన ఉల్లిని ఎగుమతి చేసుకోవచ్చని, కొత్తగా ఎగుమతి చేయడం కుదరదని డీజీఎఫ్టీ ప్రకటించింది. ఇతర దేశాల అభ్యర్థనలను భారత ప్రభుత్వం అనుమతిస్తే.. ఆ దేశాలకు మాత్రమే ఉల్లి ఎగుమతి జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. లోన్ తీసుకున్న వారికి శుభవార్త ఉల్లి ధరలను అదుపు చేయడానికి కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా కేంద్రం అనేకసార్లు ఎగుమతులను నిషేదించింది. అయితే 2024 మార్చి 31 తరువాత ఎగుమతులు యధాతధంగా కొనసాగుతాయా? లేదా నిషేధం ఇంకా పొడిగించబడుతుందా అనేది తెలియాల్సి ఉంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019