breaking news
-
రేవంత్ కాంగ్రెస్‌లో ఉండటమే పెద్ద తప్పు: ఎంపీ అర్వింద్
సాక్షి, నిజామాబాద్: వందరోజుల్లో అమలు కాని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు.. ఆగస్టు తర్వాత ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ అర్వింద్. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారనున్నాయన్నారు. హస్తం పార్టీకి ఇవే చివరి ఎన్నికలని అన్నారు. ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీటుకే గ్యారంటీ లేదని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకీ ఎదుగుతుందన్నారు. ఇతర పార్టీలతో లాలూచీ పడే అవసరం బీజేపీకి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి 12 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారన్నారు. వారు చెప్పినట్లు బీజేపీ 12 సీట్లు వస్తే సీఎం రేవంత్‌ను దేవుడే కాపాడాలని పెటైర్లు వేశారు. నిజామాబాద్ నగరంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్ధుడే కానీ.. ఆయన కాంగ్రెస్‌లో ఉండటమే పెద్ద తప్పని అన్నారు. కాంగ్రెస్ నేతలు రేవంత్‌ను పనిచేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఉంటే ఎవరికైనా రాజకీయ భవిష్యత్తు ఉండదని అన్నారు. ఎంపీ అర్వింద్ కామెంట్స్ కాంగ్రెస్ 100 రోజుల్లో ఏ గ్యారెంటీ నెరవేర్చలేదు. ఇప్పుడు ఆగస్టులో రుణమాఫీ అని మరోసారి మోసానికి తెరలేపింది. అవినీతి చేసిన వారికి శిక్ష తప్పదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే షుగర్ ఫ్యాక్టరీలు నెల రోజుల్లో పనిచేసే ప్రక్రియను ప్రారంభిస్తాం. నిజామాబాదు పార్లమెంటు పరిధిలో ఆధ్యాత్మిక, టూరిజం కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం మా ఏకైక గ్యారెంటీ మోదీనే. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని మోడీ ప్రభుత్వం నెరవేర్చుతుంది. మోదీ మూడో టర్మ్‌లో కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తాం. రైల్వే విభాగంలో కొత్త విప్లవం రాబోతుంది. రానున్న రోజుల్లో 25 వేల కి.మీ.ల కొత్త రైల్వే లైన్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ హిందు వ్యతిరేక పార్టీ. -
MLC Kavitha: కవితకు బిగ్ షాక్.. ఈడీ మరో సంచలన నిర్ణయం!
సాక్షి, నిజామాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు నిజామాబాద్‌పై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. కవిత ఆస్తులపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కవిత భర్త, బంధువులపై కూడా నిఘా పెట్టారు. వారికి సంబంధించిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈడీ అధికారులు నిజామాబాద్‌కు వెళ్లనున్నట్టు సమాచారం. ఇక, కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, ఆమె భర్త అనిల్ వ్యాపార లావాదేవీలు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలను సేకరిస్తున్నారు. ఇదే సమయంలో కవిత ఆస్తులకు బినామీలు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు పనిచేసి బదిలీ అయిన కీలక అధికారితో పాటు ఓ రెవెన్యూ ఉద్యోగిపైనా ఈడీ అధికారులు ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇలాంటి అన్ని వివరాల సేకరణ తర్వాత ఈడీ అధికారులు నిజామాబాద్‌కు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మేనల్లుడు మేక శరణ్ పేరును ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో సమర్పించిన అఫిడవిట్లో ప్రస్తావించింది. కవిత ఇంట్లో జరిపిన సోదాల్లో మేక శరణ్ ఫోన్ లభించిందని, రెండు సార్లు పిలిచినా శరణ్ విచారణకు రాలేదని కోర్టుకు ఈడీ తెలియజేసింది. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ దే కీలక పాత్ర ఉన్నదని మేక శరణ్ కవితకు అత్యంత సన్నిహితుడని, కవిత అరెస్ట్ సమయంలో శరణ్ ఇంట్లోనే ఉన్నారని ఈడీ తన అఫిడవిట్లో పేర్కొంది. అరెస్ట్ సమయంలో శరణ్ ఫోన్‌ను సీజ్ చేసి పరిశీలించగా అందులో సౌత్ లాబీకి సంబంధించిన లావాదేవీల సమాచారం గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఈడీ అతడిపై దృష్టి సారించింది. ప్రస్తుతం మేక శరణ్ అందుబాటులో లేరని తెలుస్తోంది. -
శ్రీరాంసాగర్ జలాశయంలో ముగ్గురు యువకులు గల్లంతు
సాక్షి, నిజామాబాద్: మహాశివరాత్రి పండుగపూట నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్సీ లక్ష్మీ కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద శుక్రవారం జరిగింది. గల్లంతైన యువకులను సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. వీరంతా జక్రాన్‌పల్లి మండలం గున్యా తండా వాసులుగా గుర్తించారు యువకులు మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికులు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చదవండి: మహాశివరాత్రి నాడు విషాదం.. కరెంట్ షాక్‌తో 14 మంది చిన్నారులకు గాయాలు -
లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన సెక్యూరిటీ గార్డు
-
నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్దే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అత్యధిక ఓట్లు వచ్చాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈ సారి త్రిముఖ పోరు జరగనుందని అన్నారు. నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకు పార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పై కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ప్రశాంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, ఇతర నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చదవండి: బీఆర్ఎస్కు షాక్.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం ‘హస్త’గతం
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
RSS Fix check 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019