breaking news
-
WhatsApp Chat Filters: వాట్సాప్‌లో కొత్త ఫీచర్..
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందిస్తూ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది వాట్సాప్. దీనికి పోటీగా చాలా యాప్స్ వచ్చినప్పటికీ అవేవి మార్కెట్లో వాట్సప్‌కి గట్టి పోటీ ఇవ్వలేకపోయాయి. తాజాగా వాట్సాప్ నుంచి మరో కొత్త అప్డేట్ వచ్చింది. చాట్ ఫిల్టర్ ఫీచర్ ని వాట్సాప్ కొత్తగా లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా మనకు కావాల్సిన చాట్ కోసం స్క్రోల్ చేసే అవసరం లేకుండా సర్చ్ చేసి మెసేజ్ లు చూసుకోవచ్చు. చాట్ ఫిల్టర్ ఫీచర్ 2020లో జీమెయిల్ అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదే ఫీచర్‌ను ఇప్పుడు వాట్సాప్ లో కూడా అందుబాటులోకి తెచ్చింది మెటా సంస్థ. మొదట ఆండ్రాయిడ్ వర్షన్ 2.22. 16.14లో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్, ఇప్పుడు అన్ని ఆండ్రాయిడ్ వర్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతే కాకుండా వాట్సాప్‌లో యాక్టివ్‌గా లేని యూజర్లను గుర్తించే మరో ఫీచర్ ని కూడా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 2.78 బిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. -
ఇన్‌స్టా కొత్త ఫీచర్ గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. కొత్త ఫీచర్స్ పొందుతున్నాయి. తాజాగా మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఓ కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వీడియోను రికార్డ్ చేయవచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌కు సంబంధించిన ఓ చిన్న సెల్ఫీ వీడియోను ఆడమ్ మోస్సేరి తన అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో అదెలా పనిచేస్తుందో చూడవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారుడు డిఫాల్ట్ ప్రొఫైల్ ఫోటోను లూపింగ్ వీడియోతో నోట్స్‌లో అప్డేట్ చేయగలుగుతారు. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! డెమో వీడియో ప్రకారం, వినియోగదారులు నోట్‌ని క్రియేట్ చేయడం ప్రారంభించినప్పుడు ప్రొఫైల్ ఫోటో పక్కన కెమెరా సింబల్ ఉంటుంది. దీని నుంచి వీడియో రికార్డ్ చేసి నోట్స్‌లో పోస్ట్ చేయవచ్చు. ఇది తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము. -
థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్.. విడుదలకు ముందే లీక్ - వివరాలు
ఈ ఏడాది ప్రారంభమైన థ్రెడ్స్ (Threads) అప్పుడే కొత్త ఫీచర్స్ పొందనున్నట్లు, త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఓకే ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మెటా లేటెస్ట్ సోషల్ మీడియా యాప్ 'థ్రెడ్'లో ఓ కొత్త ఫీచర్ రానున్నట్లు ఒక ఉద్యోగి పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్‌లో కనిపించింది. మెటా ప్రత్యర్థి ఎక్స్ (ట్విటర్)కి సరైన పోటీ ఇవ్వడానికి సంస్థ సిద్దమవుతున్నట్లు.. ఇందులో భాగంగానే ఈ ఫీచర్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. థ్రెడ్స్ ట్రెండింగ్ టాపిక్ ఫీచర్ కొత్త ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్‌ను యాప్ డెవలపర్ విలియం మాక్స్ మొదటిసారిగా ఒక పేరు తెలియని మెటా ఉద్యోగి తీసిన స్క్రీన్‌షాట్ ద్వారా గుర్తించారు. దీనిని అతడు అనుకోకుండా థ్రెడ్లలో పోస్ట్ చేశాడు. ఈ లేటెస్ట్ ఫీచర్ సర్చ్ బార్ కింద నెంబర్ వైస్ టాపిక్‌లను ర్యాంక్ చేస్తుంది, అంతే కాకుండా ప్రతి అంశంపై పోస్ట్‌ల సంఖ్యను కూడా చూపుతుంది. ఇదీ చదవండి: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. ఫేస్బుక్, ఇన్‌స్టా యూజర్లకు షాక్! థ్రెడ్ గత నెలలో ఒక అప్డేటెడ్ కీవర్డ్ సర్చ్ ఫీచర్‌ను మాత్రమే ఆవిష్కరించింది. ఆ సమయంలో మెటా బాస్ 'మార్క్ జుకర్‌బర్గ్' ట్రెండింగ్ టాపిక్స్ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు తెలిపాడు. ప్రారంభంలో ఇది ఇంగ్లీష్ అండ్ స్పానిష్ భాషల్లో అందుబాటులోకి వస్తుందని.. ఆ తరువాత మరిన్ని భాషల్లోనే అందుబాటులోకి వస్తుందని తెలిపాడు. -
గూగుల్ కొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ ఫోన్లను అలా కూడా వాడొచ్చు!
