breaking news
-
రాబిన్ హుడ్‌తో జోడీ?
హీరో నితిన్–హీరోయిన్ రాశీ ఖన్నా మరోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. నితిన్–రాశీ ఖన్నా ‘శ్రీనివాస కళ్యాణం’ (2018) మూవీలో జోడీగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ‘రాబిన్ హుడ్’ సినిమాలో నటించనున్నారని టాక్. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్–డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న ద్వితీయ చిత్రం ‘రాబిన్ హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. అయితే ఈ మూవీలో కథానాయిక ఎవరు? అనే విషయంపై స్పష్టత లేదు. తొలుత రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తారనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. తాజాగా రాశీ ఖన్నాని తీసుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి నితిన్‌కి జోడీగా రాశీ ఖన్నా ఫిక్స్ అయ్యారా? లేకుంటే మరో హీరోయిన్ తెరపైకి వస్తారా? అనే విషయంపై చిత్ర యూనిట్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
రాబిన్‌హుడ్ డేట్ ఫిక్స్
నితిన్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’ విడుదల తేదీ ఖరారు అయింది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు ΄ోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘అన్ని వాణిజ్య అంశాలతో పాటు వినోదంతో రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తారు. తన గెటప్ నుండి క్యారెక్టరైజేషన్ వరకు పూర్తిగా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేస్తున్నారు వెంకీ కుడుముల. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు మా సినిమాకి కలిసి రానున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: సాయి శ్రీరామ్. -
సోదరుడే కాలయముడై..
మైసూరు: ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమించిందనే కోపంతో చెల్లిని సొంత అన్న చెరువులోకి తోసేయగా.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన తల్లి కూడా జలసమాధి అయ్యింది. ఈ దారుణం మైసూరు జిల్లా హుణసూరు తాలూకా మరూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. మరూరుకు చెందిన సతీశ్, అనిత(43) దంపతుల కుమారుడు నితిన్ కూలి పనులకు వెళ్తుండగా.. ధను శ్రీ(18) బీకాం రెండో సంవత్సరం చదువుతోంది. ఈక్రమంలో మారూరుకు పొరుగున ఉన్న హనగోడు గ్రామానికి చెందిన ఇతర మతస్తుడైన యువకుడిని ధనుశ్రీ ప్రేమిస్తోంది. ఈ విషయం తెలిసిన నితిన్ తరుచూ ధనుశ్రీతో గొడవ పడేవాడు. మంగళవారం సాయంత్రం బంధువులకు బాగా లేదంటూ నితిన్ బైక్‌పై తన సోదరి ధనుశ్రీని, తల్లి అనితను బయటకు తీసుకెళ్లాడు. ఊరి బయట ఉన్న చెరువు వద్ద ధనుశ్రీ ప్రేమ విషయమై వారి మధ్య గొడవ జరిగింది. ఇంతలో పట్టరాని కోపంతో నితిన్ తన చెల్లి చేతులను టవల్‌తో కట్టేసి చెరువులోకి తోసేశాడు. ఆ వెంటనే కుమార్తెను కాపాడుకునేందుకు తల్లి అనిత కూడా చెరువులోకి దూకింది. దీంతో తల్లిని రక్షించేందుకు నితిన్ నీటిలోకి దూకాడు. కానీ తల్లీకూతురు నీళ్లలో మునిగి మరణించారు. ఆ తర్వాత నితిన్ ఇంటికి వచ్చి తండ్రి సతీశ్‌కు ఈ విషయం తెలియజేశాడు. బుధవారం ఉదయాన్నే గ్రామస్తులు, ఫైర్ సిబ్బంది చెరువులో గాలించి అనిత, ధనుశ్రీ మృతదేహాలను బయటకు తీశారు. హుణసూరు రూరల్ పోలీసులు నితిన్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. -
ఈగోని పక్కన పెడితే ఆడియన్స్‌కి దగ్గరవుతాం
