breaking news
-
ఇక ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ ఫ్యూచర్స్
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేచంజీ నేటి(బుధవారం) నుంచి ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ సూచీ డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతోంది. మూడు నెలల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంచుతుంది. ప్రతినెలా చివరి శుక్రవారం ఈ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగితా కంపెనీలన్నీ ఈ సూచీలో ఉంటాయి. ఈ ఏడాది మార్చి 29 నాటికి ఈ సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్ఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 18%గా ఉంది. ఈ కాంట్రాక్టు్టలపై అక్టోబర్ 31 వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని ఎన్ఎస్ఈ పేర్కొంది. మూడో రోజూ సూచీలు ముందుకే... స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 73,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 22,368 వద్ద నిలిచింది. సూచీలకిది ఇది మూడో రోజూ లాభాల ముగింపు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగసి 74,060 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు దూసుకెళ్లి 22,448 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే అధిక వెయి టేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరులో లాభా ల స్వీకరణ, క్రూడాయిల్ ధరల రికవరీ, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. టెలికం, రియల్టీ, యుటిలిటీ, కన్జూమర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి. మెటల్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫాలోఆన్ఆఫర్(ఎఫ్‌పీఓ) ద్వారా రూ.18వేల కోట్లు సమీకరించడంతో వొడాఫోన్ ఐడియా షేరు 12% పెరిగి రూ.14.39 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.14.42 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లో సరికొత్త రికార్డ్‌లు నమోదయ్యాయి. సోమవారం స్టాక్‌మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్‌టైం హైకి చేరుకుని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ సానుకూల అంశాలు, ఐటీ, ఆటోమొబైల్ షేర్ల కొనుగోలు, రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే రాజకీయ పరిణామాలకు కొనసాగింపుగా పెట్టుబడి దారులు మళ్లీ ఆశాజనకంగా మారడంతో బ్యాంక్ నిఫ్టీ తాజా గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 494 పాయింట్లు లాభంతో 74,742 వద్ద ముగియగా, నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో 22,666 వద్ద ముగిసింది. ఎథేర్ మోటార్స్,మారుతి సుజికీ, ఎం అండ్ ఎం,ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగియగా.. అదానీ పోర్ట్స్,నెస్లే, అపోలో హాస్పిటల్,విప్రో, ఎల్టీఐ మైండ్‌ట్రీ, సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. -
ఈయన్ని నమ్మి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ (ఫిన్‌ఫ్లూయెన్సర్) రవీంద్ర బాలుకు సెబీ భారీ షాకిచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో అక్రమంగా సంపాదించిన మొత్తం రూ.12 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని నమ్మి పలువురు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోతున్నారు. ఇదే అంశంపై మార్కెట్ నియంత్రణ మండలి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల్ని అతిక్రమించిన సంస్థలు, వ్యక్తులపై సెబీ కొరడా ఝుళిపిస్తోంది. ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ (RBEIPL)వ్యవస్థాపకుడు రవీంద్ర బాలుకు సెబీ నోటీసులు అందించింది. రవీంద్రబాలు,తన భార్య శుభాంగి భారతితో కలిసి 2016 నుంచి భారతి షేర్ మార్కెట్ పేరుతో వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. అందులో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, మార్కెట్లో ఎలా పెట్టుబడులు పెట్టాలో తెలిపేలా మదుపర్లకు క్లాసులు ఇస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఈ వెబ్సైట్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి 25 శాతం నుంచి 1000 శాతం వరకు లాభాలు గడించవచ్చనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై సమాచారం అందుకున్న సెబీ రవీంద్ర బాలుకు సంబంధించిన అన్నీ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి నోటీసు వచ్చే వరకు పెట్టుబడి సలహా సేవలు, ట్రేడింగ్ కార్యకలాపాలలో పాల్గొనొద్దంటూ సెబీ వారిని నిషేధించింది. దీంతో పాటు నేషనల్ బ్యాంక్‌లో ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో రూ.12 కోట్లను డిపాజిట్ చేయాలని సూచించింది.కాగా, రెగ్యులేటరీ బాడీ నుండి స్పష్టమైన అనుమతి లేకుండా వాటిని విడుదల చేయడం సాధ్యం కాదని నిర్ధారిస్తూ, ఈ ఎస్క్రో ఖాతాలో నిధుల్ని సెబీ సంరక్షణలో ఉంటాయి. -
సాక్షి మనీ మంత్ర : ప్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 27.09 పాయింట్లు నష్టపోయి 73,876.82 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 22,434.70 వద్ద ముగింపు పలికాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడగా, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. రియల్టీ ఇండెక్స్ 2.5 శాతం క్షీణించగా, ఆటో ఇండెక్స్ 0.4 శాతం పడిపోయింది. మరోవైపు పవర్, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ (0.6 శాతం పెరుగుదల)తో బ్రాడర్ ఇండెక్స్‌లు తాజా రికార్డు గరిష్ట స్థాయిని తాకాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతం పెరిగింది. -
తాత చేసిన పని.. 30 ఏళ్ల తర్వాత ఎగిరి గంతేసిన మనువడు
మనలో చాలా మంది..నేను ఎప్పటికైనా లక్షాధికారిని కాకపోతానా? కోటీశ్వరుణ్ణి కాకపోతానా? అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు. అయితే అలా ధనవంతులు కావాలంటే లక్షలు కావాల్సిన పనిలేదు. వందల్లో పొదుపు చేసినా అది ధనవంతుల్ని చేస్తుందని నిజం చేశారు ఓ పెద్దాయన. కేవలం రూ.500 పెట్టుబడి కాస్తా ఇప్పుడు రూ.3.75 లక్షలుగా మారడంతో మనవుడు తన తాతకి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అది వైరల్‌గా మారింది. చండీగఢ్‌కు చెందిన తన్మయ్ మోతీవాలా పీడియాట్రిక్ సర్జన్‌గా వైద్య సేవలందిస్తున్నారు. అయితే ఓ రోజు తన ఇంటిని సర్ధుతుండగా తాత వినియోగించిన ఓ ట్రంక్ పెట్ట మోతీవాలా కంటపడింది. అందులో ఏమున్నాయా? అని తెరిచి చూశాడు. అంతే అప్పుడే తాత పెట్టిన పెట్టుబడి చూసి ఎగిరి గంతేసినంత పనిచేశారు. అయితే ఆ ట్రంక్ పెట్టెలో 1994లో తన తాత రూ. 500 విలువైన ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేసినట్లు, వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను షేర్ చేశారు. తన తాత షేర్లను కొనుగోలు చేశారు. వాటిని అమ్మలేదని తర్వాత గుర్తించాడు. ఆ రూ.500 పెట్టబడితో వచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఆరా తీశారు. 1994లో ఒక్కో షేర్ రూ.10 చొప్పున రూ.500కి మొత్తం 50 షేర్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ మొత్తం షేర్ల విలువ రూ.3.75లక్షలకు చేరింది. అంటే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టిన మొత్తం 750 శాతంతో రిటర్న్స్ వచ్చాయని డాక్టర్ మోతీవాలా వెల్లడించారు. The power of holding equity 😊 My Grand parents had purchased SBI shares worth 500 Rs in 1994. They had forgotten about it. Infact they had no idea why they purchased it and if they even hold it. I found some such certificates while consolidating family's holdings in a… pic.twitter.com/GdO7qAJXXL — Dr. Tanmay Motiwala (@Least_ordinary) March 28, 2024
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
funday rss check
RSS article test 1
Check sitemap article 1
Test article qid_1234574
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019