కోవిడ్ మహమ్మారి అనంతరం జాబ్ ఇంటర్వ్యూలు, ఆఫీస్ మీటింగ్‌లు.. ఇలా అన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వెబ్‌క్యామ్‌లకు ప్రాధాన్యం బాగా పెరిగింది. స్మార్ట్ఫోన్లతో పోలిస్తే వెబ్‌క్యామ్ నాణ్యత చాలా తక్కువ. కాబట్టి స్మార్ట్ఫోన్లే వెబ్‌క్యామ్‌లుగా మారితే.. బాగుంటుంది కదా.. అవును అలాటి ఫీచర్‌నే గూగుల్ (Google) తీసుకొస్తోంది. ఆన్లైన్ మీటింగ్‌లు, ఇంటర్వ్యూల కోసం ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లకు ఉపయోగించే వెబ్‌క్యామ్‌లకు (Webcam) బదులుగా మంచి కెమెరా ఫీచర్లున్న ఆండ్రాయిడ్ ఫోన్లను (Android Smartphone) ఉపయోగించే ఫీచర్‌పై టెక్ దిగ్గజం గూగుల్ కసరత్తు చేస్తోంది. ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌కైనా.. గూగుల్ రూపొందించిన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ వెబ్‌కెమెరా ఫీచర్‌ను గూగుల్ ఉత్పత్తులకే కాకుండా విండోస్ ల్యాప్‌టాప్, మ్యాక్‌బుక్ లేదా మరొక ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నా సరే ఉపయోగించుకోవచ్చు. ఇలా పని చేస్తుంది.. ఆండ్రాయిడ్ ఫోన్‌ని పర్సనల్ కంప్యూటర్‌కి కనెక్ట్ చేయాలి. USB ప్రాధాన్యతల మెనూలో 'వెబ్‌క్యామ్ ఫంక్షనాలిటీ' ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో వెబ్‌క్యామ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఫీచర్ ప్రస్తుతానికి బీటా వర్షన్లో ఉంది. "Android 14 QPR1 Beta 1"ని ఇన్స్టాల్ చేసి ఉంటే దీన్ని ఉపయోగించవచ్చు. అక్టోబర్‌లో పిక్సెల్ 8 లాంచ్ తర్వాత స్థిరమైన వెర్షన్ డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. -
ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో సరికొత్త ఫీచర్!
Flipkart price lock Feature: పండుగల సమయంలో ఆన్లైన్ షాపింగ్ చేసేవారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులు.. తాము కొనుగోలు చేసేంత వరకూ ధరలు పెరగకుండా లాక్ చేసుకునేలా 'ప్రైస్ లాక్' ఫీచర్ (price lock feature)ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తాజాగా ప్రకటించారు. (ఇంత కంటే చీప్ ఇంకేమైనా ఉందా? రూ. 6.6 కోట్ల విలువైన ఫ్లాట్లు రూ.100కే..) "పండుగ సీజన్లలో తమకు కావాల్సిన ఉత్పత్తులు అమ్ముడైపోయాయని లేదా నిమిషాల్లోనే అందుబాటులో లేకుండా పోతున్నాయని కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దీనికి పరిష్కారంగా ప్రైస్ లాక్ ఫీచర్‌తో కస్టమర్లు తమకు అవసరమైన ఇన్వెంటరీని లాక్ చేసుకోవచ్చు" అని ఫ్లిప్‌కార్ట్ చీఫ్ ప్రాడక్ట్ అండ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO) జయందరన్ వేణుగోపాల్ ఫ్లిప్‌కార్ట్ మాతృ సంస్థ వాల్‌మార్ట్ నిర్వహించిన కన్వర్జ్ ఈవెంట్లో తెలిపారు. అయితే, ఈ ఫీచర్‌ను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనేది ఆయన చెప్పలేదు. 'ప్రైస్ లాక్' ఫీచర్ ఇలా.. ఫ్లిప్‌కార్ట్ తీసుకొస్తున్న 'ప్రైస్ లాక్' ఫీచర్ కింద కస్టమర్లు తమకు కావాల్సిన వస్తువులను లాక్ చేసుకునేందుకు కొంత మొత్తం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పండుగ సమయాల్లో ఆయా వస్తువులకు డిమాండ్ పెరిగినప్పటికీ, లాక్ చేసుకున్న కస్టమర్లకు అవి అందుబాటులో ఉండేలా చేస్తారు. అలాగే ధరలు పెరిగినప్పటికీ లాక్ చేసుకున్న ధరకే ఆయా వస్తువులను కొనుక్కోవచ్చు. సాధారణంగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల అమ్మకాలలో 50 శాతం పండుగ సీజన్లలోనే జరుగుతాయి.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్‌గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్‌తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019