‘‘గ్లోబల్ స్థాయికి వెళ్లాలని ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ సినిమాలను చేయలేదు. కథాబలం ఉండటంతో ఆ సినిమాలను జపాన్ వంటి ఇతర దేశాల ప్రేక్షకులూ ఆదరించారు. గ్లోబల్ అప్పీల్ ఉన్న కథ కోసం ఎదురు చూస్తూ ఉంటే టైమ్ వృథా అవుతుంది. నాకు వచ్చిన కథలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ క్రమంలో పాన్ ఇండియా కథ ఏదైనా సెట్ అయితే ఓకే. అయినా నాకలాంటి పెద్ద పెద్ద ఆశలు లేవు. తెలుగులోనే సినిమాలు చేయాలని ఉంది’’ అని హీరో నితిన్ అన్నారు. నితిన్, శ్రీ లీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో నితిన్ చెప్పిన విశేషాలు. ► ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’లో నా పాత్రలో త్రీ షేడ్స్ ఉన్నాయి. కథ రీత్యా జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపిస్తాను. అలా అని ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుల కష్టాల గురించి చెప్పడం లేదు. ఆ పాత్ర నుంచి కామెడీ పండించాం. ‘ఎక్స్ట్రా’ చిత్రంలో ఇంట్రవెల్లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. కథ కొత్తది కాక΄ోవచ్చు కానీ పాయింట్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కథ విన్నప్పుడల్లా హాయిగా నవ్వుకున్నాను. కథ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్. ►వక్కంతం వంశీగారి కథలతో వచ్చిన ‘కిక్’, ‘రేసు గుర్రం’, ‘ఊసరవెల్లి’, ‘టెంపర్’ చిత్రాలను గమనిస్తే హీరో క్యారెక్టరైజేషన్ కొత్తగా, విభిన్నంగా ఉంటుంది. ‘ఎక్స్ట్రా’ చిత్రంలోనూ ఇలానే ఉంటుంది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ►సినిమాలో రావు రమేశ్‌గారు నాకు తండ్రిగా నటించారు. ఆయనకు, నాకు మధ్య వచ్చే సీన్స్ వినోదాత్మకంగా ఉంటాయి. కొంత సెంటిమెంట్ కూడా ఉంటుంది. రాజశేఖర్‌గారు సెకండాఫ్‌లో వస్తారు. సందర్భానుసారంగా కామెడీ వస్తుంటుంది. ►సినిమాలో నేను జూనియర్ ఆర్టిస్టు్టను కాబట్టి ‘శ్రీమంతుడు’, ‘బాహుబలి’ వంటి సినిమాల ప్రస్తావనతో కాస్త కామెడీ ఉంటుంది. వినోదం కోసమే ఇలా చేశాం. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాల్లో వెంకటేశ్‌గారి పాత్రపై ఇతర పాత్రధారులు జోక్స్ వేస్తుంటారు. ఇమేజ్, ఈగోల గురించి ఆలోచించకుండా పాత్ర కోసం నటిస్తే ఆడియన్స్‌కు మరింత దగ్గర కావొచ్చు. ఈ విషయంలో నాకు వెంకటేశ్‌గారు స్ఫూర్తి. ►ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమా చేస్తున్నాను. కథ నచ్చితే గ్రే షేడ్ (కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రలు) ఉన్న పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నాను. -
ఎక్స్ట్రా వినోదం ఉంటుంది – నితిన్
నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎక్స్ట్రా’. ‘ఆర్డినరీ మ్యాన్’ అనేది ఉపశీర్షిక. సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఒలే ఒలే పాపాయి పలాసకే వచ్చేయ్..’ అనే మాస్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు హ్యారిస్ జైరాజ్ స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా రామ్ మిరియాల, ప్రియ హేమెస్ పాడారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్లోనే బెస్ట్ క్యారెక్టర్‌ను ఈ సినిమాలో చేశాను. సినిమా ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్తో ఉంటుంది’’ అన్నారు. ‘‘ట్రైలర్‌కు పదింతల వినోదం మా సినిమాలో ఉంటుంది. ఈ సినిమా విషయంలో నాకు సప్రోర్ట్ చేసిన నితిన్‌గారికి థ్యాంక్స్. ఇంట్రవెల్ సన్నివేశంలో ఓ మంచి ట్విస్ట్ ఉంది’’ అన్నారు వక్కంతం వంశీ. ‘‘టైటిల్‌కి తగ్గట్టు ఈ సినిమా ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది’’ అన్నారు సుధాకర్ రెడ్డి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019